Wednesday, April 5, 2023

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంటే ఏమిటీ?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంటే ఏమిటీ?

గత మూడున్నర దశాబ్దాలలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కోసం కేటాయించే నిధులను జనాభా దామాషాని బట్టి ఇవ్వక పోగా, కేటాయించిన లక్షల కోట్లు అసలు ఖర్చు చేయలేదని, కాగ్‌ నివేదికలు చెపుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వుంది ప్రభుత్వం.


సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివద్ధి అసమానతలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న రక్షణలు, అక్షరాస్యత, జీవనోపాధి, పేదరికం ధోరణులు తెలుసుజేస్తున్నాయి. రాజ్యాంగ రక్షణలు షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజలు చారిత్రకంగా అభివద్ధిలో వెనుకబడి ఉన్నారు. సమాజంలో అణచివేతకు, నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ ప్రజల అభివద్ధికి ఎన్నో పథకాలు, ప్రణాళికలు అమలు చేసినప్పటికీ అభివద్ధి అసమానతలను ఇంకా గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితి వుంది.

భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగుణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు.

ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవల రంగం నుంచే వస్తోంది. కానీ, ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో భాగమైన సమాచార, సాంకేతిక, జీవసాంకేతిక రంగాలు భవిష్యత్తులో సంపదను సష్టించే కీలక రంగాలు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాల భాగస్వామ్యంపై అత్యంత శ్రద్ధ అవసరం. అందుకే చట్టం చేయడంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీనత్వం, సజనాత్మకత కీలకమవుతాయి.

B GANGADHAR
(రచయిత ఎడిటర్‌ & పబ్లిషర్‌,
దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక)

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines