కార్మికులకు, కర్షకులకు దళితశక్తి సామాజిక మాసపత్రిక మేడే శుభాకాంక్షలు...
మేడే అంటే కార్మికుల విరోచిత పోరాటాలకు చిహ్నాం, మేడే అంటే కార్మికుల వెట్టిచాకిరి నుండి విముక్తి పొందిన రోజు. ఆనాటి చికాగో కార్మికుల బలిదానం, పోరాట స్ఫూర్తితో ప్రపంచ కార్మికులను ఐక్యం చేసింది. పోరాడితే పోయేదేమీలేదు, బానిస సంకెళ్లు తప్ప నినాదం మేడే స్ఫూర్తే. కార్మికుల ఐక్య పోరాటాలకు, హక్కుల సాధనకు కేంద్రం అయింది. కార్మిక ఉద్యమం అణచివేతను, అన్యాయాన్ని ప్రశ్నించి, విముక్తి సాధించింది.
భారతదేశానికి స్వాతంత్య్రరానికి పూర్వం, స్వాతంత్య్రం అనంతరం డా||బాబాసాహెబ్ అంబేడ్కర్ కార్మికులు, ఉద్యోగులకు అనేక హక్కులను చట్టాల ద్వారా, రాజ్యాంగం ద్వారా విముక్తి కల్పించారు. ముఖ్యంగా మహిళలు, బాలకార్మికులు ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేయకుండా ఆనేక చట్టాలను తీసుకువచ్చారు. ఆనాటి నుండి నేటికి కార్మికులు, ఉద్యోగులు పొందుతున్న హక్కులు, సౌకర్యాలు డా||బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించినవే. కార్మిక చట్టాలతో పాటు కార్మికుల నూతన జీవన విధానానికి ఆయన బాటలు వేశారు. డా||అంబేడ్కర్ ప్రతిపాదించిన స్టేట్ సోషలిజంలో పరిశ్రమలు, భూమి, సహజ వనరులు, విద్యా, వైద్యం, భీమా జాతీయ యాజమాన్యంలోనే ఉండాలని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను డా||బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే వ్యతిరేకించారు. ఆయన పాలకుల విధానాలను ఎప్పుడూ సమర్ధించలేదు. కార్మికులకు, పీడితులకు అండగా పోరాటాలు, ఉద్యమాలను నిర్వహించారు. 1942 డిసెంబర్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లడుతూ దేశానికి శ్రామికులైన కార్మికులే సరైన ప్రతినిధ్యం వహిస్తారని చెప్పారు.
మేడే నిర్వహించే ప్రతి కార్మికుడు, ప్రతి కార్మిక సంఘం డా||బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను తమ హక్కుల ప్రదాతగాను, కార్మికుల పితామహుడుగాను, కార్మికుల జీవితాలను అభివృద్ధి చేయడానికి చేసిన కృషిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది.
డా||బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి అంబేడ్కర్ జయంతి ఉత్సహాలను నిర్వహించారు. ఆయన ఆశయాలు, విధానాలకు ముందుకు తీసుకుపోవడానికి ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చిన మన దేశ పాలకులకు మాత్రం ఆయనకు వ్యతిరేక విధానాలనే అనుసరిస్తూ తామే వారసులమని ఢంకాలు మ్రోగిస్తున్నారు. సామాజిక న్యాయానికి పునాది వెయాల్సిన ప్రభుత్వాలు బ్రహ్మణీవాదాన్ని ముందుకు తెస్తూ కులవ్యవస్థ మరింత పటిష్టంగా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సామాజికోద్యమకారులు, అభ్యుదయవాదులు ఐక్యంగా డా||బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను, విధానాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాల్సి తక్షణ అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment