Sunday, June 16, 2024

''ఆలోచన''

 ''ఆలోచన'' 

x

ఆలోచన అనేది మానవుల బుద్ధికి సంబంధించిన ఒక విశేష లక్షణం. ఇది మెదడుతో ముడిపడి ఉంటుంది మరియు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. భూమిపై ప్రతి మనిషి ఆలోచనా విధానం అనేది ప్రత్యేకం. ఒక మనిషి ఆలోచనలు మరొక మనిషి ఆలోచనలకు పూర్తిగా సరిపోతాయని ఆలోచనలను బట్టి మంచి లేదా చెడు చెప్పడం కష్టం. ప్రతి వ్యక్తి తన పనులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.  

ఈ ఆలోచనలను ఆధారం చేసుకొని, కొన్ని సంస్థలు మరియు వ్యక్తులు కులం, మతం, జెండర్ వంటి అంశాలలో తప్పుడు సంప్రదాయాలను కొనసాగించడానికి కృషి చేస్తున్నారు. అలాంటి తప్పుడు పద్దతులను అడ్డుకోవడంలో, ప్రజలు, ముఖ్యంగా స్త్రీలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్ బి.విజయ భారతి గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బి.విజయ భారతి పేరు తెలియని వారు చాలా తక్కువ. రచయితగా తన ఆలోచనలను పుస్తకాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేశారు. ముఖ్యంగా స్త్రీల గురించి ఆమె కృషి మరువలేనిది. బానిస సమాజం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీల అణచివేత, అసమానతలపై ఆమె రచనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలో ఉన్న కులం, మతం, జెండర్ గురించి ఆమె అనేక పరిశోధన పత్రాలు రాశారు మరియు పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

తన ఆలోచనల్లో వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను డాక్టర్ బి.విజయ భారతి గారు 'దళితశక్తి' మాసపత్రికలో ప్రచురించడం ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఆమె కృషి మానవ సమాజంలో సమానత్వం మరియు న్యాయసంస్థలను బలపరచడంలో కీలకంగా ఉంది. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడంలో, సాంఘిక న్యాయం సాధించడంలో ఆమె పాత్ర అత్యంత ముఖ్యమైనది.

''ఆలోచన'' పేరుతో డాక్టర్‌ బి.విజయ భారతి గారు రచించిన వ్యాసాలను తీసుకువస్తున్నాం. 

- ఎడోటర్

Thursday, June 6, 2024

ప్రియమైన పాఠక మిత్రులకు జై భీమ్‌లు,

 ప్రియమైన పాఠక మిత్రులకు జై భీమ్‌లు,

  • మీరందరూ దళితశక్తి మాసపత్రికకు చూపుతున్న ఆదరణకు హదయపూర్వక కతజ్ఞతలు, జై భీమ్‌లు. మీ మద్దతుతో మన పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన పత్రికగా నిలిచింది. ఇది మన సమాజంలో, ముఖ్యంగా దళిత, బహుజన ప్రజల్లో, ఒక గొప్ప మార్పును తీసుకువచ్చే పత్రికగా నిలవాలనే మన అభిప్రాయం నిజమైనదని నిరూపిస్తోంది.
  • డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరామ్‌ల ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు మన పత్రిక నిరంతరం కషి చేస్తోంది. ఈ ప్రయాణంలో మీ అండదండలు ఎంతో ముఖ్యమైనవి. ఇంతవరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఆర్థిక వనరులు లేక పత్రికలు నిలబడలేకపోయాయి.
  • ''మాటలు కోటలు దాటిపోతున్న... చేతులు గడప దాటవన్నట్లు'' ఉంది మన పరిస్థితి. ఆచరణ, అమలు రెండు కండ్ల వంటివి. మనం ఒక్క కన్నుతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అందుకే మనం మనవరకే పరిమితం అయిపోతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న మన దళితశక్తి మాసపత్రికకు మీ వంతు సహాయం, సహకారం, చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
  • మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే దళితశక్తి పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని మన పత్రిక విజ్ఞప్తి చేస్తోంది.
చందా కాల పరిమితి:
  • 1 సం.రూ. 600/-
  • 3 సం. రూ.1,500/-
  • 5 సం|.రూ.2,500/-



మీ ఎడిటర్‌

Editorials

దేవుడి పాలనలో శాస్త్రీయత ఎంత?

  • ''మొదట్లో, మా అమ్మ బతికి ఉన్నన్నాళ్లూ ఆమే నాకు జన్మనిచ్చిందేమో అనుకునేవాడిని. అమ్మ వెళ్లిపోయిన తర్వాత, నా మొత్తం అనుభవాలనూ కలిపి చూస్తే నాకు నిశ్చయంగా ఓ విషయం అర్థమయింది. నన్ను ఆ పరమాత్ముడే ఈ లోకానికి పంపించాడు. ఈ శక్తి ఒక భౌతికమైన శరీరంతో వచ్చింది కాదు. ఈ శక్తి ఏదో ఒక పనికోసం ఈశ్వరుడు నాకు ఇచ్చింది. నాకు ఈ జీవితమే కాదు, దయా, ప్రేరణా అన్నీ ఆయనే ఇచ్చాడు. పురుషార్థం సాధించే ఈ సామర్థ్యమూ ఆయనే ఇస్తున్నాడు. నిజానికి నేనేమీ కాను. నేను ఒక పనిముట్టును. నా రూపం ద్వారా ఈశ్వరుడు ఏమి చేయదలచుకున్నాడో అవి చేస్తున్నాడు. అందుకే నేనేమైనా చేస్తున్నానంటే బహుశా ఈశ్వరుడే నాతో చేయిస్తున్నాడని అనుకుంటాను'' విలేకరి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ స్వయంగా అన్న మాటలివి. జ్ఞానం మనిషి పుట్టుక పరిణామాన్నీ శాస్త్రీయంగా నిర్దారించినప్పటికీ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలీ. ఇలాంటి మాటలు ఎవరైనా అంటే పిచ్చి ముదిరి పాకాన పడింది అనుకుంటాం. శాస్త్రీయంగా ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి వ్యాఖాలు చేయరు, మతోన్మాదులు మాత్రమే ఇలాంటి చేస్తారు. మరి నరేంద్ర మోడీని ఏమనాలి?
  • నరేంద్ర మోడీ ద్వారా దేశం లౌకికవాదం వర్థిలుతుందా? దేవుడి పరిపాలనలోని వారు భౌతికవాదం, శాస్త్ర, సాంకేతికను ఎలా ముందుకు తీసుకుపోతారు. దేశం వెలిగిపోతుంది నుండి దేవుడి పాలన మారింది. ప్రధానమంత్రిగా ఆయన దేశాన్ని సరియైన మార్గంలో నడిపిస్తాడని భౌతికవాదులు, శాస్త్రీయంగా సాంకేతికను ఎలా ముందుకు నడిపిస్తారు? దేశంలో నూతన విద్యావిధానం నరేంద్ర మోడీ అందుకే ప్రవేశపెట్టారని ఇప్పుడు అనిపిస్తుంది.
  • నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాల నుండి సాంకేతిక విద్యా సంస్థలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు. దేవుడే మార్చాలా? ప్రభుత్వం నిధులు కేటాయించి, విద్యార్థుల కనీస అవసరాలు తీరుస్తుందా? అనేది ప్రశ్నగానే మిగులుతుంది.
  • ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజుల భారం మోయలేక పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటీవల కాలంలో ప్రభుత్వ స్కూల్స్‌, కాలేజీలకు పంపలేని దుస్థితి నేలకోల్పారు. పేదలను విద్యాకు దూరం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రపంచంలో భారతదేశం ఏవిధంగా వెలిగిపోతుందో సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థ, సాంకేతికత, శాస్త్రీయత ముందుకు తీసుకెళ్లడంలో తీసుకుంటున్న చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలి.
  • కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తమ విధానాలను మరింతగా అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించలేని స్థితికి తీసుకువస్తుంది. భవిష్యత్తులో భారతదేశం ఎంతగా వెలిగిపోతుందనేది విద్య, సాంకేతికత, మరియు సమాన అవకాశాల కల్పనపై ఆధారపడి ఉంటుంది.

Dalithashakthi - 2025 - Magazines