హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఉదంతం ప్రపంచాన్ని కదిలిస్తే ''కులం'' కంపుతో పరిపాలన కొనసాగిస్తున్న హిందూమనువాద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రం కదిలించలేకపోయాయి. హేచ్‌ఆర్డీ మంత్రి ఈ విషయంపై న్యాయ విచారణ కమిటి వేసినప్పుడే విద్యార్థులు మేము ఈ కమిటితో ఏమీ జరగదనీ, కేసును పక్కదారి పట్టించడానికే కమిటి వేసారని మేము చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. ఏడు నెలలు అధ్యయనం చేసిన ఈ కమిటి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రోహిత్ వేముల దళితుడే కాదని రహస్య నివేదిక ఇచ్చినట్టు సోషల్ మీడియాలో లీకయింది. రోహిత్ దళితుడేనని జాతీయ ఎస్సీ కమిషన్, జిల్లా కలెక్టర్ నివేదికలు స్పష్టం చేసాయి. రోహిత్ తల్లి ముమ్మాటికీ ''మా కులం దళిత కులమేననీ, నా భర్త ఏనాడు నా బిడ్డల మూతి తుడిచి ఎరుగడనీ, ఒక దళిత కుటుంబంలో పుట్టిన నేను నా బిడ్డలు అన్ని అవమానాలు భరిస్తూ అణచివేతలను సహిస్తూ పెరిగామనీ, ఏనాడు నా భర్త, అతని కుటుంబం మమ్మల్ని ఆదరించలేదనీ, దళిత వాడే నన్ను ఆదుకుందనీ, నన్ను పెంచింది వడ్డెర కులస్తులు అయినా నా పుట్టుక మూలాలు దళితవాడవనీ..'' అని చెబుతుంది. అయినా ''సుప్రీమ్, హైకోర్టులు అనేక కేసుల్లో కులాంతర పెండ్లిండ్లు చేసుకున్న కుటుంబాల్లో పిల్లలు, తల్లి లేదా తండ్రి కులాల్లో ఎవరి కులాన్నైనా ఎంచుకునే హక్కుందని చాలా స్పష్టంగా చెప్పిందని'' ఆమె గుర్తు చేస్తోంది. '' నా పిల్లలు నా కులం సర్టిఫికెట్ ద్వారానే పై చదువులు చదువుతున్నప్పటికీ కేసును ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలోకి రానీయకుండా ఉంచడానికే మమ్మల్ని ఏనాడు పట్టించుకోని నా భర్తకు ఇప్పుడు రోహిత్ వడ్డెరని చెప్పుకునే అర్హత లేదని'' ఇంత స్పష్టంగా రోహిత్ తల్లి రాధిక చెప్పినా, కలెక్టర్ రోహిత్ దళితుడేనని, తహాశీల్దార్ జారీ చేసినా సర్టిఫికేట్స్ రుజువులు చూపినా, జాతీయ ఎస్సీ కమిషన్ రోహిత్ దళితుడేనని మొత్తుకున్నా, అన్ని దళిత సంఘాలు అనేక రుజువులు పొందు పర్చినా హేచ్చార్డీ న్యాయ కమిషన్ సభ్యుడు, అలహబాద్ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి కే పూపన్‌లాల్‌కు మాత్రం ఎవిడెన్స్‌గా కనిపించలేదు. అయినా ఈ కమిషన్ ద్వారా రోహిత్ వేములకు న్యాయం జరగదని, నేను హైకోర్టు సిట్టింగ్ జడ్జి నాయకత్వంలో న్యాయ విచారణ చేయాలని ఆం.ప్ర, తెలంగాణ సంయుక్త న్యాయ స్థానంలో పిటీషన్ వేసాను. జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ముందుగా హేచ్‌సీయూలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, విద్యార్థులను రెచ్చగొట్టకుండా, విద్యా వాతావరణాన్ని చెడగొట్టకుండా రోహిత్‌కు న్యాయం జరగాలంటే వీరెవర్ని లోపలికి అనుమతించకుండా చూడాల్సిన బాధ్యతను పిటీషనర్ కోరాలని సూచించిన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోని మధ్యంతర ఉత్తర్వులకు అంగీకరించడం జరిగింది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, సమస్య పక్కదారి పట్టించాయి. రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న ఏబీవీపీ విద్యార్థి నాయకున్ని సయితం అరెస్ట్ చేయించలేకపోగా 21 మంది దళిత విద్యార్థులు, ఇద్దరు దళిత ప్రొఫెసర్లను జైలుకు పంపించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రాహుల్ గాంధీతో మొదలుకుంటే కేజ్రీవాల్ వరకు జాతీయ నాయకులు, రాష్ట్ర పార్టీల నాయకులు, అందరూ ఇంత పోరాటం చేసినా రోహిత్‌కు ఎందుకు న్యాయం జరగలేదో మనకు అర్థం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అగ్రకుల, మనువాద చేతుల్లోనే ఉన్నాయి. పార్టీ పేరు ఏదైనా అగ్రకుల నాయకులు రోహిత్ ఇష్యూ రాజకీయ సమస్యగానే చూసాయి తప్పా ఇది మానవ హక్కులు, మానవ విలువలు మంటగలిపిన సంఘటనగా చూడలేకపోయాయి. హేచ్‌సీయూ వీసీ అప్పారావు, యాజమాన్యం, వెలివేతకు గురి విద్యార్థులను పరామర్శించి, వారికి అండగా నిలిస్తే రోహిత్ చనిపోయేవాడు కాదు.
అడ్మిషన్స్ అప్పుడే రోహిత్ మీరు ఉరితాడు లేదా విషం ఇవ్వండి అని బాధపడుతూ లేఖ రాసినప్పుడు, ఆ లేఖ వెనుక ఉన్న బలమైన సాంఘిక, ఆర్థిక, అణిచివేత కారణాలను వెతికి పరిష్కరించి ఉంటే రోహిత్ చనిపోయి ఉండేవాడు కాదు. డా.బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా, ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులను అడిగితే దేశ ద్రోహులుగా, సంఘ విద్రోహులుగా ముద్రవేయడం దేనికి నిదర్శనం? హేచ్‌సీయూలో రాజ్యాంగం అమలు కోసం పోరాడితే మనుధర్మం చెబుతున్న వెలివేతను అమలు చేస్తూ హిందూ ఫాసిస్టు కేంద్రంగా, అగ్రవర్ణాల అగ్రహరంగా హైద్రాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని మార్చేసారు. బ్రాహ్మణ, అగ్రకుల ప్రోఫెసర్లు, వారి అడుగు జాడల్లో నడుస్తున్న ఏబీవీపీ దళిత విద్యార్థులు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రశ్నించిన ప్రతిసారి ఏదో రూపంలో వారిపై దాడులు చేస్తు అంబేడ్కర్ భావజాలంతో కూడిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సమానత్వాన్ని అన్ని రంగాల్లో సాధించడానికి అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రయత్నిస్తున్న తరుణంలో దాన్ని తట్టుకోలేని చురుకుగా, శాస్త్రీయ భావాల అవగహన, కల్గిన రోహిత్ అనేక అంశాలపై అంబేడ్కర్ దృక్పథంతో ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
వారి దృష్టిలో దేశభక్తి అంటే అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం నిర్వచించే పౌరుల బాధ్యత మాత్రమేకాని హక్కులు కాదు. ఆర్‌ఎస్‌ఎస్ నాగపూర్ కేంద్రంగా అమలు చేస్తున్న మనుస్మృతిపై ఆయనకు విశ్వాసం లేదు. మాకు ఈ దేశంలోని కుల, మత తత్వం, పేదరికం, నుండి ఆజాదీ (విప్లవం)కావాలని, అవినీతి, లంచగోండితనం, అస్పృస్యత అన్యాయలనుండి ఆజాదీ కావాలని, పుట్టిన ప్రతి మనిషికి చివరకు పశు,పక్ష్యాదులకు సైతం జీవించే హక్కు కావాలని ఆశించిన రోహిత్ దేశ ద్రోహి ఎలా అవుతాడు? ఒక వేళ ఈ ప్రశ్నలు వేస్తేనే దేశ ద్రోహం అయితే అది ప్రజాస్వామ్య దేశం ఎలా కాగలదు? చనిపోయిన జంతు చర్మాన్ని సాంప్రదాయిక వృత్తిలో భాగంగా తీస్తే గోవులను చంపుతున్నారనీ, గో రక్షక్ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, వీహేచ్‌పీ, భజరంగదళ్, హిందూ మతోన్మాదులు దళితులు, ముస్లీంలను ఊచకోత కోస్తుంటే నోరు మెదపని గుజరాత్, ఆంధ్రప్రదేశ్ , యుపి రాష్ట్రాలు, కేంద్ర ప్ర భుత్వం దళితులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. గో రక్షణ పేరుతో మీరు చంపాలనుకుంటే దళితులను కాదు ముందు నన్ను చంపండని హైద్రాబాద్ సభలో ప్రగల్భాలు పలికిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, ఆదే హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగిన దారుణ సంఘలన రోహిత్ వేముల చావుకు బాధ్యులైన వారిని ఎందుకు శిక్షించలేదు? తన పరిధిలో ఉన్న వీసీ అప్పారావును ఎందుకు తొలగించలేదు?
రోహిత్ నిందుతులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదు?. కేవలం రానున్నా యూపీ, గుజరాత్, పంజాబ్ ఎన్నికలను నేపధ్యంలో దళితుల సానుభూతిని పొంది, వారి ఓట్లను కొల్లగొట్టటానికి పన్నిన పన్నాగంలో భాగంగానే నరేంద్రమోడీ మాటలను అర్థంచేసుకొవాలి. నిజంగా మోడీకి దళితులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు బాధ్యులైన వారిని శిక్షించడమే కాకుండా రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయించేవారు. అది జరగలేదు. ఈ ఘటనలో కనీసం ఏబీవీపీ విద్యార్థిని సయితం అరెస్ట్ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. వీరిద్దరి పరిపాలన రాజ్యాంగ బద్ధంగా ఉందా? మనుధర్మం ఆధారంగా జరుగుతున్నదా? ప్రజలు గమనించాలి. దళితులు కేంద్ర, రాష్ట్రాలల్లో అధికారాన్ని సాధించి తమ ప్రజల హక్కులను, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు ఉమ్మడిగా ఉద్యమించాలి.

- డా.గాలి వినోద్ కుమార్
-సెల్ 9390119889
-సెల్ 9390119889

No comments:
Post a Comment