భారత అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారమే శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజ్యా యంత్రాంగం పని చేస్తాయి, చేస్తున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అంశాలపై పని చేయాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు ఒక్కొక్కటిగా విఫలంగా చెందుతూనే ఉన్నాయి. రాజ్యాంగ పరిధిలో పని చేయాల్సిన వ్యవస్థలు రాజకీయనాయకుల కన్నుసన్నల్లో పనిచేయడం ప్రపంచ దేశాల ప్రజలను ఆలోచింపచేస్తున్నది. కానీ భారత రాజ్యాంగవ్యవస్థలు గానీ, జకీయనాయకులు గానీ ఈ విషయంలో పూర్తిగా విఫలం చెందినట్లు ఎక్కడ ఒప్పుకోవు. ఎందుకంటే వారు అన్ని తెలిసే చేస్తున్న విషయం గనుక.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల హక్కులను అమలు చేయడంలో విఫలం చెందిన వాటిని తిరిగి ఎలా అమలు చేయాలో ఆలోచించకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం వారికి అందకుండా చేయాలనే ఆలోచిస్తున్నట్లు 2018 మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక ఉదాహారణ. రాజకీయ పార్టీలు ఈ వర్గాల ప్రజలకి లబ్ధిచేకుర్చాలనే దానికి ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తుంటాయి. ఇలాంటి నేపథ్యంలో సామాజిక తరగతుల ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం నేడు కనిపిస్తున్నది.
రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం స్థానాన్ని క్రమేపి కుల, మతోన్మాదసంస్థలు ఆక్రమణ చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల ప్రజలకు ఉన్నహక్కుల అమలుకోసం పోరాడుతున్న వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించకపోగ హక్కులు అడగడమే అన్యాయం అన్నట్లు (2018 జనవరి1న భీమాకోరేగావ్, 2018 ఏఫ్రిల్ 2న మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటనాలు) కుల,మతోన్మాదసంఘాలు, సంస్థలు వ్యవహారిస్తున్నాయి. ఈ అంశాల పట్ల రాజ్యాంగవ్యవస్థలు ఆలోచించడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను విడివిడిగా చేసి, వాళ్ళ ప్రజల మీద వాళ్ళనే దాడులు చేస్తున్నాయి కుల, మతోన్మాద సంస్థలు. దాడులు చేయాల్సిన ప్రజలే దాడులకు గురి కబడుతున్నారు. ఇలాంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మతోన్మాద సంస్థలను కట్టడి చేయలేకపోతున్నారు? ఎందుకు? ఇలాంటి వాటిని ప్రశ్నించేవారు లేకపోవడం భారతదేశం యొక్క దౌర్భగ్య స్థితికి నిదర్శం.

I want magazine sir my number 7075071928 WhatsApp.
ReplyDelete