Saturday, August 12, 2017

విద్యావ్యవస్థ చరిత్రను తిరగరాస్తున్న సంక్షేమ గురుకులాలు


విద్యావ్యవస్థ చరిత్రను తిరగరాస్తున్న సంక్షేమ గురుకులాలు
కార్పోరేట్‌ కాలేజీల్లో చదివితే తమ పిల్లలు మంచి ర్యాంకు సాధిస్తారని తల్లిదండ్రుల అభిలాష, కానీ తమ పిల్లలు ఏ కాలేజీలో వేసిన బాగా చదువుతారని అనుకోరు, ఎందుకంటే కార్పోరేట్‌ కాలేజీల గ్లోబల్‌ ప్రచారాన్ని మాత్రమే నమ్ముతారు. మా పిల్లలను కాదు, ఎక్కడైతే ఏం? చదువు ముఖ్యం అనుకోవడం లేదు. అందుకే కార్పోరేట్‌ సంస్థల విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. ఈరోజు విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడుతున్నది ఒక్క ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలే అంటే అతిశయోక్తి కాదు. కార్పోరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా గురుకుల పాఠశాలలు, కళాశాలను నడిపిస్తున్న తీరు ఈ రోజు మన అందరికీ తెలుసు. కార్పోరేట్‌ విద్యాసంస్థల కంటే గురుకుల విద్యా సంస్థలు ఫలితాల్లోనే కాకుండా అనేక యాక్టివిట్సిలోముందు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ విద్యాసంస్థలు ఆసియా ఖండంలోనే అతి ఎత్తతైనా, పెద్దదైన ఎవరెస్టు ఎత్తు, కాదు కాదు ఐరోపా ఖండాలకు వ్యాప్తి చెందిందంటే కూడా తక్కువే అవుతుంది.
విద్యార్థులను ఉన్నత శిఖారాలకు చేర్చేందుకు వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఆత్మవిశ్వాసం లేకుంటే అతి చిన్న పనైనా సాధించలేం. వారికి కార్పోరేట్‌ సంస్థల్లో పిల్ల
లను చేర్పిస్తున్న తల్లిదండ్రుల మాదిరికాదు. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న, చదివిన విద్యార్థుల తల్లిదండ్రలు నిరాక్ష్యరాసులు, కానీ వీరు ఎంత కష్టమైన, ఎంత సహాసామైన చేయగల సత్తా కలిగినవారు. అందుకే గురుకుల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి, నైపుణ్యం కోసం అనేక మంది నిపుణులతో తరగతులు నిర్వహించారు. సమ్మర్‌ సమ్రారు పేరుతో వేసవి కాలంలో ఆయా రంగాల్లోని విద్యార్థులకు నైపుణ్యతరగతులు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో ఎక్కడ, ఎప్పుడు లేదు. మనం శిక్షణ ఇవ్వడం మాత్రమే చేయగలం, కానీ మనం సాధించాలేం. సాధనకు అవసరమైన అన్ని రకాల నైపుణాల్యలను విద్యార్థులు గ్రహించాల్సి ఉంటుంది. అందుకు మాలవత్‌ పూర్ణ, ఆనంద్‌లే ఆదర్శం. అతి పిన్న వయస్సులో ఎవరెస్ట్‌ ఎక్కిన ఘనత సాధించారు. అనేక మంది విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌ తదితర దేశాలకు వెళ్లాగలుగుతున్నరంటే దానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతోపాటు అన్నింటిలో ముందుండి నడిపిస్తున్న శక్తి, పవర్‌ ఒక్కరే, ఆయనే డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపిఎస్‌.

Saturday, August 5, 2017

Dalithashakthi August 2017 Released

దళితశక్తి ఆగష్టు 2017 సంచికను Sc,St officers ఫోరంలో ఆవిష్కరించిన కాకి మాధవరావు, భరత్ భూషణ్, వందన్ కుమార్, డా.బాబు రావు, నాగయ్య I&PR JD, బి.గంగాధర్ ఎడిటర్ దళితశక్తి మాస పత్రిక, తదితరులు
#Dalithashakthi #Magazine #SC #Daliths

Tuesday, August 1, 2017

సంపాదకీయం - August 2017 -DSMM



ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గుజరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలు దళితులు, ముస్లింలపై అత్యంత భయంకరంగా, అమానవియంగా, ఐఎస్‌ఐ టెర్రరిస్టులకు ఏ మాత్రం తీసి పోని విధంగా దాడులు చేస్తూ, హత్యలు గావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్ర కులాలు బూటకపు పరువు పేరు మీద ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు (పెద్దపల్లి మంథని మధుకర్‌, నిజామాబాద్‌ జిల్లా అమాద్ర్‌లో రోజా, భువనగిరిలో నరేష్‌-స్వాతి, వికారాబాద్‌ జిల్లా తాండూరులో) హత్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే దళితులపై ఉన్న అసూయా ద్వేషంతో దళిత సమాజానికి దిక్సూచి అయిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై తమ ప్రతాపం చూయిస్తున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పెట్టుకోవడమే నేరంగా భావించి అత్యంత అమానుషమైన సాంఘిక బహిష్కరణ గావించారు. 75 సం.రాల స్వతంత్య్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు స్వాతంత్య్ర ఫలాలు అందకపోవడం వలనే ఆర్థికంగా బలహీనపడటమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచుకోలేకపోయారు. వీటికి కారణం ఒక్కసారి విశ్లేషించు కుందాం.
ప్లాటినం ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు మేము ఈ దేశ పౌరులమేనా? ఈ వర్గాలకు చెందిన వ్యక్తి డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్రాసిన రాజ్యాంగం ఈ వర్గాలకు అమలు జరుగుతుందా? దేశంలో ఏదోఒక్కచోట కులపరంగా, మతపరంగా, వర్గం పేరుమీద దాడులు, అణచివేత ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పెద్దఎత్తున పెచ్చర్లిటానికికారణం ఏమిటి? దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ విభాగం అయినటువంటి భారతీయ జనత పార్టీ దాని మిత్ర పక్షాలు అధికారంలోకి రావటమే కారణమా? దేశవ్యాప్తంగా దళిత వర్గాలన్నింటికి చేయూత నిచ్చి పోరాటానికి సిద్ధంగా ఉండే కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటమే కారణమా? బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచన విధానంతో రాజ్యాధికారమే ధ్యేయంగా ఏర్పడిన బహుజన సమాజ్‌ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోడమే కారణమా? గతంలో దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాలుగుసార్లు అధికారం చేజిక్కించుకున్న బిఎస్సీ అదే ఉత్తర్‌ ప్రదేశ్‌లో 17 స్థానాలకు దిగజారటం, లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం, ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల తోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అసెంబ్లీలో బిఎస్పీకి ప్రతినిధ్యం ఉండేది, ఇప్పుడు అది లేకుండా పోవడమే కారణమా? అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారం కోల్పోవటం.... తదితర కారణాలతోనే ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ శక్తులు చేలరేగుతున్నాయా? 
ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీల నాయకులు గానీ, డాక్టర్‌ అంబేడ్కర్‌ భావజాలంతో పని చేస్తున్న ఆయా పార్టీల నాయకులు గానీ జరుగుతున్న పరిణామాల మీద ఆలోచించవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- బి. గంగాధర్, ఎడిటర్, దళితశక్తి మాస పత్రిక 



Dalithashakthi - 2025 - Magazines