Friday, March 29, 2024

శిక్షిస్తాం: ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌


దళితశక్తి ప్రకాశం జిల్లా ప్రతినిధి యామర్తి అంజనేయులుపై దాడి చేసిన అగ్రకుల పెత్తందార్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ బాబును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ బాబు మాట్లాడుతూ ప్రకాశం ఎస్పీతో నివేదిక తెప్పించి నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం శిక్షించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్‌ రాజు, కెవిపిఎస్‌ అధ్యక్షులు అండ్ర మాల్యాద్రి, దళితశక్తి విజయవాడ ప్రతినిధి దాసరి రంగనాథ్‌, బిఎస్‌పి నాయకులు పెగ్గం ప్రసాద్‌, రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు మర్రి సోహన్లాల్‌, లిబరేషన్‌ ఫ్రంట్‌ నాయకులు మంద ప్రసాద్‌, ఆహా రాష్ట్ర అధ్యక్షులు మెండం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines