విద్యా ప్రధాత సావిత్రిబాయి ఫూలే
- డా||సుజాత సూరేపలి
''స్వయం కృషితో ముందుకు పోదాం.
పనిజ్ఞానాన్ని మరియు ధనాన్ని ఇస్తుంది.
విజ్ఞానం లేకపోతే పశువులుగా మారతాం.
జ్ఞానం లేకపోతే అమాయకులుగానే ఉండిపోతాం.
పనిజ్ఞానాన్ని మరియు ధనాన్ని ఇస్తుంది.
విజ్ఞానం లేకపోతే పశువులుగా మారతాం.
జ్ఞానం లేకపోతే అమాయకులుగానే ఉండిపోతాం.
పనిలేకుండా ఖాళీగా కూర్చోవడం కంటే బయటికి పోయి జ్ఞానాన్ని సంపాదిద్దాం, పీడితుల కష్టాలని దూరం చేద్దాం... కుల సంకెళ్ళని తెగ్గోడద్దాం... మొట్టమొదటిగా బ్రాహ్మణ శాస్త్రాలని విసిరిపారేద్దాం''. (సావిత్రిబాయి వ్రాసిన కావ్వ ఫూలేలోని కవిత)
సావిత్రిబాయిని తలచుకోవడం, ఆమె అడుగుజాడలలో నడవడం ఇప్పుడు దేశ కాల మానపరిస్థితిలో చాలా అవసరంగా భావించాలి. ఆమె భావనలు, ఆచరణ ప్రతి మహిళకి దిక్సూచి కావాలి. అదే విధంగా జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి దంపతుల సామాజిక దృక్ప్సధం ప్రతి ఇంట్లో ఉండడం నేటి భారతీయ సమాజ మార్పుకు అనివార్యం. ఈ దేశాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న బ్రాహ్మాణీయ, పితృస్వామ్మ, కులతత్వాన్ని ఎదిరించిన మొట్టమొదటి దంపతుల గురించి చరిత్ర ఎవరీకీ చెప్పలేదు. సావిత్రిబాయిని, జ్యోతిభాఫూలే ఒక సామాజిక కార్యకర్తలుగా, సంస్కకర్తగా మాత్రమే చూడబడ్డారు. కాని సమాజాన్ని సమూలంగా మార్చి వేసే ఒక సామాజిక విప్లవ కారులుగా ప్రచారం కాలేదు. గత కొద్ది సంవత్సరాలుగా సావిత్రిబాయి జన్మ దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా, లేదా మహిళా ఉపాధ్యాయులు దినోత్సవంగా ప్రకటించాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. అసలు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా ఉన్న సావిత్రిబాయిని కాకుండా, సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ దినం ఈ దేశానికి ఉపాధ్యాయ దినోత్సవం కావడంలోనే ఉంది కుల, మత, పితృస్వామ్య భావజాలం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి సావిత్రిబాయిని గుర్తించమని అడుగుతున్నాం.
సావిత్రిబాయి ఫూలే ఒక సాధారణ కుటుంబంలో 3 జనవరి, 1831 నాడు నయిగౌమ్, సతారా జిల్లా, మహారాష్ట్రలో జన్మించింది. అప్పటి కాల పరిస్థితి ప్రకారం అతి చిన్న వయసులోనే 9 సంవత్సరాలకే జ్యోతిభాపూలేతో వివాహం జరిగింది. భర్త అభ్యుదయ భావాలు, ఆమెకు ఉన్న పట్టుదల సావిత్రిబాయిని మొట్టమొదటి మహిళా టీచర్‌గా భారతదేశ పటంలో నిలబెట్టినాయి. కాని చరిత్ర కారులు ఎవరు కూడా క్రింది కులాల వారు కాకపోవడం చేత, పితృస్వామ్య భావజాలంతో ఉండడం వలన పూలే దంపతుల జీవిత కృషిని సగం మంది జనాభాకి తెలపకుండా చేసినాయి. పూలే దార్శనికత, ఆదర్శంతో పట్టుపట్టి సావిత్రిబాయిని చదివించి అణగారిన వర్గాల మహిళలకి చదువు చెప్పడానికి ఆమెకు అన్ని విధాల సహాయ పడి 1952లో నైగౌమ్‌లో అంటరాని బాలికల కోసం ఒక పాఠశాలని ఏర్పాటు చేసి అక్కడ ఉపాధ్యాయురాలిగా పనిచేయడానికి సమాయత్తం చేశాడు. అక్కడి నుంచి సావిత్రిబాయి తన స్వంత ఆలోచనలతో ముందుకు పోతూ సమాజంలో వివక్షకు గురి అవుతున్న ఆడపిల్లలకి, అన్నికులాల వారికి ఆసరాగా మారి, అప్పటి సామాజిక పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోగలిగింది.
ఒక స్త్రీ ఆదర్శం తను పనిచేసే విధానంలోనే కాక తను జీవితంలో స్వయంగా ఆచరణలో చూపినప్పుడు ఎక్కువగా ఆదరణ పొందుతుంది. తాము చేసిన పనులు కలకాలం నిలబడతాయి. సావిత్రిభాయి ఒక టీచరనే కాదు, అంటే అప్పుడు ఉపాధ్యాయులకు ఇప్పటి ఇంత సుఖవంతమైన, గౌరవప్రదమైన, సౌఖ్యమైన ఉద్యోగం కాదు. అప్పటి పరిస్థితులలో పూలే దంపతులు అనేక అవమానాలని ఎదుర్కొని, దాడులని సైతం లెక్క చేయకుండా విద్యని, విద్య ద్వారా స్త్రీలని ముందుకు తీసుకుపోవాలనే ఆకాంక్షతోనే ఒక ఉద్యమంలాగా పనిచేయాల్సి వచ్చింది. విద్య మాత్రమే మనిషిని, సమాజాన్ని మారుస్తుంది. అనే ఒక సిద్దాంతంతోని పూలే దంపతులు అన్ని కష్టాలకోర్చి అటువైపుగా ప్రయాణించారు. పాఠశాలకి పోతున్నప్పుడు తనమీద రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు, బురద చల్లేవారు. ఆమెని అన్ని రకాలుగా అవమానాలకి గురి చేసినా కూడా లెక్కచేయలేదు ఎప్పుడు. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నా కూడా టీచర్లు ఎవరు తమ సంపాదనలోంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి తాము పనిచేసే స్థలాలలో కాని, అక్కడ ఉన్న పేద పిల్లలకి కాని ఏమి చేసే పరిస్థితి లేదు. అక్కడో, ఇక్కడో కొద్ది మంది లేకపోలేదు కాని, సేవా భావం కూడా ఉపాధ్యాయులలో కొరవడింది అని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ.
సావిత్రిభాయి ఫూలే కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు ఆమె మరాఠి భాషలో మొట్టమొదటి స్త్రీవాద కవయిత్రి కూడా. తాను రాసిన కావ్వ పూలే అనే కవితా సంపుటి ఇప్పటికి ఎంతో ప్రముఖమైనది. సహచరుడు పూలే ఎప్పుడు కూడా తనని చదువుకోమని తద్వారా స్త్రీ విముక్తి కోసం పనిచేయాలని ఎప్పుడు ప్రోత్సహించేవాడు. తాను కలలు కన్న సత్య శోధన సమాజం కొరకు కొంత మంది స్త్రీ ఉద్యమ కారుల అవసరం, తోడ్పాటు కావాలని సావిత్రిభాయిని తన బాటలో నడిపాడు. ఆయన చేసే ప్రయత్నాలకి స్వంత ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో సావిత్రిభాయి ధైర్యంగా భర్తతోనే సమాజం కొరకు సేవ చేయాలని నిర్ణయించుకుని ముందుకు నడిచింది.
విప్లవ భావాలు ఒక్క దగ్గర ఆగిపోవు, అన్ని రకాల ఆధిపత్యాలని ప్రశ్నిస్తుంటాయి. రూపు మాపడానికి ప్రయత్నిస్తాయి, సావిత్రిభాయి చదువుతోపాటు ఆనాడు స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షతలని మాట్లాడింది, రూపు మాపడానికి ప్రయత్నించింది. అప్పుడు బాల్యవివాహాలు ఎక్కువ అవడం, వితంతు స్త్రీలను ఇంటి నుంచి వెళ్ళగొట్టడం ఒక అనాగరిక సంస్కృతి. అనేక మంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకునే వారు. వారిని నివారించడానికి ఈ దంపతులు ఒక ఆశ్రమం పెట్టి ఆదరించేవారు. ఒక భర్త చనిపోయిన స్త్రీని కాపాడి, వారి బిడ్డని సావిత్రిభాయి దంపతులు పెంచుకున్నారు. అక్కడి నుంచి బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, ఆత్మహత్యల నుండి కాపాడడం, సాంస్కృతిక మార్పులు తీసుకురావడం మీద అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆ దంపతులు. అంటరాని వారిని పశువులకన్నా హీనంగా చూడటమే కాకుండా, కొన్ని పశువులని బాగా ప్రేమిస్తారు కూడా. వారి నీడని తాకితే అనుకునే కాలంలో, వారిని అత్యంత భయంకరంగా చూసే పరిస్థితిలో వారి దాహాన్ని తీర్చడానికి సావిత్రిభాయి దంపతులు ఒక బావి తవ్వించి వారి దాహాన్ని తీచ్చే ప్రయత్నం చేశారు. దీనిని సంస్కార వాదంగా చూడడం కాకుండా బ్రాహ్మాణ ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా, వారి ఆనాటి మనస్తత్వాన్ని మార్చే విధంగా చేసే పనిగా చూడాలి. అప్పటి నుండి ఇప్పటికి కూడా అంటరాని వారి పరిస్థితి దేశంలో చాలా చోట్ల ఇదే విధం ఉంది.
