అన్నింటా... మహిళకే అవరోధం?
స్వాతంత్య్ర వచ్చి 76 సంవత్సరాలు గడిచిన దేశ జనాభా సగభాగంగా వున్న మహిళలను నేటికి పురుషులతో సమానంగా చూడలేకపోతున్నారు. భారతదేశం పారిశ్రమిక రంగంతోపాటు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటి పడుతున్నది. అయినా దేశంలో అన్ని ప్రాంతాలను, వివిధ వర్గాల ప్రజలను ముఖ్యంగా మహిళలను సమానంగా చూడలేకపోతున్నది. దీనికి కారణం పాలకులా? ప్రభుత్వ యంత్రాంగమా? మనది పితృస్వామ్య సమాజం, అందుకే పురుషులకు అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా తయారు చేయబడ్డాయని చెబుతారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మహిళలు అనేక రంగాల్లో తమ సత్తా చాటుకుంటునే ఉన్నారు. అయినా వారిని బలహీనులుగా చూస్తున్నారు. పురుషుడు చేస్తున్న అన్ని పనులను సైతం మహిళలు సునయాసంగా చేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం, పాలకులకు మాత్రం వారి సేవలు కనిపించడం లేదు. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల తోపాటు రాజకీయంగా దేశ ప్రథమ పౌరురాలు నుండి కింది స్థాయిలో పనిచేసే వరకు అన్ని రంగాల్లో, మహిళలు ఉన్న వివక్ష మాత్రం తప్పడం లేదు. సామాజిక, సేవ రంగాల్లో మహిళల కృషి దేశం ఎన్నటి మార్చిపోలేదు. పారిశ్రామికం గా అనేక మంది మహిళలు రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో అవకాశం దొరికిన ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటున్నది. కానీ అవకాశాలే లేకుండా చేస్తున్న రంగం ఎదైనా ఉందంటే రాజకీయ రంగం మాత్రమే. అన్నింటికీ మహిళనే హస్త్రంగా ఉపయోగిస్తున్నారు. మణిఫూర్‌లో మహిళలను ఊరేగించడం అయా సామాజిక వర్గం ప్రజలను బయటికీ రాకుండా, భయపెట్టడానికే చేశారని బహిరంగంగానే ప్రకటించారు.

No comments:
Post a Comment