అనాది నుంచి ఒక మనిషి కష్టం వల్ల లభించే ఫలితాన్ని మరొక రు అనుభవించడం, సుఖ పడడం, శ్రమ దోపిడీ చేయడం జరుగుతూనే ఉన్నది. అలా అసలు కష్టపడ్డ జీవికి జీవితాంతం కష్టాలు మిగిల్చడం ద్వారా ఏర్పడేదే బానిసత్వం. శ్రమ దోపిడీకి గురవుతున్నవ్యక్తి బానిసగా మిగిలినట్టే. అంతులేని వ్యధను మిగిల్చే శ్రమదోపిడీకి అరికట్టేందుకు ఎన్నో శతాబ్దాలుగా ఎందరో కృషి జరుగు తున్నప్పటికీ దాస్యం మాత్రం నిరంతరం కొన సాగుతూనే ఉంది. ఆధునిక యుగంలో వెట్టిచాకిరీకి చట్టబద్దత లేకున్నప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో అది పలు రూపాల్లో మనగలుగు తూనే ఉండడం దురదృష్టకరం. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యం లో వెట్టిచాకిరీ మరింత విస్తరించగలుగుతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కీర్తి సంపాదించుకున్న స్వతంత్ర భారత దేశం ఇప్పుడు బానిసత్వం ఎక్కువగా ఉండే దేశాల్లో అగ్రగామిగా నిలవడం మన పాలకుల పాపాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
ఇటీవల ''వాక్ ఫ్రీ ఫౌండేషన్'' అనే స్వచ్చంద సంస్థ 166 దేశాల్లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే అత్యధిక సంఖ్యలో బానిసత్వంలో మగ్గుతూ వెట్టిచాకిరి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 45.8 మిలియన్ల మంది వెట్టిచాకిరిలో మగ్గుతుండగా అందులో 18 మిల్లియన్లకు పైగా భారతీయులే కావడం గమనార్హం. చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం, భిక్షాటనకు, ఇతర నేరాలకు పురికొల్పడమే గాక, వారు సంపాదించే సొమ్ము లాక్కోవడం, బాలికలను బలవంతగా వ్యభిచార కూపంలోకి దించి సొమ్ము చేసుకోవడం, వంటి హేయమైన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దాదాపు 183 ఏండ్ల కిందట 1833 ఆగస్టు 28న భారత దేశంతో సహా ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్న అన్ని దేశాల్లోనూ బానిసత్వాన్ని నిషేధిస్తూ బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టాన్ని(ఆక్ట్ ఆఫ్73) ఆమోదించిన సంఘటనను గుర్తుచేసుకోక తప్పదు. మన దేశమే బానిసత్వంలో మగ్గుతున్న రోజుల్లో ఇక్కడ బానిసత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించడమేమిటని కొందరు నవ్వుకోవచ్చు కానీ బానిసత్వ నిషేధ క్రమంలో అది తొలి అడుగుని మాత్రం చెప్పక తప్పదు. బ్రిటన్‌లో వెట్టిచాకిరీని సమర్థించే చట్టాలేవీ లేకున్నా వివిధ చట్టాల్లోని లొసుగులను వినియోగించుకుంటూ బానిసలను తెచ్చిపెట్టుకుని వెట్టిచాకిరి చేయించు కునేవారు. ఇదేక్రమంలో ఉత్తర అమెరికాలో బ్రిటిష్ కాలనీగా ఉన్న మసాచుసెట్స్ బే ప్రాంతంలోని బోస్టన్ రేవులో కస్టమ్స్ అధికారి చార్లెస్ స్టీవర్ట్ 1769లో ఆఫ్రికాకు చెందిన జేమ్స్ సోమర్సెట్ అనే బానిసను కొనుగోలు చేసి ఇంగ్లాండ్ కు తీసుకువచ్చాడు. అయితే 1791లో పారిపోయిన సోమర్సెట్ కొద్దిరోజుల్లోనే పట్టుపడ్డాడు. ఈ సందర్భంగా జరిగిన వ్యాజ్యంలో బ్రిటన్‌లో బానిసత్వానికి తావు లేదు గనుక సోమర్సెట్ కు స్వేచ్ఛ కల్పిస్తూ లార్డ్ మెన్స్ల్డ్ ఫీల్డ్ 1772 మే14న చారిత్రాత్మక తీర్పు చెప్పారు.ఆతర్వాత స్మిత్ వర్సెస్ బ్రౌన్ తదితర కేసుల్లో కూడా బానిసలకు ఇదే రీతిలో స్వేచ్ఛ లభించింది. ఈ తీర్పుల ఆధారంగా మసాచుసెట్స్, తదితర కానీలలోని పలువురు బానిసలు తమకు స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ కేసులు దాఖలు చేశారు. అప్పట్లో ఆఫ్రికాకు చెందిన బానిసను కొనుగోలు చేసింది అమెరికాలో కావడం వల్ల బ్రిటన్ చట్టాలు చెల్లవని పలువురు వాదించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం తన వలస ప్రాంతాల్లో బానిసత్వ సమస్య లేకుండా చేసేందుకు పలుసార్లు పార్లమెంట్‌లో చర్చలు జరిపింది. ఈ క్రమంలో దాదాపు 60 ఏండ్ల అనంతరం 1833లో ఎట్టకేలకు ఒక చట్టం తీసుకురాగలిగింది. 1843 నాటికీ ఈ చట్టం దాదాపు అన్ని కాలనీల్లో అమలులోకి వచ్చింది. అమెరికా స్వతంత్రం సంపాదించు కున్న తర్వాత రాసుకున్న తన రాజ్యాంగంలో బానిసత్వానికి తావులేకుండా చేయడం వల్ల అది పలు దేశాల రాజ్యాంగాలకు ఆదర్శనంగా నిలిచింది. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పౌరులకు స్వేచ్ఛ లభించడమేగాక పలు చట్టాలు తీసుకొచ్చి సామాజిక రుగ్మతలను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. పౌర హక్కుల పరిరక్షణతోబాటు అస్పృశ్యత నివారణ వంటి పలు చట్టాలు అమలులోకి వచ్చాయి. స్వేచ్ఛగా జీవించే వారితోపాటు సామాజిక కట్టుబాట్లు పాటించేవారిలో చాలామంది అమాయకం గా అక్రమ రవాణాకు గురై బానిసత్వపు బతుకులను ఎంచు కోవలసిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. నాగరిక ప్రపంచం స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇవ్వకపోగా ఇలాంటి దుర్భర పరిస్థితులు కల్పితోందని నిందించేవారు ఎక్కువవు తున్నారు. కుల వ్యవస్థ, అంటరానితనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, జోగిని వ్యవస్థ వంటి రుగ్మతలకు తోడు వెట్టిచాకిరి, బానిస బతుకులు మనదేశంలో చాలాకాలం నుంచే ఉన్నాయి. మధ్యలో విదేశీ దండయాత్రలు, బ్రిటిష్ పాలనా కాలంలో ఇవి కొనసాగాయి. బ్రిటిష్ హయాంలో ఆఫ్రికన్ బానిసలకంటే మనదేశంలోని పౌరులే చాలా ఇబ్బందులు పడ్డారు. స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగం, దాని అనుబంధ కార్యకలాపాల్లోనూ వెట్టిచాకిరీ పలురూపాల్లో కొనసాగుతూనే ఉంది. ఎమర్జెన్సీ సమయంలో వెట్టిచాకిరి నిర్మూలన పేరిట చేపట్టిన కార్యక్రమాల్లో చాలావరకు ప్రతిపక్ష నేతల దాడులుగానే ముగిశాయని తేలింది. ఆ తర్వాత కూడా ఇప్పటికీ ఎడతెగని రుణపాశం గ్రామీణ ప్రాంతాల్లో పలు రైతు కుటుంబాలను వెట్టిచాకిరిపాలు చేస్తుండగా క్షోభ తట్టుకోలేని అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి. సెంటు భూమిలేని పారిశ్రామిక వేత్తలకు ఉదారంగా కోట్లాది రూపాయలు బంగారు పళ్లెంలో పోసి అందజేయడమే గాక, అప్పు ఎగవేసే మార్గాలు కూడా చూపించే మన బ్యాంకులు మాత్రం దేశానికి వెన్నెముకలయిన రైతులకు భూమి ఉన్నా రుణం మంజూరు చేసేందుకు ముప్పుతిప్పలు పెడతాయి. హైదరాబాద్ వంటి నగరాలతో సహా పలుచోట్ల బాలకార్మిక వ్యవస్థ అప్పుడప్పుడు తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నది. పలు స్వచ్చంద సంస్థల సహకారంతో పోలీసులు దేశవ్యాప్తంగా పలుచోట్ల విస్తృత దాడులు నిర్వహిస్తున్నప్పటికీ వ్యభిచార కూపాలకు బాలికలు అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడం సాధ్యం కావడం లేదు. పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాల్లో సంఘటిత కార్మికులకు లభించిన హక్కులు అసంఘటిత కార్మికులకు దక్కడం లేదు. సంఘటిత కార్మిక శక్తిని నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం కూడా తనవంతు సహకరించడం మరింత దురదృష్టకరం.
ఇప్పటికే అనేక ప్రత్యేక ఆర్థిక మండలులలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉండగా మరిన్ని కొత్త చట్టాలతో పనిగంటలు తదితర అంశాల్లో యాజమాన్యా లకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కార్మిక శాఖ అధికారులు అసలు వేతనాలు చెల్లించే విషయంలోనే పెద్దగా జోక్యం చేసుకోని పరిస్థితులు దేశంలో నెలకొని ఉండగా వంద శాతం అదనపు వేతనం చెల్లించే షరతుపై ఏడాదికి 200 గంటల వరకు అవసరమైనప్పుడు అధికంగా పనిచేయించేందుకు ప్రభుత్వం కార్మిక చట్టాన్ని సవరించింది. చైనాలో కార్మికులు 50 శాతం అదనపు వేతనంపైనే ఏడాదికి 442 గంటల మేరకు ఓవర్ టైం పని చేస్తారని, ఐక్యరాజ్య సమితి సూచించిన దాని కంటే మనం తక్కువ ఓవర్ టైం చేయడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. ప్రభుత్వం చట్టాలు తయారు చేసి నంత సులభంగా అధికారులతో వాటిని పకడ్బందీగా అమలు చేయించడంలో తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. ఫలితంగా మన చట్టాలు ఆచరించేవారికి అసాధ్యంగాను, ఎగవేసేవారికి చుట్టాలుగాను మారుతున్నాయి.మన వ్యవస్థలో పౌరుల స్వతంత్రం సన్నగిల్లుతుండగా బానిసత్వం బలపడు తోంది. అందుకే అంతర్జాతీయ అధ్యయనాల్లో మనం బానిసత్వపు అంచులు చేరుకుంటున్న దేశాల్లో మనకు అగ్రస్థానం లభిస్తోంది.
- కె.బి.రామ్మోహన్
-సెల్ 9346235072
ఇప్పటికే అనేక ప్రత్యేక ఆర్థిక మండలులలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉండగా మరిన్ని కొత్త చట్టాలతో పనిగంటలు తదితర అంశాల్లో యాజమాన్యా లకు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కార్మిక శాఖ అధికారులు అసలు వేతనాలు చెల్లించే విషయంలోనే పెద్దగా జోక్యం చేసుకోని పరిస్థితులు దేశంలో నెలకొని ఉండగా వంద శాతం అదనపు వేతనం చెల్లించే షరతుపై ఏడాదికి 200 గంటల వరకు అవసరమైనప్పుడు అధికంగా పనిచేయించేందుకు ప్రభుత్వం కార్మిక చట్టాన్ని సవరించింది. చైనాలో కార్మికులు 50 శాతం అదనపు వేతనంపైనే ఏడాదికి 442 గంటల మేరకు ఓవర్ టైం పని చేస్తారని, ఐక్యరాజ్య సమితి సూచించిన దాని కంటే మనం తక్కువ ఓవర్ టైం చేయడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. ప్రభుత్వం చట్టాలు తయారు చేసి నంత సులభంగా అధికారులతో వాటిని పకడ్బందీగా అమలు చేయించడంలో తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. ఫలితంగా మన చట్టాలు ఆచరించేవారికి అసాధ్యంగాను, ఎగవేసేవారికి చుట్టాలుగాను మారుతున్నాయి.మన వ్యవస్థలో పౌరుల స్వతంత్రం సన్నగిల్లుతుండగా బానిసత్వం బలపడు తోంది. అందుకే అంతర్జాతీయ అధ్యయనాల్లో మనం బానిసత్వపు అంచులు చేరుకుంటున్న దేశాల్లో మనకు అగ్రస్థానం లభిస్తోంది.
- కె.బి.రామ్మోహన్
-సెల్ 9346235072
No comments:
Post a Comment