Tuesday, April 25, 2023

రచనలకు ఆహ్వానం

ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యపై నెలకొని ఉన్న సందిగ్ధత, ప్రయివేటు విద్యా సంస్థల దోపిడిపై మేధావులు, రచయితలు, కవులు రచనలను పంపించాల్సిన కోరుతున్నాము.

- ఎడిటర్‌, దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక

Sunday, April 23, 2023

విజ్ఞప్తి

 


చందా దారులుగా చేరండి

 


మీ సహకారానికి మా కృతజ్ఞతలు

మీ సహకారానికి మా కృతజ్ఞతలు


దళితశక్తి జాతీయ తెలుగు మాస పత్రిక బహుజనుల గొంతుక, హక్కుల అధ్యయన కరదీపిక మన పత్రిక. అందుకే పత్రిక నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. అందువల్లనే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక మందిని ప్రతినిధులను నియమించడం జరిగింది. ప్రతినిధులే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతినిధులేనని దళితశక్తి భావిస్తున్నది. ఎందుకంటే వివిధ సంస్థలలో ఉద్యోగులు, కార్మిక సంఘాలు, సంస్థలు అనేకం ఉన్నాయి. మీ రంగం, సంస్థలోని సమస్యలు, కార్యక్రమాల వివరాల రిపోర్టులను పంపించవచ్చు. రిపోర్టుతోపాటు అందుకు సంబంధించిన ఫోటోలు, వ్రాసిన వారి పేరు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ ఈ క్రింది అడ్రస్‌కు పంపంచవచ్చు.

మీ స్పందన మాలో స్ఫూర్తి నింపుతున్నది. మీరు అందిస్తున్న స్ఫూర్తితో పత్రికను మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాము. మా కృషికితోడు మీ సహాయ, సహాకారాలు అందించి మమ్ముల్ని 12 సంవత్సరాలుగా నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి జై భీమ్‌లు. పత్రిక అభివృద్ధి కొరకు మీరు అందించే విరాళాలు, చందాల రూపంలో అందించే సహకారంతోనే పత్రిక నిరాటంకంగా వెలువడటానికి మీ సహకారం తప్పనిసరి. మీరు అందించే శాశ్వత చందాదారులుగా చేరి ఆర్థికంగా చేయూత అందిస్తారని ఆశీస్తున్నాము. మీరు చందాల రూపంలో అందించే ఆర్థిక సహకారంతోనే పత్రిక నిలదొకుకుంటుంది. ఇప్పటికే సహాకారం అందించిన, అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో మీ సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశీస్తున్నాము.

తెలుగు మాట్లాడే అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది బహుజనులకు దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రికను అందజేయాలనేది మాలక్ష్యం. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలతోపాటు పట్టణాల్లో ప్రతినిధులను, ఏజెంట్లను నియమించాలని నిర్ణయించాం. జర్నలిస్ట్‌లుగా పని చేయాలనే ఉత్సాహం ఉన్న దళిత బహుజన యువతీ యువకులు తమ తమ ప్రాంతాల్లో దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రికకు ప్రతినిధులుగా/ ఏజెంట్లుగా పార్ట్‌టైమ్‌ చేయాలని ఉత్సాహం వున్నవారు మీ యొక్క బయోడేటాను ఈ క్రింది ఇ-మెయిల్‌ ద్వారా వాట్సాప్‌ ద్వారా పంపించవచ్చు లేదా సంప్రదించవచ్చు. 

- ఎడిటర్‌


సంప్రదించాల్సిన చిరునామా

దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక
ఇంటినెం. 78/A, మొదటి అంతస్తు, పికెట్‌, సికింద్రాబాద్‌-500026.
మొబైల్‌ నెంబర్లు: 9440154273, 9490098902, 

Wednesday, April 5, 2023

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంటే ఏమిటీ?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంటే ఏమిటీ?

గత మూడున్నర దశాబ్దాలలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కోసం కేటాయించే నిధులను జనాభా దామాషాని బట్టి ఇవ్వక పోగా, కేటాయించిన లక్షల కోట్లు అసలు ఖర్చు చేయలేదని, కాగ్‌ నివేదికలు చెపుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వుంది ప్రభుత్వం.


సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివద్ధి అసమానతలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న రక్షణలు, అక్షరాస్యత, జీవనోపాధి, పేదరికం ధోరణులు తెలుసుజేస్తున్నాయి. రాజ్యాంగ రక్షణలు షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజలు చారిత్రకంగా అభివద్ధిలో వెనుకబడి ఉన్నారు. సమాజంలో అణచివేతకు, నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ ప్రజల అభివద్ధికి ఎన్నో పథకాలు, ప్రణాళికలు అమలు చేసినప్పటికీ అభివద్ధి అసమానతలను ఇంకా గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితి వుంది.

భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగుణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు.

ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవల రంగం నుంచే వస్తోంది. కానీ, ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో భాగమైన సమాచార, సాంకేతిక, జీవసాంకేతిక రంగాలు భవిష్యత్తులో సంపదను సష్టించే కీలక రంగాలు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాల భాగస్వామ్యంపై అత్యంత శ్రద్ధ అవసరం. అందుకే చట్టం చేయడంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీనత్వం, సజనాత్మకత కీలకమవుతాయి.

B GANGADHAR
(రచయిత ఎడిటర్‌ & పబ్లిషర్‌,
దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక)

Sunday, April 2, 2023

నిరంతర స్ఫూర్తి ప్రధాత, ఆధునిక భారత నిర్మాత ''డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ''


నిరంతర స్ఫూర్తి ప్రధాత, 

ఆధునిక భారత నిర్మాత ''డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ''

భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమతాన్ని అందించారు. సాంస్కతిక భారత్‌తోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారత్‌ అవసరమని భావిస్తూ బలమైన కేంద్రం గల భారత రాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజ నుండి - ఒకే రాజ్యం - ఒకే రాష్ట్రం వైపు భారత్‌ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ అందించారు. 

132 క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు- భీమ్‌రావ్‌ రాంజీ అంబేడ్కర్‌. ఈ 143 కోట్ల మహా భారతానికి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఈ దేశ గతిరీతులకు విధాత. నేటికీ ఆయనే మన సామాజిక పథం నిర్ణేత. కులం పునాదులను పెకలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహౌపాధ్యాయుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక. ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింప చేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ, ఆర్థిక విధానాలకూ నిత్య నిర్దేశకుడు అంబేడ్కరే. ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.

భారత రాజ్యాంగపు తుది సమావేశం 25 నవంబర్‌, 1949న ప్రసంగిస్తూ ''నేడు మనకు లభించిన స్వాతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మన కులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకు పెద్దపీటవేయాలి' అని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ దళితుల ఉన్నతి కోసం, సమానత్వం కోసం పనిచేస్తూనే భారతదేశ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమించారు. దేశం కోసం బ్రిటీష్‌ వారితో పోరాడిన ధీశాలి అంబేడ్కర్‌. దేశంలో నేడు ప్రపంచంలో ముందుకు పోవడానికి కారణం మన రాజకీయ నాయకులో, వారి చాతీ, ఛరిష్మా కాదు, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. కట్టుదిట్టమైన రాజ్యాంగ వ్యవస్థలను అంబేడ్కర్‌ ఏర్పాటు చేశారు. ఆయన చేసిన సూచనలు, విలువలు ప్రపంచ వ్యాప్తంగా నేటికీ గౌరవం పొందు తున్నాయి. భారతదేశంలో మాత్రం అంబేడ్కర్‌ యొక్క కృషిని జయంతి సభలకో, వర్థంతి సభలకో, షెడ్యూల్డు కులాలకే పరిమితం చేస్తున్నారు. ఆధునిక భారతదేశ నాయకుడుగా, ప్రపంచం గుర్తించి గౌరవిస్తున్న భారతదేశంలో కులం కోసం పని చేసిన వారిగా చిత్రీకరించడం భారతీయులుగా ఆలోచించాల్సిన బాధ్యత మనందరి.
 సిహెచ్‌ సాయిలు
ప్రముఖ న్యాయవాది, నిజామాబాద్‌


Dalithashakthi - 2025 - Magazines