Sunday, April 2, 2023

నిరంతర స్ఫూర్తి ప్రధాత, ఆధునిక భారత నిర్మాత ''డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ''


నిరంతర స్ఫూర్తి ప్రధాత, 

ఆధునిక భారత నిర్మాత ''డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ''

భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమతాన్ని అందించారు. సాంస్కతిక భారత్‌తోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారత్‌ అవసరమని భావిస్తూ బలమైన కేంద్రం గల భారత రాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజ నుండి - ఒకే రాజ్యం - ఒకే రాష్ట్రం వైపు భారత్‌ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్‌ అందించారు. 

132 క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు- భీమ్‌రావ్‌ రాంజీ అంబేడ్కర్‌. ఈ 143 కోట్ల మహా భారతానికి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఈ దేశ గతిరీతులకు విధాత. నేటికీ ఆయనే మన సామాజిక పథం నిర్ణేత. కులం పునాదులను పెకలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహౌపాధ్యాయుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక. ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింప చేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ, ఆర్థిక విధానాలకూ నిత్య నిర్దేశకుడు అంబేడ్కరే. ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.

భారత రాజ్యాంగపు తుది సమావేశం 25 నవంబర్‌, 1949న ప్రసంగిస్తూ ''నేడు మనకు లభించిన స్వాతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మన కులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకు పెద్దపీటవేయాలి' అని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ దళితుల ఉన్నతి కోసం, సమానత్వం కోసం పనిచేస్తూనే భారతదేశ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమించారు. దేశం కోసం బ్రిటీష్‌ వారితో పోరాడిన ధీశాలి అంబేడ్కర్‌. దేశంలో నేడు ప్రపంచంలో ముందుకు పోవడానికి కారణం మన రాజకీయ నాయకులో, వారి చాతీ, ఛరిష్మా కాదు, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. కట్టుదిట్టమైన రాజ్యాంగ వ్యవస్థలను అంబేడ్కర్‌ ఏర్పాటు చేశారు. ఆయన చేసిన సూచనలు, విలువలు ప్రపంచ వ్యాప్తంగా నేటికీ గౌరవం పొందు తున్నాయి. భారతదేశంలో మాత్రం అంబేడ్కర్‌ యొక్క కృషిని జయంతి సభలకో, వర్థంతి సభలకో, షెడ్యూల్డు కులాలకే పరిమితం చేస్తున్నారు. ఆధునిక భారతదేశ నాయకుడుగా, ప్రపంచం గుర్తించి గౌరవిస్తున్న భారతదేశంలో కులం కోసం పని చేసిన వారిగా చిత్రీకరించడం భారతీయులుగా ఆలోచించాల్సిన బాధ్యత మనందరి.
 సిహెచ్‌ సాయిలు
ప్రముఖ న్యాయవాది, నిజామాబాద్‌


No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines