'' నాస్తికత్వాన్ని బోధించినంత మాత్రాన , ప్రజల నమ్మకాలను తాత్వీకరించినంత మాత్రాలన మతం సమసిపోదు. విజ్ఞాన శాస్త్ర విప్లవంతో దాన్ని పూర్తి చేయలేం. సామాజిక విప్లవం ద్వారా మాత్రమే మతం మాయం అవుతుంది'' అంటారు మార్క్స్ ( జర్మన్ ఐడియాలజీ). అంబేద్కర్, అభ్యుదయ, వామపక్ష, హేతు-నాస్తిక వాదులమైన మనం,- మార్క్స్ మాటల్ని కులానికి అన్వయింపచేసుకుని, 'రక్త సంబంధం-కర్మ సిద్ధాంతాల కలయిక'గా వర్థిల్లుతూ ఉన్న కులాలన్ని సామాజిక విప్లవంతో కూల్చివేసేందుకు పూనుకుందాం. మనలోని మానవ విలువలకు,శాస్త్రీయ అవగాహనకు, అభ్యుదయ భావనకు, కుల రహిత వర్గ భావజాలానికీ,-' కులాంతర వివాహాన్ని' ఒక పరీక్షగా స్వీకరించి, సామాజిక విప్లవంలో అంతర్భాగంగా కులాంతర వివాహాలను దృఢచిత్తంతో ఆచరిద్దాం.
వివాహం అంటే, - ఒక తరానికి పునాది, రెండో తరానికి సారధి, మూడు తరాల మధ్య వారధి. అంటే, తరతరాల భవిషత్తును నిర్ణయించే నిర్ణయాధికార శక్తి వివాహానికి ఉన్నదన్న మాట. అంతేకాదు, ' మాయలఫకీర్ ప్రాణం రామచిలుకలో దాగి ఉన్నట్టు' కుల వ్యవస్థ ఆయువుపట్టు కూడా స్వకుల వివాహ వ్యవస్థలోనే దాగి ఉంది. మరో మాటలో చెప్పాలంటే వివాహ వ్యవస్థను వెన్నెముకగా చేసుకునే దుర్మార్గమైన కుల వ్యవస్థ మన దేశంలో మూడు వేల సంవత్సరాలుగా నిటారుగా నిలువగలిగి ఉంది.'' వివాహ వ్యవస్థేలేని, అనేక మంది స్త్రీలు- అనేక మంది పురుషులతో కలిసి జీవించిన, ఒక స్త్రీ అనేక మంది పురుషులతో- ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో కలసి జీవించిన '' ఆదిమ సమాజాలలో కుల వ్యవస్థ ఊసే లేదు. అంతే కాదు, ఆ సమాజాలలో ' అదనపు విలువ ' ఉనికే లేదు. అదనపు విలువ సమాజంలో ఉనికిలోకి వచ్చినప్పటినుంచీ ' దంపతీ వివాహ వ్యవస్థ ' ప్రారంభమయ్యింది. అదనపు విలువను దోచుకునేందుకోసం హిందూ బ్రాహ్మణీయ దోపిడీ వర్గం దంపతీ వివాహ వ్యవస్థను స్వకుల వివాహ వ్యవస్థగా ఘణీభవింపచేసింది. ఇలా ఘణీభవించిన స్వకుల వివాహ వ్యవస్థ అదనపు విలువను దోపిడీ వర్గాలకు దోచిపెట్టడంలో నాటి నుంచి నేటి వరకూ కీలక భూమిక పోషిస్తూ ఉంది.అదనుపు విలువకు- దోపిడికి, దోపిడికి- అదనపు విలువకు అవినాభవ సంబంధం ఉంది. అదనపు విలువ లేకుంటే దోపిడి చేయాల్సిన అవసరమే లేదు. దోపిడి చేయకుంటే అదనపు విలువ కొందరి బొక్కసాలలో పోగుపడే ఆస్కారమే లేదు. దోపిడి చేసేవాళ్లు అతి తక్కువుగా, దోపిడికి గురయ్యేవాళ్లు అత్యధికంగా ఉంటారు కాబట్టి, అత్యధికంగా ఉన్న పీడితులను అదుపు చేసేందుకు అతి బలమైన , అత్యంత క్రూరమైన ఆయుధం పీడకులకు అవసరమయ్యింది. ఇలా దోపిడి దారుల చేతిలో అతిబలమైన, అత్యంత క్రూరమైన ఆయుధంగా ఊపిరిపోసుకున్నదే కులవ్యవస్థ.కులమంటే కుచితం, కులమంటే అజ్ఞానం, కులమంటే అహంకారం, కులమంటే అనైఖ్యత, ఒక్కమాటలో చెప్పాలంటే కులమంటే మెజారిటీ ప్రజలైన పీడిత ప్రజల ఎడల తేనె పూసిన కత్తి. అల్పసంఖ్యాకులైన పీడకుల చేతిలో చురకత్తి. మరి, ఇంతగా తమ జీవితాలను విశ్ఛిన్నం చేసే కులాన్ని సమాజంలోని మెజారిటీ ప్రజలచేత అంగీకరింప చేసి, ఆచరింప చేయడం అసాధ్యం కదా..! ఇదిగో,- ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఒక మహత్తర సాధనంగా హిందూ మత దోపిడి వర్గం ప్రవేశ పెట్టిందే ' స్వకుల వివాహ వ్యవస్థ'.'' కూటి పొత్తు- నీటి పొత్తు, గుడి పొత్తు- బడి పొత్తు, మడి (భూమి) పొత్తు- మంచం పొత్తు '' ల మేలికలయికగా! స్వకుల వివాహ వ్యవస్థను మొత్తం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీర్చిద్దాయి హిందుత్వ దోపిడీ శక్తులు. తాగే నీరు-తినేతిండి, చదివే చదవుకు - మొక్కే దేవుడు, పండించే భూమి- ' పండే' మంచాలను కేవలం కులాధారితం చేసి, కులాన్ని వివాహంతో ముడివేసేశాయి. పెళ్లి పొత్తును సుస్థిరం చేసేందు మిగిలిన అన్ని పొత్తులనూ సృష్టించాయి. హిందూ మతానికి చెందిన ఒక వ్యక్తి పెళ్లి పొత్తుకు సిద్ధం కావాలంటే మిగిలిన అన్ని పొత్తులకూ సిద్ధం కావాలి. ఒక వేళ మిగిలిన అన్ని పొత్తులకూ సిద్ధమైనా, పెళ్లి పొత్తుకు సిద్ధం కాకపోతే కుల వ్యవస్థకు వచ్చిన నష్టమేమీ లేదు. కావునే, '' కుల నిర్మూలనకు సరైన పద్దతి వర్ణాంతర వివాహాలేనని నా దృఢ విశ్వాసం. రక్త సమ్మిశ్రణ ఒక్కటే మానవులలో అన్యోన్య అనుబంధాన్ని , బాంధవ్యాన్నీ కలిగిస్తుంది. అట్టి బంధు భావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను , వివక్షను రూపుమాపలేం. వివిధ కులాల మధ్య స్నేహ సంబంధాలను కలిగించాంటే , ఆయా కులాల వ్యక్తుల నడుమ రక్త సంబంధాలను కల్పించక తప్పదు ''అని డాక్టర్ అంబేద్కర్ వంద సంవత్సరాల క్రితమే నొక్కి చెప్పారు. అయినా, ఇటు అంబేద్కర్ వాదులుగాని, అటు అభ్యుదయ- వామపక్షీయులుగానీ ఇప్పటికీ కులాంతర వివాహాల విషయంలో విఫలమవుతూనే ఉన్నారు . ఇందుకు కారణం,- హిందూ మత కర్మ సిద్ధాంతం గత 3 వేల సంవత్సరాలనుంచి మన రక్తంలో, మెదడులో ఎక్కించిన స్వకుల వివాహ భావజాలం నుంచి బయటపడలేక పోవడం.అవును! '' కులాంతర వివాహాలకు మరణ శిక్ష'' విధించాలని మనుధర్మ శాస్త్రం ( 1:64) స్పష్టంగా చెప్పింది. '' సహ బంతి భోజనం, వర్ణాంతర వివాహం నిషిద్ధం. వీటిని ఏమాత్రం అనుమతించినా కుల వ్యవస్థకే ముప్పు ( 1:16)'' అని అగ్రకులాను హెచ్ఛరించింది. అలాగే, '' కుల క్షయము వలన సనాతనములైన కులధర్మమములన్నియును నశించును. ధర్మము అంతరించిపోయినపుడు కులమునందు అంతటనూ పాపమే వ్యాపించును. కావున, స్వ (కుల) ధర్మం ఎంత నికృష్టమైనదైనా దాన్ని పాటించాలి. పరధర్మం ఎంత ఉన్నతమైనదైనా దాన్ని త్రోసిరాజాలి'' అని తన భగవగ్ధీత (40వ అధ్యాయం)లోశ్రీకృష్ణ పరమాత్ములవారు ఉద్భోదించారు. '' పరమాత్మ యొక్క స్థాయిలోనే సమానత్వం కుదురుతుంది. కాని భౌతిక స్థాయిలో అదే పరమాత్మ ఆశ్ఛర్యకరమైన వైవిద్యంతోను, అసమానతలతోనూ లోకంలో వ్యక్త మవుతాడు'' అని కాషాయ దళాల ఆదిగురువు గోల్వాల్కర్ ( బంచ్ ఆఫ్ థాట్స్) స్పష్టం చేశారు. నాటి మనువు - కృష్ణపరమాత్మల నుంచి, నేటి గోల్వాల్కర్, వారి శిష్యపరమాణువుల వరకూ మన మెదళ్లకు ఎక్కించిన కర్మ సిద్ధాంతం నుంచి మనమింకా బయటపడలేకపోతున్నాం.గోల్వాల్కర్ అన్నట్టు '' మనిషిని కేవలం భౌతిక వాంఛల ప్రోపుగా పరిగణించడం అంటే అతన్ని జంతువులతో సమానంగా చేయడమే అవుతుంది'' అని చెబుతూ, శ్రమ జీవుల భౌతిక వాంఛలనన్నిటినీ దోపిడి శక్తులకు అంకితం చేయమంటుంది కర్మ సిద్ధాంతం.దోపిడీ శక్తుల భౌతిక వాంఛలకు మాత్రం పూర్తి భరోసా ఇచ్చి, ఆ శక్తులను నిజమైన జంతు బలగంగా నిలబెడుతుంది.భౌతిక వాంఛలలో ప్రధానమైనది వివాహం. ఆ వివాహాన్ని ఇష్టపూర్వకంగా చేసుకోవడాన్ని జంతు లక్షణంతో పోల్చి, తన ఆజ్ఞల పరిధిలో ( కుల పరిధిలో) చేసుకోవటాన్ని ఉన్నతమైనదిగా, భద్రమైనదిగా, రాబోయే జన్మల సుఖమయ జీవితాలకు(?!) విలువైన పెట్టుబడిగా చిత్రీరిస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మినంతవరకూ ఏ మనిషీ కులాంతర వివాహాలకు సిద్ధపడలేడు.కావునే, '' కులాంతర వివాహాలు జాతి ప్రయోజనాలకే ఉపయోగపడుతాయని'' దేశ అత్యున్నత న్యాస్ధానం ( 7 జూలై 2006) ఘోషిస్తున్నా, '' స్వకుల వివాహాల వలన డిఎన్‌ఏ మూలాలు అలాగే కొనసాగుతూ కొన్ని వ్యాధులు తరతరాలుగా సంక్రమిస్తునే ఉంటాయని, కులాంతర వివాహాల వల్ల జన్యు సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడుతాయని '' శాస్త్రీయ పరిశోధనల ద్వారా ( సీసీఎంబీ- కేంబ్రిడ్జ్, బోస్టన్ యూనివర్శిటీల సంయుక్త పరిశోధన (2009) వెల్లడవుతున్నా , మనం జబ్బుకు బలయ్యేందుకే సిద్ధమవుతున్నాం కానీ, కుల జబ్బును వదిలించుకునేందుకు మాత్రం పూనుకోవడం లేదు.స్వకుల వివాహాల ద్వారా అనారోగ్యం సంభవిస్తుంది- కులాంతర వివాహాల ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది, స్వకుల వివాహాల ద్వారా మూఢత్వం మరింతగా మనలో మూర్తీభవిస్తుంది- కులాంతర వివహాల ద్వారా జ్ఞానం వెల్లివిరుస్తుంది, స్వకుల వివాహాల ద్వారా అసమానత్వం శాస్వతమవుతుంది- కులాంతర వివాహాల ద్వారా సమానత్వం సాధ్యమవుతుంది తెలిసినా అందుకు సిద్ధపడలేక పోతున్నాం.