రాష్ట్రంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని వివిధ వర్గాల ప్రజలు పారిశ్రామిక విధులు విరాళాలతో నిర్మించారు. అలాంటి ఆశ్రమాన్ని ట్రస్టు ద్వారానో స్వతంత్రంగా ఆలోచించేటటువంటి వ్యక్తుల సమూహం ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉండగా చిన్ని చిన్న జీయర్ స్వామి బంధు ప్రీతితో తన సొంతమైన అల్లుడుని నిర్వాకుడిగా ప్రకటించుకున్నారు. ఈ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి లీలలను ఆయనకు తెలియకుండా జరుగుతున్నావని భావించిన అక్కర్లేదు. ఎందుకంటే ఆశ్రమంలో అన్నీ తానై చూసుకుంటున్నటువంటి వ్యక్తి ఇలాంటి వాడు ఏ విధంగా సరిపోతాడు అని సరి చూసుకున్న తర్వాతనే బాధ్యతలు అప్పగించి ఉంటారు.
ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలను ఆశ్రమ నిర్వాకులు గాని చిన్న జీయర్ స్వామి గారి ఇప్పటివరకు ఖండించలేదు. జరిగిన జరుగుతున్న వాస్తవాలను ఆంధ్రజ్యోతి నిర్భయంగా వెల్లడించింది.
భక్తి పేరుతో దేవుని గుడికి వస్తున్నటువంటి అప్సర అనే యువతని అక్కడున్నటువంటి పూజారి భక్తి ముసుగులో కామంతో కండ్లు మూసుకుపోయి (వివాహితుడైన వ్యక్తి) ప్రేమ పేరుతో వలవేసి గర్భవతిని చేయడంతో పాటు హత్య చేసి మ్యాన్ హోల్ (మురికి కాలువలో) శవాన్ని పడి వేయడం అంటే రాష్ట్రంలో స్వాముల వికృత చేష్టలకు ఈ దారుణాలు ప్రతిరూపం.
ఇప్పటికైనా.. భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నటువంటి స్వాములు, బాబాలు, పూజారులు, తదితర మోసగాళ్లపట్ల జాగ్రత్త మెలిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- బి గంగాధర్, ఎడిటర్, దళితశక్తి మాసపత్రిక
No comments:
Post a Comment