డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రతిపాదించిన బోధించు, సమీకరించు, పోరాడు లక్ష్య సాధనకు నిరంతరం అమలుచేసిన వ్యక్తి. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వ అధికారిగా విద్యా, ఆరోగ్యం, అభివృద్ధిపై తన కృషి కొనసాగించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మూర్తి గారు వెనుకబడిన ప్రాంతాలు, వాడలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పని చేశారంటే చిన్న మాటే అవుతుంది. తన ఉద్యోగ ప్రస్థానంలో ఎస్పీ మాలకొండయ్య, లతా కృష్ణారావు, పీయూష్ కుమార్, దాసరి శ్రీనివాసులు, విద్యాసాగర్, బి.జనార్ధన్ రెడ్డి, బుర్రా వెంకటేశం, రాహుల్ బొజ్జా, దినకర్ బాబు, ఆర్.సుబ్బారావు, వికాస్‌రాజ్, స్మితాసబర్వాల్ లాంటి అనేకమంది ఐఏఎస్ అధికారుల మన్ననలు పొందారు. రాష్ట్రమంత్రులు తన్నీరు హరీష్‌రావు, గీతారెడ్డి, ఎమ్మెల్యేలు మూర్తిగారి సేవలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనకు అనుకూలంగా మార్చుకోగల సామర్ధ్యం మూర్తిగారి సొంతం. నిరుపేదలు ఎవరైనా మూర్తిగారి ముందుకు వస్తే సమస్యకు తన వ్యక్తిగతంగా భావించి పరిష్కరించే వ్యక్తిత్వం ఆయనది. మెతుకు సీమ మెదక్ జిల్లాలో బద్దె శ్రీ వీరవెంకట సత్యనారాయణ మూర్తి (బిఎస్‌వివిఎస్ మూర్తి) తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంబేడ్కరిస్టు, ఆశయ సాధనాపరుడు, మానవతావాదియైన మూర్తిగారి రియల్ స్టోరీ.
Dalithashakthi March 2017 Magazine
చిరునామా
దళితశక్తి సామాజిక మాసపత్రికఇంటి నెం.56, SCB 4-23-096,
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన,
పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్: dalithashakthi@

No comments:
Post a Comment