డాక్టర్ బాబాసాహెబ్ అరబేడ్కర్, సంత్ రవిదాస్ భావజాలాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి నూతన పంథాన్ని ఎన్నుకొంది గిన్నీమహి. దళిత గీతాల్ని తన పద్థతిలో నేటి యువతరానికి అందిస్తోంది. యూట్యూబ్ సామాజిక మాధ్యమ వేదిక ద్వారా అంటరానితనాన్ని ఎదుర్కొంటుంది. అంబేడ్కరిజం ఆమె ఆయుధం. దళిత చైతన్యం ఆమె గీతం. భారతీయ దళితవాడల్లో తప్పెట్లమోతను, వెలివాడల వెతలను, గుండెకోతల్ని యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. పాతుకుపోయిన వర్ణవ్యవస్థ పాత పునాదులపై నిలబడి తన పాటద్వారా ప్రశ్నిస్తున్న కొత్త కెరటం గిన్నీ మహి.


No comments:
Post a Comment