తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మూడవసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,26,18,205 మంది ఓటర్లలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల వారిగా అధికార బిఆర్‌ఎస్, కాంగ్రెస్ 119, బిజెపి 111, బిఎస్‌పి 107, ఎంఐఎం 9, సిపియం 19, జనసేన 8, సీపీఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడుగురు ఎమ్మెల్యేలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్యేలతోపాటు 1,779 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, 1 ఎన్నికల ట్రాన్స్‌జెండర్ ఈ బరిలో ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో దివ్యాంగుల కోసం 120, మహిళల కోసం 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644 ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638, భద్రాచలం నియోజకవర్గంలో అతితక్కువగా 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పరిమితం చేసింది. దాదాపు 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రిన్యను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉంగా భద్రాచలంలో 1,48,713 మంది మాత్రమే ఉన్నారు. ఎబ్బీనగర్ నియోజనవర్గంలో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు, బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో అతితక్కువగా ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్, 54 నియోజకవర్గాల్లో రెండు, 10 నియోజకవర్గాల్లో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.
ముచ్చటగా మూడో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడ్డాక హౌరాహౌరీగా సాగుతున్న తొలి త్రిముఖ పోరులో అధికార భారాసకు విపక్ష కాంగ్రెస్, భాజపాలు తీవ్ర పోటీనిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి ఐదురాష్ట్రాల అసెంబ్లీల సమరాంగణంలో ఇదే చివరి పోరు...! రాష్ట్రం సాధించి, తొమ్మిదిరేళ్లుగా ఎంతో అభివ ద్ధి చేశామంటున్న అధికార పార్టీ ఒకవైపు, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, ఒక్కసారి ఆదరించాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీ మరో వైపు, డబుల్ ఇంజిన్ సర్కారుకు మద్దతివ్వాలంటున్న అధికార పార్టీ ఇంకోవైపు. ఇలా ద్విముఖ, త్రిముఖ పోటీలో తమ తీర్పును ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేస్తున్న రోజు ఇది. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ ఓటర్లు ఉన్న ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? మార్పును కోరుకుంటారా? లేక త్రిశంకును తీర్మానిస్తారా? ... ఫలితం ఏదైనా ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఓటున్న ప్రతి ఒక్కరూ ఇంట్లోంచి కాలు కదిలించి... ఈవీఎంలపై వేలు మీటే విద్యుక్త ధర్మం నెరవేర్చాల్సిందే! మరి పదండి పోలింగ్‌కు...
- B Gangadhar, Editor
No comments:
Post a Comment