రోహిత్ మృతిపై నివేదికలో 9 అంశాలు
Report on HCU student Rohith Vemula..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రోహిత్ వేమలు కేసులో నిజనిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది. కేంధ్ర మానవవనరుల శాఖ నియమించి కమిటీ నివేదికలో కీలకాంశాలున్నట్టు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తాజా కథనం ప్రకారం హైదరాబాద్ యూనివర్సిటీ పెద్దలే రోహిత్ మృతికి కారణమని తెలుస్తోంది. అంతేగాకుండా ఐదుగురు దళిత విద్యార్థుల సస్ఫెన్షన్ విషయంలో క్యాంపస్ మేనేజ్ మెంట్ తీరు సక్రమంగా లేదని స్పష్టమయ్యింది.
జనవరి 17నాడు ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల విషయంలో కమిటీ రిపోర్ట్ సమర్పించింది. దాని ప్రకారం హెచ్సీయూలో దళితుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. అందుకు ఆధారంగా ఐదు అంశాలను కమిటీ పేర్కొంది.
1. సస్ఫెన్షన్ కి ముందు విచారణ తీరు అసమగ్రం
యూనివర్సిటీ మెడికల్ ఆఫీసర్ రిపోర్ట్, ప్రోటోకాల్ బోర్డ్ విచారణ వంటి అనేక విషయాల్లో యూనివర్సిటీ యాజమాన్యం నిర్లిప్తంగా వ్యవహరించిందని కమిటీ పేర్కొంది. అనేక లొసుగులు ఆ రిపోర్టుల్లో ఉన్నాయని తెలిపింది. ఏబీవీపీ నాయకుడిపై దాడి జరిగిన ఆధారాలు మెడికల్ రిపోర్టులో లేవని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించినట్టు భావిస్తోంది.
2 హెచ్చార్డీ తీరు
హెచ్చార్డీ లేఖలతో చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందని వీసీ అప్పారావు కమిటీ ముందు వెల్లడించినట్టు నివేదకిలో ఉంది. విద్యార్థులపై చర్యల విషయంలో వచ్చిన లేఖలతో క్యాంపస్ యాజమాన్యం స్పందించింనట్టు వెల్లడించింది.
3. విద్యార్థులు, యూనివర్సిటీ యాజమాన్యం సంబంధాలు
ఆందోళన సాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు సిద్ధం కాకపోవడాన్ని నిజనిర్థారణ కమిటీ తప్పుబట్టింది. డీన్స్, సీనియర్ ఫ్యాకల్లీ అభిప్రాయం కూడా అందుకు తగ్గట్టుగా ఉందని నివేదికలో పేర్కొంది. రోహిత్ ఆత్మహత్య వరకూ వెళ్లకుండా అడ్డుకోవడంలో విఫమయినట్టు తెలిపింది.
4. అట్టడుగువర్గాలపై వివక్షత
యూనివర్సిటీలో కొన్ని వర్గాల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టు అభిప్రాయ పడింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతున్నట్టు కనిపించడం లేదని తెలిపింది.
5. యాజమాన్యం వైపల్యం
చాలాకాలంగా సాగుతున్న వివక్షపై స్పందించడంలో హెచ్సీయూ యాజమాన్యం స్పందించలేదని ఈ కమిటీ అభిప్రాయపడింది. ఆ సందర్భంగా ఒక ఎంపీ లేఖను కమిటీ ప్రస్తావించింది. పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరాన్ని చెప్పింది. 2008 నుంచి 2014 వరకూ జరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ ఆవశ్యాన్ని వివరించింది.
ఇన్నాళ్లుగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నేతలు చెబుతున్న వ్యాఖ్యలతో దాదాపు నిజనిర్థారణ కమిటీ అంగీకరించడంతో ప్రభుత్వ గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టవుతోంది. దాంతో ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్ ను రహస్యంగా ఉంచుతున్నట్టు ఆ కథనంలో పేర్కొంది. అసలే జేఎన్యూలో దేశద్రోహ వ్యవహారంలో తలబొప్పి కట్టే పరిస్థితి రావడంతో ఇప్పుడు రోహిత్ ఆత్మహత్యా ఘటనపై నివేదికను కొంత కాలం తాత్సార్యం చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతోంది.
No comments:
Post a Comment