పచ్చని మణిపూరన కొండల్లో...
ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఎందుకు?
మణిపూర్ చిన్న రాష్ట్రమైన 33 తెగలు 190 భాషలకు నిలయం. ఆకుపచ్చని అరణ్యాలు, ఎత్తయిన కొండలతో నిండిన సుందరమైన మణిపూర్ కుకీ, మైతేయి తెగల ఘర్షణలతో మూడు నెలలుగా మండుతోంది. ఈ మంటలు రగిలిస్తున్నది ఎవరు? చలి కాగుతున్నది ఎవరు? లాభం పొందాలని ప్రయత్నిస్తున్న శక్తులు ఏవి అనేది ఆలోచించాలి.
మణిపూర్ రాష్ట్రంలో అత్యధికులు మైతీయి తెగకు చెందిన వారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాలించిన రాజవంశం కూడా ఈ తెగవారే. వీరి తరువాత రాష్ట్రంలో సింహభాగం గిరిజనులు. వారిలో ప్రధానమైన తెగలు కుకీలు, నాగాలు. సహజంగా గిరిజనులలో ఉండే అమాయకత్వం, మొండితనం, ధైర్యంతో కూడిన తెగువ వీరిలో నరనరాన జీర్ణించుకు పోయింది. ఆ సహజ స్వభావమే ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేలా చేసింది. దేశంలో సాగిన తొలి గిరిజన పోరాటాలలో ఒకటిగా ఈ కుకీ తిరుగుబాటు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి ఉన్న కుకీలు, నాగాలు, ఇతర తెగలు ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మొదటి నుంచి వీరందరూ సామాజికంగా ఎస్టీ హౌదాలో గుర్తించబడి కొనసాగు తున్నారు. అందువల్ల వీరు నివసించే అటవీ ప్రాంతాలలో వీరికి ప్రత్యేకంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లతోపాటు అక్కడి భూములపై ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాలను అమలు పరుస్తున్నారు. అయితే, వీరి కంటే సామాజికంగా ఉన్నత హౌదాను అనుభవిస్తున్న మెయితీలు ఈ ప్రాంతాలకు వలస వచ్చారు.
వివాదానికి అసలు కారణం...
నిజానికి వీరు అధికంగా మైదాన, లోయ ప్రాంతాల లో నివసిస్తువస్తున్నారు. వీరిని సామాజికంగా బీసీ, ఓబీసీలుగా ప్రభుత్వాలు గుర్తించాయి. అయితే కాలక్రమంలో వీళ్ళు తమను కూడా గిరిజనులుగా గుర్తించి విద్య, ఉద్యోగ అవకాశాల తోపాటు, గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలలోని భూములపై కూడా సమాన హక్కులు కల్పించాలని పోరాటా లను చేస్తూ వచ్చారు. రాష్ట్ర జనాభాలో కుకీలు, నాగాల చేతిలో 90% భూమి ఉండని, 53% జనాభా ఉన్న తమ వద్ద 10% భూమి మాత్రమే ఉందని మైతీయులు ఎదురుదాడికి దిగారు. (మణిపూర్‌లో కొండ ప్రాంతం 90% ఉంటే, మైదాన ప్రాంతం 10% మాత్రమే ఉంది) ఇది నిజమైనప్పటికీ భూమిపై హక్కు కోసం ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మైతీలకు ఎస్టీ హౌదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది కుకీల వాదన. ఈ విషయంలో వారు ఎప్పటినుంచో తమ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను విన్నవిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దష్టికి సైతం తీసుకువెళ్లారు. అయితే, మే 3వ తేదీన కుకీలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శ నలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో శాంతియుతం గానే సాగిన నిరసన చురా చాంద్బూర్ అనే కుకీల ఆధిపత్యం కలిగిన ప్రాంతంలో మాత్రం హింసకు దారి తీసింది. మైదాన, కొండ ప్రాంతం కలిసి ఉన్న చురా చాంద్పూర్‌లో మైతీయులు, కుకీలు ఎక్కువ ఉండటం వల్లే ఘర్షణలు తలెత్తాయి. హత్యలు కూడా జరిగాయి.
గత ఎన్నికలలో వీరికి మద్దతు పలికిన బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో వారి ఉద్యమానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు మైతీయులు మణిపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న మణిపూర్ హైకోర్టు మైతీయులను కూడా కుకీలలాగే ఎస్టీ జాబితాలో కలపాలని తీర్పు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. మైతీయు లను ఎస్టీ జాబితాలో చేర్చితే వారు తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమ సంస్కతి, సంప్రదాయాలను నాశనం చేస్తారని, తాము నివసించే అటవీ భూములను తమకు దక్కకుండా చేస్తారని భావించి రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ గ్రూప్స్ కలిసి ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ మణిపూర్‌గా ఏర్పడి సంఘీభావ యాత్రను నిర్వహించాయి. ఆ తరువాత మే నెల నుంచి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గిరిజనులు తీవ్ర నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు చేపట్ట సాగారు. ఇది గిట్టని మైతీయులు తమకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న గిరిజనులపై కోపం పెంచుకుని అమాయక కుకీలు, ఇతర గిరిజనులపై మారణకాండకు తెగబడుతూ వాళ్ల ఆడవాళ్ళపై చేసిన అహంకార, ఆధిపత్య, బలప్రదర్శనకు సంబంధించిన వీడియో ఒకటి 72 రోజుల తరువాత బయటికి రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిలో మానవత్వం మంట గలిసేలా ఉన్న చర్యలను చూసి మనుషులైన ప్రతి వారు సిగ్గుతో తలదించుకునేలా చేసింది. అయితే గడిచిన మూడు నెలలలో బయటకు వచ్చింది ఈ ఒక్క సంఘటన మాత్రమే. కానీ ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మారణ హౌమంలో 142 మంది చనిపోయినట్లుగా, సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారని, 5,000 దహనకాండ ఘటనలు చోటు చేసుకున్నాయని, 5,995 కేసులు పెట్టి, 6,745 మందిని కస్టడీలోకి తీసుకున్నారని వివిధ మీడియా సంస్థలు చెబుతున్న అంచనా. దుండగులు ఏకంగా 35 పోలీస్ స్టేషన్లపై దాడులు జరిపి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. వాటిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ఆరోజు ఏం జరిగింది...?
మణిపూర్‌లో మే 3వ తేదిన మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ మొదలైంది. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటే ఓ ఫేక్ వీడియో మెయితీ వర్గానికి చెందిన ప్రజల్లో వైరల్ అయింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీయులు ఇంఫాలకు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్ పోప్కి జిల్లాలో ఒక గ్రామానికి చెందిన 800-1000 మంది మే4వ తేదీన మరో గ్రామంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షించు కునేందుకు ఓ కుటుంబానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె, మరో ఇద్దరు మహిళలు అడవిలోకి పారిపోతుండగా... వాళ్లను వందల మందితో కూడిన గుంపు అడ్డగించి దాడికి పాల్పడింది. 21 ఏళ్ల యువతిని వివస్త్రను చేస్తున్న అల్లరి మూకను అడ్డగించిన 19 ఏళ్ల ఆమె తమ్ముడిని, 50 ఏళ్ల తండ్రిని చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో 42 ఏళ్ల మహిళ బట్టల ఊడదీసి, నగంగా ఊరేగిస్తూ, అసభకరంగా తాకుతూ, కొడుతూ పొల్లాల్లోకి లాక్కెళ్లారు. యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరితోపాటు మాజీ సైనికుడి భార్యను కూడా నగంగా ఊరేగించడం దేశానికే అవమాన కరంగా నిలిచింది. కార్గిల్ యుద్ధంలో శత్రువు నుంచి దేశాన్ని రక్షించిన తాను ముష్కరుల నుంచి తన భార్యను కాపాడుకోలేక పోయానని ఆవేదన చెందారు.తమను రక్షించాలని పోలీసుల వద్దకెళ్తే, వారే తమను గుంపు వద్దకు తీసుకెళ్లి వదిలి పెట్టారని బాధిత యువతి ఆవేదన వ్యక్తంగా చేసింది. తమను నగంగా ఊరేగిస్తూ, కొడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. తమ గ్రామంపై దాడి చేస్తున్న గుంపుతో కూడా పోలీసులు ఉన్నారని పేర్కొన్నది. తమను ఇంటి నుంచి ఫికప్ చేసిన పోలీసులు ఊరికి కొంచెం దూరంగా తీసుకుళ్లి గుంపు వద్ద రోడ్డుపై వదిలేశారని తెలిపింది. గుంపులో చాలా మంది ఉన్నారని, 21ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నది.
మణిపూర్‌లో మే 3వ తేదిన మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ మొదలైంది. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటే ఓ ఫేక్ వీడియో మెయితీ వర్గానికి చెందిన ప్రజల్లో వైరల్ అయింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీయులు ఇంఫాలకు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్ పోప్కి జిల్లాలో ఒక గ్రామానికి చెందిన 800-1000 మంది మే4వ తేదీన మరో గ్రామంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షించు కునేందుకు ఓ కుటుంబానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె, మరో ఇద్దరు మహిళలు అడవిలోకి పారిపోతుండగా... వాళ్లను వందల మందితో కూడిన గుంపు అడ్డగించి దాడికి పాల్పడింది. 21 ఏళ్ల యువతిని వివస్త్రను చేస్తున్న అల్లరి మూకను అడ్డగించిన 19 ఏళ్ల ఆమె తమ్ముడిని, 50 ఏళ్ల తండ్రిని చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో 42 ఏళ్ల మహిళ బట్టల ఊడదీసి, నగంగా ఊరేగిస్తూ, అసభకరంగా తాకుతూ, కొడుతూ పొల్లాల్లోకి లాక్కెళ్లారు. యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరితోపాటు మాజీ సైనికుడి భార్యను కూడా నగంగా ఊరేగించడం దేశానికే అవమాన కరంగా నిలిచింది. కార్గిల్ యుద్ధంలో శత్రువు నుంచి దేశాన్ని రక్షించిన తాను ముష్కరుల నుంచి తన భార్యను కాపాడుకోలేక పోయానని ఆవేదన చెందారు.తమను రక్షించాలని పోలీసుల వద్దకెళ్తే, వారే తమను గుంపు వద్దకు తీసుకెళ్లి వదిలి పెట్టారని బాధిత యువతి ఆవేదన వ్యక్తంగా చేసింది. తమను నగంగా ఊరేగిస్తూ, కొడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. తమ గ్రామంపై దాడి చేస్తున్న గుంపుతో కూడా పోలీసులు ఉన్నారని పేర్కొన్నది. తమను ఇంటి నుంచి ఫికప్ చేసిన పోలీసులు ఊరికి కొంచెం దూరంగా తీసుకుళ్లి గుంపు వద్ద రోడ్డుపై వదిలేశారని తెలిపింది. గుంపులో చాలా మంది ఉన్నారని, 21ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నది.
రహదారుల విస్తరణ ఓ కారణమా?
రాష్ట్రంలోని ఏడు రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో సాగు దిగుబడులకు మార్కెట్ లభించ డంతోపాటు భూముల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉంటున్న మైతీయులకు అటవీ ప్రాంత భూములపై హక్కులు దక్కాలంటే వారికి ఎస్టీ హౌదా అత్యవసరంగా మారింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ సహా మైదాన ప్రాంతాల్లో ఉన్న మైతీయులు ఇప్పటికే ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందంజలో ఉన్న మైతీయులు రహదారుల విస్తరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీలోనూ మైతీయి ఎమ్మెల్యేల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో ఎస్టీ హౌదా విషయంలో తమకు అన్యాయం జరిగిందని కుకీలు మండిపడుతున్నారు.
మంటపెట్టిన పౌరసత్వ చట్టం
రాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (పౌరసత్వ చట్టం-ఎన్నార్సీ)ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా కుకీలకు ఆగ్రహం తెప్పించింది. ఫొటో రికగెజేషన్ వంటి పద్ధతులను అమలు చేయడంతో వారిలో అనుమానాలను మరింత కలిగించింది. ఈ క్రమంలోనే ఎస్టీ హౌదాపై కోర్టు తీర్పు రాకముందే ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ హాజరు కానున్న ఓ కార్యక్రమ వేదికను కుకీలు తగులబెట్టారు. అయితే, మయన్మార్ నుంచి అక్రమ వలసను కట్టడి చేసేందుకే ఎన్నార్సీని అమలు చేస్తున్నా మని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, తమను అక్రమ వలసదారులుగా ముద్రవేస్తూ ఇక్కడి భూములపై హక్కును కాలరాస్తోందని కుకీలు ఎదురుదాడికి దిగుతున్నారు. తమ ప్రధాన జీవ నాధారమైన గసగసాల సాగుపై ప్రభుత్వం ఆక్షలు విధించడం కూడా కోపం తెప్పించింది.
స్వయంపాలన కోరుతున్న కుకీలు
భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 244 ప్రకారం తమను 6వ షెడ్యూల్‌లో చేర్చాలని కుకీలు డిమాండ్ చేస్తున్నారు. 6వ షెడ్యూల్‌లో చేరితే గిరిజన, కొండ ప్రాంతాలకు స్వయం పాలన లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో అటానమస్ డిస్టీక్ట్ కౌన్సిల్ (ఏడీసీ)ని ఏర్పాటు చేస్తారు. తమ ప్రాంతానికి సంబధించిన ఆదాయ వనరులు, నిర్ణయాలు, ఖర్చులన్నీ కౌన్సిల్ స్వయంగా చేసుకుంటుంది. గిరిజనుల కేసుల విచారణను వినేందుకు గ్రామ న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారం పరిమితం అవుతుంది. ప్రస్తుతం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని 10 గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా గుర్తించారు. పాలకుల స్వప్రయోజనాల కోసమే మణిపూర్‌లో ఈ చట్టాలను అమలు చేయడం లేదని కుకీలు మండిపడుతున్నారు.
మణిపూర్ వాసులు పోరాటయోధులు
మణిపూర్ వాసులు పోరాట యోధులు, ప్రజాస్వామ్యం కోసం 1917 నుంచి 1937 మధ్య కాలంలో ఉద్యమించారు. దేశానికి స్వాతంత్య్రం లభించినప్పుడు బర్మాను కాదని ఇండియాలో కలిసేందుకే మొగ్గు చూపారు. విలీనంపై మణిపూర్ మహారాజు బుద్ధ చంద్ర 1947 ఆగస్టు 11వ తేదీన భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1949 సెప్టెంబర్ 21వ తేదీన విలీన ఒప్పందంపై మహారాజు సంతకం చేశాడు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన వర్గాలు నాటి నుంచి సాయుధ పోరాటం చేస్తూనే ఉన్నాయి. 1964లో ఏర్పడిన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ భారత్ '' నుంచి స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నది. తర్వాత వివిధ లక్ష్యాలతో చాలా తిరుగుబాటు వర్గాలు ఉనికిలోకి వచ్చాయి. 1977లో కంగ్రీపాక్ పీపుల్స్ లిబరేషన్ పార్టీ, 1978లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటయ్యాయి. 1980 నుంచి 2004 వరకు మణిపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. 1980 నుంచి సైన్యం అరాచకాలతో రాష్ట్రంలో మానవ హక్కులు మంటగలిశాయని ప్రజలు ఆందోళన చేపట్టారు. తంగ్ జామ్ మనోరమా దేవి అనే మణిపూర్ మహిళను అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మానభంగం చేయడంతో అశాంతి పెల్లుబుకింది. మీరా పైబీస్ అనే మహిళా సంఘం నాయకత్వంలో మహిళలు ఏకంగా నగంగా మారి సైనికుల ముందు ప్రదర్శన నిర్వహించారు.
మహిళలే ఎందుకు టార్గెట్?
ఆదివాసీ తెగల్లో ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానించడానికి మహిళలను చెరపట్టడాన్ని ఆయుధంగా ఉప యోగించుకుంటున్నారు. ఫలితంగా ఆ కుటుంబం తెగ సమాజంలో తలెత్తుకు తిరగదని వారి నమ్మకం. అయితే మణిపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసన తెలిపేందుకు మహిళలు నగత్వాన్ని నిరసనగా ఎంచుకున్నారు. ఆఫ్సా చట్టాన్ని రద్దుతోపాటు మరికొన్ని ఘటనల్లోనూ ఈ విధంగానే నిరసన తెలిపారు.
నల్లమందు సాగు...
కొండిపాంతంలో నివసించే కొంతమంది కుకీలు ఉపాధి కోసం మయన్మార్ డ్రగ్ లార్డ్స్ కోసం నల్లమందు. (ఓపియం) సాగు చేస్తున్నారు. మయన్మార్‌లో సార వంతమైన మణిపూర్‌లో పండించే ఓపియంకు విదేశాల్లో గిరాకీ ఉండటంతో వీరిని ప్రోత్సహి స్తున్నారు. నల్లమందు సాగులో కేవలం కుకీలే కాకుండా నాగాలు, మైతీయులు కూడా తమతమ పరిధిలో సాగు చేస్తున్నారు. ఈ సాగుకు అవసరమైన పనులు చేసేందుకు మయన్మార్, మిజోరం నుంచి కుకీలు ఇక్కడి వలస వస్తున్నారు. ఈ క్రమంలో 2017 నుంచికొండ ప్రాంతాల్లో వరుస దాడులు చేస్తూ ఓపీఎం, హెరాయిన్ పండిస్తున్న కుకీల పంట పొలాలను ప్రభుత్వ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో తమ ఆదాయాన్ని ప్రభుత్వం కొల్లగొడుతున్నదని అసహనంతో కుకీలు ఉన్నారు. ఉపాధి ప్రత్యామ్నాయాలు చూపకుండా తమను సంఘ విద్రోహులుగా ముద్ర వేస్తున్నా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుకీలు ఏమంటున్నారు...?
కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుకీలు, నాగాలు దశాబ్దాలుగా అభివద్ధికి దూరంగా ఉన్నారు. అధికరణ 371సీ అక్కడి భూమిని ఇతరులు ఆక్రమించు కోకుండారక్షణ కల్పిస్తున్నది. అయితే... కొండ ప్రాంతాల్లో చట్టబద్దంగా నివసిస్తున్న తమను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నదని కుకీలు ఆరోపిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న అటవీ భూములను ఫారెస్ట్‌గా, తమ గ్రామాలను అక్రమ మైనవిగా ప్రకటిస్తూ తమకు నీడ లేకుండా చేస్తోందని అందోళన చెందుతున్నారు. తమ ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయం చేయకుండా తరిమేస్తే బతికేదెట్లా...? అని ప్రశ్నిస్తున్నారు.
నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకుతినడం బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించడం తప్ప ఏముంది! ఇందు కోసమే మతాల మంటలను, కులాల కుంపట్లను రాజేసి ఓట్లుగా మలుచుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు. శాంతి భద్రతల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు, పార్టీలు ఈ విషయాన్ని ఒక పొలిటికల్ మైలేజీగా చూస్తున్నాయి. మణిపూర్ మంటలు చల్లారాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసి తిరిగి అమలు చేయాలి. ముఖ్యంగా జాతుల వైరాన్ని నివారించడం కోసం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి.
- బి గంగాధర్, ఎడిటర్

No comments:
Post a Comment