చీకటి జీవితాల్లో వెలుగుల చుక్కాని చిక్కా హరీష్ కుమార్
విజ్ఞానపు కుసుమ పరిమళాలు విశ్వమంతా వ్యాపించక మునుపే అంధులెందరో శ్రవణ జ్ఞానేంద్రాయాన్నే నేత్రంగా భావించారు. ఆ కోవలోనే సుర్‌దాస్ లాంటి మహాకవులెందరో... అయినా భారతదేశంలో వివక్షకు ఉన్న స్థానం మరేదానికి లేదు. మహాత్మ జ్యోతిరావ్‌ఫూలే, సావిత్రిబాయి ఫూలే లాంటివారు లేకపోతే దళిత, బడుగు వర్గాలతోపాటు స్త్రీ విద్య, వికలాంగులకు విద్యకు చోటులేదు. అలాంటి చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన స్ఫూర్తిప్రదాత సర్ లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని ఆరు చుక్కల రాత, అరచేతి కర్ర అంధులకి ఆధారంగా చేసుకుని రాజ్యాంగంలో వికలాంగులకు వాటా కావాలని నినదించిన ఏకైక గొంతుక. వికలాంగుడినని భాద పడకుండా సంకలాంగులతో సమానంగా తోటి వికలాంగుల కోసం నిరంతరం తపనపడే వ్యక్తి. వికలాంగుల హక్కుల కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నటువంటి శక్తి. సరదా కోసం మొదలైన సాహిత్య ప్రస్థానంలో తనకంటూ ఒక్క ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ధ్యాన్‌చంద్ లాంటి క్రీడాకారులకు క్రీడా పురస్కారాలు, భారతరత్న లాంటి అవార్డులు రాకపోవడానికి కారణం పాక్షిక అంధుడు కావడమే. దేశానికి గుండెలాంటి పార్లమెంట్‌లో వికలాంగులు లేకపోవడం మరో కారణం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన ''రాజ్యాంగ పరిహారపు హక్కు'', సమానత్వపు హక్కు''కు నేటికీ ప్రాధాన్యత దక్కకపోవటం మనుస్మృతి అమలులో వుండటమే. బుద్దుడు నాటి నుండి నేటి వరకు బుద్ధిబలంతో సమాజాన్ని జయించారు కానీ శరీరంతో కాదని అంటాడు. వైకల్యం శరీరానికే కానీ విజ్ఞానం మేధస్సుకు సంబంధించిందని పాలకులు గుర్తించడంలేదు. వికలాంగులకు కావాల్సింది మెరుపులు కాదు, వెలుగులు కావాలి అంటాడు. కాళ్లకు తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తుందని, అలాగే మనస్సుకు తగిలిన గాయం ఎలా జీవించాలో నేర్పిస్తుందని అంటాడు చిక్కా హరీష్ కుమార్. ఈ పేరు వినగానే ధ్వని తరంగాలు వికలాంగుల సమాజాన్ని చుట్టూ ముడుతాయి. ఆయన జీవిత విశేషాలు ఎందరికో స్ఫూర్తి నింపాలని....
website https://dalithashakthi.com/ను సందర్శించండి