సరికదా, ' స్వకుల వివాహాల ద్వారా స్వకుల పరువు నిలబడుతుంది- కులాంతర వివాహాల ద్వారా పరువు పోతుంది, స్వకుల వివాహాల ద్వారా పరలోక సుఖం లభిస్తుంది- కులాంతర వివాహాల ద్వారా పరలోక నరకం ప్రాప్తిసుంది' అన్న కర్మ సిద్ధాంతంలో మరింతగా కూరుకుపోతున్నాం.కులాంతర వివాహాలను వ్యభిచారం, తాగుడు లాంటి సమాజంలో పరువు తక్కువ వ్యహారాల సరసన చేర్చి మనల్ని భయకంపితులను చేస్తున్న హిందుత్వ భావజాలానికి బందీలైపోయి, మరణానంతర స్వర్గ సుఖాల మాయలో పడి కులాంతర వివాహాలు చేసుకున్న మన రక్త సబంధీకులనే వెలివేస్తున్నాం. బలి చేస్తున్నాం.నిజానికి ఇప్పుడు జరగాల్సింది సరిగ్గా ఇందుకు వ్యతిరేక కార్యాచరణ. అవును! స్వకుల వివాహాన్ని ఒక చెడు అలవాటుగా, అనారోగ్య కారిణిగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి, స్వర్గం నరకం లాంటి కర్మ సిద్ధాంతాల బూటకాన్ని ఎత్తి చూపి, యువతను పెద్ద ఎత్తున కులాంతర వివాహాలకు సిద్ధం చేయడం. ఈ పని ' హిందువులంతా బంధువులం- గంగ, సంధు బిందువులం' అని బూటకపు నినాదమిచ్చే హిందుత్వ శక్తులు ఎన్నటికీ చేయలేవు. అసలు,- కులం, కులాన్ని నిలబెట్టే స్వకుల వివాహ వ్యవస్థే హిందుత్వానికి ఊపిరి. కావున, మనం కులాంత వివాహాలకు సిద్ధపడిన మరుక్షణం హిందుత్వ శక్తులు ఊపిరాడక గిలగిలలాడటం ఖాయం. ఇలా చేయడం ద్వారా మాత్రమే హిందుత్వ దోపిడీ శక్తుల కుట్రలను ధీటుగా ఎదుర్కొగలం. కులాంతర వివాహాల కారణంగా రక్త సంబంధీకుల మధ్యే జరుగుతన్న తీవ్ర హింసాకాండను నిరోధించి, కుల - వర్గ పీడిత ప్రజానీకాన్ని కులాంతర వివాహాల మీదుగా, కుల -వర్గ రహిత సమాజంలోకి నడిపించగలం.'' నాస్తికత్వాన్ని బోధించినంత మాత్రాన , ప్రజల నమ్మకాలను తాత్వీకరించినంత మాత్రాలన మతం సమసిపోదు. విజ్ఞాన శాస్త్ర విప్లవంతో దాన్ని పూర్తి చేయలేం. సామాజిక విప్లవం ద్వారా మాత్రమే మతం మాయం అవుతుంది'' అంటారు మార్క్స్ ( జర్మన్ ఐడియాలజీ). అంబేద్కర్, అభ్యుదయ, వామపక్ష, హేతు-నాస్తిక వాదులమైన మనం,- మార్క్స్ మాటల్ని కులానికి అన్వయింపచేసుకుని, 'రక్త సంబంధం-కర్మ సిద్ధాంతాల కలయిక'గా వర్థిల్లుతూ ఉన్న కులాలన్ని సామాజిక విప్లవంతో కూల్చివేసేందుకు పూనుకుందాం. మనలోని మానవ విలువలకు,శాస్త్రీయ అవగాహనకు, అభ్యుదయ భావనకు, కుల రహిత వర్గ భావజాలానికీ,-' కులాంతర వివాహాన్ని' ఒక పరీక్షగా స్వీకరించి, సామాజిక విప్లవంలో అంతర్భాగంగా కులాంతర వివాహాలను దృఢచిత్తంతో ఆచరిద్దాం.- రచయిత - ఎంబీసీ సిద్ధాంతవేత్తసెల్ : 8333997714-కోప్ర

No comments:
Post a Comment