సమాజంలో ఉన్న స్త్రీ, బాలిక అణచివేత సంస్కృతికి వ్యతిరేకంగా మరొక విప్లవాత్మకమైన ఉద్యమం మొదలు పెట్టారు. ఈ దంపతులు. ఆనాడు బాలికలని ముస్లిం వాళ్ళకి ఇచ్చి పెండ్లి చేయడం, భర్తలు చనిపోతే వితంతురాల్లుగా ముద్రవేసి, గర్భంతో ఉన్న పిల్లలని, స్త్రీలని కూడా చూడకుండా ఇంటి నుంచి వెళ్ళగొట్టే వారు. ఈ పరిస్థితిని పోగొట్టాలని పూలే దంపతులు ఒక మహౌతన్నతమైన విలువలతో కూడిన ఆశ్రమంలోకి బాలికలని, స్త్రీలని చేరదీసి వారిలో ధైర్యాన్ని నింపేవారు. స్త్రీల కోసం 1852లో మహిళాసేవా మండలిని స్థాపించి కార్యక్రమాలని చేపట్టేవారు. ఇప్పటికి భర్తలేని స్త్రీలలో మార్పులేదు కాని వాళ్ళ గురించి ఆలోచించే స్త్రీలు గాని, పురుషులు గాని లేకపోవడం పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు.
1876 నుండి 1898 కరువులో సావిత్రిభాయి ఒంటిరిగానే ఎంతో ధైర్యంగా పనిచేసింది. భర్త తోడ్పాటుతో అన్ని అవరోధాలని అధిగమించడం ప్రారంభించింది. పూలే చనిపోయిన తరువాతనే తలకొరివిపెట్టి హిందూ సంస్కృతిని, పితృస్వామ్య సంస్కృతిని ధిక్కరించి నిలబడిన మహిళ. చివరికి ప్లేగు వ్యాధి వచ్చిన రోగికి సేవ చేసి తాను కూడా ఆరోగ్యానికి బలై ప్రజలకి సేవ చేస్తూనే చనిపోయింది. సావిత్రిభాయిని భర్త ప్రోత్సాహంతో పైకి వచ్చింది కాని భర్తచాటు భార్యగా ఆమె ఎప్పుడు అనుకోలేదు, ఫూలే కూడా అనుకోలేదు. బ్రతికి ఉన్నన్ని రోజులు ఒక ఆదర్శం కోసం కలిసి మెలిసి బ్రతికిన వాళ్ళు వారిద్దరూ. ఒక ధిక్కారస్వరాన్ని వినిపించిన మొట్టమొదటి స్త్రీ సావిత్రిభాయి.
ఇంత ఘన చరిత్ర ఉన్న సావిత్రిభాయి ఎందుకు ఈ దేశ ప్రజలకి తెలియదన్నది మన ముందు ఉన్న ప్రశ్న. ఎక్కడో ఉన్న క్లారా జేట్కిన్‌ని స్త్రీ హక్కుల కార్యకర్తగా పరిచయం చేసిన ఉద్యమకారులు, చరిత్రకారులు సావిత్రిభాయిని ఎందుకు గుర్తించలేదు, ఆమె చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఎందుకు చోటు చేసుకోలేదు. ఆమె ఒక విప్లవకారిణిగా ఎందుకు గుర్తించబడలేదు. ముఖ్యంగా ఈ దేశ కుల, పితృస్వామ్య, బ్రహ్మాణ భావజాలానికి సావిత్రిభాయి ఫూలే, జ్యోతిభా ఫూలే కూడా అంటరాని వారేనా అనేది ఆలోచించాలి. స్త్రీలకి కేవలం చదువు, ఉద్యోగం, అందం అనేవి నేర్పించి హిందూ స్త్రీల మాదిరిగా తయారు చేసి సమాజానికి అందించే చదువులు కావు నేడు కావల్సింది. ఇక్కడ ఉన్న అన్ని రకాల అధిపత్యాలని ప్రశ్నించే సావిత్రిభాయి ధైర్యాన్ని, ఆదర్శాన్ని, ఆచరణని నేడు మనం రేపటి తరానికి అందించాలి. అప్పుడు మాత్రమే ఆమె ఆశించిన స్త్రీ సాధికారత నిజం అవుతుంది. ఆమె జన్మదినం ఉపాధ్యా దినోత్సవంగా జరుపుకోవాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దానిని సాధించిన రోజు సావిత్రిభాయి ఫూలేకి నిజమైన నివాళి.

No comments:
Post a Comment