Tuesday, May 1, 2018

స్నేహాశీలి, మృధుస్వభావి, సామాజిక 'కమ్యూనిస్టు'ఉద్యమకారుడు

స్నేహాశీలి, మృధుస్వభావి, సామాజిక 'కమ్యూనిస్టు'ఉద్యమకారుడు - జి.రాములు

విద్యార్థి దశలోనే బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను గ్రామీణ పేద ప్రజల వద్దకు తీసుకువెళ్ళిన జి.రాములు, బి.ఆర్‌. భగవాన్‌దాస్‌ పరిచయంతో కమ్యూనిస్టు నాయకుడిగా మారారు. అయినా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీల్లో కులంపై ప్రత్యేక చర్చలను ప్రారంభించిన వారిలో జి.రాములు ఒకరు. కమ్యూనిస్టులు ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా, కులసమస్యలను కూడా తీసుకోవాలని 1975లో నక్సలైట్‌ పార్టీలో ఉన్నప్పుడే చర్చ పెట్టారు జి.రాములు. సిపియం పార్టీ వరంగల్‌ సిటీ కార్యదర్శిగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 41వ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను సామాజిక అణచివేత నుండి విముక్తి చేయడానికి అంబేడ్కర్‌ ఆలోచన విధానం, ఆర్థిక దొపిడీ నుండి మార్క్సిస్టు మేథాడాలజీని కలిపి పని చేస్తారు మన జి.రాములు. అదే అంశాన్ని పార్టీలోని ఫోరంలలో చర్చలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక శక్తులు, కమ్యూనిస్టులు కలిసి 'లాల్‌-నీల్‌' ఐక్యతను ముందుకు తీసుకు పోవడానికి నిరంతరం కృషి చేసిన, చేస్తున్న వారిలో జి.రాములు ముందు వరుసలో ఉంటారని అనడంలో అతిశయోక్తిలేదు. సామాజిక న్యాయసాధన కోసం కషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలన శక్తులు సహజమైన దఢ బంధంతో ఐక్యం కావాలని కోరుకునే వారందరూ ముందుకు రావాలని కోరుతున్నారు. కమ్యూనిస్టులందరూ ఒకే పార్టీగా విలీనం కావాలని, 'లాల్‌-నీల్‌' ఐక్యత కావాలనే జి.రాములు ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో టీ-మాస్‌, బిఎల్‌ఎఫ్‌ ఒక్క నూతన వొరవడిని సృష్టిస్తుందని ఆశభావంతో ఉన్నారు. ఈ నూతన చైతన్యం మరింత బలపడి భారతదేశ నిర్ణయాత్మక రాజ్యాధికారశక్తి కావాలనే ఆయన లక్ష్యం. స్నేహాశీలి, మృధుస్వభావి, ''సామాజిక కమ్యూనిస్టు'' ఉద్యమకారులు జి.రాములు గురించి కార్మిక దినోత్సవం 'మే డే' సందర్భంగా దళితశక్తి పాఠకుల కోసం...  
website https://dalithashakthi.com/ను సందర్శించండి 

Dalithashakthi - 2025 - Magazines