Tuesday, June 5, 2018

దళిత్‌ లిటరరీ ఐకాన్‌ డాక్టర్‌ పసునూరి రవీందర్‌

దళిత్‌ లిటరరీ ఐకాన్‌ డాక్టర్‌ పసునూరి రవీందర్‌

దళితులకు అక్షరాలు ఆక్సిజన్‌తో సమానం. ఒక్క సావిత్రిబాయి ఫూలే తప్ప, వీరి నాలుకల మీద బీజాక్షరాలు ఏ సరస్వతి లిఖించలేదు. పైగా నాలుకలు తెగ్గోసిన చరిత్ర. వెలివాడలు చదువు నేర్చుకుంటే నేరమన్నది మనువాద కుల వ్యవస్థ. అందుకే శంభూకుని శిరస్సులు తెగింది. అందుకే ఏకలవ్యుని బొటనవేళు తెగింది. అందుకే రోహిత్‌ వేముల గొంతుకు ఉరితాడు బిగుసుకుంది. ఇలాంటి బ్రాహ్మణీయ కులవ్యవస్థలో మూడువేల యేండ్లుగా మనుస్మృతి దళితులకు కనీస హక్కులు లేకుండా చేసింది. చదువుకుంటేనే కాదు, దళితులు మంచిబట్టలు కట్టుకున్నా, తలెత్తి నిలదీసినా చుండూరు,కారంచేడు మారణహౌమాలు పుడతాయి. ఆర్యుల దురాక్రమణ తర్వాత భారతదేశంలో దళిత, బహుజనుల మెదళ్లు ఆత్మన్యూనత భావనతో నింపేశారు. తక్కువ జాతోల్లం, తలరాతలు బాగలేనోళ్లమనే బానిస భావనను అనువణువునా నింపేసింది బ్రాహ్మణిజం. ఇందుకు పండిత పురోహిత వర్గానికి ఆధారంగా నిలిచింది లిఖిత సాహిత్యమే. గుప్తులకాలంలో లిఖించబడిన పురణాలు క్రమంగా కిందికులాల మెదళ్లకు సంకెళ్లుగా మారాయి. ఆ సంకెళ్లను చేధించుకొని అక్షరాలను అందుకోవడం అంత సులువు కాదు. ఇందుకోసం దళిత సమాజం కొన్ని శతాబ్దాల వరకు వేచి చూడక తప్పలేదు. ఒక ఫూలే, ఒక అంబేడ్కరులు చదువుల బాట పట్టడం వెనకాల పెద్దయుద్ధమే ఉంది. బహుజన మహనీయులు వేసిన తోవలో అక్షరాల బాటను అందిపుచ్చుకునే బాధ్యతను గుర్తెరిగిన తరం, స్వాతంత్య్ర అనంతరం మాత్రమే రూపొందింది. 1944లో జరిగిన షెడ్యుల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ మహాసభల్లో ప్రసంగిస్తూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఈ దేశంలో దళితులు, కింది కులాలు బాగుపడాలంటే వారు తమ దృష్టిని చదువు,రాజకీయాల మీద కేంద్రీకరించాలన్నారు. అలా బాబాసాహెబ్‌ చూపిన మార్గంలో చదువును నమ్ముకుని ఎదిగొచ్చిన తొలితరపు ప్రతినిధి డాక్టర్‌ పసునూరి రవీందర్‌.
website https://dalithashakthi.com/ను సందర్శించండి 

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines