Friday, July 5, 2024

Editorials

ప్రజాస్వామ్యమే విజేత

  • లోక్‌సభ ఎన్నికల ప్రజాస్వామ్యం అతిపెద్ద విజేతగా నిలిచింది. తాము ప్రజాస్వామ్యానికీ రాజ్యాంగానికీ ఎంత విలువ ఇస్తామో ఈ తీర్పు ద్వారా ప్రజలు చాటి చెప్పారు. 2014లోనూ 2019లోనూ పరిపూర్ణ అధికారం తెచ్చుకున్న బిజెపికి ఈసారి ప్రజలు ఆ అవకాశం నిరాకరించారు. జూన్ 4న ప్రకటించిన ఫలితాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని భిన్నమైనవిగా చెప్పాలి. 64.2 కోట్ల మంది ఓటర్ల నుంచి అధికార పార్టీ బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనేది స్పష్టం. గత రెండు నెలలుగా నిరంతరాయంగా చేపట్టిన ప్రధానమంత్రి ప్రచారంలో ఎన్డీఏ నిక్కచ్చిగా 400 సీట్లు సాధిస్తామని, అందులో బీజేపీ లక్ష్యం 370సీట్లుగా ఘనప్రచారం చేశారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో ఇది ఖాయమని దేశవ్యాప్తంగా హౌరెత్తింది. అయితే ఎట్టకేలకు అతి కష్టంగా 303 స్థానాలున్న బిజెపి సీట్ల సంఖ్య ఈసారి 240కి పడిపోయింది. అంటే 21 శాతం తగ్గింది. ఎన్‌.డి.ఏ కు 292, 'ఇండియా' వేదికకు 234 స్థానాలు వచ్చాయి.
  • మోడీ పదేళ్ల పాలన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ పాలన మొత్తం లక్షణం నియంత త్వ పోకడలతో హిందూత్వ మతతత్వ ఎజెండాను అమలు చేయడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి అంగమూడు దిగ్బంధానికి గురైంది. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి దారితీసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు జైళ్ల పాలయ్యారు. రాజకీయ పక్షాలపై కక్ష సాధింపు సాగింది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతిపక్షానికి సమాన అవకాశం లేకుండా పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలలో ముస్లింలపై విషం కక్కుతున్నా హద్దు ఆపూ లేకపోయింది. ఈ కీలక రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతకు విఘాతమేర్పడింది. మీడియావరణాన్ని పూర్తిగా బిజెపి గుత్తాధిపత్యంలోకి తెచ్చేసుకుంది. సోషల్ మీడియాలోనూ వనరులు గుమ్మరించింది. ప్రచారంలోనూ ఓటర్లకు పంచిపెట్టడం కోసమూ వేల కోట్లు వెచ్చించింది. ఏమైనా నిరంతరం అప్రమత్తంగా వుండటం ఇప్పటికీ అవసరమే. ఎందుకంటే నిరంకుశ హిందూత్వ లక్షణాలు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి జన్యుధాతువుల్లోనే వున్నాయి. తమ ఎజెండాను ముందుకు నెట్టడానికి ప్రత్యక్షంగా కాకపోతే రహస్యంగా నిరంతరం అన్వేషిస్తూనే వుంటారు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వానికి కట్టుబాట్లు సూత్రాలుగా పని చేయాలి. నిరంకుశ మతతత్వ ప్రమాదంపై పోరాటం ఎంత మాత్రం ముగియలేదు.
  • భారతదేశ న్యాయ చరిత్రలో నూతన అధ్యాయం జులై 1 న మొదలుకానుంది. కొత్త నేర, న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటీషర్లు అమల్లోకి తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (సీఆర్‌పీసీ), ఇండియన్‌ ఎవిఎస్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్యానియం (ఎస్‌'ఎన్‌బీఎస్‌) వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసులు, ఫిర్యాదులు నమోదవుతాయి. ఈ నూతన నేర, న్యాయచట్టాలను జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. 

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines