Saturday, February 20, 2016

క‌న్న‌య్య పై దేశ‌ద్రోహం కేసు

క‌న్న‌య్య పై దేశ‌ద్రోహం కేసు ఉప‌సంహ‌ర‌ణ‌ !

CbBJv3UVAAAkH1r
Home department rethinking on JNU issue..

ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేస్తోంది. జేఎన్‌యూ వివాదంలో ఒత్తిడికి త‌లొగ్గుతోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించి నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రిమాండ్ లో విద్యార్థి సంఘం నేత క‌న్న‌య్య కుమార్ పై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జేఎన్యూలో నినాదాలిచ్చార‌న్న కార‌ణంతో యూనివ‌ర్సిటీ అధ్య‌క్షుడిపై దేశ‌ద్రోహం నేరం మోపారు. కేసుల్లో ఇరికించి ప్ర‌స్తుతం తీహార్ జైల్ కి పంపించారు. దానిపై తీవ్ర దుమారం రేగింది. ఆ త‌ర్వాత ప‌టియాల కోర్ట్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లు కూడా ప్ర‌భుత్వాన్ని బోనులో నిల‌బెట్టాయి. వివిధ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేశారు. మీడియాపై కూడా దాడి జ‌ర‌గ‌డంతో ప్ర‌జాస్వామ్య‌మే ప్ర‌మాదంలో ప‌డింద‌న్న వాద‌న వినిపించింది. సేవ్ జేన్యూ ఉద్య‌మం ఊపందుకుంది.
చివ‌ర‌కు ఏబీవీపీ నేత‌లు కూడా రాజీనామాలు సంధించారు. దాంతో క‌న్న‌య్య‌పై మోపిన ఆ కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు లభించలేదన్న కార‌ణంతో కేసు ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ వర్గాలు ప్రాధ‌మికంగా మీడియాకు తెలిపాయి. పోలీసుల దగ్గర ఉన్న వీడియో క్లిప్పుల్లో ఆడియో సరిగా వినిపించడం లేదు. పార్ల మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఓ వైపు స‌ర‌యిన ఆధారాలు లేక‌పోవ‌డంతో పాటు మ‌రోవైపు సుప్రీం కోర్ట్ తీర్పులు కూడా నినాదాలు దేశ‌ద్రోహం కింద‌కు రావ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌భుత్వ నిర్ణ‌యం మార్చుకోక‌త‌ప్ప‌డం లేదని స‌మాచారం.
మ‌రోవైపు కన్నయ్యకు ఎలాంటి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మాత్రం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బస్సీ చెబుతున్నారు. జేఎన్‌యూలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో కొందరు జాతి వ్యతిరేక నినాదాలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మొన్న 9వ తేదీన జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ వివాదం మొద‌ల‌య్యింది. ఆత‌ర్వాత స్మృతి ఇరానీ, రాజ్ నాధ్ సింగ్ కూడా ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌డంతో ప‌లు మ‌లుపులు తిరిగింది.
హాఫీజ్ ట్వీట్ అంటూ హోంమంత్రి నిరాధారంగా మాట్లాడ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. మొత్తంగా ఈ ప‌రిణామాల మ‌ధ్య దేశ‌ద్రోహం కేసు ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇత‌ర నేరాల‌తో క‌న్న‌య్య కేసు కొన‌సాగుతుంద‌ని హోం శాఖ వ‌ర్గాల స‌మాచారం.

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines