Thursday, June 6, 2024

Editorials

దేవుడి పాలనలో శాస్త్రీయత ఎంత?

  • ''మొదట్లో, మా అమ్మ బతికి ఉన్నన్నాళ్లూ ఆమే నాకు జన్మనిచ్చిందేమో అనుకునేవాడిని. అమ్మ వెళ్లిపోయిన తర్వాత, నా మొత్తం అనుభవాలనూ కలిపి చూస్తే నాకు నిశ్చయంగా ఓ విషయం అర్థమయింది. నన్ను ఆ పరమాత్ముడే ఈ లోకానికి పంపించాడు. ఈ శక్తి ఒక భౌతికమైన శరీరంతో వచ్చింది కాదు. ఈ శక్తి ఏదో ఒక పనికోసం ఈశ్వరుడు నాకు ఇచ్చింది. నాకు ఈ జీవితమే కాదు, దయా, ప్రేరణా అన్నీ ఆయనే ఇచ్చాడు. పురుషార్థం సాధించే ఈ సామర్థ్యమూ ఆయనే ఇస్తున్నాడు. నిజానికి నేనేమీ కాను. నేను ఒక పనిముట్టును. నా రూపం ద్వారా ఈశ్వరుడు ఏమి చేయదలచుకున్నాడో అవి చేస్తున్నాడు. అందుకే నేనేమైనా చేస్తున్నానంటే బహుశా ఈశ్వరుడే నాతో చేయిస్తున్నాడని అనుకుంటాను'' విలేకరి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ స్వయంగా అన్న మాటలివి. జ్ఞానం మనిషి పుట్టుక పరిణామాన్నీ శాస్త్రీయంగా నిర్దారించినప్పటికీ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలీ. ఇలాంటి మాటలు ఎవరైనా అంటే పిచ్చి ముదిరి పాకాన పడింది అనుకుంటాం. శాస్త్రీయంగా ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి వ్యాఖాలు చేయరు, మతోన్మాదులు మాత్రమే ఇలాంటి చేస్తారు. మరి నరేంద్ర మోడీని ఏమనాలి?
  • నరేంద్ర మోడీ ద్వారా దేశం లౌకికవాదం వర్థిలుతుందా? దేవుడి పరిపాలనలోని వారు భౌతికవాదం, శాస్త్ర, సాంకేతికను ఎలా ముందుకు తీసుకుపోతారు. దేశం వెలిగిపోతుంది నుండి దేవుడి పాలన మారింది. ప్రధానమంత్రిగా ఆయన దేశాన్ని సరియైన మార్గంలో నడిపిస్తాడని భౌతికవాదులు, శాస్త్రీయంగా సాంకేతికను ఎలా ముందుకు నడిపిస్తారు? దేశంలో నూతన విద్యావిధానం నరేంద్ర మోడీ అందుకే ప్రవేశపెట్టారని ఇప్పుడు అనిపిస్తుంది.
  • నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాల నుండి సాంకేతిక విద్యా సంస్థలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు. దేవుడే మార్చాలా? ప్రభుత్వం నిధులు కేటాయించి, విద్యార్థుల కనీస అవసరాలు తీరుస్తుందా? అనేది ప్రశ్నగానే మిగులుతుంది.
  • ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజుల భారం మోయలేక పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటీవల కాలంలో ప్రభుత్వ స్కూల్స్‌, కాలేజీలకు పంపలేని దుస్థితి నేలకోల్పారు. పేదలను విద్యాకు దూరం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రపంచంలో భారతదేశం ఏవిధంగా వెలిగిపోతుందో సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థ, సాంకేతికత, శాస్త్రీయత ముందుకు తీసుకెళ్లడంలో తీసుకుంటున్న చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలి.
  • కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తమ విధానాలను మరింతగా అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించలేని స్థితికి తీసుకువస్తుంది. భవిష్యత్తులో భారతదేశం ఎంతగా వెలిగిపోతుందనేది విద్య, సాంకేతికత, మరియు సమాన అవకాశాల కల్పనపై ఆధారపడి ఉంటుంది.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines