సంపాదకీయం
మన దేశంలోనూ ఒక్కశాతంగా ఉన్న సంపన్నులు 58శాతం సంపద అనుభవిస్తుంటే,99 శాతం ప్రజల చేతిలో కేవలం 42శాతం సంపదే మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా 99 శాతంప్రజలు ఐక్యమై కండ్లు తెరవాలి. ఈ అసమానతలను, అభివద్ధిని ప్రశ్నించాలి? ఎదిరించాలి? అభివద్ధి అంటే కోట్లాది మంది శ్రమను కొద్ది మందికి దోచి పెట్టడమేనా? అంతరాలను పెంచి పోషించడమేనా..? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై ఈ ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం.
దళిత, గిరిజన, బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయవివక్షకు కారణమైన విద్యాను అభ్యసించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆకాక్షించారు. తన జాతి ప్రజలనుఐక్యంచేసి, సమీకరించాల్సిన అవసరాన్ని, జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ముందుండి పోరాటాన్ని నడిపించాల్సివ అవశ్యకతను వివరించారు. భోధించు, సమీకరించు, పోరాడినప్పుడు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు.
ఈ రోజు ఉత్తర్ప్రదేశ్లో ఏర్పడిన ''భీమ్ ఆర్మీ'' బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రబోధించిన భోధించు, సమీకరించు, పోరాడు లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నది. రావణ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తర్ప్రదేశ్లో నిర్మించిన భీమ్ఆర్మీ ద్వారా విద్యా యొక్క ప్రాముఖ్యతను దళిత, గిరిజన, బలహీనవర్గాలకు వివరించడమే కాకుండా దాదాపు 250 విద్యాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా సామాజిక వర్గాలను చైతన్యం చేస్తున్నారు. విద్యా ద్వారానే తమ జాతి ప్రజలను ఐక్యం చేసి షహరాన్పూర్లో ఉద్యమ పోరాటాన్నిమొదలుపెట్టారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని దేశ రాజధానిలో వినిపించాడు. ప్రపంచాన్ని ఒక్కసారి భారతదేశంలో దళిత, గిరిజన, బలహీనవర్గాలపైహిందూత్వవాదులు చేస్తున్న దాడులు, అత్యాచారాలు, కులవివక్ష అంటరానితనంపై ఆలోచించే విధంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో 50వేల మందితో కదన సింహాంగాగర్జించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. మనం, మన జాతి ప్రయోజనాల కోసం చెయి చెయి కలిపి ఐక్యంగా పోరాడాల్సిన అవసరాలన్ని నేటి పాలకులే కల్పించినవిషయం మార్చిపోవద్దని దళితశక్తి పాఠకులకు మరోమారు గుర్తు చేస్తున్నది. మాన్యశ్రీ కాన్షీరామ్ రాజకీయ పోరాటపటిమతో రాజ్యాధికారం సాధించే వరకూ... రాజకీయ ఉద్యమాన్ని నిర్మిద్దాం, కదలిరండి, కలసి రండి, కలిసినడుద్దాం, నడిపిద్దాం...
