Sunday, September 1, 2024

ఆలోచన

మహిళలు - మత వివక్షలు 

మానవ హక్కులు, సమానత్వం, న్యాయం అంటే మనం బలంగా నమ్మాల్సినవి. దేవతల పట్ల, ఆచారాల పట్ల మనం చూపించే గౌరవం, స్త్రీల పట్ల కూడా చూపించాలి. స్త్రీలకు పురాణ సమయాల్లో ఉన్న గౌరవాన్ని, సమాజంలో వారి స్థానం గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది. సమానత్వం, మానవ హక్కులు, ధర్మం అనేవి మనం పాటించాల్సిన మార్గాలు.

మహిళలు సమాజంలో అత్యంత ప్రభావశాలి, ప్రతి ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం తీసుకుంటాము. వివిధ క్షేత్రాల్లో తమ శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారితో పాటు సమాజంలో ఉన్న అనేక సమస్యలను ప్రతిపాదించడం, పరిష్కరించడం వలన సమాజంలో మహిళ ప్రగతి సాధించవచ్చు. స్త్రీలకు కొన్ని ఆలయాలలోనికీ రానీయరు. వారు కొన్ని సమయాలలో అశుచిగా (బహిష్టు సమయాలలో) ఉంటారనీ, అది పురుష దేవుళ్ళు భరించలేరనీ వారి న్యాయవాదులు వాదిస్తున్నారు. ''అర్థం శరీరస్య భార్యాలా'' అని స్మ తులు చెబు తున్నాయి. శ్రుతుల (వేదాల)లోని సత్యాలనే స్మ తులు, అంటే ధర్మ శాస్త్రాలు చెప్పాయి. పురుషులు ఏ పుణ్యకర్మలు చేసినా భార్యా సహితులై కూడా ధర్మశాస్త్రాలు చెబుతున్నారు. యజ్ఞకర్మలూ, అగ్ని కార్యాలూ, తీర్థయాత్రలూ మినహయింపుగా ఎలా అవుతాయి? అలా జరిపిన యాత్ర అసంపూర్తమే అవుతుంది. పూర్వ సంస్క తిని, పురాణ సంప్రదాయాలనూ తెలిసిన వారెవరూ స్త్రీలను పుణ్యక్షేత్రాలకు దూరం పెట్టాలనే నిర్ణయాన్ని హర్షించారు. పూర్వం యజ్ఞకర్మలలో దేవుళ్ళ భార్యలను సగౌరవంగా ఆహ్వానించారు. దేవుళ్ళ భార్యలను ఉద్దేశించి హవ్యం (హౌమపధార్థం) సమర్పించి నట్లు రుగ్వేదంలో కనిపిస్తున్నాయి (5-వి-4-2-8). ఇంద్రుని భార్య ఇంద్రాణి, అగ్ని భార్య అగ్నాయి, అశ్వినుల భార్యలు రోదసి, ఆశ్విని అనేవారు. వరుణుని భార్య వరుణాని, మునుల వారికి హవ్యం సమర్పిస్తూ మంత్రాలు వల్లించేవారు. వారు వచ్చి తీసుకునేవారు (అని నమ్మవలసిందే). పూర్వ దష్టాంతాలు ఇలా ఉండగా ఆధునిక భక్తులు వివిధ నిబంధనలు పెట్టుకుని తమ అధికారాన్ని చూపించడానికి ప్రయత్నించడం ఏ విధంగా ఉంది?

స్త్రీలు రుతుస్రావ సమయాలలో అపవిత్రంగా ఉంటారనే వాదన ఎప్పుడు మొదలయ్యిందోగాని అది అత్యంత దౌర్భాగ్యకరమైన నమ్మకం. భక్తులు నమ్మే స ష్టికర్త స్త్రీలకు అలా స జించాడనే దానిని స ష్టికర్త పరంగా మన్నించవలసి ఉంటుందనీ సమాజం ఎందుకు అనుకోదు? ఈ విషయంలో ఇంకా లోతుల్లోకి పోయి విచారిస్తే స్త్రీలకు ఆ పాపభారాన్ని అంటగట్టిన వాసు ఇంద్రుడని తెలుస్తుంది. స్త్రీలను ఏదో తక్కువ చేసి చూపించటానికి ఇండియాలోనే ఆ కుట్ర జరిగింది. ఇంద్రుడు తన పాపభారాన్ని ఎదుటి వారికి పంచి ఇచ్చేసి తాను నాయకుడుగా చలామణి అవుతున్నాడు.

ఇంద్రుడు దేవతల రాజు. రాజు చెప్పిందే ధర్మం. రాజు చెప్పిందే న్యాయం. పాలకవర్గాల పాపలన్నిటినీ అమాయక ప్రజలు బలి అవుతున్నప్పుడు గానే ఈ రుతుస్రావ పాపభారాన్ని స్త్రీలు మోస్తే ఉండవలసి వచ్చింది. దీనికి సంబంధించి చాలా కథలున్నాయి. ఉదాహరణకు ఒక్కటి చెప్పుకుందాం. ఇంద్రుడు విశ్వరూపుడనే అసురుని చంపినప్పుడు ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇంద్రుడు ఒక సంవత్సరంపాటు ఆ పాపం వల్ల వచ్చే కష్టాలు భరించాడు. ఇక భరించలేని దశలో ఆ పాపాన్ని బతిమాలుకుని తన పాపాన్ని ముగ్గురికి బదిలీ చేశాడు.

ఇంద్రుడి పాపం భరించటానికి సహనమూర్తులు ఎవరు దొరుకుతారు? స్త్రీలు తప్ప. భూమి (భూదేవి), చెట్టు, స్త్రీ. ఈ ముగ్గురినే బతిమాలుకుని వారికి కొన్ని మినహాయింపులు ఇచ్చి ఇంద్రుడు (రాజు, మంత్రులు) శిక్ష నుండి బయటపడ్డాడు. ఆ మినహాయింపులు ఇప్పటి ప్రభుత్వ రాయితీల వంటివే. ఆచరణలోకి రావు. ఆ పాపభారం మటుకు చీరకాలం శాశ్వతంగా అనుభవించవలసిందే.
స్త్రీలకు రజోవికారం, ఇంద్రుని పాపం ఫలితంగా వచ్చింది. భూమిని తవ్వటమూ, చెట్టును కొట్టేయటమూ అనే దోషాలు ఆ పాప లక్షణాలే. అయితే భూమి మీద ఏర్పడే గోతులు వాటంతట అవే పూడుకు పోతాయనీ, చెట్లు కొట్టేసినా తిరిగి చిగురిస్తాయనీ ఇంద్రుడు అన్నాడు. కానీ అవి జరుగుతున్నట్లు లేదు. ఈ వేద భాగవతంలో (6-316) ఉంది. ఇంద్రుడు దేవతల రాజు అని నమ్మితే స్త్రీలకు రాజోవికారం. ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దానిని దోషంగా పరిగణించకూడదు.
ఇంద్రుడే చేసిన ఏర్పాటును ఆపచారంగా భావించడం సమంజసమా? శివుడు ఎప్పుడూ భార్య(ల)తోనే కనిపిస్తాడు. అతని అర్థశరీరంలో పార్వతి ఉంటుంది. విష్ణువుకు వక్షస్థలంపై (గుండెల మీద) లక్ష్మి ఉంటుంది. ఒక్కోసారి అవసరమైతే కాళ్లుపడుతూనూ కనిపిస్తుంది. బ్రహ్మకు నాలుకే గాయత్రి. తమ దేవుళ్లను చూసి అయినా భక్తులు మర్యాద నేర్చుకోక పోవటం విచారకరమే.
దేవీశక్తి త్రిమూర్తులకే ఆరాధ్య. అయ్యప్ప తాను స్త్రీ దేవతలనూ స్త్రీలనూ సహించలే నంటున్నాడా? ఈ సందర్భంలో ఇటీవల చదివిన ఒక వ్యాసం గుర్తు వస్తుంది. అది ఒక పురాతన ఆలయం పుణ్యక్షేత్రమే. సముద్రపు ఒడ్డున ఉన్నది. చాలాసార్లు సముద్రంలో ఆ గుడి మునిగిపోతుంది. ప్రతిసారీ అందులోని విగ్రహాలను తెచ్చుకుని మరోచోట గుడి కట్టి ప్రతిష్ఠించేవారు. చెప్పుకోవలసిన విశేషమేమిటంటే ఆ గుడిలో పూజారులే ఉంటారు. పురుషులు మూల విరాట్టును తాకటానికి వీల్లేదు.

ఇది ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో ఉన్న 'పంచుబరాహి' ఊరి ఆలయం. ఇంకో విశేషమేమిటంటే ఈ పూజలు కొన్ని కుటుంబాల దళిత మహిళలే. పూజారితనం అత్తగారి నుండి పెద్దకోడలికి వారసత్వం గా వస్తుంది. పురుషులు గుడిలోపలికి రావచ్చు, కానీ విగ్రహాలను తాకారు. పూర్వం ఒక బ్రాహ్మణ పూజారి విగ్రహాలను నగంగా చూసిన వెంటనే శిల అయిపోయాడట. అప్పటి నుంచీ స్త్రీలే పూజలు చేస్తారు.

ఇక్కడ స్థానిక జాతులు పూజారులుగా ఉన్నారంటే పురోహితులు దాని వెనక ఒక కథ కట్టించి ప్రచారం చేస్తారు. మహాభారత కాలపు కష్ణుడు ఒక శబరుని బాణపు దెబ్బతో దేహం విడిచాడనీ అందుకే శబర పూజ అవసరమైందనీ చెప్పారు. శతహయ గ్రామంలో ఆ ఆలయంలో మూడు రాతి విగ్రహాలు ఉన్నాయి. 'వారాహి' అధిష్ఠాన దైవతం. ఆలయం ప్రధాన ద్వార దగ్గర సింహ శిల్పాలున్నాయి.

ఇక్కడ శబర పూజారిలు మంత్రాలు చదవరు. స్థానిక భాషలోనే తమ పూజలు నిర్వహించారు. స్త్రీలకూ శూద్రులకూ సంస్క తం నిషిద్ధం కదా! సింహ వాహిని అయిన దేవి స్త్రీ శక్తికి ప్రతీక. పూర్వం సంస్క తి అవశేషాలు ఒడిశాలో ప్రస్ఫుటంగా కనబడతాయి. శ తి, గానాది కళలలో స్థానిక జాతులవారు ముందుండేవారు. జగన్నాథ దేవాలయంలో మొదట ఒడిస్సీ న త్యాన్ని ప్రదర్శించినవారు దళితులే. అప్పట్లో ఒడిస్సీ నాట్య కళాకారిణులను 'మహరి' అనేవారు. ఒకప్పుడు మహర్లకే సొంతమైన కళారూపాలను పురోహిత వ్యవస్థ అనంతరకాలంలో చేజిక్కించుకుంది. ఆలయాలలో పురోహిత వ్యవస్థ నిరంకుశంగా తయారైంది.

శబరిమలలో స్త్రీలను అభ్యంతర పెట్టడం తమ సంస్క తిని తాము అగౌరవ పరుచుకోనటమే అవుతుంది. స్త్రీల ఆరాధన హక్కును అంగీకరించడం మన పురాతన సంస్కతికి సత్యాలను గుర్తించడమే కాదు, సమాజంలో సంబంధించిన స్త్రీల స్థాయిని కూడా ఎత్తివేసే ప్రయత్నం. మానవ హక్కులు, సమానత్వం, న్యాయం అంటే మనం బలంగా నమ్మాల్సినవి. దేవతల పట్ల, ఆచారాల పట్ల మనం చూపించే గౌరవం, స్త్రీల పట్ల కూడా చూపించాలి. స్త్రీలకు పురాణసమయాల్లో ఉన్న గౌరవాన్ని, సమాజంలో వారి స్థానం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. సమానత్వం, మానవ హక్కులు, ధర్మం అనేవి మనం పాటించాల్సిన మార్గాలు. స్త్రీలను ఆలయాలకు దూరం చేయడం, వారి పట్ల వివక్ష, సమాజంలో వారి స్థాయిని తగ్గించడమే.
(ఆలోచన పార్ట్-2)

- డా|| బి.విజయభారతి
ప్రముఖ రచయిత్రి

Editorials

 సామాజిక వివక్ష...!

ఎస్సీ కులాలు వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, సామాజిక వివక్షను అనుభవించాయి. సంపద మీద హక్కు లేకుండా ఆర్థిక వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, చారిత్రక, సామాజిక కారణాల వల్ల వాటి పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి.


ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల సంపూర్ణ అభివద్ధి సాధ్యమవుతుందా?, మాలల అభివద్ధి అడుగంటి పోతుందా? రిజర్వేషన్స్‌తోనే దళితుల సకల సమస్యలు సమసిపోతాయా? ప్రభుత్వ రంగం ఉండి, రిజర్వేషన్లను త్రికరణశుద్ధిగా అమలుచేస్తే 16 శాతం మంది మాత్రమే ప్రయోజనం పొందుతారు, మిగతా 84 శాతం అసంఘటిత రంగాలలో జీవనోపాధి పొందవలసి ఉంటుంది. రిజర్వేషన్ల కారణంగా ఎస్సీ మొత్తం జనాభాలో రెండు నుంచి మూడు శాతమే ఇప్పటికి అభివద్ధి చెందారని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన సుమారు 97 శాతం ఇంకా అభివద్ధి చెందాల్సిన స్థితిలోనే ఉంది. ప్రైవేటు రంగం శరవేగంగా విస్తరిస్తున్న వర్తమానంలో కూడా ప్రభుత్వ రంగంలోని రిజర్వేషన్ల చుట్టూనే ఇరువర్గాలు తిరుగుతున్నాయి. రిజర్వేషన్లు కలిగించే ప్రయోజనాలకు పరిమితులున్నాయి.

మొత్తంగా 60 ఉపకులాలు పరిమితంగానే అమలయ్యే రిజర్వేషన్లని తమ వెనుకబాటుతనం ప్రాతిపదికన అవకాశాలు అందిపుచ్చుకోగల పద్ధతిని అభివద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అభివద్ధి చెందని వారిని మొదటి లబ్ధిదారుగా, ఇప్పటికే అభివద్ధి చెందిన వారిని ద్వితీయ లబ్ధిదారుగా మార్చటం ద్వారా ఇది సుసాధ్యం అవుతుంది. దీనికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సంబంధిత వ్యక్తులు పొందిన లబ్ధిని, వెనుకబాటు తనాన్నీ లెక్కించి వెయిటేజ్‌ మార్కులు ఇవ్వటం ద్వారా ఈ ఎంపిక ప్రక్రియను సమర్థంగా నిర్వహించవచ్చు. జే.ఎన్‌.యు. వంటి చోట్ల అడ్మిషన్లలో ఇటువంటి పద్ధతి ఎప్పటినుంచో అమలవుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఈ పనిని సులభతరం చేస్తుంది. ఇది ఒకే సామాజికవర్గంలోని సహౌదరుల మధ్య అభివద్ధిలో గల వ్యత్యాసం తగ్గించి సర్వతోముఖాభివద్ధికి దోహదపడుతుంది. దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, పార్లమెంట్‌ తీర్మానమూ అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినా సాంకేతికపరమైన, చట్టపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో దళిత నాయకత్వం తమ దీర్ఘకాలిక సమస్యకు ముగింపు పలకవలసిన చారిత్రక సందర్భం ఇది. దీనిని అధిగమించి అనేక ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

Dalithashakthi - 2025 - Magazines