దళిత ఉద్యమస్ఫూర్తి ప్రధాత, ప్రముఖ అంబేడ్కర్ వాది జె.బి.రాజు
నేటి ప్రముఖ అంబేడ్కర్ వాదుల్లో జె.బి.రాజు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.గత 5 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మరిముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అణగారిన వర్గాల విముక్తిదాత, మానవహక్కుల ప్రధాత అయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ పోరాట చరిత్రను, సిద్థాంతాన్ని, ఎనలేని త్యాగాన్ని ప్రజల వద్దకు పల్లెలు, పట్టణాలు, హైదరాబాద్‌లోని బస్తీలకు తీసుకెళ్లారు. దళిత, బహుజనుల్లో చైతన్యం, సంఘటితశక్తి, ఉద్యమస్ఫూర్తి రగిలించడానికి తనదైన శైలిలో నిరంతరం కృషి చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఫలితంగా వేలాది క్రియాశీలక కార్యకర్తలను, వందలాది సమర్థ నాయకుల్ని తయారు చేయగలిగారు. అంతేకాకుండా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నిర్దేశించిన ''పే బ్యాక్ టు ది సొసైటి సిద్ధాంతాన్ని ఆచరణలో నిరూపించి మిగతా ఉద్యోగులకు ప్రేరణగా నిలిచారు. నేడు ఆయన అనుయాయులు, శిష్యులు, అభిమానులు, జె.బి.రాజును 'జై భీమ్ రాజు' అని అప్యాయంగా పిలుచుకుంటారు. April2018

No comments:
Post a Comment