నీవే లేకుంటే...
నీవే గనుక లేకుంటేమా బతుకులు ఇప్పటికీ
తెల్లారేవే కావు!
మూతికి ముంత, ముడ్డికి ఆకు
అలానే వ్రేళ్ళాడుతుండేవి!
తలలు పంకించి, చేతులు ముడుచుకుని
దిక్కులు వెతుక్కుంటూ ఉండేవాళ్ళం!
ఇప్పటికి కొంకొణ ప్రాంత రైతులు
బిత్తర బిత్తరగా బ్రతికే వారు!
కార్మికులు యంత్ర బాహువులకి చిక్కి
నలిగి బూడిదయ్యేవారు!
ఓటు మొగమే చూసే వారం కాదు.
బడి గడప తొక్కేవాళ్ళమే కాదు!
నీవే గనుక లేకుంటే
గుక్కెడు నీళ్ళ కోసం
అలమటించాల్సి వచ్చేది!
గుప్పెడు మెతుకుల కోసం
అల్లాడాల్సి వచ్చేది!
మహద్ సత్యాగ్రహం చేసి
మా బతుకుల్లో వెలుగు పంచావు!
మనుధర్మ శాస్త్రాన్ని తగుల బెట్టి
మాలో ఆత్మ విశ్వాసం నింపావు!
నీవే గనుక లేకుంటే
దేవాలయాల గడప తొక్కనిచ్చేవారే కాదు!
పతనార్ల జీవితాల్లో
సంతోషం వెల్లువిరిసేదే కాదు!
శ్రామికుల బతుకుల్లో
నవ్వులు విరబూసేవే కాదు!
నీవే గనుక లేకుంటే
ఈ దేశానికి రాజ్యాంగం
ఎవరు రాయగలిగేవారు?
అంత పెద్ద బాధ్యతను
ఎవరు తలకెత్తుకొనగలిగేవారు
ఈ దేశంలో బౌద్ధాన్ని
ఎవరు పునరుద్ధరించగలిగే వారు?
నీవు పుట్టి ఉండకపోతే
నిమ్నజాతుల మనుగడ ప్రశ్నార్థకమయ్యేది
అస్పశ్యుల వెతలు
ఆరని కాష్టంలా రగులుతూ ఉండేవి!
దళిత బాంధవా! బాబాసాహెబా!
నీ నుంచి స్వాభిమానం అబ్బింది
నీ నుంచి వ్యక్తిత్వం అలవర్చుకున్నాం!
ధైర్యస్థైర్యాలను, ఆత్మ విశ్వాసాన్ని
నీ నుంచే చేజిక్కించుకున్నాం!!
అసలు నువ్వు లేకుండా ఉంటే?
ఈ ప్రశ్న అవసరం లేదు!
నువ్వు మా కోసం పుట్టావ్!
నీ జన్మ యుగధర్మానిధి!
నువ్వు మా యుగపురుషుడివి!
నువ్వు కారణజన్ముడివి!!
బిత్తర బిత్తరగా బ్రతికే వారు!
కార్మికులు యంత్ర బాహువులకి చిక్కి
నలిగి బూడిదయ్యేవారు!
ఓటు మొగమే చూసే వారం కాదు.
బడి గడప తొక్కేవాళ్ళమే కాదు!
నీవే గనుక లేకుంటే
గుక్కెడు నీళ్ళ కోసం
అలమటించాల్సి వచ్చేది!
గుప్పెడు మెతుకుల కోసం
అల్లాడాల్సి వచ్చేది!
మహద్ సత్యాగ్రహం చేసి
మా బతుకుల్లో వెలుగు పంచావు!
మనుధర్మ శాస్త్రాన్ని తగుల బెట్టి
మాలో ఆత్మ విశ్వాసం నింపావు!
నీవే గనుక లేకుంటే
దేవాలయాల గడప తొక్కనిచ్చేవారే కాదు!
పతనార్ల జీవితాల్లో
సంతోషం వెల్లువిరిసేదే కాదు!
శ్రామికుల బతుకుల్లో
నవ్వులు విరబూసేవే కాదు!
నీవే గనుక లేకుంటే
ఈ దేశానికి రాజ్యాంగం
ఎవరు రాయగలిగేవారు?
అంత పెద్ద బాధ్యతను
ఎవరు తలకెత్తుకొనగలిగేవారు
ఈ దేశంలో బౌద్ధాన్ని
ఎవరు పునరుద్ధరించగలిగే వారు?
నీవు పుట్టి ఉండకపోతే
నిమ్నజాతుల మనుగడ ప్రశ్నార్థకమయ్యేది
అస్పశ్యుల వెతలు
ఆరని కాష్టంలా రగులుతూ ఉండేవి!
దళిత బాంధవా! బాబాసాహెబా!
నీ నుంచి స్వాభిమానం అబ్బింది
నీ నుంచి వ్యక్తిత్వం అలవర్చుకున్నాం!
ధైర్యస్థైర్యాలను, ఆత్మ విశ్వాసాన్ని
నీ నుంచే చేజిక్కించుకున్నాం!!
అసలు నువ్వు లేకుండా ఉంటే?
ఈ ప్రశ్న అవసరం లేదు!
నువ్వు మా కోసం పుట్టావ్!
నీ జన్మ యుగధర్మానిధి!
నువ్వు మా యుగపురుషుడివి!
నువ్వు కారణజన్ముడివి!!
-డా|| గూటం స్వామి




