Sunday, June 25, 2023

ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి

ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి

దేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్‌ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.

నిధుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ధనిక రాష్ట్రం పేరుతో ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాలయాలను వేతనాలు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లించడంలో విఫలం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రతినెల రుణాలు తీసుకోకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా నిధులు దుబారా ఖర్చు చేస్తున్న విషయం కాగ్‌ నివేదికలో పేర్కొనడం మనం గమనించాలి. వివిధ అభివృద్ధి పనులు చేసినబిల్లులు చెల్లించలేక సర్పంచ్‌ మొదలుకుని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదు.
నియమాకాలు... ''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కాంట్రాక్టు నియమాకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు నీటిమీద రాతలు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ఖాళీలు ఉన్న, ఒక్క ఉద్యోగి రెండు, మూడు రకాల పనులు చేస్తున్నారు. ఇది మన పాలకులకు తెలియంది కాదు. కానీ అన్ని ఖాళీలు భర్తీ చేసినట్లు గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ప్రకటించిన నియమాకాలు సైతం భర్తీ చేయలేకపోతుంది. ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు/ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.
తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, ముఖ్యంగా జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ నల్లచట్టాల కింద అణచివేయాలని చూస్తుంది. ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అవినీతి, భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, జర్నలిస్టులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం జర్నలిస్టును, మేధావులను బూతు పురాణంతో తిడుతూ... తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్న మూకలను ప్రభుత్వం నియంత్రించలేక పోతున్నది. వారికే వత్తాసు పలుకుతుండటం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.
- బి గంగాధర్‌, ఎడిటర్‌ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధిదేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్‌ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.

నిధుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ధనిక రాష్ట్రం పేరుతో ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాలయాలను వేతనాలు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లించడంలో విఫలం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రతినెల రుణాలు తీసుకోకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా నిధులు దుబారా ఖర్చు చేస్తున్న విషయం కాగ్‌ నివేదికలో పేర్కొనడం మనం గమనించాలి. వివిధ అభివృద్ధి పనులు చేసినబిల్లులు చెల్లించలేక సర్పంచ్‌ మొదలుకుని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదు.
నియమాకాలు... ''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కాంట్రాక్టు నియమాకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు నీటిమీద రాతలు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ఖాళీలు ఉన్న, ఒక్క ఉద్యోగి రెండు, మూడు రకాల పనులు చేస్తున్నారు. ఇది మన పాలకులకు తెలియంది కాదు. కానీ అన్ని ఖాళీలు భర్తీ చేసినట్లు గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ప్రకటించిన నియమాకాలు సైతం భర్తీ చేయలేకపోతుంది. ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు/ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.

తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, ముఖ్యంగా జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ నల్లచట్టాల కింద అణచివేయాలని చూస్తుంది. ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అవినీతి, భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, జర్నలిస్టులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం జర్నలిస్టును, మేధావులను బూతు పురాణంతో తిడుతూ... తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్న మూకలను ప్రభుత్వం నియంత్రించలేక పోతున్నది. వారికే వత్తాసు పలుకుతుండటం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.

- బి గంగాధర్‌, ఎడిటర్‌

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines