లక్కెపోగు ఆనందం సాధారణ దళిత వ్యవసాయకూలీ కుటుంబంలో పుట్టి, 14 సంవత్సరాల వయస్సు వరకు బడిబాట పట్టకపోయినా ఉక్కు సంకల్పం, క్రమశిక్షణతో బడికెళ్ళిన 5 సం||ల్లోనే హయ్యర్ గ్రేడ్ టీచర్ (19 సం||ల వయస్సులో) గా ఎదిగారు. అరతేపట్టుదలతో తన విద్యార్థులను తయారుచేశారు. మాస్టారుగా పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా సమాజంలోని అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదిరించి దళిత, బడుగు, బలహీనవర్గాలకు నాయకులుగా సేవలు చేశారు. అగ్రుకుల ఆధిపత్యం ఎక్కువగా వున్న రోజుల్లో కూడా వారిని ధిక్కరించి ఫారంలోని కూలీలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయించారు. చిన్నంపేట కో-ఆపరేటివ్ ఫారం ఏర్పాటు చేయడంలో ఆనందం మాస్టారి కృషిని ఆనాటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.వి.ఎస్.రెడ్డి స్వయంగా కొనియాడారు. గంటిపాడులో దళితుల మంచినీటి బావిలో ఊరు మురుగునీరు రాకుండా చేయడం, విలువైన స్మశాన భూములను కాపాడడంలో ఆనందం మాస్టారు కృషి ఎనలేనిది. కృష్ణా జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన (3 జిల్లాల సరిహద్దు ప్రాంతం) పర్వతపురంలో ఎవరూ పని చేయడానికి ముందుకు రాకపోతే ఆనందం మాస్టారు నిర్భయంగా ఆ గ్రామానికి వెళ్లి విద్యార్థులు పాఠాలు బోధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సుశీల్ కుమార్‌షిండే చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నారు. 65 సం||ల అనంతరం కూడా ఆనందం మాస్టారిని పర్వతాపురం మాస్టారుగానే సుపరిచితులు. హిందువుగా పుట్టినా, క్రైస్తవుల మధ్య పెరిగి అంబేడ్కర్ భావాలకు అనుగుణంగా పిల్లల పెంపకంలో ఆదర్శంగా నిలిచారు లక్కెపోగు ఆనందం మాస్టారు.
Dalithashakthi April 2017 Magazine
చిరునామా
దళితశక్తి సామాజిక మాసపత్రికఇంటి నెం.56, SCB 4-23-096,
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన,
పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్: dalithashakthi@

No comments:
Post a Comment