Saturday, April 7, 2018

దళితశక్తి ఏప్రిల్ మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం -DSMM


హైదరబాద్ అంబేద్కర్ భవన్ లో దళితశక్తి సామజిక జాతీయతెలుగు ఏప్రిల్ మాసపత్రికను కాకి మాధవరావు ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి,డా.వినోద్ కుమార్, బి.జగదీశ్ కుమార్, గడ్డం ఝాన్సీ, సిద్దోజి రావు, విజయలక్ష్మి, కిరణ్, దళితశక్తి ,ఎడిటర్ బిగంగాధర్ గారు మరియు దళితశక్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి యేలేటి ఆంజనేయులు ,నల్గొండ జిల్లా ప్రతినిధి రామయ్య తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#Dalithashakthi #Magazine ఆవిష్కరణ కార్యక్రమం
సూర్యాపేటలో...

దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక ను సూర్యాపేట జిల్లా చింతలపాలలెం సబ్ ఇన్సపెక్టర్ (SI) పరమేష్ దళితశక్తి ఏప్రిల్ మాసపత్రిక ఆవిష్కరించడం జరిగినది .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలచంద్రు.దళితశక్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి యేలేటి ఆంజనేయులు ,నల్గొండ జిల్లా ప్రతినిధి డి .రామయ్య ,దళితశక్తి చింతలపాలలెం మండల ప్రతినిధి .డి .రవి .మండల నాయకులు చిలక యేసు తదితరులు పాల్గొన్నారు.#Dalithashakthi #Magazine ఆవిష్కరణ కార్యక్రమం

Thursday, April 5, 2018

సంపాదకీయం -April 2018 - Dalithashakthi Monthly Magazine


భారత అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారమే శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజ్యా యంత్రాంగం పని చేస్తాయి, చేస్తున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అంశాలపై పని చేయాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు ఒక్కొక్కటిగా విఫలంగా చెందుతూనే ఉన్నాయి. రాజ్యాంగ పరిధిలో పని చేయాల్సిన వ్యవస్థలు రాజకీయనాయకుల కన్నుసన్నల్లో పనిచేయడం ప్రపంచ దేశాల ప్రజలను ఆలోచింపచేస్తున్నది. కానీ భారత రాజ్యాంగవ్యవస్థలు గానీ, జకీయనాయకులు గానీ ఈ విషయంలో పూర్తిగా విఫలం చెందినట్లు ఎక్కడ ఒప్పుకోవు. ఎందుకంటే వారు అన్ని తెలిసే చేస్తున్న విషయం గనుక. 
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల హక్కులను అమలు చేయడంలో విఫలం చెందిన వాటిని తిరిగి ఎలా అమలు చేయాలో ఆలోచించకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం వారికి అందకుండా చేయాలనే ఆలోచిస్తున్నట్లు 2018 మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక ఉదాహారణ. రాజకీయ పార్టీలు ఈ వర్గాల ప్రజలకి లబ్ధిచేకుర్చాలనే దానికి ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తుంటాయి. ఇలాంటి నేపథ్యంలో సామాజిక తరగతుల ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం నేడు కనిపిస్తున్నది.
రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం స్థానాన్ని క్రమేపి కుల, మతోన్మాదసంస్థలు ఆక్రమణ చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల ప్రజలకు ఉన్నహక్కుల అమలుకోసం పోరాడుతున్న వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించకపోగ హక్కులు అడగడమే అన్యాయం అన్నట్లు (2018 జనవరి1న భీమాకోరేగావ్‌, 2018 ఏఫ్రిల్‌ 2న మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటనాలు) కుల,మతోన్మాదసంఘాలు, సంస్థలు వ్యవహారిస్తున్నాయి. ఈ అంశాల పట్ల రాజ్యాంగవ్యవస్థలు ఆలోచించడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను విడివిడిగా చేసి, వాళ్ళ ప్రజల మీద వాళ్ళనే దాడులు చేస్తున్నాయి కుల, మతోన్మాద సంస్థలు. దాడులు చేయాల్సిన ప్రజలే దాడులకు గురి కబడుతున్నారు. ఇలాంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మతోన్మాద సంస్థలను కట్టడి చేయలేకపోతున్నారు? ఎందుకు? ఇలాంటి వాటిని ప్రశ్నించేవారు లేకపోవడం భారతదేశం యొక్క దౌర్భగ్య స్థితికి నిదర్శం. 

- బి. గంగాధర్, ఎడిటర్, DALITHA SHAKTHI

Sunday, April 1, 2018

దళిత ఉద్యమస్ఫూర్తి ప్రధాత, ప్రముఖ అంబేడ్కర్‌ వాది జె.బి.రాజు

దళిత ఉద్యమస్ఫూర్తి ప్రధాత, ప్రముఖ అంబేడ్కర్‌ వాది జె.బి.రాజు

నేటి ప్రముఖ అంబేడ్కర్‌ వాదుల్లో జె.బి.రాజు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.గత 5 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మరిముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అణగారిన వర్గాల విముక్తిదాత, మానవహక్కుల ప్రధాత అయిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పోరాట చరిత్రను, సిద్థాంతాన్ని, ఎనలేని త్యాగాన్ని ప్రజల వద్దకు పల్లెలు, పట్టణాలు, హైదరాబాద్‌లోని బస్తీలకు తీసుకెళ్లారు. దళిత, బహుజనుల్లో చైతన్యం, సంఘటితశక్తి, ఉద్యమస్ఫూర్తి రగిలించడానికి తనదైన శైలిలో నిరంతరం కృషి చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఫలితంగా వేలాది క్రియాశీలక కార్యకర్తలను, వందలాది సమర్థ నాయకుల్ని తయారు చేయగలిగారు. అంతేకాకుండా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నిర్దేశించిన ''పే బ్యాక్‌ టు ది సొసైటి సిద్ధాంతాన్ని ఆచరణలో నిరూపించి మిగతా ఉద్యోగులకు ప్రేరణగా నిలిచారు. నేడు ఆయన అనుయాయులు, శిష్యులు, అభిమానులు, జె.బి.రాజును 'జై భీమ్‌ రాజు' అని అప్యాయంగా పిలుచుకుంటారు. April2018

Dalithashakthi - 2025 - Magazines