DSMM
Saturday, September 27, 2025
Tuesday, May 6, 2025
సమాజ మార్పుకు విద్య, న్యాయం, సంస్కతి మార్గదర్శకం
సమాజ మార్పుకు విద్య, న్యాయం, సంస్కతి మార్గదర్శకం
భారత న్యాయవ్యవస్థలో దళితుల ప్రాతినిధ్యం ఇప్పటికీ అనేక అడుగులు వెనుకబడి ఉంది. జస్టిస్ బి.ఆర్. గవారు 57వ ప్రధాన న్యాయమూర్తిగా పదవిలోకి రావడం చారిత్రక ఘట్టమే అయినా, అది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు - దళిత సమాజం ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. కానీ, ఈ ఒక నియామకంతో వ్యవస్థలో న్యాయం స్థాపించబడిందని అనుకోవడం పొరపాటు. ఇప్పటికీ న్యాయవ్యవస్థలో - న్యాయ విద్యార్థుల నుంచి సుప్రీంకోర్టు వరకు ు దళితుల భాగస్వామ్యం తీవ్రమైన అసమానతకు గురవుతోంది. ఈ అసమతులతలు కేవలం సంఖ్యల లోటే కాదు ు అవి సామాజిక చైతన్యానికి ఎదురైన సవాళ్లు. న్యాయ వ్యవస్థ, సామాజిక న్యాయాన్ని పరిరక్షించే స్థంభంగా ఉండాలి అంటే, దానిలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు - న్యాయ వత్తిలో మార్పు కోసం శిక్షణ, ప్రోత్సాహం, ప్రాతినిధ్యం వంటి అంశాలపై సమిష్టిగా పని చేయాల్సిన సమయం ఇదే. గవారు ఎదుగుదల స్ఫూర్తిదాయకమే అయినా, దళితులకు న్యాయపరమైన ప్రాతినిధ్యం కల్పించే సుస్థిర మార్గాలే అసలైన విజయం.
నేడు విద్యా వ్యవస్థ దారితప్పింది. విద్యార్థి బుద్ధి వికాసం, వ్యక్తిత్వ అభివద్ధి లక్ష్యంగా ఉండాల్సిన విద్య, మార్కులు, ర్యాంకులు, ఫీజుల లాభాల లెక్కలతో వాణిజ్య కేంద్రంగా మారింది. పిల్లలు ఉత్పత్తుల్లా, తల్లిదండ్రులు గిరాకీల్లా, స్కూళ్లు వ్యాపార సంస్థల్లా మారిపోయిన దుస్థితిని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ నివేదికలు బట్టబయలు చేశాయి. మానసిక ఒత్తిడి, ఆనందం లేని విద్యా పద్ధతులు, ప్రైవేటు సంస్థల వాణిజ్య దౌర్జన్యం కలిసి విద్యార్థులను నిరాశ, నిస్సహాయత వైపు నడిపిస్తున్నాయి. పాసవ్వాలన్న భయంతో విద్యార్థి జీవితం భారం అవుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యా విధానాన్ని సమగ్రంగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. మార్కులకే కాక, మానవతా విలువలకు ప్రాధాన్యతనిచ్చే, జీవన నైపుణ్యాలను పెంపొందించే విద్యా విధానమే సమాజాన్ని చైతన్యవంతంగా మార్చగలదు. ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు - అందరూ కలసి విద్యను పోటీకి కాక, వ్యక్తిత్వ వికాసానికి సేవ చేయించే మార్గంలో తీసుకెళ్లాలి. లేకపోతే విద్య అనే శక్తి, భవిష్యత్తు తరాలపై శాపంగా మారే ప్రమాదం ఉంది.
బాబాసాహెబ్ అంబేడ్కర్ బుద్ధుని మార్గదర్శిగా ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు సమాధానం బౌద్ధ తత్వంలోనే దాగి ఉంది. సమానత్వం, వివక్ష రహిత సమాజం, బలహీనులకు మానవతా విలువల బోధ %-% ఇవే దళిత విముక్తి ప్రేరణ. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ తత్వాన్ని స్వీకరించి, దళిత సమాజానికి నిజమైన సామాజిక మార్పును అందించాలన్న లక్ష్యంతో చరిత్ర రాశారు. ఈ విలువలు మాత్రమే సమాజాన్ని నిజంగా సమానంగా, శాంతిగా నిలబెట్టగలవు. ఆయనకు బుద్ధుడి మార్గదర్శనం కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గం కాక, ఒక సామాజిక, రాజకీయ సిద్ధాంతంగా మారింది.
మరో వైపు, పండుగలు మన సంస్కతి, సమాజాన్ని ప్రతిబింబించే ఉత్సవాలు కావాల్సినప్పటికీ, నేటి సమాజంలో ఇవి కేవలం వివక్షను పెంచే వేదికలు, కులాలు, సామాజిక స్థితి, అహంకారాన్ని ప్రదర్శించే సందర్భాలుగా మారిపోయాయి. పండుగల పేరుతో కొందరు తమ హక్కులను ఇతరులపై లాంచించి, దళితులను అవమానిస్తూ, వారి మానవ హక్కులను రగిలించేస్తున్నారు. ఈ పండుగల ఆత్మను కించపరిచే ఈ విధానాలు మన సమాజాన్ని మరింత విభజిస్తాయి. మన సంప్రదాయాలను, పండుగలను అందరిని కలిపే మార్గంగా మార్చాల్సిన అవసరం ఉంది, దానితోనే సమాజంలో నిజమైన ఐక్యత ఏర్పడుతుంది. పండుగలు ఒక వర్గానికి మాత్రమే పరిమితంగా ఉండకుండా, సమానత్వాన్ని, శాంతిని పరిమళించేలా మారాలి. ఈ మార్పును సాధించాలంటే మనం ప్రతీ ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది.
- బి.గంగాధర్, ఎడిటర్
Wednesday, April 2, 2025
Sunday, March 2, 2025
ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం - Cover story
ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం
జాన్‌వెస్లీ సిపియం రాష్ట్రకార్యదర్శి
తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త శక్తిని అందిస్తూ, జాన్‌వెస్లీ సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్) తెలంగాణ (మొట్ట మొదటి దళితుడు) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ జీవితాన్ని ఎంచుకున్న ఆయన, కులవివక్ష, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో కీలకపాత్ర పోషిస్తూ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావం చూపనున్నారు. దళితుల హక్కుల కోసం పోరాడటంలో ఆయన పాత్ర అపారమైనది. నిరంతర పోరాటం, నాయకత్వ నైపుణ్యం, నిస్వార్థ సేవ ద్వారా ఆయన సామాజిక సమానత్వాన్ని స్థాపించేందుకు కషి చేశారు. జాన్‌వెస్లీ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక సిద్ధాంతం. ఉద్యమకారుడిగా, పోరాట ధీరుడిగా, మార్గదర్శిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. జాన్‌వెస్లీ నాయకత్వంలో ఉద్యమాన్ని అంచనా వేయడం కష్టతరమైన పని, ఎందుకంటే ఉద్యమాన్ని అసాధారణ స్థాయిలో నడిపించడం, ప్రజలను చైతన్యవంతులను చేయడం, ఫలితాలు వచ్చే వరకు నిరంతరం పోరాటాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకత.
తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త శక్తిని అందిస్తూ, జాన్‌వెస్లీ సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్) తెలంగాణ (మొట్ట మొదటి దళితుడు) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ జీవితాన్ని ఎంచుకున్న ఆయన, కులవివక్ష, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో కీలకపాత్ర పోషిస్తూ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావం చూపనున్నారు. దళితుల హక్కుల కోసం పోరాడటంలో ఆయన పాత్ర అపారమైనది. నిరంతర పోరాటం, నాయకత్వ నైపుణ్యం, నిస్వార్థ సేవ ద్వారా ఆయన సామాజిక సమానత్వాన్ని స్థాపించేందుకు కషి చేశారు. జాన్‌వెస్లీ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక సిద్ధాంతం. ఉద్యమకారుడిగా, పోరాట ధీరుడిగా, మార్గదర్శిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. జాన్‌వెస్లీ నాయకత్వంలో ఉద్యమాన్ని అంచనా వేయడం కష్టతరమైన పని, ఎందుకంటే ఉద్యమాన్ని అసాధారణ స్థాయిలో నడిపించడం, ప్రజలను చైతన్యవంతులను చేయడం, ఫలితాలు వచ్చే వరకు నిరంతరం పోరాటాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకత.
జాన్‌వెస్లీ ఉద్యమపోరాటాలను సమగ్రంగా అంచనా వేయడం కష్ట తరమైనది, ఎందుకంటే ఆయన పోరాటాలు కేవలం నినాదాలకు పరిమితం కాకుండా, ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారాలు అందించారు. ఉద్యమాన్ని ఏ దశలోనూ వదలకుండా, ఫలితాలు వచ్చే వరకు శ్రమించడంలో ఆయన అసమానమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. ఆయన అచంచలమైన పట్టుదల, ఉద్యమశక్తి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి.
సాధారణ కుటుంబం నుండి...
జాన్‌వెస్లీ 1965 ఫిబ్రవరి 14న వనపర్తి (ఉమ్మడి మహాబూబ్ నగర్) జిల్లా అమరచింత గ్రామంలో దళిత దంపతులు మోజెస్, బేతమ్మల నాలుగో కుమారుడిగా జన్మించారు. వారి కుటుంబం బీడీ చుట్టం, చిన్నపాటి వ్యవసాయ పనుల ద్వారా జీవనం సాగించేది. జాన్ వెస్లీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, గద్వాల ఎంఎల్‌డీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకునే ఆసక్తితో వామపక్ష ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఉద్యమాల్లో తొలి అడుగులు
జాన్‌వెస్లీ, విద్యార్థి, యువత హక్కుల పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 1978లో వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులై, ఆయన విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. సమాజంలో సమానత్వం సాధించడమే కాకుండా, విద్యార్ధి సమర్థతను పెంచే దిశగా ఆయన ఎంతో కషి చేశారు. 1996లో సిపియం పార్టీలో చేరి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులై, అనేక కాలేజీలలో విద్యా హక్కుల పరిరక్షణ కోసం యువతకు ఉద్యోగాల కోసం నిరసనలు, ఆందోళనల నిర్వహించి సామాజిక చైతన్యాన్ని కల్పించారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన, పోరాటాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.
కెవిపిఎస్‌లో నాయకత్వ బాధ్యతలు
జాన్‌వెస్లీ 1998లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కులవివక్ష నిర్మూలనకు, సామాజిక సమానత్వ సాధనకు విస్తతంగా పనిచేశారు. ఆయన నాయకత్వంలోని కెవిపిఎస్ అనేక ఆందోళనాలు, ఉద్యమాలు, మరియు పోరాటాల ద్వారా ప్రజల్లో కులవివక్ష వ్యతిరేక ఆందోళనలపై సామాజిక చైతన్యాన్ని పెంచారు. ప్రస్తుతం, జాన్‌వెస్లీ కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహి స్తున్నారు, తన విశాలమైన అనుభవం మరియు సమాజంలో అన్యాయం నిరోధించడంలో తన విశ్వాసంతో మరింత కషి చేస్తూ, కులవివక్షను నిర్మూలించడంలో తన పాత్రను మరింత బలపరిచారు. భారతదేశంలో దళితులు ఎన్నో ఏళ్లుగా కులవివక్షకు గురవుతూ, సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక ఉద్యమాలు ఉన్నప్పటికీ, వాటిని సమాజంలో ప్రాచుర్యం తీసుకురావడంలో పెద్ద సవాళ్లు ఉన్నాయి. దీనిని గుర్తించిన బీవీ.రాఘవులు వంటి నాయకులు, దళిత సమస్యలపై అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్ర చేపట్టారు.
సైకిల్ యాత్ర ఒక ముఖ్యమైన సాధనంగా తయారైంది. ఈ యాత్ర ద్వారా రాఘవులుతోపాటు 10 నాయకులు దళితులకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచారు. ఈ యాత్ర నిర్వహించడం ద్వారా సమాజంలో దళితుల హక్కులు, న్యాయం, సమానత్వం గురించి మౌలికంగా అవగాహన కల్పించడం, దళిత సమస్యలపై ప్రజాస్వామిక దష్టి కోణాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
సైకిల్ యాత్ర ద్వారా అవగాహన పెంచడం, ప్రజల్లో సామాజిక మార్పు తీసుకురావడం, సామాజిక బాధ్యత, హక్కులను పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ యాత్ర ద్వారా కులవివక్షపై సమరశీల ఆందోళనలు, పోరాటాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన ఏర్పడింది. ఈ సైకిల్ యాత్రలు ఒక రకమైన ప్రజా ఉద్యమంగా మారింది. అందులో నాయకులు, విద్యార్థులు, మేధావులు, సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ యాత్రలు దళితుల గురించి అవగాహన పెంచడమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావడంలో కీలకమైన పాత్రను పోషించారు. ఈ యాత్ర కేవలం సందేశాలను ఇవ్వడమే కాకుండా, అనేక ఇతర అంశాలలో తీవ్రమైన మార్పు తీసుకొచ్చాయి. ప్రతి అడుగు ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతూ, సమాజంలో దళితుల పట్ల ఉన్న వివక్షను సమూలంగా ఛేదించడానికి అవసరమైన చైతన్యాన్ని వ్యాప్తి చేశాయి. ఈ యాత్రలు, ముఖ్యంగా దళితుల హక్కులు, వారి ఆర్థిక అభివద్ధి, సామాజిక ఆందోళనలు వంటి అనేక అంశాలను ప్రస్తావించింది. సైకిల్ యాత్రలో భాగంగా, దళితుల హక్కులను సాధించడమే కాకుండా, వారికి సమాజంలో సరైన స్థానం కల్పించడానికి అవసరమైన చట్టాలు, విధానాలు, సమాజిక మార్పులు అవసరమని కూడా అవగాహన పెంచిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యాత్రలు సమాజంలో దళితుల కోసం చిత్తశుద్ధి , గౌరవం మరియు సమానత్వం కోసం పోరాటాన్ని పెంచింది. ఈ సైకిల్ యాత్రలు సమాజంలో దళితుల సంక్షేమాన్ని సాధించడానికి, ప్రభుత్వాలు, ప్రజలు, ఉద్యమకారులు మరియు ఇతర సామాజిక కార్యకర్తలు కలసి పనిచేయడం అవసరం అని స్పష్టంగా తెలియజేసింది. సమాజంలో సమానత్వాన్ని, న్యాయాన్ని, దళితుల హక్కులను పటిష్టం చేయడానికి ఒక క్షేత్ర స్థాయి ఉద్యమంగా నిలిచింది.
జస్టిస్ పున్నయ్య కమిషన్ - ఉద్యమం
భారతదేశంలో దళితులపై కులవివక్ష, మానవ హక్కుల ఉల్లంఘనలు అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు, కమిషన్లు ఏర్పాటు చేసింది. కానీ సమాజంలో పాతుకుపోయిన కులవివక్షను నిషేదించలేకపోయింది. కెవిపిఎస్ సమరశీల ఉద్యమ ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తీవ్రమైన లాఠీచార్జీ, వాటర్ క్యానల్స్‌తో ప్రభుత్వం దాడి చేసిన ప్రజలు కమిషన్ ఏర్పాటు చేసే వరకు హైదరాబాద్ విడిచి పెట్టి వేళ్లే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న కులవివక్షను నివారించడమే లక్ష్యంగా సిఫారసులు ఇచ్చింది. అయితే ఈ సిఫారసులను అమలు చేయించడంలో కొన్ని సవాళ్లు ఉన్నందున, దళిత హక్కుల రక్షణకోసం అనేక ఉద్యమాలు చేపట్టారు. వాటిలో కెవిపిఎస్ ఉద్యమం ఒక కీలకమైన భాగంగా నిలుస్తుంది.
జస్టిస్ పున్నయ్య కమిషన్ దళితుల హక్కులపై పరిశోధన చేసి, దళితులపై కులవివక్ష నివారణకు సంబంధించి కొన్ని కీలకమైన సిఫారసులను రూపొందించింది. ఈ కమిషన్ ప్రధానంగా వివక్షకు గురయ్యే వివిధ సామాజిక వర్గాలను గుర్తించి, వారి కోసం ప్రత్యేకంగా అభివద్ధి, విద్య, వైద్య సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఉద్దేశ్యంతో పనిచేయాలని సూచించింది. జస్టిస్ పున్నయ్య కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేయించడంలో కెవిపిఎస్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఉద్యమం దళితుల హక్కుల సాధన, వివక్ష నివారణ, సమాజంలో సమానత్వాన్ని స్థాపించేందుకు శక్తివంతమైన ఆయుధంగా మారింది.
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్
భారతదేశంలో సమాజంలో దళితులు అనేక సంవత్సరాలుగా కులవివక్ష, అణచివేత, పేదరికంలో ఉన్నారు. దళితుల అభివద్ధి కోసం అనేక చట్టాలు మరియు పథకాలు ఉన్న అమలులో విఫలం చెందుతున్న ప్రభుత్వాలను నిలదీసింది. జాన్‌వెస్లీ నాయకత్వంలోని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని దశలవారీగా ఉద్యమ పోరాటాలు నిర్వహించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను, సామాజిక సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో జాన్‌వెస్లీ కీలకపాత్ర పోషించారు. దాదాపు 72 సామాజిక సంస్థలను ఐక్యం చేసి, ఉద్యమాన్ని సమర్థవంతంగా రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కాకి మాధవరావు ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉద్యమం ముందుకు సాగింది. దళితుల అభివద్ధికి కేటాయించిన నిధులను కేవలం దళితుల సంక్షేమానికి వినియోగించాలని ప్రభుత్వాలకు ఈ పోరాటాల ద్వారా గుర్తు చేశారు. దాదాపు ఆరు నెలలపాటు సాగిన ఈ ఉద్యమ, పోరాటాలు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ వద్ద 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేశారు. లక్షలాది మందిని సమీకరించి ఆందోళనలను కొనసాగించడంతో, రాష్ట్ర ప్రభుత్వం 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి అంగీకరించింది. ఈ విజయంలో జాన్‌వెస్లీ నాయకత్వంలోని కెవిపిఎస్ కీలక పాత్ర పోషించింది.
దళితుల విద్య, ఉద్యోగ అవకాశాలు, దళితవాడ అభివద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఏర్పడింది. దళితుల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం, క్రెడిట్ మరియు వాణిజ్య అవకాశాలు అందించడానికి కూడా కార్యక్రమాలు తీసుకున్నారు. అలాగే, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రత్యేక ప్రవేశాలు, అదనపు శిక్షణల ద్వారా విద్యావద్ధి సాధించడానికి చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య రక్షణ, పథకాలు, రుణాల ఎంపిక వంటి సామాజిక సంక్షేమ పథకాలు కూడాఅమలులోకి వచ్చారు.
ఎస్‌సి, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, సైకిల్ యాత్రలు, జస్టిస్ పున్నయ్య కమిషన్ వంటి పోరాటాలతో పాటు అనేక ఉద్యమాలను నిర్వహించి, కెవిపిఎస్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. జాన్‌వెస్లీ సామాజిక ఉద్యమకారుడిగానే కాకుండా, ప్రజా సమస్యలపై అనేక పోరాటాలను నడిపించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలను నిర్వహించారు. జాన్‌వెస్లీ నాయకత్వంలోని కెవిపిఎస్, పిఆర్‌ఎస్‌ఎస్ వంటి అనేక సంస్థలు రాష్ట్రంలో అనేక సామాజిక, రాజకీయ ఉద్యమాలను విజయవంతంగా నడిపించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలపై జాన్‌వెస్లీ నాయకత్వంలో నిరంతర పోరాటాలు, ఆందోళనలు జరిగాయి, బాధితుల పక్షాన ఆయన నిరంతరం న్యాయపోరాటాలు నడిపారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించడంలో ఆయన అపరిమితమైన నిబద్ధత చూపించారు. అధికారులను ప్రశ్నిస్తూ, అనేక సందర్భాల్లో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
కష్ణా జిల్లా బండ్లగూడెంలో దళితుల భూములను అక్రమంగా ఆక్రమించిన పెత్తందారులపై పోరాటాన్ని చేపట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను నిర్వహించారు. ఫలితంగా వందలాది ఎకరాల చేపల చెరువులను స్వాధీనం చేసుకుని, దళితులకు న్యాయమైన హక్కులను తిరిగి అందించారు. దళితుల నివాస హక్కులకు ప్రాధాన్యత ఇచ్చి, ఇండ్లు, భూ పంపిణీ, ఇండ్ల స్థలాల కేటాయింపు, స్మశాన వాటికల ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాల్లో జాన్‌వెస్లీ విశేష కషి చేశారు. ఈ చర్యలు దళితుల జీవితాలను సమూలంగా మార్చేలా ప్రభావితం చేశాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
సిపిఎం నాయకుడిగా ఎదుగుదల
సిపిఎం (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) వామపక్ష ఉద్యమాలను గట్టి పటిష్టమైన చరిత్రతో కొనసాగించు కుంటూ, సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, శ్రామిక హక్కుల కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీల్లో ఒకటి. ఇందులోని నాయకుల అద్భుత కషి, తమ వాదనలతో ప్రజలను ఆకర్షించే విధానం సీపీఎం యొక్క విజయానికి కారణంగా నిలుస్తోంది. ఈ సందర్భంలో జాన్‌వెస్లీ పోరాట నాయకత్వం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది.
1997లో జాన్‌వెస్లీ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితు లయ్యారు. ఆయన చేసిన ఆందోళన, పోరాటాలే పార్టీలో బలమైన జాన్‌వెస్లీ అగ్రనేతగా ఎదగడానికి మార్గాన్ని సష్టించబడింది. ఆయన రాజకీయ వ్యవహారాలు, పార్టీ కార్యాచరణపై జ్ఞానం, ప్రజలతో సంబంధాలు మెరుగుపడటం ఆయన ప్రతిష్టను పెంచాయి.
జాన్‌వెస్లీ 2022లో సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఉండగానే ఆయన పార్టీకి సంబంధించి ముఖ్యమైన మార్పులను, ఆలోచనా విధానాలను రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించారు. వామపక్షాల రాజకీయ వ్యూహాలను నూతనంగా మలచడమే కాకుండా, సమాజంలోని పేద, నిరుపేద వర్గాలకు గట్టి అండగా నిలబడటంతో ఆయన కొత్త నాయకత్వం పార్టీకు మరింత స్థిరతను, ప్రజలలో ఆదరణను అందించింది.
2025లో జాన్‌వెస్లీ తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా (మొట్ట మెదటి దళితుడు) ఎన్నికయ్యారు. ఈ కొత్త పదవిలో ఆయన ఉద్యమాల పట్ల ఉన్న అంకితభావం, రాజకీయ నాయకత్వం, ప్రగతిశీల దష్టికోణం ప్రధానంగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ముఖ్యమైన ప్రజాస్వామ్య, సామాజిక చైతన్య కార్యకలాపాల్లో ఆయన పాత్ర మరింత గణనీయంగా మారింది. జాన్‌వెస్లీ నాయకత్వంలో సీపీఎం పార్టీని తెలంగాణలో మెరుగైన దిశలో నడిపించడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. 1997 నుండి 2025 వరకు అనేక జాన్‌వెస్లీ చేసిన ఆందోళనాలు, పోరాట కార్యక్రమా లలో ఆయన కషికి నాయకత్వం ఇప్పటికీ గుర్తించబడింది.
నూతన బాధ్యతలు -లక్ష్యాలు
జాన్‌వెస్లీ, 2025లో తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన నాయకత్వంలో పార్టీకి, ప్రజలకు ఒక కొత్త దిశ, ప్రగతి, మార్పును చూపించబోతున్నారు. ఈ బాధ్యతలను చేపడుతూ, ఆయన ఆర్థిక, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో ఎంతో కీలక వ్యాఖాలు చేశారు. ఆయన రాజకీయ వ్యూహాలు, లక్ష్యాలు, చేపట్టబోయే పోరాటాలు, నిరసనలు నిరంతర సంబంధాలను చూపిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని పేదలు, రైతులు, కార్మికులు, మైనారిటీ వర్గాలకు అండగా నిలిచిపోనున్నాయి.
జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, రాష్ట్రంలోని రైతుల సమస్యలను చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై ప్రభుత్వాని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే, జాబ్ ఎమ్ప్లాయిమెంట్ హామీ స్కీమ్‌లను గట్టిగా అమలు చేయాలని మరియు నిరుద్యోగాన్ని తగ్గించడానికి కార్యాచరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ విధానాలపై పేదల పక్షాన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. భూమిలేని నిరుపేదల కోసం ఇళ్లు, ఇండ్ల స్థలాల కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటిలోగా ప్రజలకు అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కులవివక్ష మరియు మతోన్మాద విధానాలపై నిరంతరం కలిసివచ్చే శక్తులతో పోరాటం చేస్తామన్నారు. మతోన్మాద బిజెపిని రాష్ట్రంలో అడ్డుకుంటామని అన్నారు. జాన్‌వెస్లీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రైతుల సమస్యలపై, కార్మిక హక్కుల సాధనపై, నిరుపేదల హక్కులపై, అలాగే సమాజంలో ఉన్న అన్యాయాలపై పోరాటం చేస్తూ, ఆయన సీపీఎం పార్టీకి నూతన దిశను చూపించనున్నారు.
సామాజిక సమానత్వం మరియు రైతు హక్కుల పరిరక్షణకు పార్టీ ఆందోళనలని, ఉద్యమాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సంకల్పితమైన మార్గాలు అనుసరించనుంది. ఆయన ముఖ్యంగా రైతుల హక్కుల పరిరక్షణ, భూ సమస్యలు, రుణమాఫీ, మరియు ప్రభుత్వ వైఫల్యాలను జవాబుదారీగా తీర్చడం కోసం మరింత ఒత్తిడి రాబోయే కాలంలో చేయనున్నారు. పేదలు, నిరుద్యోగులు, కార్మికులు తదితర సామాజిక వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన నేతత్వం అత్యంత కీలకంగా మారుతుంది.
కార్మికుల సంక్షేమంపై జాన్‌వెస్లీ ప్రత్యేక దష్టి సారించారు. ఆయన నాయకత్వంలో, కార్మిక చట్టాల అమలును మరింత కఠినంగా అమలు చేయడానికి, కార్మికుల భవిష్యత్తును మెరుగుపర్చేందుకు పోరాటం సాగించబడుతుంది. కార్మిక వర్గానికి ముఖ్యమైన లబ్ధి చేరుస్తూ, ఉద్యమాలను బలోపేతం చేయడం, అలాగే కార్మికులకు మౌలిక హక్కులు సాధించడంలో ఆయన మరింత కషి చేయనున్నారు.
వామపక్ష ఉద్యమాలను, అలాగే దాని అనుసరించే సామాజిక చైతన్యాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో ప్రజల సమస్యలపై గట్టిగా నిలబడడం జాన్‌వెస్లీకి ముఖ్యమైన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆయన, తెలంగాణలోని విభిన్న వర్గాల ప్రజల పక్షానా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు వామపక్ష వైఖరిని నిలబెట్టానున్నారు.
జాన్‌వెస్లీ ఉద్యమ పోరాటాలను సమగ్రంగా అంచనా వేయడం కష్టతరమైనది, ఎందుకంటే ఆయన పోరాటాలు కేవలం నినాదాలకు పరిమితం కాకుండా, ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారాలు అందించారు. ఉద్యమాన్ని ఏ దశలోనూ వదలకుండా, ఫలితాలు వచ్చే వరకు శ్రమించడంలో ఆయన అసమానమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. ఆయన అచంచలమైన పట్టుదల, ఉద్యమశక్తి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. జాన్‌వెస్లీ ఎన్నికతో తెలంగాణలో సీపీఎం పార్టీలో మంచి పరిణామాలు కనపడుతాయని అంచనా వేస్తున్నారు. ఆయన నాయకత్వంలో, వామపక్ష ఉద్యమాలు మరింత ప్రబలంగా, సామాజిక న్యాయం, కార్మిక సంక్షేమం, రైతుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతాయని వారు భావిస్తున్నారు. జాన్‌వెస్లీ సీపీఎం కార్యదర్శి ఎన్నిక కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అది పేదల, కార్మికుల, రైతుల హక్కుల సాధనకు బలమైన ప్రతిఫలంగా కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలో సీపీఎం తెలంగాణలో కీలక భూమిక పోషించబోతోంది. భవిష్యత్తులో, వామపక్ష ఉద్యమాలను బలోపేతం చేస్తూ, సామాజిక సమానత్వం, కార్మిక సంక్షేమం, రైతు హక్కుల పరిరక్షణ కోసం ఆయన ముందుండి పోరాడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- బి.గంగాధర్, ఎడిటర్
చందాదారులకు విజ్ఞప్తి
మీరు అందరూ దళితశక్తి మాసపత్రికకు చూపుతున్న ఆదరణకు హదయపూర్వక కతజ్ఞతలు. మీ మద్దతుతో మన పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా నిలిచింది. ఇది మన సమాజంలో, ముఖ్యంగా దళిత, బహుజన ప్రజల్లో, ఒక గొప్ప మార్పును తీసుకువచ్చే పత్రికగా నిలవాలనే మన అభిప్రాయం నిజమైనదని నిరూపిస్తోంది.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరామ్‌ల ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు మన పత్రిక నిరంతరం కషి చేస్తోంది. ఈ ప్రయాణంలో మీ అండదండలు ఎంతో ముఖ్యమైనవి.ఇంతవరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఆర్థిక వనరులు లేక పత్రికలు నిలబడలేకపోయాయి. అయితే, మన పత్రిక అండదండాలతోనే ముందుకు సాగుతోంది.''మాటలు కోటలు దాటిపోతున్న... చేతులు గడప దాటవన్నట్లు'' ఉంది మన పరిస్థితి. ఆచరణ, అమలు రెండు కండ్ల వంటివి. మనం ఒక్క కన్నుతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అందుకే మనం మనవరకే పరిమితం అయిపోతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న మన దళితశక్తి మాసపత్రికకు మీ వంతు సహాయం, సహకారం, చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే దళితశక్తి పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని మన పత్రిక విజ్ఞప్తి చేస్తోంది.
మీరు అందరూ దళితశక్తి మాసపత్రికకు చూపుతున్న ఆదరణకు హదయపూర్వక కతజ్ఞతలు. మీ మద్దతుతో మన పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా నిలిచింది. ఇది మన సమాజంలో, ముఖ్యంగా దళిత, బహుజన ప్రజల్లో, ఒక గొప్ప మార్పును తీసుకువచ్చే పత్రికగా నిలవాలనే మన అభిప్రాయం నిజమైనదని నిరూపిస్తోంది.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరామ్‌ల ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు మన పత్రిక నిరంతరం కషి చేస్తోంది. ఈ ప్రయాణంలో మీ అండదండలు ఎంతో ముఖ్యమైనవి.ఇంతవరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఆర్థిక వనరులు లేక పత్రికలు నిలబడలేకపోయాయి. అయితే, మన పత్రిక అండదండాలతోనే ముందుకు సాగుతోంది.
''మాటలు కోటలు దాటిపోతున్న... చేతులు గడప దాటవన్నట్లు'' ఉంది మన పరిస్థితి. ఆచరణ, అమలు రెండు కండ్ల వంటివి. మనం ఒక్క కన్నుతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అందుకే మనం మనవరకే పరిమితం అయిపోతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న మన దళితశక్తి మాసపత్రికకు మీ వంతు సహాయం, సహకారం, చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే దళితశక్తి పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని మన పత్రిక విజ్ఞప్తి చేస్తోంది.
చందాల వివరాలు:
కాల పరిమితి ధర తగ్గింపు ధర
సంవత్సర రూ. 600 రూ. 600
రెండు సంవత్సరాలు రూ. 1200 రూ. 1000
మూడు సంవత్సరాలు రూ. 1800 రూ. 1500
నాలుగు సంవత్సరాలు రూ. 2400 రూ. 2000
ఐదు సంవత్సరాలు రూ. 3000 రూ. 2500
పది సంవత్సరాలు రూ. 6000 రూ. 3000
జీవితకాలం రూ. 10000 రూ. 5000
Subscribe to:
Comments (Atom)
-
ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం జాన్‌వెస్లీ సిపియం రాష్ట్రకార్యదర్శి తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త శక్తిని అందిస్తూ, జాన్‌వెస్లీ స...













