అంబేడ్కర్ ఆలోచనా విధానంతోనే దేశాభివృద్ధి రంజిత్ ఓఫీర్

- అద్దంకి రంజిత్ ఓఫీర్ వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడైనప్పటికీ, సర్వమతసారాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పేదల అభ్యున్నతికి సామాజిక అంశాలపై కేంద్రీకరించి పని చేయడం ఆయనకు ఆయనే సాటి. మత ప్రబోధకులుగా పనిచేస్తూనే సమాజంలో ఉన్న అనేక సైద్ధాంతిక గందరగోళ పరిస్థితులను తన ప్రసంగాల తోనూ, రచనలతోనూ చక్కదిద్దారు. భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. ఆయన స్ఫూర్తిని చాటడడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అద్దంకి రంజిత్ ఓఫీర్. ''కులం పునాదులపై ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేం'' అన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో కులాల పేరిట వున్న సామాజిక అసమానతలను తొలగించడానికి పోరాడుతున్నారు. కుల నిర్మూలన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంబేడ్కర్ చెప్పిన ''మాస్టర్ కీ''ని సాధించేందుకు 'ఇండియా ప్రజాబంధు పార్టీ'ని నిర్మించి కార్యాచరణకు పూనుకున్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానంతోనే దేశాభివృద్ధి చెందుతుందని విశ్వసించే వారిలో అద్దంకి రంజిత్ ఓఫీర్ ముందు వరుసలో ఉన్నారు.
- website https://dalithashakthi.com/ను సందర్శించండి