ప్రియమైన పాఠక మిత్రులకు జై భీమ్‌లు,
- మీరందరూ దళితశక్తి మాసపత్రికకు చూపుతున్న ఆదరణకు హదయపూర్వక కతజ్ఞతలు, జై భీమ్‌లు. మీ మద్దతుతో మన పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా నిలిచింది. ఇది మన సమాజంలో, ముఖ్యంగా దళిత, బహుజన ప్రజల్లో, ఒక గొప్ప మార్పును తీసుకువచ్చే పత్రికగా నిలవాలనే మన అభిప్రాయం నిజమైనదని నిరూపిస్తోంది.
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరామ్‌ల ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు మన పత్రిక నిరంతరం కషి చేస్తోంది. ఈ ప్రయాణంలో మీ అండదండలు ఎంతో ముఖ్యమైనవి. ఇంతవరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఆర్థిక వనరులు లేక పత్రికలు నిలబడలేకపోయాయి.
- ''మాటలు కోటలు దాటిపోతున్న... చేతులు గడప దాటవన్నట్లు'' ఉంది మన పరిస్థితి. ఆచరణ, అమలు రెండు కండ్ల వంటివి. మనం ఒక్క కన్నుతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అందుకే మనం మనవరకే పరిమితం అయిపోతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న మన దళితశక్తి మాసపత్రికకు మీ వంతు సహాయం, సహకారం, చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
- మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే దళితశక్తి పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని మన పత్రిక విజ్ఞప్తి చేస్తోంది.

No comments:
Post a Comment