Monday, October 9, 2017

సంపాదకీయం Dalithashakthi October 2017



1985కు ముందు దేశ రాజకీయాల్లో అగ్రకులాలదే అధిపత్యం. ఓట్ల రాజకీయాలను నోట్లమయం చేసి ప్రజస్వామ్య విలువల్ని భ్రష్టుపట్టిస్తున్న తరుణంలో ''ఓట్లు మావి, సీట్లు (అధికారం) మీదా? ఇకపై చెల్లదు ఇకపై సాగదు అంటూ ఓట్లు మావి అధికారం కూడా మాదే'' అని బహుజనుల పక్షాన నిలబడి అధిపత్యపార్టీలకు సవాలు విసిరారు కాన్షీరాం. పేదల కోసం, పేదల చేత, పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన పేదల పార్టీ బీఎస్పీ ద్వారా ఏనాడు అసెంబ్లీ, పార్లమెంట్‌ మెట్లెక్కని వెనుకబడిన అతి పేదలను ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన ఘనత కాన్షీరాందే. సామాన్యులు సైతం ఈ దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా అత్యున్నత పదవులు పొందగలరని నిరూపించి ప్రజాస్వామ్య విలువల్ని ఆయన పరిరక్షించారు.
రాజకీయాల్లో కులం ప్రవేశపెట్టిన నాయకుడిగా ప్రచారం చేస్తారు కానీ ఆయన కులం అనే ముల్లును కులంతోనే తీయాలని 'కుల నిర్మూలన' కోసమే ఆయన దేశ రాజకీయాల్లో కుల ఎజెండాను చేర్చారు. ఫలితంగా అన్ని అగ్రకుల పార్టీల్లో బహుజనులను అవకాశాలు లభించాయి. కాన్షీరాం కొనసాగించిన కఠోరశ్రమ ఫలితంగా నిశ్శబ్ధ రాజకీయ విప్లవం అన్ని రాష్ట్రాలకు పాకింది. ఫలితంగా ఒక సామాన్య మహిళ, అందులో అంటరాని కులానికి చెందిన 'చమార్‌' మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత పూర్తిగా కాన్షీరాందే. తద్వారా బ్రహ్మణ, పురుషాధిపత్య రాజకీయాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు కాన్షీరాం. 
ప్రస్తుత భారత రాజకీయాల్లో ఆయనకు సరితూగే నాయకుడు లేడనడంలో అతిశయోక్తి లేదు. అగ్రకులాల నాయకత్వాన్ని సమాజం మొత్తం అంగీకరిస్తుంది. కానీ కిందికులాల విషయంలో అలా జరగదు. ఎన్నో రకాల అడ్డంకులు, అవరోధాలు నిత్యం వారిని కిందికి లాగడానికి ప్రయత్నిస్తాయి. వీటన్నింటిని తట్టుకొని కాన్షీరాం దృఢ సంకల్పంతో ఉద్యమించడం వల్లనే జనం ఆయన వెంట నడిచారు. ఇవాళ దేశంలో కింది కులాల్లో నాయకులు పెరిగిన వారిలో లోపించినది ఇదే. దేశంలో ప్రపంచీకరణ విధానం ప్రారంభమైన తర్వాత ఎన్నికలే కాదు, ఉద్యమాలు కూడా వ్యాపార మయమైపోయాయి. కాబట్టి కాన్షీరాం వంటి త్యాగనిరతి కలిగిన నాయకుడి అవసరం చాలా ఉంది.
దేశరాజకీయాల్లో అగ్రకుల దోపిడి కులాల పెత్తనంపై తిరుగుబాటు చేసిన నేత కాన్షీరాం. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశించిన రాజ్యాధికారం వైపు దళిత, బహుజనులను పరుగులు పెట్టించారు. దళిత, బహుజనులకు ఈరోజు దేశరాజకీయాలను శాషించే స్థాయికి తీసుకు వెళ్లింది కూడా మాన్యశ్రీ కాన్షీరాం మాత్రమే. వీరి సాధనకు కృషి చేయడమే మనం ఆ మహానీయుడి అర్పించే నివాళి.

Friday, September 8, 2017

బాబాలలో శూద్రబాబాలు వేరయా... డా. జిలుకర శ్రీనివాస్ - Dalithashakthi September 2017

సిబిఐ కోర్టు బాబా గుర్మీత్‌ రాం రహీం ఇన్సాన్‌ కేసులో ఇచ్చిన తీర్పు, రేపు పై కోర్టులోనో, లేదా సుప్రీం కోర్టులోనో కొట్టుడు పోదనే హామీ ఏమీ లేదు. మరోవైపు, బ్రాహ్మణులైన మఠాధిపతులు, స్వామీజీలు చేసిన నేరాల మీద ఎలాంటి పురోగతి లేదు. ఆశారంబాపు లాంటి వాళ్ల చేతిలో అన్యాయానికి గురైన బాధితులంతా యింకా కోర్టు చుట్టూ తిరుగుతూనే వున్నారు.

- డా. జిలుకర శ్రీనివాస్ 
సిబిఐ తీర్పుతో బాబా గుర్మీత్‌ రాంరహీం ఇన్సాన్‌కు ఇరవైయేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ రుజువయ్యాయని సిబిఐ కోర్టు నిర్దారించింది. బాబాలంతా కలిసి గుర్మీత్‌ లాంటి వాళ్లను ఉపేక్షించరాదని ప్రకటన కూడా చేశారు. గుర్మీత్‌ బాధితులంతా కోర్టు తీర్పుతో ఆనందించినట్టు మీడియా తెలిపింది. అయితే, గతేడాది ఇలాంటి ఆరోపణలతో అరెస్టయిన బాబా రామ్‌ పాల్‌ను సరైన సాక్ష్యాల్లేవని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. బాబా రాంపాల్‌ను అరెస్టు చేసే సమయంలో కూడా అనుచరుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ఆయన సత్సంగ్‌ నిర్వహించే వేదిక కింద ఏకే47 లాంటి తుపాకులు, మందుగుండు సామ్రాగ్రి లభించాయని పోలీసులు ఆ రోజు చెప్పినవీ, మీడియా ప్రచారం చేసిందీ అంతా అబద్ధమని తేలిపోయింది. 
సిబిఐ కోర్టు బాబా గుర్మీత్‌ రాం రహీం ఇన్సాన్‌ కేసులో ఇచ్చిన తీర్పు, రేపు పై కోర్టులోనో, లేదా సుప్రీం కోర్టులోనో కొట్టుడు పోదనే హామీ ఏమీ లేదు. మరోవైపు, బ్రాహ్మణులైన మఠాధిపతులు, స్వామీజీలు చేసిన నేరాల మీద ఎలాంటి పురోగతి లేదు. ఆశారామ్‌ బాపులాంటి వాళ్ల చేతిలో అన్యాయానికి గురైన బాధితులంతా యింకా కోర్టు చుట్టూ తిరుగుతూనేవున్నారు. బాబా రాందేవ్‌ ఆయుర్వేద ఉత్పత్తుల కోసం హరిద్వార్‌లో వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకున్నారనీ, మా భూమి మాక్కావాలని ఆందోళన చేసిన రైతుల మీద కాల్పులు జరిపితే చనిపోయిన రైతుల వివరాలు కూడా మీడియాలో రాలేదని విమర్శకులంటూంటారు. వెబ్‌సెట్‌ వార్తల్లో తప్ప ఎక్కడా ఆ దారుణం కనిపించ లేదు. కానీ, సంఘటన జరిగింది నిజం. అయినా, బాబా రాందేవ్‌ మీద కేసులు నమోదు కాలేదు. ఒక్క అరెస్టు కూడా జరగలేదు. అంతెందుకు, సత్యసాయి బాబా ఆశ్రమంలో ఇరవై యేళ్లకిందట కాల్పులు జరిగాయి. అవి సత్యసాయి చేయించిన హత్యలని అందరూ అన్నారు. కానీ, హతులెవ్వరో, హంతకులెవ్వరో రుజువు కాలేదు. హత్యలు జరిగిన తర్వాత కూడా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు సత్యసాయిని దర్శించుకొని, దీవెనెలు తీసుకున్నారు. బాబా గుర్మీత్‌ రాంరహీం ఉదంతం నేపథ్యంలో కొన్ని విషయాలు మనం కచ్చితంగా చర్చించుకోవాలె. 
అఖాలీ తక్త్‌ అనేది సవర్ణ సిక్కుల సంస్థ. అది హింసాత్మక పద్ధతుల ద్వారా పంజాబు, హర్యానా, ఢిల్లీ, యుపి, రాజస్థాన్‌ జనాభాలో పెద్ద సంఖ్యలో వున్న చమార్‌ సిక్కులను అణచి వేయాలని చూస్తుంది. ఆ క్రమంలోనే గురు రవిదాస్‌ ధార్మిక ఉద్యమాన్ని ప్రపంచ స్థాయిలో నడిపిన గురు రామ్‌నాథ్‌జీని కెనడాలో కాల్చి చంపిన నేరస్తులు ఈ సంస్థకు చెందిన వాళ్లే అని అనుమానం. ఆ హత్యాకాండ ను నిరసిస్తూ చమార్‌ జాతి నెలరోజుల పాటు ప్రతిహింసకు దిగింది.
అఖాళీ తక్త్‌ నేతలు చమార్‌, ఇతర దళిత జాతులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎదగ డాన్ని సహించరనే వాదనను నిరూపించే ఎన్నో ఉదంతాలున్నాయి. గురు రవి దాసు ప్రేరణతో పంజాబు, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు గా, సత్సంగ్‌ నిర్వాహకులుగా, బాబాలుగా ఎదిగారు. ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక మార్గాన్నీ, సాంస్కృతిక రంగాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృషిని అభినందించలేని సవర్ణ ఆధిపత్యవాదులు మీడియా సహకారం, పోలీసుల అండ దండలతో అనేక కేసులు పెట్టిస్తున్నారు. అలాంటి ప్రయత్నమే గుర్మీత్‌ రాం రహీం సంఘటన కూడా.
గుర్మీత్‌ రాం రహీం ఎక్కడా తాను దైవదూతను అని గానీ, నేనే దేవున్నీ అని గానీ చెప్పుకోలేదు. కానీ, అలా చెప్పు కున్నాడని మీడియా ద్వారా బాగా ప్రచారం చేస్తున్నారు. గురు గోవింద్‌ సింగ్‌ లాగా వస్త్రధారణ చేసినందుకు సహించలేక డేరా సచ్చా సౌదా ఆధ్యాత్మిక గురువైన రాం రహీం మీద హత్యా ప్రయత్నం చేశారు. బాంబులు అమర్చి పేల్చేస్తే తప్పించు కున్నాడు. ఎన్ని కుట్రలు చేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోజు రోజుకీ తన ప్రభావం పెరిగి పోతుందని గ్రహించిన సవర్ణ దురహంకారులు అత్యాచార ఆరోపణలు చేయించారని ఒక వాదన. వాజ్‌పేయి పాలనలో మొదలైన ఈ కేసులు మోదీ కాలంలో శిక్ష ప్రకటించే దాకా పోయాయి.
దళిత, గిరిజన, బిసీ, మైనార్టీ ఆధ్యాత్మికవేత్తలను, రాజకీయ నాయకులను, లేదా ఉద్యమ నాయకులను అణచి వేయడానికి అగ్రకులాలు అమలు చేసే ఆయుధాలు రెండు. ఒకటి, అవినీతిపరుడు, అక్రమ సంపాదనా పరుడనే ఆరోపణలు. రెండు, రేపిస్టు, స్త్రీలోలుడు, వేశ్యాపరుడు, చివరికి అమ్మాయిలకు ప్రేమ అనే వల విసిరి మోసం చేసే మోసగాడనే ఆరోపణలు. వీటిని చాలా సులువుగా ప్రజలు నమ్మేలా కథనాలుంటాయి. అవి ఎంతగా మెప్పిస్తాయంటే, ప్రజాస్వామికవాదులు, ఉదార స్వభావులు, స్త్రీవాదులు, ప్రగతిశీలవాదులని అనుకునేవాళ్లను కూడా విచక్షణను కోల్పోయేలా చేసేలా వుంటాయి.
మొన్నటికి మొన్న భీమ్‌ ఆర్మీ నేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. మిలటరీవాళ్లు తప్ప ఆర్మీ అనే పేరు సంఘానికి వాడుకోరాదట. సేన అనే పదం సంఘానికి పెట్టుకోవటం నేరమట. మరి, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాన్‌ సేన లాంటి పార్టీల సంగతేంటని అడిగితే అది కూడా నేరమట. చంద్రశేఖర్‌ ఆజాద్‌ మీద ఆరోపణలను నిరూపించలేక, అతని మీద నైతికపరమైన ఆరోపణలు ప్రచారం చేశారు. అతనికి ఇద్దరు ప్రియురాళ్లున్నారని ప్రచారం చేశారు. ఒక్క అమ్మాయి తోనైనా నేను అతని గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పించలేక పోయారు. తిరుమావళ్లువన్‌ను ఎదుర్కోలేక ఎవరో ఒక అమ్మాయితో నన్ను మోసం చేశాడని డ్రామాలు వేయించారు. ఇవేవీ పని చేయక పోతే, రోహిత్‌ వేముల మీద తీవ్రవాదనే ముద్ర వేసి హత్య చేశారు. కన్నయ్య కుమార్‌ లాంటివాడి మీద దేశానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చాడనే నేరం మోపారు.
పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ దళితులు యింకా ఏమాత్రం సహించే స్థితిలో లేరు. ఆరెస్సెస్‌, బిజెపీ కుట్రలను వాళ్లు తిప్పి కొట్టాలనుకుంటున్నారు. రాజకీయ అవసరాల కోసం చేసే కుట్రలకు కాలం తప్పక జవాబిస్తుంది. సవర్ణ ఆధిపత్య రాజకీయలు, ఆధ్యాత్మికవాదం తప్పకుండా తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది.
- జిలకర శ్రీనివాస్ 






సంపాదకీయం - Dalithashakthi September 2017



పీడితుల న్యాయం కోసం న్యాయమూర్తులనే ఎదిరించిన సాహసవంతులు బొజ్జా తారకం. ఆయన మరణాంతరం ఉభయ రాష్ట్రాల్లో అగ్రకులాల ఆరాచాలకు, ప్రభుత్వాల మోసపూరిత కుట్రకు వ్యతిరేకంగా న్యాయవాదిగా కోర్టుల్లో, ఉద్యమకారుడిగా బయట ప్రశ్నించే నాధుడే లేకపోకపోవడం వల్ల జనం గొంతుక మూగబోయింది. న్యాయం కోసం పోరాడే న్యాయవాది ఎక్కడీ అని హైకోర్టులోని దళిత, బడుగు, బలహీన వర్గాల కేసులు వెతుకు తున్నాయి. పరువు పేరు మీద ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు పెద్దపల్లి మంథని మధుకర్‌, నిజామాబాద్‌ జిల్లా అమాద్ర్‌లో రోజా, భువనగిరిలో నరేష్‌-స్వాతి, వికారాబాద్‌ జిల్లా తాండూరులో హత్యలకు గురైన బాధితులు తారకం సార్‌ ఎక్కడాని ప్రశ్నిస్తున్నారు? బాధితులకు ఆయన అభయం, పోలీసులకు, అధికారులకు భయం, భయం. ఆయన లేనందునే న్యాయం అట్టడుగు వర్గాలకు అందకుండాపోయే ప్రమాదానికి దగ్గరకు అవుతూనే ఉన్నాయి. ప్రజా ఉద్యమాల ప్రజా నాయకుడి కొరత ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉంది.
71ఏళ్ళలో సామాజిక అంతరాలు తగ్గకపోగ నేటికీ విస్తృతం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి రిజర్వేషన్లపై ఉంటుంది. కానీ వాటి పునాది కుల అంతరాల్లో ఉందనే విషయం మార్చిపోతున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని కురుకునే వారందరూ కులాలు రద్దు చేయాలని గానీ, తాను కులవివక్ష పాటించనని చెప్పాగలడా? ఎందుకు? చెప్పలంటే వారికీ కాలేజీలో సీటు రాకుంటేనో, ఉద్యోగం రాకుంటేనో రిజర్వేషన్లను నిందిస్తారు. మరి ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లు కావాలంటే ప్రతిభ కావాలంటారు. మరి మీకు ఉద్యోగం రాకుంటేనో, కాలేజీలో సీటు రాకుంటేనో రిజర్వేషన్లే కారణం అనుకుంటారే కానీ ప్రతిభ లేదని అనుకుంటారా? లేదు కదా? ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లు లేవు కదా? అందులో మరి మీకు ఎందుకు ఉద్యోగామో, సీటు ఎందుకు రాలేదు, అంటే మీలో ప్రతిభ లేదని మీకు మీరు ఒక్కసారైన ప్రశ్నించుకున్నారా? కనీసం మనసులోనైనా అనుకున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. రిజర్వేషన్లు లేని సమాజం కోరుకుంటున్న వారు ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు ఎందుకు విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లతోపాటు భూమి, పరిశ్రమలలో రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలి. ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినట్లే భూమి దున్నుకోవడంలో పరీక్షలు నిర్వహించాలి. అందుకే రిజర్వేషన్లు లేని సమాజం కోసం అంటే ముందు కులాలు లేని సమాజం రావాలని కోరుకోవాలి. తొందర పడితే మొదటే మోసం వస్తుంది... జాగ్రత్త... భీ కేర్‌ ఫూల్‌... 

Saturday, August 12, 2017

విద్యావ్యవస్థ చరిత్రను తిరగరాస్తున్న సంక్షేమ గురుకులాలు


విద్యావ్యవస్థ చరిత్రను తిరగరాస్తున్న సంక్షేమ గురుకులాలు
కార్పోరేట్‌ కాలేజీల్లో చదివితే తమ పిల్లలు మంచి ర్యాంకు సాధిస్తారని తల్లిదండ్రుల అభిలాష, కానీ తమ పిల్లలు ఏ కాలేజీలో వేసిన బాగా చదువుతారని అనుకోరు, ఎందుకంటే కార్పోరేట్‌ కాలేజీల గ్లోబల్‌ ప్రచారాన్ని మాత్రమే నమ్ముతారు. మా పిల్లలను కాదు, ఎక్కడైతే ఏం? చదువు ముఖ్యం అనుకోవడం లేదు. అందుకే కార్పోరేట్‌ సంస్థల విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. ఈరోజు విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడుతున్నది ఒక్క ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలే అంటే అతిశయోక్తి కాదు. కార్పోరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా గురుకుల పాఠశాలలు, కళాశాలను నడిపిస్తున్న తీరు ఈ రోజు మన అందరికీ తెలుసు. కార్పోరేట్‌ విద్యాసంస్థల కంటే గురుకుల విద్యా సంస్థలు ఫలితాల్లోనే కాకుండా అనేక యాక్టివిట్సిలోముందు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ విద్యాసంస్థలు ఆసియా ఖండంలోనే అతి ఎత్తతైనా, పెద్దదైన ఎవరెస్టు ఎత్తు, కాదు కాదు ఐరోపా ఖండాలకు వ్యాప్తి చెందిందంటే కూడా తక్కువే అవుతుంది.
విద్యార్థులను ఉన్నత శిఖారాలకు చేర్చేందుకు వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఆత్మవిశ్వాసం లేకుంటే అతి చిన్న పనైనా సాధించలేం. వారికి కార్పోరేట్‌ సంస్థల్లో పిల్ల
లను చేర్పిస్తున్న తల్లిదండ్రుల మాదిరికాదు. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న, చదివిన విద్యార్థుల తల్లిదండ్రలు నిరాక్ష్యరాసులు, కానీ వీరు ఎంత కష్టమైన, ఎంత సహాసామైన చేయగల సత్తా కలిగినవారు. అందుకే గురుకుల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి, నైపుణ్యం కోసం అనేక మంది నిపుణులతో తరగతులు నిర్వహించారు. సమ్మర్‌ సమ్రారు పేరుతో వేసవి కాలంలో ఆయా రంగాల్లోని విద్యార్థులకు నైపుణ్యతరగతులు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో ఎక్కడ, ఎప్పుడు లేదు. మనం శిక్షణ ఇవ్వడం మాత్రమే చేయగలం, కానీ మనం సాధించాలేం. సాధనకు అవసరమైన అన్ని రకాల నైపుణాల్యలను విద్యార్థులు గ్రహించాల్సి ఉంటుంది. అందుకు మాలవత్‌ పూర్ణ, ఆనంద్‌లే ఆదర్శం. అతి పిన్న వయస్సులో ఎవరెస్ట్‌ ఎక్కిన ఘనత సాధించారు. అనేక మంది విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌ తదితర దేశాలకు వెళ్లాగలుగుతున్నరంటే దానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతోపాటు అన్నింటిలో ముందుండి నడిపిస్తున్న శక్తి, పవర్‌ ఒక్కరే, ఆయనే డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపిఎస్‌.

Saturday, August 5, 2017

Dalithashakthi August 2017 Released

దళితశక్తి ఆగష్టు 2017 సంచికను Sc,St officers ఫోరంలో ఆవిష్కరించిన కాకి మాధవరావు, భరత్ భూషణ్, వందన్ కుమార్, డా.బాబు రావు, నాగయ్య I&PR JD, బి.గంగాధర్ ఎడిటర్ దళితశక్తి మాస పత్రిక, తదితరులు
#Dalithashakthi #Magazine #SC #Daliths

Tuesday, August 1, 2017

సంపాదకీయం - August 2017 -DSMM



ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గుజరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలు దళితులు, ముస్లింలపై అత్యంత భయంకరంగా, అమానవియంగా, ఐఎస్‌ఐ టెర్రరిస్టులకు ఏ మాత్రం తీసి పోని విధంగా దాడులు చేస్తూ, హత్యలు గావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్ర కులాలు బూటకపు పరువు పేరు మీద ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు (పెద్దపల్లి మంథని మధుకర్‌, నిజామాబాద్‌ జిల్లా అమాద్ర్‌లో రోజా, భువనగిరిలో నరేష్‌-స్వాతి, వికారాబాద్‌ జిల్లా తాండూరులో) హత్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే దళితులపై ఉన్న అసూయా ద్వేషంతో దళిత సమాజానికి దిక్సూచి అయిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై తమ ప్రతాపం చూయిస్తున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పెట్టుకోవడమే నేరంగా భావించి అత్యంత అమానుషమైన సాంఘిక బహిష్కరణ గావించారు. 75 సం.రాల స్వతంత్య్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు స్వాతంత్య్ర ఫలాలు అందకపోవడం వలనే ఆర్థికంగా బలహీనపడటమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచుకోలేకపోయారు. వీటికి కారణం ఒక్కసారి విశ్లేషించు కుందాం.
ప్లాటినం ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు మేము ఈ దేశ పౌరులమేనా? ఈ వర్గాలకు చెందిన వ్యక్తి డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్రాసిన రాజ్యాంగం ఈ వర్గాలకు అమలు జరుగుతుందా? దేశంలో ఏదోఒక్కచోట కులపరంగా, మతపరంగా, వర్గం పేరుమీద దాడులు, అణచివేత ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పెద్దఎత్తున పెచ్చర్లిటానికికారణం ఏమిటి? దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ విభాగం అయినటువంటి భారతీయ జనత పార్టీ దాని మిత్ర పక్షాలు అధికారంలోకి రావటమే కారణమా? దేశవ్యాప్తంగా దళిత వర్గాలన్నింటికి చేయూత నిచ్చి పోరాటానికి సిద్ధంగా ఉండే కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటమే కారణమా? బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచన విధానంతో రాజ్యాధికారమే ధ్యేయంగా ఏర్పడిన బహుజన సమాజ్‌ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోడమే కారణమా? గతంలో దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాలుగుసార్లు అధికారం చేజిక్కించుకున్న బిఎస్సీ అదే ఉత్తర్‌ ప్రదేశ్‌లో 17 స్థానాలకు దిగజారటం, లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం, ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల తోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అసెంబ్లీలో బిఎస్పీకి ప్రతినిధ్యం ఉండేది, ఇప్పుడు అది లేకుండా పోవడమే కారణమా? అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారం కోల్పోవటం.... తదితర కారణాలతోనే ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ శక్తులు చేలరేగుతున్నాయా? 
ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీల నాయకులు గానీ, డాక్టర్‌ అంబేడ్కర్‌ భావజాలంతో పని చేస్తున్న ఆయా పార్టీల నాయకులు గానీ జరుగుతున్న పరిణామాల మీద ఆలోచించవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- బి. గంగాధర్, ఎడిటర్, దళితశక్తి మాస పత్రిక 



Thursday, July 6, 2017

Dalithashakthi July 2017- DSMM



















Dalithashakthi July 2017- DSMM - B.Gangadhar


దళిత రాష్ట్రపతి ఒకవైపు... దాసిన దాగని కులవివక్ష మరోవైపు 

శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దూసుకుపోతుంది, దేశం దూసుకుపోతుందని సంక్కలు గుద్దుకుంట్టున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు కులం పేరుతో, మతం పేరుతో, అగ్రకుల దురంహకారులు దళితుల మీద దాడులు, హత్యలు, వెలివేతలు వేధిస్తుంటే వారి కండ్లకు దళితులు కనిపించడం లేదా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా గోమాతపేరుతో మత తత్వవాదులు దాడులు, హత్యలు చేస్తుంటే, కులం పేరుతో దురహంకారులు దళితులను పరువు హత్యలు, బహిష్కరణలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు కనిపించడం లేదు, వీరి ఘోష వినిపించడంలేదు, వీరి గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. మరి స్వాతంత్య్రం వచ్చింది ఎవరికి? దేశం ఎక్కడికి దూసుకుపోతుందో? ఎందులో దూసుకుపోతుందో? వారికే తెలియాలి. ఈ దేశానికి ఒక దిశానిర్ధేశం చేసే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం పెడితే అదిచూసి ఓర్వలేక అగ్రకుల దురంహకారంతో వీర్రవీగుతూ గరగపర్రులో 800 కుటుంబాలబహిష్కరణ చేసి అన్ని విధాలుగా అవమానపరుస్తుంటే ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. 
భారత దేశానికి ప్రథమ పౌరునిగా దళితున్ని చేస్తున్నామని ఒకరంటారు, ఇంకొకరేమో 125 అడుగుల విగ్రహం పెడతాం అంటారు. మరి అంబేడ్కర్‌ విగ్రహం పెట్టినందుకే దళితులని బహిష్కరణ చేసిన మీ వాళ్ళు కనిపించడం లేదా? మీరు మాట్లాడానికి మీకు కులం అడ్డొస్తుందా? నిన్న మంథని మధుకర్‌, మొన్న భువనగిరిలో నరేష్‌ హత్య ఇంకా కనిపించని హత్యలు ఎన్నో, ఇక్కడ గ్రామం గ్రామాన్నే వెలివేస్తే ఇంకా ఎన్నాళ్లు చూస్తూ ఉరుకుంద్దామా? దళితజాతి బతుకులో వెలుగు నింపిన మహనీయుని విగ్రహం పెడితేనే తట్టుకోలేకపోతున్నారు దురంహకారులు, ఇంకా వారి మాయమాటలు చెపితే ఇంకా నమ్ముదామా? 
రాష్ట్రపతులు చేయకున్నా పర్వలేదు, కానీ ఆత్మ గౌరవంతో బ్రతకనీయండి చాలు. 125 అడుగుల విగ్రహం పెట్టకున్న పర్వలేదు, కుల దురంహకారంతో వీర్రవిగే వారిని అధికారంలో ఉండనిస్తే గరగపర్రులో దళితులకు జరిగిందే మరోచోట జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు, చట్టాలను, కోర్టులను నమ్ముకుంటే న్యాయం జరగదు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరం ఐక్యంగా అంబేడ్కర్‌ ఆలోచనలను, విధానాలను ఊరు, వాడ వాడల విస్తృతంగా ప్రచారం నిర్వహించి రాజ్యాధికారాన్ని సాధింద్దాం, అగ్రకుల దురంహకార ఆధిపత్యాన్ని అంతం చేద్దాం.

Wednesday, June 7, 2017

సంపాదకీయం June 2017 - Dalithashakthi Magazine



సంపాదకీయం
మన దేశంలోనూ ఒక్కశాతంగా ఉన్న సంపన్నులు 58శాతం సంపద అనుభవిస్తుంటే,99 శాతం ప్రజల చేతిలో కేవలం 42శాతం సంపదే మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా 99 శాతంప్రజలు ఐక్యమై కండ్లు తెరవాలి. ఈ అసమానతలను, అభివద్ధిని ప్రశ్నించాలి? ఎదిరించాలి? అభివద్ధి అంటే కోట్లాది మంది శ్రమను కొద్ది మందికి దోచి పెట్టడమేనా? అంతరాలను పెంచి పోషించడమేనా..? డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై ఈ ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం. 
దళిత, గిరిజన, బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయవివక్షకు కారణమైన విద్యాను అభ్యసించాలని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆకాక్షించారు. తన జాతి ప్రజలనుఐక్యంచేసి, సమీకరించాల్సిన అవసరాన్ని, జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ముందుండి పోరాటాన్ని నడిపించాల్సివ అవశ్యకతను వివరించారు. భోధించు, సమీకరించు, పోరాడినప్పుడు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. 
ఈ రోజు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పడిన ''భీమ్‌ ఆర్మీ'' బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రబోధించిన భోధించు, సమీకరించు, పోరాడు లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నది. రావణ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించిన భీమ్‌ఆర్మీ ద్వారా విద్యా యొక్క ప్రాముఖ్యతను దళిత, గిరిజన, బలహీనవర్గాలకు వివరించడమే కాకుండా దాదాపు 250 విద్యాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా సామాజిక వర్గాలను చైతన్యం చేస్తున్నారు. విద్యా ద్వారానే తమ జాతి ప్రజలను ఐక్యం చేసి షహరాన్‌పూర్‌లో ఉద్యమ పోరాటాన్నిమొదలుపెట్టారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని దేశ రాజధానిలో వినిపించాడు. ప్రపంచాన్ని ఒక్కసారి భారతదేశంలో దళిత, గిరిజన, బలహీనవర్గాలపైహిందూత్వవాదులు చేస్తున్న దాడులు, అత్యాచారాలు, కులవివక్ష అంటరానితనంపై ఆలోచించే విధంగా న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో 50వేల మందితో కదన సింహాంగాగర్జించారు.
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. మనం, మన జాతి ప్రయోజనాల కోసం చెయి చెయి కలిపి ఐక్యంగా పోరాడాల్సిన అవసరాలన్ని నేటి పాలకులే కల్పించినవిషయం మార్చిపోవద్దని దళితశక్తి పాఠకులకు మరోమారు గుర్తు చేస్తున్నది. మాన్యశ్రీ కాన్షీరామ్‌ రాజకీయ పోరాటపటిమతో రాజ్యాధికారం సాధించే వరకూ... రాజకీయ ఉద్యమాన్ని నిర్మిద్దాం, కదలిరండి, కలసి రండి, కలిసినడుద్దాం, నడిపిద్దాం...

దళితశక్తి మాస పత్రిక ఎడిటోరియల్ బోర్డు


దళితశక్తి మాస పత్రిక  ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సలహాదారులు
జె.బి.రాజు, బిఎస్‌వివిఎస్‌ మూర్తి
గౌరవ సంపాదకులు
డా|| గాలి వినోద్‌ కుమార్‌, డా|| జి.వి.రత్నాకర్‌, డా|| జాడి ముసలయ్య
ఎడిటర్‌
బి.గంగాధర్‌
సబ్‌-ఎడిటర్స్‌
జి.విఠల్‌, నీలం పుల్లయ్య, కళింగ లక్ష్మణ్‌రావ్‌
జిల్లా ప్రతినిధులు
జి.గంగాధర్‌ నిజామాబాద్‌, సుంచు గణేష్‌ - సిద్ధిపేట, అనంతుల శ్రీనివాస్‌ - భద్రాది కొత్తగూడెం, దాసరి రంగనాథ్‌ - కృష్ణా, వై.సత్యకుమార్‌ - రాజమండ్రి, సి.మధుబాబు - తూర్పు గోదావరి, పవన్‌ రాజ్‌ కుమార్‌ - పశ్చిమ గోదావరి, వడ్లూరి కిషోర్‌ - కరీంనగర్‌, సిహెచ్‌ ఓబయ్య - చిత్తూరు, జీడి సదానందర - మంచిర్యాల, జి.రాజు - కామారెడ్డి , లక్ష్మణ్ - ఆదిలాబాద్.
లీగల్‌ అడ్వయిజర్‌
సిహెచ్‌. సాయిలు, అడ్వకేట్‌
మేనేజర్‌
బి.స్వాతి



2026