DSMM

Monday, February 29, 2016

స్వకుల వివాహాలను నిషేధిద్దాం

 '' నాస్తికత్వాన్ని బోధించినంత మాత్రాన , ప్రజల నమ్మకాలను తాత్వీకరించినంత మాత్రాలన మతం సమసిపోదు. విజ్ఞాన శాస్త్ర విప్లవంతో దాన్ని పూర్తి చేయలేం. సామాజిక విప్లవం ద్వారా మాత్రమే మతం మాయం అవుతుంది'' అంటారు మార్క్స్‌ ( జర్మన్‌ ఐడియాలజీ). అంబేద్కర్‌, అభ్యుదయ, వామపక్ష, హేతు-నాస్తిక వాదులమైన మనం,- మార్క్స్‌ మాటల్ని కులానికి అన్వయింపచేసుకుని, 'రక్త సంబంధం-కర్మ సిద్ధాంతాల కలయిక'గా వర్థిల్లుతూ ఉన్న కులాలన్ని సామాజిక విప్లవంతో కూల్చివేసేందుకు పూనుకుందాం. మనలోని మానవ విలువలకు,శాస్త్రీయ అవగాహనకు, అభ్యుదయ భావనకు, కుల రహిత వర్గ భావజాలానికీ,-' కులాంతర వివాహాన్ని' ఒక పరీక్షగా స్వీకరించి, సామాజిక విప్లవంలో అంతర్భాగంగా కులాంతర వివాహాలను దృఢచిత్తంతో ఆచరిద్దాం. 

వివాహం అంటే, - ఒక తరానికి పునాది, రెండో తరానికి సారధి, మూడు తరాల మధ్య వారధి. అంటే, తరతరాల భవిషత్తును నిర్ణయించే నిర్ణయాధికార శక్తి వివాహానికి ఉన్నదన్న మాట. అంతేకాదు, ' మాయలఫకీర్‌ ప్రాణం రామచిలుకలో దాగి ఉన్నట్టు' కుల వ్యవస్థ ఆయువుపట్టు కూడా స్వకుల వివాహ వ్యవస్థలోనే దాగి ఉంది. మరో మాటలో చెప్పాలంటే వివాహ వ్యవస్థను వెన్నెముకగా చేసుకునే దుర్మార్గమైన కుల వ్యవస్థ మన దేశంలో మూడు వేల సంవత్సరాలుగా నిటారుగా నిలువగలిగి ఉంది.'' వివాహ వ్యవస్థేలేని, అనేక మంది స్త్రీలు- అనేక మంది పురుషులతో కలిసి జీవించిన, ఒక స్త్రీ అనేక మంది పురుషులతో- ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో కలసి జీవించిన '' ఆదిమ సమాజాలలో కుల వ్యవస్థ ఊసే లేదు. అంతే కాదు, ఆ సమాజాలలో ' అదనపు విలువ ' ఉనికే లేదు. అదనపు విలువ సమాజంలో ఉనికిలోకి వచ్చినప్పటినుంచీ ' దంపతీ వివాహ వ్యవస్థ ' ప్రారంభమయ్యింది. అదనపు విలువను దోచుకునేందుకోసం హిందూ బ్రాహ్మణీయ దోపిడీ వర్గం దంపతీ వివాహ వ్యవస్థను స్వకుల వివాహ వ్యవస్థగా ఘణీభవింపచేసింది. ఇలా ఘణీభవించిన స్వకుల వివాహ వ్యవస్థ అదనపు విలువను దోపిడీ వర్గాలకు దోచిపెట్టడంలో నాటి నుంచి నేటి వరకూ కీలక భూమిక పోషిస్తూ ఉంది.అదనుపు విలువకు- దోపిడికి, దోపిడికి- అదనపు విలువకు అవినాభవ సంబంధం ఉంది. అదనపు విలువ లేకుంటే దోపిడి చేయాల్సిన అవసరమే లేదు. దోపిడి చేయకుంటే అదనపు విలువ కొందరి బొక్కసాలలో పోగుపడే ఆస్కారమే లేదు. దోపిడి చేసేవాళ్లు అతి తక్కువుగా, దోపిడికి గురయ్యేవాళ్లు అత్యధికంగా ఉంటారు కాబట్టి, అత్యధికంగా ఉన్న పీడితులను అదుపు చేసేందుకు అతి బలమైన , అత్యంత క్రూరమైన ఆయుధం పీడకులకు అవసరమయ్యింది. ఇలా దోపిడి దారుల చేతిలో అతిబలమైన, అత్యంత క్రూరమైన ఆయుధంగా ఊపిరిపోసుకున్నదే కులవ్యవస్థ.కులమంటే కుచితం, కులమంటే అజ్ఞానం, కులమంటే అహంకారం, కులమంటే అనైఖ్యత, ఒక్కమాటలో చెప్పాలంటే కులమంటే మెజారిటీ ప్రజలైన పీడిత ప్రజల ఎడల తేనె పూసిన కత్తి. అల్పసంఖ్యాకులైన పీడకుల చేతిలో చురకత్తి. మరి, ఇంతగా తమ జీవితాలను విశ్ఛిన్నం చేసే కులాన్ని సమాజంలోని మెజారిటీ ప్రజలచేత అంగీకరింప చేసి, ఆచరింప చేయడం అసాధ్యం కదా..! ఇదిగో,- ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఒక మహత్తర సాధనంగా హిందూ మత దోపిడి వర్గం ప్రవేశ పెట్టిందే ' స్వకుల వివాహ వ్యవస్థ'.'' కూటి పొత్తు- నీటి పొత్తు, గుడి పొత్తు- బడి పొత్తు, మడి (భూమి) పొత్తు- మంచం పొత్తు '' ల మేలికలయికగా! స్వకుల వివాహ వ్యవస్థను మొత్తం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీర్చిద్దాయి హిందుత్వ దోపిడీ శక్తులు. తాగే నీరు-తినేతిండి, చదివే చదవుకు - మొక్కే దేవుడు, పండించే భూమి- ' పండే' మంచాలను కేవలం కులాధారితం చేసి, కులాన్ని వివాహంతో ముడివేసేశాయి. పెళ్లి పొత్తును సుస్థిరం చేసేందు మిగిలిన అన్ని పొత్తులనూ సృష్టించాయి. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్తి పెళ్లి పొత్తుకు సిద్ధం కావాలంటే మిగిలిన అన్ని పొత్తులకూ సిద్ధం కావాలి. ఒక వేళ మిగిలిన అన్ని పొత్తులకూ సిద్ధమైనా, పెళ్లి పొత్తుకు సిద్ధం కాకపోతే కుల వ్యవస్థకు వచ్చిన నష్టమేమీ లేదు. కావునే, '' కుల నిర్మూలనకు సరైన పద్దతి వర్ణాంతర వివాహాలేనని నా దృఢ విశ్వాసం. రక్త సమ్మిశ్రణ ఒక్కటే మానవులలో అన్యోన్య అనుబంధాన్ని , బాంధవ్యాన్నీ కలిగిస్తుంది. అట్టి బంధు భావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను , వివక్షను రూపుమాపలేం. వివిధ కులాల మధ్య స్నేహ సంబంధాలను కలిగించాంటే , ఆయా కులాల వ్యక్తుల నడుమ రక్త సంబంధాలను కల్పించక తప్పదు ''అని డాక్టర్‌ అంబేద్కర్‌ వంద సంవత్సరాల క్రితమే నొక్కి చెప్పారు. అయినా, ఇటు అంబేద్కర్‌ వాదులుగాని, అటు అభ్యుదయ- వామపక్షీయులుగానీ ఇప్పటికీ కులాంతర వివాహాల విషయంలో విఫలమవుతూనే ఉన్నారు . ఇందుకు కారణం,- హిందూ మత కర్మ సిద్ధాంతం గత 3 వేల సంవత్సరాలనుంచి మన రక్తంలో, మెదడులో ఎక్కించిన స్వకుల వివాహ భావజాలం నుంచి బయటపడలేక పోవడం.అవును! '' కులాంతర వివాహాలకు మరణ శిక్ష'' విధించాలని మనుధర్మ శాస్త్రం ( 1:64) స్పష్టంగా చెప్పింది. '' సహ బంతి భోజనం, వర్ణాంతర వివాహం నిషిద్ధం. వీటిని ఏమాత్రం అనుమతించినా కుల వ్యవస్థకే ముప్పు ( 1:16)'' అని అగ్రకులాను హెచ్ఛరించింది. అలాగే, '' కుల క్షయము వలన సనాతనములైన కులధర్మమములన్నియును నశించును. ధర్మము అంతరించిపోయినపుడు కులమునందు అంతటనూ పాపమే వ్యాపించును. కావున, స్వ (కుల) ధర్మం ఎంత నికృష్టమైనదైనా దాన్ని పాటించాలి. పరధర్మం ఎంత ఉన్నతమైనదైనా దాన్ని త్రోసిరాజాలి'' అని తన భగవగ్ధీత (40వ అధ్యాయం)లోశ్రీకృష్ణ పరమాత్ములవారు ఉద్భోదించారు. '' పరమాత్మ యొక్క స్థాయిలోనే సమానత్వం కుదురుతుంది. కాని భౌతిక స్థాయిలో అదే పరమాత్మ ఆశ్ఛర్యకరమైన వైవిద్యంతోను, అసమానతలతోనూ లోకంలో వ్యక్త మవుతాడు'' అని కాషాయ దళాల ఆదిగురువు గోల్వాల్కర్‌ ( బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌) స్పష్టం చేశారు. నాటి మనువు - కృష్ణపరమాత్మల నుంచి, నేటి గోల్వాల్కర్‌, వారి శిష్యపరమాణువుల వరకూ మన మెదళ్లకు ఎక్కించిన కర్మ సిద్ధాంతం నుంచి మనమింకా బయటపడలేకపోతున్నాం.గోల్వాల్కర్‌ అన్నట్టు '' మనిషిని కేవలం భౌతిక వాంఛల ప్రోపుగా పరిగణించడం అంటే అతన్ని జంతువులతో సమానంగా చేయడమే అవుతుంది'' అని చెబుతూ, శ్రమ జీవుల భౌతిక వాంఛలనన్నిటినీ దోపిడి శక్తులకు అంకితం చేయమంటుంది కర్మ సిద్ధాంతం.దోపిడీ శక్తుల భౌతిక వాంఛలకు మాత్రం పూర్తి భరోసా ఇచ్చి, ఆ శక్తులను నిజమైన జంతు బలగంగా నిలబెడుతుంది.భౌతిక వాంఛలలో ప్రధానమైనది వివాహం. ఆ వివాహాన్ని ఇష్టపూర్వకంగా చేసుకోవడాన్ని జంతు లక్షణంతో పోల్చి, తన ఆజ్ఞల పరిధిలో ( కుల పరిధిలో) చేసుకోవటాన్ని ఉన్నతమైనదిగా, భద్రమైనదిగా, రాబోయే జన్మల సుఖమయ జీవితాలకు(?!) విలువైన పెట్టుబడిగా చిత్రీరిస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మినంతవరకూ ఏ మనిషీ కులాంతర వివాహాలకు సిద్ధపడలేడు.కావునే, '' కులాంతర వివాహాలు జాతి ప్రయోజనాలకే ఉపయోగపడుతాయని'' దేశ అత్యున్నత న్యాస్ధానం ( 7 జూలై 2006) ఘోషిస్తున్నా, '' స్వకుల వివాహాల వలన డిఎన్‌ఏ మూలాలు అలాగే కొనసాగుతూ కొన్ని వ్యాధులు తరతరాలుగా సంక్రమిస్తునే ఉంటాయని, కులాంతర వివాహాల వల్ల జన్యు సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడుతాయని '' శాస్త్రీయ పరిశోధనల ద్వారా ( సీసీఎంబీ- కేంబ్రిడ్జ్‌, బోస్టన్‌ యూనివర్శిటీల సంయుక్త పరిశోధన (2009) వెల్లడవుతున్నా , మనం జబ్బుకు బలయ్యేందుకే సిద్ధమవుతున్నాం కానీ, కుల జబ్బును వదిలించుకునేందుకు మాత్రం పూనుకోవడం లేదు.స్వకుల వివాహాల ద్వారా అనారోగ్యం సంభవిస్తుంది- కులాంతర వివాహాల ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది, స్వకుల వివాహాల ద్వారా మూఢత్వం మరింతగా మనలో మూర్తీభవిస్తుంది- కులాంతర వివహాల ద్వారా జ్ఞానం వెల్లివిరుస్తుంది, స్వకుల వివాహాల ద్వారా అసమానత్వం శాస్వతమవుతుంది- కులాంతర వివాహాల ద్వారా సమానత్వం సాధ్యమవుతుంది తెలిసినా అందుకు సిద్ధపడలేక పోతున్నాం.సరికదా, ' స్వకుల వివాహాల ద్వారా స్వకుల పరువు నిలబడుతుంది- కులాంతర వివాహాల ద్వారా పరువు పోతుంది, స్వకుల వివాహాల ద్వారా పరలోక సుఖం లభిస్తుంది- కులాంతర వివాహాల ద్వారా పరలోక నరకం ప్రాప్తిసుంది' అన్న కర్మ సిద్ధాంతంలో మరింతగా కూరుకుపోతున్నాం.కులాంతర వివాహాలను వ్యభిచారం, తాగుడు లాంటి సమాజంలో పరువు తక్కువ వ్యహారాల సరసన చేర్చి మనల్ని భయకంపితులను చేస్తున్న హిందుత్వ భావజాలానికి బందీలైపోయి, మరణానంతర స్వర్గ సుఖాల మాయలో పడి కులాంతర వివాహాలు చేసుకున్న మన రక్త సబంధీకులనే వెలివేస్తున్నాం. బలి చేస్తున్నాం.నిజానికి ఇప్పుడు జరగాల్సింది సరిగ్గా ఇందుకు వ్యతిరేక కార్యాచరణ. అవును! స్వకుల వివాహాన్ని ఒక చెడు అలవాటుగా, అనారోగ్య కారిణిగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి, స్వర్గం నరకం లాంటి కర్మ సిద్ధాంతాల బూటకాన్ని ఎత్తి చూపి, యువతను పెద్ద ఎత్తున కులాంతర వివాహాలకు సిద్ధం చేయడం. ఈ పని ' హిందువులంతా బంధువులం- గంగ, సంధు బిందువులం' అని బూటకపు నినాదమిచ్చే హిందుత్వ శక్తులు ఎన్నటికీ చేయలేవు. అసలు,- కులం, కులాన్ని నిలబెట్టే స్వకుల వివాహ వ్యవస్థే హిందుత్వానికి ఊపిరి. కావున, మనం కులాంత వివాహాలకు సిద్ధపడిన మరుక్షణం హిందుత్వ శక్తులు ఊపిరాడక గిలగిలలాడటం ఖాయం. ఇలా చేయడం ద్వారా మాత్రమే హిందుత్వ దోపిడీ శక్తుల కుట్రలను ధీటుగా ఎదుర్కొగలం. కులాంతర వివాహాల కారణంగా రక్త సంబంధీకుల మధ్యే జరుగుతన్న తీవ్ర హింసాకాండను నిరోధించి, కుల - వర్గ పీడిత ప్రజానీకాన్ని కులాంతర వివాహాల మీదుగా, కుల -వర్గ రహిత సమాజంలోకి నడిపించగలం.'' నాస్తికత్వాన్ని బోధించినంత మాత్రాన , ప్రజల నమ్మకాలను తాత్వీకరించినంత మాత్రాలన మతం సమసిపోదు. విజ్ఞాన శాస్త్ర విప్లవంతో దాన్ని పూర్తి చేయలేం. సామాజిక విప్లవం ద్వారా మాత్రమే మతం మాయం అవుతుంది'' అంటారు మార్క్స్‌ ( జర్మన్‌ ఐడియాలజీ). అంబేద్కర్‌, అభ్యుదయ, వామపక్ష, హేతు-నాస్తిక వాదులమైన మనం,- మార్క్స్‌ మాటల్ని కులానికి అన్వయింపచేసుకుని, 'రక్త సంబంధం-కర్మ సిద్ధాంతాల కలయిక'గా వర్థిల్లుతూ ఉన్న కులాలన్ని సామాజిక విప్లవంతో కూల్చివేసేందుకు పూనుకుందాం. మనలోని మానవ విలువలకు,శాస్త్రీయ అవగాహనకు, అభ్యుదయ భావనకు, కుల రహిత వర్గ భావజాలానికీ,-' కులాంతర వివాహాన్ని' ఒక పరీక్షగా స్వీకరించి, సామాజిక విప్లవంలో అంతర్భాగంగా కులాంతర వివాహాలను దృఢచిత్తంతో ఆచరిద్దాం.- రచయిత - ఎంబీసీ సిద్ధాంతవేత్తసెల్‌ : 8333997714-కోప్ర
at February 29, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, February 20, 2016

క‌న్న‌య్య పై దేశ‌ద్రోహం కేసు

క‌న్న‌య్య పై దేశ‌ద్రోహం కేసు ఉప‌సంహ‌ర‌ణ‌ !

CbBJv3UVAAAkH1r
Home department rethinking on JNU issue..

ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేస్తోంది. జేఎన్‌యూ వివాదంలో ఒత్తిడికి త‌లొగ్గుతోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించి నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రిమాండ్ లో విద్యార్థి సంఘం నేత క‌న్న‌య్య కుమార్ పై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జేఎన్యూలో నినాదాలిచ్చార‌న్న కార‌ణంతో యూనివ‌ర్సిటీ అధ్య‌క్షుడిపై దేశ‌ద్రోహం నేరం మోపారు. కేసుల్లో ఇరికించి ప్ర‌స్తుతం తీహార్ జైల్ కి పంపించారు. దానిపై తీవ్ర దుమారం రేగింది. ఆ త‌ర్వాత ప‌టియాల కోర్ట్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లు కూడా ప్ర‌భుత్వాన్ని బోనులో నిల‌బెట్టాయి. వివిధ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేశారు. మీడియాపై కూడా దాడి జ‌ర‌గ‌డంతో ప్ర‌జాస్వామ్య‌మే ప్ర‌మాదంలో ప‌డింద‌న్న వాద‌న వినిపించింది. సేవ్ జేన్యూ ఉద్య‌మం ఊపందుకుంది.
చివ‌ర‌కు ఏబీవీపీ నేత‌లు కూడా రాజీనామాలు సంధించారు. దాంతో క‌న్న‌య్య‌పై మోపిన ఆ కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు లభించలేదన్న కార‌ణంతో కేసు ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ వర్గాలు ప్రాధ‌మికంగా మీడియాకు తెలిపాయి. పోలీసుల దగ్గర ఉన్న వీడియో క్లిప్పుల్లో ఆడియో సరిగా వినిపించడం లేదు. పార్ల మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఓ వైపు స‌ర‌యిన ఆధారాలు లేక‌పోవ‌డంతో పాటు మ‌రోవైపు సుప్రీం కోర్ట్ తీర్పులు కూడా నినాదాలు దేశ‌ద్రోహం కింద‌కు రావ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌భుత్వ నిర్ణ‌యం మార్చుకోక‌త‌ప్ప‌డం లేదని స‌మాచారం.
మ‌రోవైపు కన్నయ్యకు ఎలాంటి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మాత్రం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బస్సీ చెబుతున్నారు. జేఎన్‌యూలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో కొందరు జాతి వ్యతిరేక నినాదాలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మొన్న 9వ తేదీన జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ వివాదం మొద‌ల‌య్యింది. ఆత‌ర్వాత స్మృతి ఇరానీ, రాజ్ నాధ్ సింగ్ కూడా ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌డంతో ప‌లు మ‌లుపులు తిరిగింది.
హాఫీజ్ ట్వీట్ అంటూ హోంమంత్రి నిరాధారంగా మాట్లాడ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. మొత్తంగా ఈ ప‌రిణామాల మ‌ధ్య దేశ‌ద్రోహం కేసు ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇత‌ర నేరాల‌తో క‌న్న‌య్య కేసు కొన‌సాగుతుంద‌ని హోం శాఖ వ‌ర్గాల స‌మాచారం.

at February 20, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

రోహిత్ మృతిపై నివేదిక‌

రోహిత్ మృతిపై నివేదిక‌లో 9 అంశాలు

CbjKqLZUYAEEXjV
Report on HCU student Rohith Vemula..
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన రోహిత్ వేమ‌లు కేసులో నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ నివేదిక స‌మ‌ర్పించింది. కేంధ్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ నియ‌మించి క‌మిటీ నివేదిక‌లో కీల‌కాంశాలున్న‌ట్టు స‌మాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక తాజా క‌థ‌నం ప్ర‌కారం హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీ పెద్ద‌లే రోహిత్ మృతికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అంతేగాకుండా ఐదుగురు ద‌ళిత విద్యార్థుల స‌స్ఫెన్ష‌న్ విష‌యంలో క్యాంప‌స్ మేనేజ్ మెంట్ తీరు స‌క్ర‌మంగా లేద‌ని స్ప‌ష్ట‌మ‌య్యింది.
జ‌న‌వ‌రి 17నాడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న రోహిత్ వేముల విష‌యంలో క‌మిటీ రిపోర్ట్ స‌మ‌ర్పించింది. దాని ప్ర‌కారం హెచ్సీయూలో ద‌ళితుల ప‌ట్ల వివ‌క్షపూరితంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకు ఆధారంగా ఐదు అంశాల‌ను క‌మిటీ పేర్కొంది.

1. స‌స్ఫెన్ష‌న్ కి ముందు విచార‌ణ తీరు అస‌మ‌గ్రం

యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ రిపోర్ట్, ప్రోటోకాల్ బోర్డ్ విచార‌ణ వంటి అనేక విష‌యాల్లో యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం నిర్లిప్తంగా వ్య‌వ‌హ‌రించింద‌ని క‌మిటీ పేర్కొంది. అనేక లొసుగులు ఆ రిపోర్టుల్లో ఉన్నాయ‌ని తెలిపింది. ఏబీవీపీ నాయ‌కుడిపై దాడి జ‌రిగిన ఆధారాలు మెడిక‌ల్ రిపోర్టులో లేవ‌ని స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు భావిస్తోంది.

2 హెచ్చార్డీ తీరు

హెచ్చార్డీ లేఖ‌ల‌తో చ‌ర్య‌లను వేగ‌వంతం చేయాల్సి వ‌చ్చింద‌ని వీసీ అప్పారావు క‌మిటీ ముందు వెల్ల‌డించిన‌ట్టు నివేద‌కిలో ఉంది. విద్యార్థుల‌పై చ‌ర్య‌ల విష‌యంలో వ‌చ్చిన లేఖ‌ల‌తో క్యాంప‌స్ యాజ‌మాన్యం స్పందించింన‌ట్టు వెల్ల‌డించింది.

3. విద్యార్థులు, యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం సంబంధాలు

ఆందోళ‌న సాగిస్తున్న విద్యార్థుల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం కాక‌పోవ‌డాన్ని నిజ‌నిర్థార‌ణ క‌మిటీ త‌ప్పుబ‌ట్టింది. డీన్స్, సీనియ‌ర్ ఫ్యాకల్లీ అభిప్రాయం కూడా అందుకు త‌గ్గ‌ట్టుగా ఉంద‌ని నివేదిక‌లో పేర్కొంది. రోహిత్ ఆత్మ‌హ‌త్య వ‌ర‌కూ వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డంలో విఫ‌మ‌యిన‌ట్టు తెలిపింది.

4. అట్ట‌డుగువ‌ర్గాల‌పై వివ‌క్ష‌త‌

యూనివ‌ర్సిటీలో కొన్ని వ‌ర్గాల ప‌ట్ల వివ‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నట్టు అభిప్రాయ ప‌డింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గతుల‌కు విద్యార్థుల‌కు త‌గిన న్యాయం జ‌రుగుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని తెలిపింది.

5. యాజ‌మాన్యం వైప‌ల్యం

చాలాకాలంగా సాగుతున్న వివ‌క్ష‌పై స్పందించ‌డంలో హెచ్సీయూ యాజ‌మాన్యం స్పందించ‌లేద‌ని ఈ క‌మిటీ అభిప్రాయప‌డింది. ఆ సంద‌ర్భంగా ఒక ఎంపీ లేఖ‌ను క‌మిటీ ప్ర‌స్తావించింది. ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దాల్సిన అవ‌స‌రాన్ని చెప్పింది. 2008 నుంచి 2014 వ‌ర‌కూ జ‌రిగిన ద‌ళిత విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ముగ్గురు స‌భ్యుల క‌మిటీ ఆవ‌శ్యాన్ని వివ‌రించింది.
ఇన్నాళ్లుగా విద్యార్థి సంఘాలు, ప్ర‌తిప‌క్ష నేత‌లు చెబుతున్న వ్యాఖ్య‌ల‌తో దాదాపు నిజ‌నిర్థార‌ణ క‌మిటీ అంగీక‌రించ‌డంతో ప్ర‌భుత్వ గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ‌ప‌డ్డ‌ట్ట‌వుతోంది. దాంతో ఇప్పుడు ఈ క‌మిటీ రిపోర్ట్ ను ర‌హ‌స్యంగా ఉంచుతున్న‌ట్టు ఆ క‌థ‌నంలో పేర్కొంది. అస‌లే జేఎన్యూలో దేశ‌ద్రోహ వ్య‌వ‌హారంలో త‌ల‌బొప్పి క‌ట్టే ప‌రిస్థితి రావ‌డంతో ఇప్పుడు రోహిత్ ఆత్మ‌హ‌త్యా ఘ‌ట‌న‌పై నివేదిక‌ను కొంత కాలం తాత్సార్యం చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు చెబుతోంది.
రోహిత్ మృతిపై నివేదిక‌లో ఆస‌క్తిక‌ర అంశాలు
at February 20, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, February 15, 2016

దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణ

దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్ లో 

 జస్టిస్ చంద్రకుమార్, గాలి వినోద్ కుమార్. జె.బి.రాజు, కె.ఆనంద్ రావు, బి.గంగాధర్, బత్తుల రాంప్రసాద్ ,HCU విద్యార్ధి JAC కన్వీనర్ వెంకటేష్ చౌహాన్.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లో 

పెంటపాడు ఎంపిపి వెంకటెశ్వర్లు, ఎంఆర్‌ఓ మధుసూధన్‌రావు, దళిత నాయకులు లక్ష్మణరావు, సతీష్‌ కుమార్‌,తదితరులు 

విజయవాడలో 

బహుజన రచయితల వేదిక అధ్వర్యంలో రోహిత్ స్మారక సాహిత్య సదస్సులో దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణ


at February 15, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Sunday, February 14, 2016

దళితశక్తి మాస పత్రిక

దళితశక్తి మాస పత్రికను తాడేపల్లి గూడెంలో పెంటపాడు ఎంపిపి వెంకటెశ్వర్లు, ఎంఆర్‌ఓ మధుసూధన్‌రావు, దళిత నాయకులు లక్ష్మణరావు, సతీష్‌ కుమార్‌,తదితరులు ఆవిష్కరించారు.



at February 14, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, February 8, 2016

దళితశక్తి ఫిబ్రవరి 2016 మాస పత్రిక

విషయ సూచిక

  •  రోహిత్‌ ఆత్మహత్య లేఖ ... 2
  • వెలివాడ ఎందుకు వెలిసింది...? ... 3
  • కులోన్మాదానికి రోహిత్‌'బలి' ... 6
  • రోహిత్‌ మృతికి కారకులను శిక్షించారా? ... 9
  • విద్యార్థుల ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు ... 10
  • గుండె బరువెక్కుతోంది... ... 19
  • దుష్ప్రచారాలు మానండి ... 20
  • చావు కూడా సమరమే ... 22
  • మిత్రులెవరు? శత్రువులెవరు? ... 24
  • సంఘం చెక్కిన మరణం ... 27
  • వివక్షకు దర్పణం ... 29 
  • యే వెలివాల్లో వెతకాలి నిన్ను? ... 32
at February 08, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

'దళితశక్తి' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ




at February 08, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

'దళితశక్తి' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ఆ ఇద్దరిలో ఎవరు స్పందించినా... రోహిత్‌ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు

 'దళితశక్తి' ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో జస్టిస్‌ చంద్రకుమార్‌


'సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య చేసుకోకముందు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో స్వయంగా మాట్లాడాను. విద్యార్థులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. సమస్య పరిష్కరించే విధంగా చూడాలని కోరాను. అదే విధంగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు మూడు సార్లు ఫోన్‌ చేశాను. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితి వివరించాను. ఏబీవీపీ విద్యార్థులతో మాట్లాడి, యూనివర్సిటీకి పంపిస్తానని రాంచందర్‌రావు చెప్పారు. కానీ పంపించలేదు. ఇద్దరూ పట్టించుకోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు స్పందించినా రోహిత్‌ ఆత్మహత్య చేసుకునే వాడు కాదు' అని జస్టిస్‌ చంద్రకుమార్‌ చెప్పారు. దళితశక్తి మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం చంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రోహిత్‌కు ఎదురైన సమస్యలు ఆనాడు అంబేద్కర్‌కూ ఎదురయ్యాయని గుర్తు చేశారు. ప్రకృతికి కులం లేదు, కడుపు మంటకి, కన్నీళ్లకు లేని కులం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్రవాదులుగా మారుతున్నారనే ముద్ర వేయడం కాదు, ఆ పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయనే మూలాలను వెతకాలన్నారు. మతం పేరుతో మసీదులు, మందిరాలు కూలగొట్టి, పునర్నిర్మాణం చేయాలనుకునేవారు టెర్రరిస్టులు, గుజరాత్‌లో మారణహోం సృష్టించిన వారు, స్మగ్లర్లు, కల్తీ చేసేవారు, రాజకీయ అధికారం దుర్వినియోగం చేసేవారు టెర్రరిస్టులన్నారు. స్వాతంత్రం వచ్చిన 68 సంవత్సరాల తర్వాత కూడా కులం సర్టిఫికేట్‌ పొందడానికి రూ.3వేల రూపాయలు ఇచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. రోహిత్‌ ఆత్మహత్యకు పేదరికం కూడా ఒక కారణమే. రోహిత్‌ తండ్రి ఒక రాజకీయ నేతనో, బడా కాంట్రాక్టరో, ఐఏఎస్‌ అధికారి అయితే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు.రోహిత్‌ మరణం సమాజం కళ్లు తెరిపించాలని కోరారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

రాజకీయ నిర్ణయంతోనే సమస్యలు పరిష్కారం: ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌

రాజకీయ నిర్ణయంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు కులవివక్ష ఒక్కటే కారణం కాదన్నారు. రాజకీయ వివక్ష కూడా తోడైందని చెప్పారు. ఏబీవీపీ అధ్యక్షులు సుశీల్‌కుమార్‌, ప్రధాన బాధ్యుడైన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును, కనీసం వీసీని కూడా తొలగించలేదంటే రాజకీయ నిర్ణయం జరగలేదనేది స్పష్టమవుతోందన్నారు. రాజకీయ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉందో తెలియందికాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దళితులు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. రాహుల్‌ గాంధీ యూనివర్సిటీకి రావడం ఆహ్వానించడమే అయినా కార్యాచరణ ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. కుల నిర్మూలన చట్టం తీసుకొచ్చినప్పుడే న్యాయం చేకూరుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం వల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదన్నారు. 2లక్షల కేసులు నమోదైతే, 20 మందికి కూడా శిక్ష పడ లేదన్నారు. రోహిత్‌ దళితుడు కాకుండా ఒక వెలమ, కమ్మ కులానికి చెందిన వాడైతే ఇదే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. 
దళిత నేత జేబీ రాజు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను రాజకీయ శక్తిగా మార్చుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఒక ఆవేదన, ఆవేశం, భాద, దు:ఖం ఉన్నా ఆ దిశగా ఆచరణలో అమలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో దళితశక్తి సంపాదకులు బి. గంగాధర్‌, హెచ్‌సీయు నేత వెంకటేశ్‌చౌహాన్‌, టీపీఎస్‌కే కన్వీనర్‌ కె. రాములు, మాల సంక్షేమ సంఘం నేత రాంప్రసాద్‌, ఎస్సీ,ఎస్టీ జాతీయ నేత ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

at February 08, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Sunday, February 7, 2016

దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణ




దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణలో జస్టిస్ చంద్రకుమార్, గాలి వినోద్ కుమార్. జె.బి.రాజు, కె.ఆనంద్ రావు, బి.గంగాధర్, బత్తుల రాంప్రసాద్ ,HCU విద్యార్ధి JAC కన్వీనర్ వెంకటేష్ చౌహాన్, తదితరులు. 
at February 07, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, February 5, 2016

''వెలివాడ''(దళితశక్తి) ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ఆహ్వానం


''వెలివాడ''(దళితశక్తి) ప్రత్యేక సంచిక ఆవిష్కరణ


తేది: 07.02.2016, 11 గంటలు, స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌

ముఖ్యఅథితి:

జస్టిస్‌ చంద్రకుమార్‌ గారు,హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డు),

ప్రత్యేక అథితులు: 

డా|| గాలి వినోద్‌కుమార్‌ గారు, దళితశక్తి గౌరవ సంపాదకులు,

శ్రీమతి వేములరాధిక గారు, రోహిత్‌ తల్లి

జి.రాములు గారు, కన్వీనర్‌, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం,

శ్రీ వెంకటేశ్‌ చౌహాన్‌ గారు, హెచ్‌సీయూ విద్యార్థి జెఏసి కన్వీనర్‌

శ్రీ బి.గంగాధర్‌ గారు, సంపాదకులు, దళితశక్తి, మాసపత్రిక


at February 05, 2016 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Comments (Atom)

Dalithashakthi - 2025 - Magazines

 

  • ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం - Cover story
    ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం జాన్‌వెస్లీ సిపియం రాష్ట్రకార్యదర్శి తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త శక్తిని అందిస్తూ, జాన్‌వెస్లీ స...
  • దళిత శక్తి మాసపత్రిక క్యాలండర్ విడుదల
  • Home

Blog Archive

  • ►  2025 (8)
    • ►  September (1)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  January (4)
  • ►  2024 (22)
    • ►  December (2)
    • ►  October (6)
    • ►  September (2)
    • ►  July (1)
    • ►  June (3)
    • ►  May (1)
    • ►  April (3)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2023 (35)
    • ►  December (3)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (1)
    • ►  August (3)
    • ►  July (3)
    • ►  June (4)
    • ►  May (8)
    • ►  April (6)
  • ►  2021 (1)
    • ►  May (1)
  • ►  2018 (11)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  April (3)
  • ►  2017 (27)
    • ►  November (3)
    • ►  October (3)
    • ►  September (2)
    • ►  August (3)
    • ►  July (2)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2016 (31)
    • ►  October (2)
    • ►  August (4)
    • ►  June (3)
    • ►  May (3)
    • ►  April (3)
    • ►  March (4)
    • ▼  February (10)
      • స్వకుల వివాహాలను నిషేధిద్దాం
      • క‌న్న‌య్య పై దేశ‌ద్రోహం కేసు
      • రోహిత్ మృతిపై నివేదిక‌
      • దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణ
      • దళితశక్తి మాస పత్రిక
      • దళితశక్తి ఫిబ్రవరి 2016 మాస పత్రిక
      • 'దళితశక్తి' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
      • 'దళితశక్తి' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
      • దళితశక్తి "వెలివాడ" ప్రత్యెక సంచిక ఆవిష్కరణ
      • ''వెలివాడ''(దళితశక్తి) ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
    • ►  January (2)

Labels

  • 125 అడుగుల విగ్రహావిష్కరణ (1)
  • ఆధునిక భారత నిర్మాత ''డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ '' (1)
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంటే ఏమిటీ? (1)
  • ఎస్సీ (1)
  • కథ (1)
  • కుబేరుల రాజ్యంలో... కూటికిలేనివారే ఎక్కువ? (1)
  • చందా దారులుగా చేరండి (1)
  • దేశంలో నెంబర్‌-1 లీకుల కమిషన్‌? (1)
  • నిరంతర స్ఫూర్తి ప్రధాత (1)
  • నిరుద్యోగుల ఘోష ఆలకించేదేవరు? (1)
  • బాబాసాహెబ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ సాంఘిక విప్లవం (1)
  • మీ సహకారానికి మా కృతజ్ఞతలు (1)
  • రచనలకు ఆహ్వానం (1)
  • విజ్ఞప్తి (1)
  • సామాజిక హింసపై చట్టమేదీ? (1)

Address

దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక

ఇంటినెం. 78/A, మొదటి అంతస్తు, పికెట్‌, సికింద్రాబాద్‌-500026.

ఆంధ్రప్రదేశ్‌

దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక డోర్‌ నెం.:7-91/1, వసంత నగర్‌, తాడిగడప, విజయవాడ-520007.

Mobile No. +91 94401 54273, dalithashakthi@gmail.com, dalithashakthi.blogspot.com

About Me

Dalithashakthi Manthly Magazine
దళితశక్తి మానపత్రిక తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ, అభిమానం సంపాదించుకుని అత్యధిక సర్క్యులేషన్‌ కలిగి ఉన్నది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాంల ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నిరంతరం కషి చేస్తున్నది. ఇప్పటి వరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఎందుకంటే ఆర్ధిక వనరులు లేక ఆ పత్రికలు నిలబడలేకపోయాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రింట్‌ మీడియా రంగంలో ఉన్నటువంటి పత్రికలకు మీ వంతు సహాయ, సహకారాన్ని చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. మన పత్రికలను మన వారే ప్రోత్సహించకపోతే ఇతరులెవరూ కొంటారు? ఇతరులెవరూ ప్రోత్సహిస్తారు? మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని దళితశక్తి మాసపత్రిక విజ్ఞప్తి చేస్తున్నది.
View my complete profile

Facebook Badge

Dalitha Shakthi

Create Your Badge

Contact Details

Name

Email *

Message *

చిరునామా దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక ఇంటినెం. 78/A, మొదటి అంతస్తు, పికెట్‌, సికింద్రాబాద్‌-500026. Mobile No. 9440154273. . Simple theme. Powered by Blogger.