జెండర్ - కులం ఆధారంగా
హక్కుల నిరాకరణ సమానత్వం- న్యాయం
ఒక వ్యక్తి యొక్క లింగం, కులం వ్యక్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పొందడంలో పెద్దగా ప్రభావం చూపుతుంది. జెండర్ ఆధారంగా ఉన్న వివక్ష, పురుషుడి-మహిళా మధ్య వ్యత్యాసాలను మరింత పెంచుతుంది, అలాగే కులం ఆధారంగా ఉన్న వివక్ష కూడా సమాజంలో అసమానతులను స ష్టిస్తుంది. ఈ అసమానతలు, సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో పెద్ద అడ్డంకిగా మారుతాయి.
దళిత వర్గాలకూ, స్త్రీలకూ, మానవ హక్కులు నిరాకరించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంత మాత్రాన స్త్రీలను దళితులుగా చెప్పటం కుదరదు. అది విజ్ఞత కాదు, కానీ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించవలసి ఉంది. సంస్క తి పరంగా పూర్వగాథలు చూస్తే ఒకానొక కాలంలో స్త్రీలను చదువుకోనివ్వలేదు. శూద్ర వర్ణాలనూ చదువుకోనివ్వలేదు. ఈ విషయంలో స్త్రీలనూ, శూద్రులకూ విద్యా విషయకంగా మానవహక్కులు నిరాకరించబడ్డాయి. ఆస్తి విషయం లోనూ ఈ రెండు వర్గాల వారు నిరాదరణకు గురైనవారే. స్త్రీలు పురుషుల అధీనంలో (తండ్రి, భర్త, సోదరుడు లేదా కుమారుడు) ఉండాలి. శూద్రులు, ముఖ్యంగా అతిశూద్రులు, యజమానుల అధీనంలో ఉండాలి. వీరికి స్వంత ఆస్తి ఉండకూడదు, యజమాన్య హక్కులు ఉండవు. పరాధీనమైన జీవితాలు వారివి. ఈ రకమైన పరాధీనతను ఆయా వర్గాలకు అలవాటు చేయడానికి మతపరంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. దానినే సంస్క తిగా నమ్మించారు.
''న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అనే నిబంధన అలాగే ప్రచారంలోకి వచ్చింది. వర్ణధర్మాల పరంగా ఆచార న్యాయం శూద్ర వర్గాల స్వాతంత్య్రాన్ని నిషేధించింది. కుల విద్యలకే వారిని పరిమితం చేసింది. విశేష విద్యలు వారికి అందనివ్వలేదు. ఈ కోణంలో సమస్యను చూసినప్పుడు ఆంధ్రమహా భారతంలో మ త సంజీవని విద్య సందర్భం గుర్తుకు వస్తుంది. ఆ కథలోని అంశాలు విస్తృతమైనట్టివీ, ఈ వివక్షపూరిత సంస్కృతికి దారులు వేసినవి.
మ త సంజీవని విద్య గురించి చెప్పుకోవాలంటే, దానితో ముడిపడి ఉన్న చాలా విషయాల గురించి చెప్పాలి. శుక్రాచార్యుని కథ, కచుని వ త్తాంతం, దేవయాని కథ, యయాతి కథ, యదువంశ చరిత్ర గురించి చెప్పుకోవాలి. సంక్షిప్తంగా ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
శుక్రాచార్యుడు అంటే చాలామందికి తెలుసు. ఆయన అసురుల గురువు. అసురులు అంటే ధైత్యులు, రాక్షసులు అని ప్రచారం జరిగింది. సుర-అసుర యుద్ధాలు పురాణ కథలలో ప్రస్తావించారు. దేవగణాలకు, వారి ప్రత్యర్థులైన అసురగణాల మధ్య ద్వేషం, వైరం ఎందుకు వచ్చాయంటే, రాజ్యాధికారం కోసమూ, భూమి కోసమూ. ఈ పోరాటాలు ఆనాది కాలం నుంచీ, అంటే స్వంత ఆస్తి అనే భావన మనిషికి కలిగినప్పటి నుంచీ, జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, రాజ్యాల మధ్య, జాతుల మధ్య, వర్గాల మధ్య కూడా ఇవే పోరాటాలు జరుగుతూ వచ్చాయి. గెలుపు, ఓటముల నుండి ఉన్నత, కులీన సంస్థలు, యాజమాన్య సంస్థలు, సేవక సంస్థలు ఏర్పడ్డాయి. వర్ణం అనే భావన కూడా ఈ సంఘర్షణల నుండే పుట్టుక వచ్చింది.
వర్ణం అనేదానికి సామాజిక శాస్త్రవేత్తలు, భాషా కోవిదులు అనేక అర్థాలు, వివరణలు ఇచ్చారు. అయినా ''వర్ణం'' అంటే ''కులం'' అనే సామాన్య అర్థం లోకంలో స్థిరపడిపోయింది. ప్రాచీన నాగరికతలలో ''వరేణ'' అనే పదం ఉండేది. ''వరేణ'' అంటే మతపరమైన విశ్వాసం. ఒక సిద్ధాంతం మీద నమ్మకం కలిగి ఉండటం. ఎవరైతే తమ ఆత్మను స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుతారో, వారి నమ్మకం, వరణం, వర్ణం అయ్యింది. ఒక నిర్దిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వర్గాన్ని సూచించే పదం ఇది.
మహాభారతం ప్రకారం మానవులంతా ఒకటే వర్ణం. ''ఏకవర్ణ మిదం సర్వం'' అని అక్కడ చెప్పారు. భగవద్గీత ప్రకారమూ అంతే. ఈ స ష్టిలో పుట్టినవన్నీ ప్రక తి ఆధారం గానే పుడుతున్నాయని భగవద్గీత చెబుతోంది.
''సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సంభవన్తి యాః
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా.'' (14-4) (అన్ని యోనులలో పుడుతున్న శరీరాలకు మూలం ప్రక తి తల్లి, నేను గర్భదానం చేసే తండ్రిని.)
ఈ విధంగా స ష్టిలోని అన్ని ప్రాణులకూ తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే, ఆమె ప్రక తి. గుణకర్మలను బట్టి చతుర్వర్ణాలను తానే ఏర్పరచానని క ష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.
తస్య కర్తారమపి మాం విద్యా కన్తార మవ్యయమ్ ॥'' (4-13)
(మనుషుల గుణకర్మల ఆధారంగానే చతుర్వర్ణాలను ఏర్పరచాను. ఈ విభజన సత్వ, రాజస, తమోగుణాల ఆధారంగా వారు చేసే పనులు, పరిగణన ఆధారంగా జరిగింది. కానీ అనంతర కాలపు స్వార్థశక్తులు ఈ పరిగణనను గుణాల ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా నిర్ణయించాయి.)
ఈ నేపథ్యంతో మ త సంజీవనీ విద్య వ త్తంగా చెప్పుకోవాలి. ఆ కాలానికి అంటే ఈ కథా కాలానికి వర్ణధర్మాలు స్థిరపడి ఉన్నాయి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, శూద్రులకు వారు చేయవలసిన పనులు నిర్ధేశించబడ్డాయి. వీరి మధ్య వివాహ సంబంధాలు నిషేధించబడ్డాయి. ఆర్య, అనార్య భేదాలు, రాజులు తమ వంశం సూర్యుడు లేదా చంద్రుడు నుండి వచ్చారని చెప్పుకోవడం వంటి వర్ణధర్మ రక్షణ (ఎవరి పనులు వారు చేసుకోవటం) రాజుల కర్తవ్యంగా ఉండేది. ఇప్పటికీ ఇది ఆచరింపబడదు.
యయాతి చంద్ర వంశపురాజు, నహుఘని కొడుకు, వర్ణధర్మ పరిరక్షణకు పేరు పొందాడు. ''వర్ణధర్మములో గాచుచు వసుధ యెల్ల ననఘ చరితుడై యేలిన నయ్యయాతి'' అనే ప్రశ్న వచ్చిందిబ్రాహ్మణ బాలికను ఎలా పెండ్లి చేసుకున్నాడు? అనే ప్రశ్నకు జనమేజయుడు అనే రాజు అడిగిన ప్రశ్నకు వైశంపాయనుడనే ముని సమాధానంగా కింది వివరాలు ఇచ్చాడు. ఈ వివరాలు మహాభారతంలో ఉన్నాయి (అదిపర్వం - ఆశ్వాసం - 3).
శుక్రాచార్యుడు వ షపర్వుడనే అసుర రాజుకు ఆచార్యుడుగా ఉన్నాడు. ఆయనకు మ త సంజీవనీ విద్య (మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్య) తెలుసు. అసురగణాల ప్రజలకు ఇతర గణాల వారితో యుద్ధాలు జరుగుతున్న సందర్భాలలో, మరణించిన అసురులను శుక్రుడు తిరిగి బతికిస్తూ ఉండేవాడు. ఈ విధంగా, అసుర బలం ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. దేవగణాలకు ఆ విద్య తెలియకపోవడం వల్ల వారు నష్టపోతూ ఉండేవారు.
ఈ సందర్భంలో, దేవగణాలు మ తసంజీవనీ విద్య నేర్చుకోవాలనే సంకల్పంతో, బ హస తి కుమారుడైన కచుడిని శుక్రాచార్యుని దగ్గరకు విద్యార్థిగా పంపించారు. బ హస తి దేవగణాల గురువు. దేవగణాలు అంటే ఆర్య గణాలు. స్థానిక తెగలలో నాగ, యక్ష, దైత్య, దానప, రాక్షస, పిశాచ, కిన్నెర, గంధర్వ, గరుడ, పతగ, పన్నాగ జాతుల వారే ఈ ప్రాంతంలో ఉండేవారు. వీరిని పురాణాలలో అసురులు అని పేర్కొన్నారు.
శత్రు వర్గానికి చెందిన కచుడు విద్యార్థిగా శుక్రుని ఆశ్రమంలో ప్రవేశించడం అప్పట్లో అనుహ్యమైన సంఘటన. శుక్రుడు కచుడికి ఆదరంగా ఆహ్వునించాడు. అతడిని అప్పటి గురువులు శిష్యులందరికే సాధారణ విద్య నేర్పుతున్నప్పటికీ విశేష విద్యలు తమ వద్దే ఉంచుకునేవారు.
దేవయాని చాలా తరచుగా కచుని మంచిచెడ్డలు చేస్తూ ఉండేది. కచుడు ఆమె అభిమానం ఆమెకు ప్రత్యేకంగా పూలు, ఫలాలు తెచ్చి ఇస్తుండేవాడు. కచుని వ్యవహార శైలిని అనుమానించిన శుక్రుని ఇతర శిష్యులు కచుడిని చంపి అడవిలోనే వదిలేసి వచ్చారు. అందరితో పాటు కచుడు సాయంత్రం ఆశ్రమానికి తిరిగి రాడా దేవయాని దిగులు పడ్డాయి. తండ్రితో చెప్పింది. శుక్రుడు దివ్యదృష్టితో చూశాడు. తన విద్యాబలంతో కచుడిని బతికించాడు. దేవయాని కచుడి పట్ల ఆకర్షితు రాలవటం గమనించి శుక్రుని శిష్యులు కచుడిని మళ్ళీ చంపారు. ఈసారి అతని శరీరాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి ఆ మద్యాన్ని శుక్రుని చేత తాగించారు.
యధా ప్రకారం కచుడు ఆశ్రమానికి రాక పోవటంతో దేవయాని గాభరా పడింది. మద్యం మత్తులో ఉన్న తండ్రితో చెప్పింది. ''వీళ్ళందరికీ కచుని మీద కోపం ఉంది. వీళ్ళే అతనిని ఏదో చేసి ఉంటారు అన్నది''. మళ్ళీ అతనిని బతికించినా వీళ్ళు మళ్లీ ఏదో చేస్తారు. అతని సంగతి వదిలెయ్యి'' అన్నాడు శుక్రుడు. దేవయాని మొండిపట్టు పట్టింది. అతను వస్తేగాని అన్నం తినన్నది. శుక్రుడు దివ్వదృష్టితో చూసి కచుడు తన ఉదరం లోనే ఉన్నట్లు గమనించాడు. ఆసంగతే కూతురితో చెప్పాడు. కచుడు లేకపోతే తాను బతికనన్నది దేవయాని. కచుడిని బతికిస్తే తాను మరణించవలసి వస్తుందని శుక్రుడు చెప్పాడు. తనకు ఇద్దరూ ముఖ్యమే అంటూ దేవయాని మొండికేసింది. గత్యంతరం లేక శుక్రుడు కచుడికి బతికించాడు. కచుడు గురువు గారి ఉదరంలో బయట పడేదెలా? ఆ సంకట పరిస్థితిలో శుక్రుడు కచునికి మృతసంజీవని విద్య ఉపదేశించాడనే కచుడు గురువుగారి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి మరణించి పడి ఉన్న గురువు గారిని తన విద్యతో బతికించాడనే మహాభారతం చెప్తున్నది. శత్రువర్గపు వాడైన కచునికి మృత సంజీవని విద్య ఉపదేశించే బదులు-శుక్రుడు తన కూతురికే ఆ విద్య ఎందుకు ఉపదేశించలేదు?. స్త్రీలకు విద్యార్హత లేదు. గనుకనే? స్త్రీలకు విద్యార్హత లేకపోయింది. సరే, తన శిష్యులలో ఎవరికైనా ఆ విద్యను ఉపదేశించి ఉండవచ్చు కదా? అలా ఎందుకు చేయలేదు. అంటే ఆ శిష్యులు శూద్ర వర్ణాల వారు గనుక- అసురులు గనక, ఆర్యేతరులు గనుక, అనే సమాధానం చెప్పవలసి వస్తుంది. ''ఆ విద్య వల్లనే శూద్రులు పతనమయ్యారు'' అన్నారు మహాత్మా జోతిరావ్ ఫూలే. అది అప్పటి సమాజపు కట్టుబాటు.
స్త్రీలకూ, శూద్రకులాలకూ వేషభాషలలో కొన్ని కట్టుబాట్లు, నిషేధాలు విధించబడ్డాయి. ఈ వాదన చాలా మందికి రుచించక పోవచ్చు. అలాంటి వారిని చార్వాకులుగా ముద్రవేసి దూరం పెట్టటం చరిత్రలో ఉన్న విషయమే.
దేవయాని ప్రేమానురాగాల వల్లనే ఆమె పట్టుదల వల్లనే కచునికి మరణం తప్పింది. అనుకోకుండా మృత సంజీవని విద్య కూడా లభించింది. వచ్చినపని నెరవేరింది. అయితే కచుడు వెంటనే తన నగరానికి వెళ్ళలేదట. చాలకాలం పాటు మామూలుగా శిష్యరికం చేసి గురువు అనుమతి పొంది తన దేవలోకానికి ప్రయాణం కట్టాడు. అప్పుడు దేవయాని కచునితో ''మన మధ్యగల అనురాగం వల్ల మనకు వివాహమయినట్టే లెక్క నేనూ నీతోపాటు వస్తాను'' అన్నది.
''శుక్రుని అనుగ్రహంతో నన్ను కూడా పరిగ్రహించు'' అని అడిగింది. ''నీవు బ్రాహ్మచారివి -నేనూ కన్యనే'' అన్నది. ''మహీదేవ కుల వతంస'' అంటూ కచుని సంబోధించింది. కచునిది బ్రాహ్మణ కులం, అనేది పరోక్షంగా చెప్పినట్టు. వివాహ ప్రసక్తి తేగానే కచుడు అత్యంత విషాదం పొందాడట.'' ఇది లోక నింద్యం-నీవు నాకు సోదరి వంటి దానిని. గురువుకు శిష్యులు పుత్రుల వంటివారు. నీవు గురువు పుత్రికవు నాకు సోదరివి'' అనేశాను. ప్రవర్తన పరంగా అతను సోదర భావంతో ఉన్నాడని దేవయాని ఊహించలేదు. కచుడు సోదర భావంతో మెలిగాడా అనేదీ సందేహమే. తన పని నెరవేరటం కోసమే అతను తన సాన్నిహిత్యం పెంచుకుని ఆమెను భ్రమలో ఉంచాడనేది నిర్వివాదాంశం. మోసం గుర్తించిన దేవయానికి చాలా కోపం వచ్చింది. ''మోసంతో నేర్చుకున్న సంజీవని నీకు పని చేయదు'' అని శాపించింది. ''నాకు పని చేయకపోతే పోనీ, నావల్ల ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది.'' అన్నాడతను. కచుడు-పైగా, ''ధర్మవిరోధం తలపెట్టావు గనక నిన్ను బ్రాహ్మణుడు ఎవడూ వివాహం చేసుకోడు'' అని తనూ శాపం ఇచ్చి వెంటనే దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విద్య అందరికీ నేర్పాడో లేదో తెలీదు.
కచుని శాపం కారణంగా దేవయాని బ్రాహ్మణుడెవరూ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత ఆమె 'యయాతి' భార్య అయింది. యయాతి క్షత్రియుడు. ఇది బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు గుణకర్మల చేతనే ఏర్పడిన కాలపు కథ కావచ్చు. అందుకే గురుస్థానాలలో ఉన్న శుక్రుడూ, బృహసృతీ బ్రాహ్మణులయారు. అనంతరకాలపు పరిణామాల వల్ల వాళ్ళ పిల్లలకూ అదే కులం వచ్చింది. అయినా విద్యల విషయం కొచ్చేసరికి బ్రాహ్మణ స్త్రీ అయినా దేవయాని అనర్హురాలైంది. ఇది జెండర్ వివక్ష. శుక్రుని శిష్యులు అసురులూ, స్థానిక జాతులు కావటం వల్ల అనర్హులయ్యారు. ఇది కులవివక్ష - వివక్ష మూలాలు ఇంత పటిష్టంగా ప్రజల మనస్సులలోకి చొప్పించగలిగింది మతవ్యవస్థ.

No comments:
Post a Comment