ఆ ఇద్దరిలో ఎవరు స్పందించినా... రోహిత్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు
'దళితశక్తి' ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో జస్టిస్ చంద్రకుమార్
'సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోకముందు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో స్వయంగా మాట్లాడాను. విద్యార్థులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. సమస్య పరిష్కరించే విధంగా చూడాలని కోరాను. అదే విధంగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు మూడు సార్లు ఫోన్ చేశాను. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితి వివరించాను. ఏబీవీపీ విద్యార్థులతో మాట్లాడి, యూనివర్సిటీకి పంపిస్తానని రాంచందర్‌రావు చెప్పారు. కానీ పంపించలేదు. ఇద్దరూ పట్టించుకోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు స్పందించినా రోహిత్ ఆత్మహత్య చేసుకునే వాడు కాదు' అని జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. దళితశక్తి మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రోహిత్‌కు ఎదురైన సమస్యలు ఆనాడు అంబేద్కర్‌కూ ఎదురయ్యాయని గుర్తు చేశారు. ప్రకృతికి కులం లేదు, కడుపు మంటకి, కన్నీళ్లకు లేని కులం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్రవాదులుగా మారుతున్నారనే ముద్ర వేయడం కాదు, ఆ పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయనే మూలాలను వెతకాలన్నారు. మతం పేరుతో మసీదులు, మందిరాలు కూలగొట్టి, పునర్నిర్మాణం చేయాలనుకునేవారు టెర్రరిస్టులు, గుజరాత్‌లో మారణహోం సృష్టించిన వారు, స్మగ్లర్లు, కల్తీ చేసేవారు, రాజకీయ అధికారం దుర్వినియోగం చేసేవారు టెర్రరిస్టులన్నారు. స్వాతంత్రం వచ్చిన 68 సంవత్సరాల తర్వాత కూడా కులం సర్టిఫికేట్ పొందడానికి రూ.3వేల రూపాయలు ఇచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. రోహిత్ ఆత్మహత్యకు పేదరికం కూడా ఒక కారణమే. రోహిత్ తండ్రి ఒక రాజకీయ నేతనో, బడా కాంట్రాక్టరో, ఐఏఎస్ అధికారి అయితే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు.రోహిత్ మరణం సమాజం కళ్లు తెరిపించాలని కోరారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రాజకీయ నిర్ణయంతోనే సమస్యలు పరిష్కారం: ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్
రాజకీయ నిర్ణయంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కులవివక్ష ఒక్కటే కారణం కాదన్నారు. రాజకీయ వివక్ష కూడా తోడైందని చెప్పారు. ఏబీవీపీ అధ్యక్షులు సుశీల్‌కుమార్, ప్రధాన బాధ్యుడైన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును, కనీసం వీసీని కూడా తొలగించలేదంటే రాజకీయ నిర్ణయం జరగలేదనేది స్పష్టమవుతోందన్నారు. రాజకీయ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉందో తెలియందికాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దళితులు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ యూనివర్సిటీకి రావడం ఆహ్వానించడమే అయినా కార్యాచరణ ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. కుల నిర్మూలన చట్టం తీసుకొచ్చినప్పుడే న్యాయం చేకూరుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం వల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదన్నారు. 2లక్షల కేసులు నమోదైతే, 20 మందికి కూడా శిక్ష పడ లేదన్నారు. రోహిత్ దళితుడు కాకుండా ఒక వెలమ, కమ్మ కులానికి చెందిన వాడైతే ఇదే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు.
దళిత నేత జేబీ రాజు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను రాజకీయ శక్తిగా మార్చుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఒక ఆవేదన, ఆవేశం, భాద, దు:ఖం ఉన్నా ఆ దిశగా ఆచరణలో అమలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో దళితశక్తి సంపాదకులు బి. గంగాధర్, హెచ్‌సీయు నేత వెంకటేశ్‌చౌహాన్, టీపీఎస్‌కే కన్వీనర్ కె. రాములు, మాల సంక్షేమ సంఘం నేత రాంప్రసాద్, ఎస్సీ,ఎస్టీ జాతీయ నేత ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment