Thursday, July 6, 2017

Dalithashakthi July 2017- DSMM



















Dalithashakthi July 2017- DSMM - B.Gangadhar


దళిత రాష్ట్రపతి ఒకవైపు... దాసిన దాగని కులవివక్ష మరోవైపు 

శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దూసుకుపోతుంది, దేశం దూసుకుపోతుందని సంక్కలు గుద్దుకుంట్టున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు కులం పేరుతో, మతం పేరుతో, అగ్రకుల దురంహకారులు దళితుల మీద దాడులు, హత్యలు, వెలివేతలు వేధిస్తుంటే వారి కండ్లకు దళితులు కనిపించడం లేదా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా గోమాతపేరుతో మత తత్వవాదులు దాడులు, హత్యలు చేస్తుంటే, కులం పేరుతో దురహంకారులు దళితులను పరువు హత్యలు, బహిష్కరణలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు కనిపించడం లేదు, వీరి ఘోష వినిపించడంలేదు, వీరి గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. మరి స్వాతంత్య్రం వచ్చింది ఎవరికి? దేశం ఎక్కడికి దూసుకుపోతుందో? ఎందులో దూసుకుపోతుందో? వారికే తెలియాలి. ఈ దేశానికి ఒక దిశానిర్ధేశం చేసే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం పెడితే అదిచూసి ఓర్వలేక అగ్రకుల దురంహకారంతో వీర్రవీగుతూ గరగపర్రులో 800 కుటుంబాలబహిష్కరణ చేసి అన్ని విధాలుగా అవమానపరుస్తుంటే ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. 
భారత దేశానికి ప్రథమ పౌరునిగా దళితున్ని చేస్తున్నామని ఒకరంటారు, ఇంకొకరేమో 125 అడుగుల విగ్రహం పెడతాం అంటారు. మరి అంబేడ్కర్‌ విగ్రహం పెట్టినందుకే దళితులని బహిష్కరణ చేసిన మీ వాళ్ళు కనిపించడం లేదా? మీరు మాట్లాడానికి మీకు కులం అడ్డొస్తుందా? నిన్న మంథని మధుకర్‌, మొన్న భువనగిరిలో నరేష్‌ హత్య ఇంకా కనిపించని హత్యలు ఎన్నో, ఇక్కడ గ్రామం గ్రామాన్నే వెలివేస్తే ఇంకా ఎన్నాళ్లు చూస్తూ ఉరుకుంద్దామా? దళితజాతి బతుకులో వెలుగు నింపిన మహనీయుని విగ్రహం పెడితేనే తట్టుకోలేకపోతున్నారు దురంహకారులు, ఇంకా వారి మాయమాటలు చెపితే ఇంకా నమ్ముదామా? 
రాష్ట్రపతులు చేయకున్నా పర్వలేదు, కానీ ఆత్మ గౌరవంతో బ్రతకనీయండి చాలు. 125 అడుగుల విగ్రహం పెట్టకున్న పర్వలేదు, కుల దురంహకారంతో వీర్రవిగే వారిని అధికారంలో ఉండనిస్తే గరగపర్రులో దళితులకు జరిగిందే మరోచోట జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు, చట్టాలను, కోర్టులను నమ్ముకుంటే న్యాయం జరగదు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరం ఐక్యంగా అంబేడ్కర్‌ ఆలోచనలను, విధానాలను ఊరు, వాడ వాడల విస్తృతంగా ప్రచారం నిర్వహించి రాజ్యాధికారాన్ని సాధింద్దాం, అగ్రకుల దురంహకార ఆధిపత్యాన్ని అంతం చేద్దాం.

Dalithashakthi - 2025 - Magazines