దళితశక్తి ఆగష్టు 2017 సంచికను Sc,St officers ఫోరంలో ఆవిష్కరించిన కాకి మాధవరావు, భరత్ భూషణ్, వందన్ కుమార్, డా.బాబు రావు, నాగయ్య I&PR JD, బి.గంగాధర్ ఎడిటర్ దళితశక్తి మాస పత్రిక, తదితరులు
#Dalithashakthi #Magazine #SC #Daliths
Saturday, August 5, 2017
Dalithashakthi August 2017 Released
Tuesday, August 1, 2017
సంపాదకీయం - August 2017 -DSMM
ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గుజరాజ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలు దళితులు, ముస్లింలపై అత్యంత భయంకరంగా, అమానవియంగా, ఐఎస్ఐ టెర్రరిస్టులకు ఏ మాత్రం తీసి పోని విధంగా దాడులు చేస్తూ, హత్యలు గావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్ర కులాలు బూటకపు పరువు పేరు మీద ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు (పెద్దపల్లి మంథని మధుకర్, నిజామాబాద్ జిల్లా అమాద్ర్‌లో రోజా, భువనగిరిలో నరేష్-స్వాతి, వికారాబాద్ జిల్లా తాండూరులో) హత్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే దళితులపై ఉన్న అసూయా ద్వేషంతో దళిత సమాజానికి దిక్సూచి అయిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై తమ ప్రతాపం చూయిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం పెట్టుకోవడమే నేరంగా భావించి అత్యంత అమానుషమైన సాంఘిక బహిష్కరణ గావించారు. 75 సం.రాల స్వతంత్య్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు స్వాతంత్య్ర ఫలాలు అందకపోవడం వలనే ఆర్థికంగా బలహీనపడటమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచుకోలేకపోయారు. వీటికి కారణం ఒక్కసారి విశ్లేషించు కుందాం.
ప్లాటినం ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు మేము ఈ దేశ పౌరులమేనా? ఈ వర్గాలకు చెందిన వ్యక్తి డాక్టర్ అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం ఈ వర్గాలకు అమలు జరుగుతుందా? దేశంలో ఏదోఒక్కచోట కులపరంగా, మతపరంగా, వర్గం పేరుమీద దాడులు, అణచివేత ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పెద్దఎత్తున పెచ్చర్లిటానికికారణం ఏమిటి? దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగం అయినటువంటి భారతీయ జనత పార్టీ దాని మిత్ర పక్షాలు అధికారంలోకి రావటమే కారణమా? దేశవ్యాప్తంగా దళిత వర్గాలన్నింటికి చేయూత నిచ్చి పోరాటానికి సిద్ధంగా ఉండే కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటమే కారణమా? బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానంతో రాజ్యాధికారమే ధ్యేయంగా ఏర్పడిన బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోడమే కారణమా? గతంలో దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగుసార్లు అధికారం చేజిక్కించుకున్న బిఎస్సీ అదే ఉత్తర్ ప్రదేశ్‌లో 17 స్థానాలకు దిగజారటం, లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం, ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల తోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అసెంబ్లీలో బిఎస్పీకి ప్రతినిధ్యం ఉండేది, ఇప్పుడు అది లేకుండా పోవడమే కారణమా? అదే విధంగా పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు అధికారం కోల్పోవటం.... తదితర కారణాలతోనే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ శక్తులు చేలరేగుతున్నాయా?
ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీల నాయకులు గానీ, డాక్టర్ అంబేడ్కర్ భావజాలంతో పని చేస్తున్న ఆయా పార్టీల నాయకులు గానీ జరుగుతున్న పరిణామాల మీద ఆలోచించవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- బి. గంగాధర్, ఎడిటర్, దళితశక్తి మాస పత్రిక
Thursday, July 6, 2017
Dalithashakthi July 2017- DSMM - B.Gangadhar
దళిత రాష్ట్రపతి ఒకవైపు... దాసిన దాగని కులవివక్ష మరోవైపు
శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దూసుకుపోతుంది, దేశం దూసుకుపోతుందని సంక్కలు గుద్దుకుంట్టున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు కులం పేరుతో, మతం పేరుతో, అగ్రకుల దురంహకారులు దళితుల మీద దాడులు, హత్యలు, వెలివేతలు వేధిస్తుంటే వారి కండ్లకు దళితులు కనిపించడం లేదా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా గోమాతపేరుతో మత తత్వవాదులు దాడులు, హత్యలు చేస్తుంటే, కులం పేరుతో దురహంకారులు దళితులను పరువు హత్యలు, బహిష్కరణలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు కనిపించడం లేదు, వీరి ఘోష వినిపించడంలేదు, వీరి గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. మరి స్వాతంత్య్రం వచ్చింది ఎవరికి? దేశం ఎక్కడికి దూసుకుపోతుందో? ఎందులో దూసుకుపోతుందో? వారికే తెలియాలి. ఈ దేశానికి ఒక దిశానిర్ధేశం చేసే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం పెడితే అదిచూసి ఓర్వలేక అగ్రకుల దురంహకారంతో వీర్రవీగుతూ గరగపర్రులో 800 కుటుంబాలబహిష్కరణ చేసి అన్ని విధాలుగా అవమానపరుస్తుంటే ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి.
భారత దేశానికి ప్రథమ పౌరునిగా దళితున్ని చేస్తున్నామని ఒకరంటారు, ఇంకొకరేమో 125 అడుగుల విగ్రహం పెడతాం అంటారు. మరి అంబేడ్కర్ విగ్రహం పెట్టినందుకే దళితులని బహిష్కరణ చేసిన మీ వాళ్ళు కనిపించడం లేదా? మీరు మాట్లాడానికి మీకు కులం అడ్డొస్తుందా? నిన్న మంథని మధుకర్, మొన్న భువనగిరిలో నరేష్ హత్య ఇంకా కనిపించని హత్యలు ఎన్నో, ఇక్కడ గ్రామం గ్రామాన్నే వెలివేస్తే ఇంకా ఎన్నాళ్లు చూస్తూ ఉరుకుంద్దామా? దళితజాతి బతుకులో వెలుగు నింపిన మహనీయుని విగ్రహం పెడితేనే తట్టుకోలేకపోతున్నారు దురంహకారులు, ఇంకా వారి మాయమాటలు చెపితే ఇంకా నమ్ముదామా?
రాష్ట్రపతులు చేయకున్నా పర్వలేదు, కానీ ఆత్మ గౌరవంతో బ్రతకనీయండి చాలు. 125 అడుగుల విగ్రహం పెట్టకున్న పర్వలేదు, కుల దురంహకారంతో వీర్రవిగే వారిని అధికారంలో ఉండనిస్తే గరగపర్రులో దళితులకు జరిగిందే మరోచోట జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు, చట్టాలను, కోర్టులను నమ్ముకుంటే న్యాయం జరగదు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరం ఐక్యంగా అంబేడ్కర్ ఆలోచనలను, విధానాలను ఊరు, వాడ వాడల విస్తృతంగా ప్రచారం నిర్వహించి రాజ్యాధికారాన్ని సాధింద్దాం, అగ్రకుల దురంహకార ఆధిపత్యాన్ని అంతం చేద్దాం.
Wednesday, June 7, 2017
సంపాదకీయం June 2017 - Dalithashakthi Magazine
సంపాదకీయం
మన దేశంలోనూ ఒక్కశాతంగా ఉన్న సంపన్నులు 58శాతం సంపద అనుభవిస్తుంటే,99 శాతం ప్రజల చేతిలో కేవలం 42శాతం సంపదే మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా 99 శాతంప్రజలు ఐక్యమై కండ్లు తెరవాలి. ఈ అసమానతలను, అభివద్ధిని ప్రశ్నించాలి? ఎదిరించాలి? అభివద్ధి అంటే కోట్లాది మంది శ్రమను కొద్ది మందికి దోచి పెట్టడమేనా? అంతరాలను పెంచి పోషించడమేనా..? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై ఈ ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం.
దళిత, గిరిజన, బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయవివక్షకు కారణమైన విద్యాను అభ్యసించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆకాక్షించారు. తన జాతి ప్రజలనుఐక్యంచేసి, సమీకరించాల్సిన అవసరాన్ని, జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ముందుండి పోరాటాన్ని నడిపించాల్సివ అవశ్యకతను వివరించారు. భోధించు, సమీకరించు, పోరాడినప్పుడు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు.
ఈ రోజు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పడిన ''భీమ్ ఆర్మీ'' బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రబోధించిన భోధించు, సమీకరించు, పోరాడు లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నది. రావణ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించిన భీమ్ఆర్మీ ద్వారా విద్యా యొక్క ప్రాముఖ్యతను దళిత, గిరిజన, బలహీనవర్గాలకు వివరించడమే కాకుండా దాదాపు 250 విద్యాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా సామాజిక వర్గాలను చైతన్యం చేస్తున్నారు. విద్యా ద్వారానే తమ జాతి ప్రజలను ఐక్యం చేసి షహరాన్‌పూర్‌లో ఉద్యమ పోరాటాన్నిమొదలుపెట్టారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని దేశ రాజధానిలో వినిపించాడు. ప్రపంచాన్ని ఒక్కసారి భారతదేశంలో దళిత, గిరిజన, బలహీనవర్గాలపైహిందూత్వవాదులు చేస్తున్న దాడులు, అత్యాచారాలు, కులవివక్ష అంటరానితనంపై ఆలోచించే విధంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో 50వేల మందితో కదన సింహాంగాగర్జించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. మనం, మన జాతి ప్రయోజనాల కోసం చెయి చెయి కలిపి ఐక్యంగా పోరాడాల్సిన అవసరాలన్ని నేటి పాలకులే కల్పించినవిషయం మార్చిపోవద్దని దళితశక్తి పాఠకులకు మరోమారు గుర్తు చేస్తున్నది. మాన్యశ్రీ కాన్షీరామ్ రాజకీయ పోరాటపటిమతో రాజ్యాధికారం సాధించే వరకూ... రాజకీయ ఉద్యమాన్ని నిర్మిద్దాం, కదలిరండి, కలసి రండి, కలిసినడుద్దాం, నడిపిద్దాం...
దళితశక్తి మాస పత్రిక ఎడిటోరియల్ బోర్డు
దళితశక్తి మాస పత్రిక ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సలహాదారులు
జె.బి.రాజు, బిఎస్‌వివిఎస్ మూర్తి
గౌరవ సంపాదకులు
డా|| గాలి వినోద్ కుమార్, డా|| జి.వి.రత్నాకర్, డా|| జాడి ముసలయ్య
ఎడిటర్
బి.గంగాధర్
సబ్-ఎడిటర్స్
జి.విఠల్, నీలం పుల్లయ్య, కళింగ లక్ష్మణ్‌రావ్
జిల్లా ప్రతినిధులు
జి.గంగాధర్ నిజామాబాద్, సుంచు గణేష్ - సిద్ధిపేట, అనంతుల శ్రీనివాస్ - భద్రాది కొత్తగూడెం, దాసరి రంగనాథ్ - కృష్ణా, వై.సత్యకుమార్ - రాజమండ్రి, సి.మధుబాబు - తూర్పు గోదావరి, పవన్ రాజ్ కుమార్ - పశ్చిమ గోదావరి, వడ్లూరి కిషోర్ - కరీంనగర్, సిహెచ్ ఓబయ్య - చిత్తూరు, జీడి సదానందర - మంచిర్యాల, జి.రాజు - కామారెడ్డి , లక్ష్మణ్ - ఆదిలాబాద్.
లీగల్ అడ్వయిజర్
సిహెచ్. సాయిలు, అడ్వకేట్
మేనేజర్
బి.స్వాతి
Friday, May 26, 2017
సంపాదకీయం - May 2017 - Dalithashakthi
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో చైతన్యవంతమవుతన్న దళిత, బహుజనులకు మనుధర్మ మరణశాసనం ద్వారా దళిత, బడుగు, బలహీన వర్గాలను మరింత అంధకారంలోకి తీసుకువెళ్ళుతున్నది. రాజ్యం మనుధర్మాన్ని అవలభించడం ద్వారా ప్రగతి పథంలో ప్రయాణించాల్సిన ఆధునిక భారతం ఆగధంలోకి వెళ్ళుతున్నా, పాలకుల పైశాచిక ఆనందం ముందు రాజ్యాంగ విలువలు మంట కలిసిపోతున్నాయి. రాజ్యాంగ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మాట్లడుతూ ''రాజ్యాంగ ఎంత మంచిగా ఉన్న అమలు చేసేవారు బాగా లేకపోతే, అది చేడుగానే కనిపిస్తుందని'' చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
సామాజికార్థిక కారణాలతో విభజితమవుతున్న సమాజాలను మతతత్వానికి లోనుకావడం సులువు. ఒకరి ప్రయోజనాలను ఒకరికి ప్రతికూలమైనవని చెప్పి ద్వేషాలను రెచ్చగొట్టడం కులతత్వ, మతతత్వశక్తులకు సులభమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కారంచేడు, చుండూరువంటి సంఘటనలు తెలంగాణలో లేవని ఘనంగా చెప్పుకునేవారు. కానీ స్వయం పాలిత తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితికి భిన్నంగా లేదని, మంథని మధుకర్ హత్య, ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరువుహత్యలు గ్రామీణ వైరుధ్యాలకు సూచికలు. స్థావరాలు మార్చుకుని అహంకరి స్తున్న భూస్వామ్య విధానానికి గుర్తులుగా మిగిలిపోతున్నాయి. సామాజిక ఉద్యమాల ద్వారానే, అభివద్ధిని కోరే వర్గాల పోరాటాలకు సామాజిక కోణాన్ని జోడించడం ద్వారానే పరిష్కారం అయ్యే జాడ్యాలు ఇవి. ఇటువంటి అమానవీయమైన హత్యలు కడుపులో ఉడుకుతున్న నిప్పును చూడడానికి నిరాకరించినట్టే అవుతుంది.
దళిత, బహుజనులకు సామాజికంగా, ఆర్థికంగా కొన్ని రాయితీలు కల్పించడం ద్వారా సంతృప్తి పొందుతున్నారు. కానీ అంతిమ లక్ష్యం 'రాజ్యాధికారం' చేజిక్కించుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అందుకు ఉద్యమాల నాయకులు చొరవ, ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కార్మికులను ఐక్యం చేసిన మేడే స్ఫూర్తితో సామాజిక శక్తులు ఐక్యమై రాజ్యాధికార సాధకకు ముందుకు కదలని ఆకాంక్షిస్తూ....
Sunday, May 14, 2017
మనుస్మృతికి బలైన మంథని మధుకర్ - Dalithashakthi Monthly Magazine
అదొక మారుమూల గ్రామం, కరీంనగర్ జిల్లాకి కూడా దూరమే, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, ఖానాపూర్ . దళిత యువకుడు మంథని మధుకర్ చేసిన ఒకే ఒక్క నేరం దగ్గరలో ఉన్న వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక మున్నూరుకాపు యువతిని ప్రేమించడం. ఆ యువతీ ఎమ్మెల్యే పుట్ట మధు బంధువు కావడం ఒక మనువాద సంస్కతికి, శిక్షకి చిహ్నంగా మధుకర్ శరీరం అందరిని గాయ పరిచింది. పాపం మధుకర్ ఎన్ని చిత్ర హింసలు పడ్డాడో? ఇక్కడ ఒక చట్టం ఉంటుంది అది ఎప్పటికి దళితుల దరి చేరదు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది దళిత వ్యతిరేకం , ఇక్కడ పోలీసులు ఉంటారు ఎప్పుడు దళితులని చంపడంలో ముందే, ఇక్కడ మీడియా ఉంటుంది అది డబ్బుకి అమ్ముడు పోతుంది, ప్రజల గొంతుక స్థితి ఎన్నడో దాటిపోయింది. మానవ హక్కుల వాదులు కులం అనే సరికి గొంతులో వెలక్కాయ పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ కాస్ట్‌ని బట్టి వద్దామా? వద్దా? అని ఆలోచిస్తారు. ఏమైంది ఇప్పుడు, అమ్మాయి ద్వారా శవం దొరికింది, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు, కొన్ని దళిత సంఘాలు ధర్నాలు చేయడంతో వార్త సామాజిక మాధ్యమంలో వచ్చింది. అదే అందరిని కదిలించింది. వందలాదిగా తరలి వచ్చిన ప్రజలు, మానవ , పౌర హక్కుల కార్యకర్తలు , స్టూడెంట్స్ , లాయర్లు, పార్టీలు , ఒక్కటేమిటి ప్రపంచం అంతా అక్కడ కనిపించింది. కొందరు ప్రగతిశీలురులు, తాము ఉన్న చోటు కదలకుండా ధర్నాలతోని న్యాయం జరగదని రాస్తున్నారు. శిక్షించడమే ఆయుధం అంటున్నారు కానీ యుద్ధ భూమిలో దిగితే కదా లోతు తెలిసేది . కారంచేడులో తుపాకీతో మార్పులు కనిపించిన ఉధతమైన ప్రజా ఉద్యమం దేశ వ్యాప్తంగా కదిలించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చేటట్టు చేసిందని మరవొద్దు. అంటరాని ఉద్యమాలలో ప్రతి ఒక్క చర్య ముఖ్యమే, చిన్న రాత కావొచ్చు, పెద్ద ఎత్తున జన సమీకరణ కావొచ్చు అన్ని బలాన్ని ఇచ్చేవే కానీ బలహీన పరిచేవి కావు. అయినా ప్రభుత్వం అంగాలన్నీ కులవ్యతిరేకం అయినప్పుడు మనం చేసేది ఉదతమైన ఉద్యమమే.
మనుస్మృతికి బలైన మంథని మధుకర్ - Dalithashakthi Monthly Magazine
అదొక మారుమూల గ్రామం, కరీంనగర్ జిల్లాకి కూడా దూరమే, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, ఖానాపూర్ . దళిత యువకుడు మంథని మధుకర్ చేసిన ఒకే ఒక్క నేరం దగ్గరలో ఉన్న వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక మున్నూరుకాపు యువతిని ప్రేమించడం. ఆ యువతీ ఎమ్మెల్యే పుట్ట మధు బంధువు కావడం ఒక మనువాద సంస్కతికి, శిక్షకి చిహ్నంగా మధుకర్ శరీరం అందరిని గాయ పరిచింది. పాపం మధుకర్ ఎన్ని చిత్ర హింసలు పడ్డాడో? ఇక్కడ ఒక చట్టం ఉంటుంది అది ఎప్పటికి దళితుల దరి చేరదు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది దళిత వ్యతిరేకం , ఇక్కడ పోలీసులు ఉంటారు ఎప్పుడు దళితులని చంపడంలో ముందే, ఇక్కడ మీడియా ఉంటుంది అది డబ్బుకి అమ్ముడు పోతుంది, ప్రజల గొంతుక స్థితి ఎన్నడో దాటిపోయింది. మానవ హక్కుల వాదులు కులం అనే సరికి గొంతులో వెలక్కాయ పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ కాస్ట్‌ని బట్టి వద్దామా? వద్దా? అని ఆలోచిస్తారు. ఏమైంది ఇప్పుడు, అమ్మాయి ద్వారా శవం దొరికింది, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు, కొన్ని దళిత సంఘాలు ధర్నాలు చేయడంతో వార్త సామాజిక మాధ్యమంలో వచ్చింది. అదే అందరిని కదిలించింది. వందలాదిగా తరలి వచ్చిన ప్రజలు, మానవ , పౌర హక్కుల కార్యకర్తలు , స్టూడెంట్స్ , లాయర్లు, పార్టీలు , ఒక్కటేమిటి ప్రపంచం అంతా అక్కడ కనిపించింది. కొందరు ప్రగతిశీలురులు, తాము ఉన్న చోటు కదలకుండా ధర్నాలతోని న్యాయం జరగదని రాస్తున్నారు. శిక్షించడమే ఆయుధం అంటున్నారు కానీ యుద్ధ భూమిలో దిగితే కదా లోతు తెలిసేది . కారంచేడులో తుపాకీతో మార్పులు కనిపించిన ఉధతమైన ప్రజా ఉద్యమం దేశ వ్యాప్తంగా కదిలించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చేటట్టు చేసిందని మరవొద్దు. అంటరాని ఉద్యమాలలో ప్రతి ఒక్క చర్య ముఖ్యమే, చిన్న రాత కావొచ్చు, పెద్ద ఎత్తున జన సమీకరణ కావొచ్చు అన్ని బలాన్ని ఇచ్చేవే కానీ బలహీన పరిచేవి కావు. అయినా ప్రభుత్వం అంగాలన్నీ కులవ్యతిరేకం అయినప్పుడు మనం చేసేది ఉదతమైన ఉద్యమమే.
Monday, May 1, 2017
Tuesday, April 25, 2017
దళితశక్తి మాస పత్రిక చందాలు
దళితశక్తి 15వేల మంది దళిత, బహుజనులు చదివే తెలుగు మాసపత్రిక. ఇప్పుడు 5వ సంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలో పరిగెడుతున్న దళితశక్తి మాసపత్రికతో చేయి చేయి కలిపి, కలిసి నడుద్దాం, నడిపిద్దాం. పత్రిక నడపడం ఒక్కరి బాధ్యత కాదు, మనందరి సామాజిక బాధ్యత. ఈ ఉమ్మడి బాధ్యతలు నిర్వహిస్తున్న దళితశక్తి బృందానికి మీ చేయూత, తోడ్పాటు చందాల రూపంలోగానీ, ప్రకటనల రూపంలోగానీ అందించగలరు. దళితశక్తి మాసపత్రిక ప్రతినెలా మీ ఇంటికి చేరేందుకు మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది వివరాలతో మీ చందాలను పంపడమే. బ్యాంకు వివరాలు: Bank A/c No.62238319094, Bank:SBI, Branch: Chikkadapally, IFSC Code. SBIN0020064, Paytm, PayUmoney వాల్లెట్, ఆన్లైన్ చందాలు, ద్వారా మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి.
పేరు :
ఇంటి.నెం.:
వీధి :
గ్రామం & పోస్టు :
మండలం :
జిల్లా:
పిన్ కోడ్:
సెల్ నెంబరు :
ఇంటి నెం.56, SCB 4-23-096,
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన,
పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్: dalithashakthi@ gmail.com
Online payments links
చందాలను పంపించాల్సిన చిరునామా
దళితశక్తి సామాజిక మాసపత్రికఇంటి నెం.56, SCB 4-23-096,
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన,
పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్: dalithashakthi@
Online payments links
దళితశక్తి మాసపత్రిక ₹300.00 లు సంవత్సరం చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/ merchant/billTool/#/ invoicePayment? invoicePriceDetailId= 10DB5ECA063AE636C1057322F1C277 CE
https://www.payumoney.com/
దళితశక్తి మాసపత్రికకు ₹450.00లు 2 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/ merchant/billTool/#/ invoicePayment? invoicePriceDetailId= 66275C809E7EBECBF9D50417FD8E8E CF
https://www.payumoney.com/
దళితశక్తి మాసపత్రిక కు ₹1100.00లు 5 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/ merchant/billTool/#/ invoicePayment? invoicePriceDetailId= C52660FA8805AE492BF8576AC462C6 FE
https://www.payumoney.com/
దళితశక్తి మాసపత్రికకు ₹2000.00లు 10 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/ merchant/billTool/#/ invoicePayment? invoicePriceDetailId= 84FA15D77FAA27D8FB36A050F152EC 44
https://www.payumoney.com/
దళితశక్తి మాసపత్రికకు ₹5000.00లు జీవిత చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/ merchant/billTool/#/ invoicePayment? invoicePriceDetailId= 2E94FE62972DB39374997098E6BD32 81
https://www.payumoney.com/
Subscribe to:
Posts (Atom)
-
దళిత బహుజన మహిళల విముక్తి కోసం... జూపాక సుభద్ర ఈ పేరు వింటేనే దళితధిక్కార స్వరం కంచుకంఠంతో ధ్వనిస్తుంది. తెలంగాణా దళితవాడల విషాద ...






































