ఆధునిక భారత నిర్మాత,
బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్
125 అడుగుల విగ్రహావిష్కరణ
125 అంబేడ్కర్ అడుగుల విగ్రహావిష్కరణ ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏఫ్రిల్ 14, 2023న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ సమీపంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని అంబేడ్కర్ జయంతి రోజునే ఆవిష్కరించారు. విగ్రహా విష్కరణకు ముందు బౌద్ధమత గురువులు ప్రార్థనలు చేశారు. హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కిందనే 50 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేడ్కర్ స్మారక భవనాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ప్రారంభించారు. ఆ భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, అందులోని థియేటర్‌లో ప్రభుత్వ విభాగాలు అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ప్రకాశ్ అంబేడ్కర్, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు తిలకించారు. దీన్ని సభకు వచ్చిన వారందరికీ లైవ్లో చూపించారు. సభావేదికపై ప్రకాశ్ అంబేడ్కర్‌ను సత్కరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు బుద్ధుని ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా 'దళితబంధు పధకం విజయగాధలు' సీడీని ప్రకాశ్ ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. హిందువులు ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని అంబేడ్కర్ 1938లోనే చెప్పారని ప్రకాశ్ అంబేడ్కర్ ప్రస్తావించారు. అందుకు అనుగుణం గానే దేశ విభజన జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే ఒకసారి మతం ఆధారంగా దేశ విభజన జరిగినందున ఇక మళ్లీ హిందూ రాష్ట్రం డిమాండ్ లేవనెత్తడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే దేశంలో కులం, మతం రాజకీయాలు ప్రారంభమవుతాయో, అప్పుడు దేశంలో జాతీయ నాయకుడు అనే వారే ఉండరని అప్పట్లోనే అంబేడ్కర్ చెప్పారన్నారు. అభివద్ధిలో తెలంగాణ దేశానికే కొత్త మార్గం చూపించిందని ప్రకాశ్ అంబేడ్కర్ ప్రశంసించారు. కుల మతాల రాజకీయాలకు దూరంగా ఉంటామని అందరం శపధం చేయాలని ప్రకాశ్ అంబేడ్కర్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్న కలలను నిజం చేయాలని ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, రెండో రాజధాని కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపు నిచ్చారు. దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని అంబేడ్కర్ బలంగా కోరేవారన్నారు.
70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా నేటికీ అంబేడ్కర్ ఆలోచనలు దేశ ప్రజల ముందుకు పూర్తిగా రాలేదని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. బాబాసాహెబ్ ఆలోచనలు కేవలం దళితులు, బలహీన వర్గాలకు పరిమితం కాలేదని, దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని ఆయన కలలు కన్నారని చెప్పారు. దుర దష్టవశాత్తు నేడు దేశంలో మతం ఆధారంగా మైనార్జీలను పరిగణి స్తున్నారని, సామాజిక వెనకబాటు ఆధారంగా ఉన్న మైనార్జీలను గుర్తించి చేయూత అందించాలని సూచించారు. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పారు. భాషా ప్రయుక్త సాధ్యమవు తుందని రాష్ట్రాలకు అప్పట్లో కేంద్రంతోపాటు, అంబేడ్కర్ కూడా వ్యతిరేకమని, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయనంత వరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ప్రకాశ్ అంబేడ్కర్ గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు మరణం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు కాంగ్రెస్ పార్టీ పుణ్యదానం చేసిందని అంబేడ్కర్ అన్నారని ప్రస్తావించారు. అంబేడ్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, ఆర్థికంగా మనగలగడం, భౌగోళిక అంశాల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పే వారని అన్నారు. సంక్షేమం, అభివద్ధి చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని అంబేడ్కర్ పదేపదే చెప్పేవారని, ఇప్పుడు అది నిజమవు తోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం దేశంలో వెనకబడిన వర్గాలకు ఒక ఆశాదీపంలా కనిపిస్తోందని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని ఏటా అందరూ నిర్వహిస్తారని, హైదరాబాద్ కార్యక్రమం వాటన్నింటికన్నా భిన్నమైనదని చెప్పారు. సమాజంలో మార్పు కోసం సంఘర్తించాలని అంబేడ్కర్ చెప్పేవారని, నేటి యుగం వాస్తవికతను గ్రహించి మానవత్వాన్ని పెంచేందుకు సంఘరించాలని పిలుపు నిచ్చారు. రూపాయితో బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ఆడుకుందో, దేశాన్ని ఎలా దోచుకుందో 1923లోనే ప్రాబ్లం ఆఫ్ రూపీ అనే పుస్తకంలో అంబేడ్కర్ వివరించారని ప్రకాశ్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఈ దోపిడీ ఇప్పటికీ కొనసాగుతోందని, ప్రస్తుత కాలాన్ని బట్టి ఈ సమస్యను 'దియరీ ఆఫ్ లూట్' పేర్కొనవచ్చని చెప్పారు. దియరీ ఆఫ్ లూట్‌ను అడుకునే ప్రయత్నం చేస్తోందని ప్రశంసించారు. దేశంలో ఉత్పత్తిదారు, విక్రయదారు స్థానాలను ధనిక పారిశ్రామికవేత్తలు ఆక్రమించారని, పేదలు, బలహీన వర్గాలవారు కొనుగోలుదారులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దళిత బంధు పథకంతో చేస్తున్న కషిని అభినందించారు. దళితబందు పధకంలో అందించే రూ.10 లక్షలు ఏడాది తర్వాత కూడా అంతే విలువ కలిగి ఉండాలని, రూపాయి విలువ నిలకడగా లేనపుడు పేదరిక నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని ప్రకాశ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment