దళితశక్తి మానపత్రిక తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ, అభిమానం సంపాదించుకుని అత్యధిక సర్క్యులేషన్ కలిగి ఉన్నది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాంల ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నిరంతరం కషి చేస్తున్నది. ఇప్పటి వరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఎందుకంటే ఆర్ధిక వనరులు లేక ఆ పత్రికలు నిలబడలేకపోయాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రింట్ మీడియా రంగంలో ఉన్నటువంటి పత్రికలకు మీ వంతు సహాయ, సహకారాన్ని చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. మన పత్రికలను మన వారే ప్రోత్సహించకపోతే ఇతరులెవరూ కొంటారు? ఇతరులెవరూ ప్రోత్సహిస్తారు? మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని దళితశక్తి మాసపత్రిక విజ్ఞప్తి చేస్తున్నది.


No comments:
Post a Comment