Friday, September 8, 2017

సంపాదకీయం - Dalithashakthi September 2017



పీడితుల న్యాయం కోసం న్యాయమూర్తులనే ఎదిరించిన సాహసవంతులు బొజ్జా తారకం. ఆయన మరణాంతరం ఉభయ రాష్ట్రాల్లో అగ్రకులాల ఆరాచాలకు, ప్రభుత్వాల మోసపూరిత కుట్రకు వ్యతిరేకంగా న్యాయవాదిగా కోర్టుల్లో, ఉద్యమకారుడిగా బయట ప్రశ్నించే నాధుడే లేకపోకపోవడం వల్ల జనం గొంతుక మూగబోయింది. న్యాయం కోసం పోరాడే న్యాయవాది ఎక్కడీ అని హైకోర్టులోని దళిత, బడుగు, బలహీన వర్గాల కేసులు వెతుకు తున్నాయి. పరువు పేరు మీద ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు పెద్దపల్లి మంథని మధుకర్‌, నిజామాబాద్‌ జిల్లా అమాద్ర్‌లో రోజా, భువనగిరిలో నరేష్‌-స్వాతి, వికారాబాద్‌ జిల్లా తాండూరులో హత్యలకు గురైన బాధితులు తారకం సార్‌ ఎక్కడాని ప్రశ్నిస్తున్నారు? బాధితులకు ఆయన అభయం, పోలీసులకు, అధికారులకు భయం, భయం. ఆయన లేనందునే న్యాయం అట్టడుగు వర్గాలకు అందకుండాపోయే ప్రమాదానికి దగ్గరకు అవుతూనే ఉన్నాయి. ప్రజా ఉద్యమాల ప్రజా నాయకుడి కొరత ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉంది.
71ఏళ్ళలో సామాజిక అంతరాలు తగ్గకపోగ నేటికీ విస్తృతం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి రిజర్వేషన్లపై ఉంటుంది. కానీ వాటి పునాది కుల అంతరాల్లో ఉందనే విషయం మార్చిపోతున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని కురుకునే వారందరూ కులాలు రద్దు చేయాలని గానీ, తాను కులవివక్ష పాటించనని చెప్పాగలడా? ఎందుకు? చెప్పలంటే వారికీ కాలేజీలో సీటు రాకుంటేనో, ఉద్యోగం రాకుంటేనో రిజర్వేషన్లను నిందిస్తారు. మరి ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లు కావాలంటే ప్రతిభ కావాలంటారు. మరి మీకు ఉద్యోగం రాకుంటేనో, కాలేజీలో సీటు రాకుంటేనో రిజర్వేషన్లే కారణం అనుకుంటారే కానీ ప్రతిభ లేదని అనుకుంటారా? లేదు కదా? ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లు లేవు కదా? అందులో మరి మీకు ఎందుకు ఉద్యోగామో, సీటు ఎందుకు రాలేదు, అంటే మీలో ప్రతిభ లేదని మీకు మీరు ఒక్కసారైన ప్రశ్నించుకున్నారా? కనీసం మనసులోనైనా అనుకున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. రిజర్వేషన్లు లేని సమాజం కోరుకుంటున్న వారు ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు ఎందుకు విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లతోపాటు భూమి, పరిశ్రమలలో రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలి. ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినట్లే భూమి దున్నుకోవడంలో పరీక్షలు నిర్వహించాలి. అందుకే రిజర్వేషన్లు లేని సమాజం కోసం అంటే ముందు కులాలు లేని సమాజం రావాలని కోరుకోవాలి. తొందర పడితే మొదటే మోసం వస్తుంది... జాగ్రత్త... భీ కేర్‌ ఫూల్‌... 

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines