భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చేసుకుంటున్న సందర్భంగా...
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టండి
భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చేసుకుంటున్న, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో ఇచ్చిన ప్రత్యేక సదుపాయాలు మరియు హక్కుల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చోట్ల విఫలమవుతున్నాయన్నది కఠోరమైన వాస్తవం. డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పినట్లుగా, ''రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వారు నిబద్ధతతో ఉండకపోతే అది విఫలమవుతుంది.'' ఇప్పటికీ కొన్ని ప్రభుత్వాలు మరియు వ్యక్తులు రాజ్యాంగంలోని నిబంధనలను వ్యతిరేకిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ చర్యలు ఆ వర్గాల అభివద్ధిని మాత్రమే కాదు, వారి హక్కులను కూడా హరించేలా మారాయి.
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయ వ్యవస్థకు పునాది. కానీ, ఇటీవల కాలంలో భారత రాజ్యాంగాన్ని మార్చేలనే బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు ప్రయత్నాలు జరిగుతున్నాయి. ''రాజ్యాంగం జీవిస్తేనే ప్రజాస్వామ్యం బతికేది'' రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని బలహీనపరిచే దిశగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. రాజ్యాంగంలోని ''సెక్యులర్'' సిద్ధాంతాలను ప్రశ్నించే విధంగా బీజేపీ నాయకత్వంలోని ఆర్‌ఎస్‌ఎస్ కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. హిందూ దేశం సిద్ధాంతం ప్రతిపాదించి, ఆదిమ సమాజంలో తీసుకుపోవడానికి కుట్రలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు, రాజ్యాంగ హక్కులను హారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని పౌరుల హక్కులు, స్వేచ్ఛలు పక్కదారి పట్టేలా చట్టసభల్లో చర్చలు జరుగుతున్నాయి. సిఏఏ, ఎన్‌సిఆర్ వంటి చట్టాలు ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు వ్యతిరేకంగా వ్యవహారిస్తున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై అధిపత్యం చెలాయించే చేస్తున్నది.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారత రాజ్యాంగ సంఘానికి చైర్మన్‌గా బాధ్యత వహిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివద్ధిని కేంద్రబిందువుగా ఉంచి రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కషి ద్వారా ఆయన భారత చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత గల నాయకుడిగా నిలిచారు. భారతదేశంలో శతాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు అనుభవిస్తున్న సామాజిక వివక్షను నిర్మూలించడం ఆయన ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ దిశలో ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించి, దానిని చట్టపరంగా రద్దు చేయడం ఆయన గొప్ప విజయాలలో ఒకటి. ఇది రాజ్యాంగంలోని అద్భుతమైన సామాజిక సాధనంగా నిలిచింది. అంబేడ్కర్ గారు సామాజిక న్యాయాన్ని రాజ్యాంగానికి కేంద్ర బిందువుగా నిలిపి, అన్ని వర్గాలకూ సమాన అవకాశాలను కల్పించడంలో పునాదులను వేశారు. ఈ క్రమంలో, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది తాత్కాలిక ఉపాయం మాత్రమే కాకుండా, ఆ వర్గాల భవిష్యత్తుకు మెరుగైన పునాదులను అందించింది.
అతని కషి వల్ల రాజ్యాంగంలో ప్రత్యేక చర్యలను చేర్చడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వానికి మార్గాన్ని వేయడం సాధ్యమైంది. ఆయన తీసుకున్న చర్యలు భారత రాజ్యాంగాన్ని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలతో నింపి, అద్భుతమైన పునాదిగా నిలిపాయి. డాక్టర్ అంబేడ్కర్ చూపిన మార్గదర్శకత్వం భారత రాజ్యాంగానికి మాత్రమే కాకుండా, దేశానికి ఆత్మస్వరూపాన్ని అందించింది. సమాజంలో మార్పు, అభివద్ధి కోసం ఆయన చేసిన కషి తరతరాలకు మార్గదర్శకంగా ఉంటుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక మరియు విద్యా అభివద్ధిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిబంధనలను అందించారు. ఈ ఆర్టికల్ ప్రకారం, ప్రభుత్వాలు ఈ వర్గాల అభివద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేయాలని రాజ్యాంగం సూచిస్తుంది. ఇది శాస్త్రం, టెక్నాలజీ, మరియు ప్రాజెక్టుల ద్వారా ఈ వర్గాలను ఉత్తేజపరిచేందుకు, ప్రోత్సాహించేందుకు ప్రభుత్వానికి బాధ్యత అప్పగించింది. అలాగే, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 330, మరియు ఆర్టికల్ 332 ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి. ఈ రిజర్వేషన్లు ఈ వర్గాలకు ప్రత్యక్ష హక్కులు, అవకాశాలు కల్పించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదం చేశాయి. రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలుగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా వారి జీవనశైలిని మెరుగుపరచుకునేందుకు అనేక అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలు, శాసనసభలు, మరియు ఇతర రంగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి వారి అభివద్ధికి దోహదం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఎస్సీ, ఎస్టీ వర్గాలను సమాజంలో సమానత్వం సాధించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు మరియు సామాజిక స్థాయిలో పురోగతి సాధించేందుకు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివద్ధి కోసం ఎన్నో సంఘాలు మరియు సంస్కరణ సంస్థలు ఏర్పడినవి. ఈ సంస్థలు ప్రభుత్వ నిర్ణయాలలో దళితుల హక్కులను ప్రవేశపెట్టేందుకు, అలాగే రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక విధానాలలో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంఘాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులను కాపాడటం, వారికి సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడుతున్నాయి. ఇది ప్రత్యేక రిజర్వేషన్ల అమలు, సామాజిక వివక్షాన్ని నిర్మూలించడం వంటి ముఖ్యమైన అంశాలపై పోరాటం చేస్తున్నాయి. ఈ సంఘాలు దళితుల బానిసత్వం పై పోరాటాలను చట్టపరంగా నిర్వహిస్తున్నాయి. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల అమలు కోసం ప్రత్యేక చర్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నాయి. దళితుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా పెట్టుకుని, రాజకీయ, సామాజిక మార్పుల కోసం సదస్సు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆకాంక్షలను ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి, సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు కషి చేస్తున్నాయి. ఈ సంఘాలు దళితుల హక్కుల పై పెద్ద స్థాయిలో పోరాటం చేస్తూ, వివిధ ప్రాంతాల్లో ఉద్యమాలను నిర్వహిస్తుంది. ఇది దళితులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి పునరాలోచన చేయించడం, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ వర్గాలు రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు సంపాదించడం, తమ హక్కులను సాధించడంలో ముఖ్యమైన వేదికగా మారింది. పోరాటం వల్ల సమాజంలో దళితుల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, మరియు అభివద్ధి పనులు మెరుగుపడ్డాయి. రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో కొన్ని అవకాశాలు దక్కాయి, తద్వారా దేశవ్యాప్తంగా ఈ వర్గాలు సాంఘిక స్థాయిలో పురోగతిని సాధించాయి.
ప్రస్తుతం కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కొన్ని ప్రాంతాల్లో వివక్ష, ఆర్థిక వెనుకబాటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కొంతమంది సాంప్రదాయ ధోరణులను అనుసరిస్తూ, దళితులపై వివక్షను కొనసాగిస్తూ ఉన్నారు. దళితులపై అణచివేత, అన్యాయాలు, సామాజిక అసమానతలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో గణనీయంగా కనిపిస్తూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మరియు చట్టబద్ధమైన రక్షణల కారణంగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనలు, ప్రభుత్వ రిజర్వేషన్లు, మరియు వివిధ సంక్షేమ ప్రణాళికలు ఈ వర్గాల వ్యక్తుల సామాజిక స్థాయిని మెరుగుపరిచేలా మార్పులు తీసుకొచ్చాయి. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలలో, రాజకీయంగా, తదితర రంగాలలో అవకాశాలు కల్పించడం ద్వారా దళితుల శక్తిని పెంచాయి. ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్వతంత్రంగా ఉన్న న్యాయపరమైన రక్షణలు తమ హక్కులను కాపాడటానికి సహాయపడుతున్నాయి. యువతలో ఆర్థిక, సామాజిక అభివద్ధి పెరుగుతున్న వేళ, విద్యాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రేటు పెరిగింది. అంతేకాదు, ఈ వర్గాలు ఇంకా సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు, తమ హక్కులను కాపాడుకునేందుకు మరింత అవగాహన పెంచడం, చట్టపరమైన పోరాటాలు, సామాజిక చర్చలు నిర్వహించడం సంఘాలు కొనసాగిస్తున్నాయి. ఇది సమాజంలో ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని ప్రేరణనిచ్చేలా మారింది.
భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేస్తుకుంటున్నా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో ఇచ్చిన ప్రత్యేక సదుపాయాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి. ''రాజ్యాంగం ఎంత మంచిగా ఉన్న ప్రయోజనం లేదు, అమలు చేసే వారు గొప్పగా లేకపోతే ప్రయోజనం లేదు'' అని డా.బి.ఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ రోజు అదే విధంగా జరుగుతున్నది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వారు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీలకు అణగదొక్కే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాజ్యాంగం ద్వారా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, మరియు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా, వీరికి ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అమలు చేయబడినవి. ఈ రిజర్వేషన్ల ద్వారా, ఈ వర్గాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తమ హక్కులను, అధికారాన్ని పెంచుకోవడంలో కీలకంగా వ్యవహరించాయి. పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిర్దిష్ట రిజర్వ్ స్థానాలు ఉండటం, ఈ వర్గాలకు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులను కాపాడటానికి, తమ సమస్యలను అవకాశం ఉన్న ప్రజా ప్రతినిధులు అయా పార్టీల నాయకులుగానే వ్యవహారిస్తున్నారు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత అందించడంలో ఘోరంగా విఫలం చెందారు. ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, సామాజిక స్థాయిని పటిష్టం చేసుకోవడానికి అవకాశాలు ఉన్న రాజకీయంగా పొందలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సామాజికంగా వెనుకబడిన వర్గాలుగా ఉండే పరిస్థితి నుండి తేరుకుని, సమాన అవకాశాలను పొందే దిశగా ముందుకు సాగుతున్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను ఎస్సీ, ఎస్టీ సంఘాలు తమ పోరాటాల్లో వాడుకొని, సమానత్వం సాధించేందుకు కషి చేశాయి. ఇది రిజర్వేషన్ల అమలు మాత్రమే కాకుండా, సామాజిక వివక్ష, దళితుల అణచివేత, వివిధ రంగాలలో ప్రాతినిధ్యం కోసం చేసిన పోరాటాలతో పొందడం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అందించడం, హక్కులను అందించడం, న్యాయపరమైన పరిష్కారాలు, సామాజిక దక్కోణంలో మార్పులు తీసుకురావడంలో ముఖ్యమైన అంశాలు అయ్యాయి. ఈ సమాజిక మార్పులు, రిజర్వేషన్ల అమలు, ప్రత్యేక రక్షణలతో కూడిన పోరాటాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తమ హక్కులను కాపాడటానికి, సామాజిక, ఆర్థిక పురోగతిని సాధించడానికి కీలకమైన వేదికగా నిలిచాయి.
గోవల్కర్ విధానాలతో ఆర్‌ఎస్‌ఎస్ నూతన రాజ్యాంగాన్ని తీసుకురావాలని కుట్రలు చేస్తున్నది. హిందూత్వ సిద్ధాంతానికి అనుగుణంగా మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నది. రాజ్యాంగంలో ''సామాజికవాదం'' వంటి పదాలను తొలగించి, హిందూత్వ భావజాలం ప్రవేశపెట్టాలని భావన. ప్రజల మధ్య అసమానతలను ప్రోత్సహిస్తూ, సామాజిక సమానత్వాన్ని దెబ్బతీసే విధానాలు అమలు చేస్తున్నారు. ప్రజాఉద్యమాలను అణచివేసే చర్యలు కొనసాగుతుండటం రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉందని మేధావులు విమర్శలు చేస్తున్నారు. మతాల మధ్య విభజన పెరిగేలా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరచాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నవారు, సామాజిక ఉద్యమాల ద్వారా దీనికి ప్రతిఘటించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ చర్యలు జరిగితే వాటిని చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలి.

No comments:
Post a Comment