Saturday, October 8, 2016

దళితశక్తి అక్టోబర్ 2016 మాసపత్రిక

Dalithashakthi Monthly Magazine October 2016



దళితశక్తి మాసపత్రిక ₹250.00 లు సంవత్సరం చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=E10DA9A70A960473D9A4885034466498
దళితశక్తి మాసపత్రికకు  ₹450.00లు 2 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=66275C809E7EBECBF9D50417FD8E8ECF
దళితశక్తి మాసపత్రిక కు  ₹1100.00లు 5 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=C52660FA8805AE492BF8576AC462C6FE
దళితశక్తి మాసపత్రికకు  ₹2000.00లు  10 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=84FA15D77FAA27D8FB36A050F152EC44
దళితశక్తి మాసపత్రికకు  ₹5000.00లు జీవిత చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=2E94FE62972DB39374997098E6BD3281

Thanks,
Manager,
Dalithashakthi Monthly Magazine
Contact details:
H.No.1-7-1022/9/20/4, Hari Nagar,
Ram Nagar, Hyderabad -500020.
Phone No.9440154273, 9490098902.
dalithashakthi@gmail.com

అంబేద్కర్‌ రాజకీయ సిద్ధాంతం ఆచరణయోగ్యం - Dalithashakthi Monthly Magazine

అంబేద్కర్‌ రాజకీయ సిద్ధాంతం ఆచరణయోగ్యం 

- ఎస్‌ఆర్‌ శంకరన్‌, కాన్షీరాం, బొజ్జా తారకం సంస్మరణ సభలో వక్తలు





రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజకీయ సిద్ధాంతాన్ని ఆచరించడం ద్వారానే దేశంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత శక్తి, మామా సమైక్య సమితి, నవ భారత్‌ నిర్మాణ్‌ ట్రస్టుల ఆధ్వర్యంలో సంయుక్తంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్‌కే హాల్లో శుక్రవారం ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ అధ్యక్షతన కాన్షీరాం, ఎస్‌ఆర్‌ శంకరన్‌, బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు పేదల అభ్యున్నతికి ఎస్‌ఆర్‌ శంకరన్‌, కాన్షీరాంలు తమ వైవాహిక జీవితాలను కూడా త్యాగం చేశారని గుర్తుచేశారు. అధికారం చేజిక్కించుకోవాలంటే రాజకీయంగా సంఖ్యాబలాన్ని పెంచుకోవాలన్నారు. జెబి రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ రాజకీయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన మహానుభావుడు కాన్షీరాం అని, ఇటు మార్క్సిజం, అటు అంబేద్కరిజాన్ని జోడించాల్సిన అవసరాన్ని బొజ్జా తారకం నొక్కి చెప్పారని గుర్తుచేశారు. ఎస్సీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను తీసుకొచ్చారన్నారు. వైసీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షులు నల్లా సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ వేముల కేసులో కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా మంత్రులకు, వీసీ అప్పారావుకు అండదండలు అందిస్తూ క్లీన్‌చీట్‌ ఇచ్చిందన్నారు. ప్రొఫెసర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ శతాబ్దంలో అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. కాన్షీరాం స్ఫూర్తితో దళితులు పోరాటాలను నిర్వహించాలని సూచించారు. 2018లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తానని ప్రకటించారు. మామా సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడే శాంతికుమార్‌ మాట్లాడుతూ.. అణచివేతకు గురవుతున్న మాల, మాదిగలు ఐక్యత దిశగా పయనించాలన్నారు. 
గోసంరక్షణ పేరుతో బీజేపీ దళితులపై దాడులు చేస్తోందని ఆలిండియా దళిత హక్కుల ఫోరం అధ్యక్షులు ఆనంద రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ రత్నాకర్‌, మామా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్‌, దళిత శక్తి ఎడిటర్‌ గంగాధర్‌, న్యాయవాది సాయిలు తదితరు లు ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందుగా కాన్షీరాం, ఎస్‌ఆర్‌ శంకర న్‌, బొజ్జా తారకంల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Monday, August 29, 2016

దళితశక్తి మాసపత్రిక 2016

ప్రియమైన మిత్రులారా,
సామాజిక అణచివేత నుండి, ఆర్థిక దోపిడి నుండి దళితులను రాజకీయంగా చైతన్యం చేయడమే లక్ష్యంగా పని చేయాలని దళితశక్తి, మాస పత్రిక ఫ్రిబవరి 2012లో ప్రారంభమైంది. ఇప్పటికే దళితుల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం కలిగించే విధంగా ఎప్పటికప్పుడు ప్రముఖుల వ్యాసాలను ప్రచురిస్తున్నది. పత్రిక అనగానే వ్యాపారం అనే ధృక్పదంతో కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కల్పిచడమే ధ్యేయంగా పని చేస్తుంది.
కావున దళితశక్తి మాసపత్రిక చందాదారులను చేర్పించే విధంగా కృషి చేయగలరని కోరుకుంటున్నాము. మీ ప్రాంతంలో, మీ చుట్టు ప్రక్కల ఉన్న అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, విద్యా, ఉద్యోగ పరిస్థితులపై అధ్యయనం చేసిన అంశాలు, ప్రభుత్వ పథకాలపై అమలు, తీరుపై మీ దృష్టిలో ఉన్న సమస్యలతోపాటు దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు, కవితలు, పాటలు, కథలు, తదితర పంపించగలరని కోరుతున్నాము.



చందాల వివరాలు:

1.  విడి పత్రిక                       రూ. 20.00 
2.  సంవత్సర చందా              రూ. 240.00 
3.  2 సంవత్సరాల చందా        రూ. 450.00 
4.  3 సంవత్సరాల చందా        రూ. 700.00 
5.  4 సంవత్సరాల చందా        రూ. 950.00 
6.  5 సంవత్సరాల చందా        రూ. 1100.00 
7.  10 సంవత్సరాల చందా      రూ. 2,500.00 
8.  జీవిత చందా                    రూ. 5,000.00

దళితశక్తి మాసపత్రిక చందా ఆన్లైన్ లో చెల్లించవచ్చు. Subscription in Dalithashakthi Monthly Magazine. Make payment at https://www.payumoney.com/merchant/billTool/…
Thanks, 
Manager, Dalithashakthi Monthly Magazine

Phone .9490098902, 9440154273.

Dalithashakthi Agust 2016 Monthl Magazine - DSMM

ప్రియమైన మిత్రులారా,
సామాజిక అణచివేత నుండి, ఆర్థిక దోపిడి నుండి దళితులను రాజకీయంగా చైతన్యం చేయడమే లక్ష్యంగా పని చేయాలని దళితశక్తి, మాస పత్రిక ఫ్రిబవరి 2012లో ప్రారంభమైంది. ఇప్పటికే దళితుల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం కలిగించే విధంగా ఎప్పటికప్పుడు ప్రముఖుల వ్యాసాలను ప్రచురిస్తున్నది. పత్రిక అనగానే వ్యాపారం అనే ధృక్పదంతో కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కల్పిచడమే ధ్యేయంగా పని చేస్తుంది.
కావున దళితశక్తి మాసపత్రిక చందాదారులను చేర్పించే విధంగా కృషి చేయగలరని కోరుకుంటున్నాము. మీ ప్రాంతంలో, మీ చుట్టు ప్రక్కల ఉన్న అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, విద్యా, ఉద్యోగ పరిస్థితులపై అధ్యయనం చేసిన అంశాలు, ప్రభుత్వ పథకాలపై అమలు, తీరుపై మీ దృష్టిలో ఉన్న సమస్యలతోపాటు దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు, కవితలు, పాటలు, కథలు, తదితర పంపించగలరని కోరుతున్నాము.

చందాల వివరాలు:

1.  విడి పత్రిక                       రూ. 20.00 
2.  సంవత్సర చందా              రూ. 240.00 
3.  2 సంవత్సరాల చందా        రూ. 450.00 
4.  3 సంవత్సరాల చందా        రూ. 700.00 
5.  4 సంవత్సరాల చందా        రూ. 950.00 
6.  5 సంవత్సరాల చందా        రూ. 1100.00 
7.  10 సంవత్సరాల చందా      రూ. 2,500.00 
8.  జీవిత చందా                    రూ. 5,000.00
దళితశక్తి మాసపత్రిక చందా ఆన్లైన్ లో చెల్లించవచ్చు. Subscription in Dalithashakthi Monthly Magazine. Make payment at https://www.payumoney.com/merchant/billTool/…
Thanks, 
Manager, Dalithashakthi Monthly Magazine
Phone .9490098902, 9440154273.


ఎన్నాళ్లీ బానిస బతుకులు - DSMM

అనాది నుంచి ఒక మనిషి కష్టం వల్ల లభించే ఫలితాన్ని మరొక రు అనుభవించడం, సుఖ పడడం, శ్రమ దోపిడీ చేయడం జరుగుతూనే ఉన్నది. అలా అసలు కష్టపడ్డ జీవికి జీవితాంతం కష్టాలు మిగిల్చడం ద్వారా ఏర్పడేదే బానిసత్వం. శ్రమ దోపిడీకి గురవుతున్నవ్యక్తి బానిసగా మిగిలినట్టే. అంతులేని వ్యధను మిగిల్చే శ్రమదోపిడీకి అరికట్టేందుకు ఎన్నో శతాబ్దాలుగా ఎందరో కృషి జరుగు తున్నప్పటికీ దాస్యం మాత్రం నిరంతరం కొన సాగుతూనే ఉంది. ఆధునిక యుగంలో వెట్టిచాకిరీకి చట్టబద్దత లేకున్నప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో అది పలు రూపాల్లో మనగలుగు తూనే ఉండడం దురదృష్టకరం. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యం లో వెట్టిచాకిరీ మరింత విస్తరించగలుగుతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కీర్తి సంపాదించుకున్న స్వతంత్ర భారత దేశం ఇప్పుడు బానిసత్వం ఎక్కువగా ఉండే దేశాల్లో అగ్రగామిగా నిలవడం మన పాలకుల పాపాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.


మనిషితనాన్ని మింగేస్తున్న కులతత్వం -DSMM






Saturday, June 4, 2016

Dalithashakthi Monthly Magazine June 2016 Edition








Dalithashakthi Monthly Magazine June 2016 Edition

సంపాదకీయం


విద్య ద్వారానే సామాజిక న్యాయం, ఆర్థిక స్వాలంభన, రాజ్యాధికారం లభిస్తుందని భాగ్యరెడ్డి వర్మ, మహాత్మ జ్యోతిరావ్‌ ఫూలే, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ నుండి నేటి వరకు అనేక మంది సామాజికోద్యమనాయకులు బోధిస్తూనే ఉన్నారు. మతం పేరుతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పేదలను విద్యకు దూరం చేశారు ఆనాటి పాలకులు. నేటి లౌకిక, ప్రజాతంత్ర స్వాతంత్య్రం వచ్చి 68ఏళ్ళు గడిచిన తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పూర్తి స్థాయిలో ప్రాధమిక విద్యను అందించలేక పోతున్నారు ఈనాటి పాలకులు. 
దళితులను పాఠశాలలో చేర్చుకోవడానికి అగ్రకులాలు నిరాకరించే వ్యవస్థను గమనించిన భాగ్యరెడ్డి వర్మ 'పష్తక్వామ్‌' (డిప్రెస్‌డ్‌) పాఠశాలలను ఏర్పాటు చేసి సామాజిక విద్యా విప్లవానికి పూనాదులు నిర్మించారు. ''విద్య ద్వారానే విజ్ఞానం, విజ్ఞానం ద్వారా వివేకం, వివేకంతో అభివృద్ధి, అభివృద్ధి లేకనే అంధకారం, అంధకారానికి కారణం విద్య లేకపోవడమే'' అని విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పిన మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే అంటరానివారికి, మహిళలకు సత్యశోధక్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అనాటి నుండి నేటి వరకు విద్య కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. 
డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విద్య వ్యాప్తి కోసం పడిన శ్రమ రాజ్యాంగం రూపంలో మన ముందుకు వచ్చింది. కానీ పాలకుల మనుధర్మ విధానాల ముందు రాజ్యాంగ ఆశయాలు అనతికాలంలోనే గాల్లో దీపంలా కదిలిపోయాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 65 సంవత్సరాల తరువాత విద్యాహక్కు చట్టం చేసిన పాలకులు, దీనిని అమలు చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులు లేరనే సాకుతో మూసివేస్తున్నారు. దళితవాడలు, గిరిజన తండాల్లో ఉన్న 80 శాతం పాఠశాలలు మూసివేసి ఈ వర్గాలకు విద్య అందకుండా చేస్తున్నారు. విద్యను కొనుగోలు సరుకుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను దూరం చేస్తూ, ప్రయివేటు పాఠశాలల దగ్గరకు చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ''ప్రథమ్‌'' నివేదిక, సుప్రీంకోర్టు సూచనలను అమలుకు పూనుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.
ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని, లేనిపక్షంలో ప్రయివేటు- కార్పోరేట్‌ స్కూల్స్‌కు చెల్లించే ఫీజులకు సమానంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు చెల్లించాలని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ మన పాలకులకు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను అమలుపరిచే తీరిక లేదు. కావున సుప్రీంకోర్టు ద్వారానైనా విద్య యొక్క ప్రాధాన్యతను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉన్నది.

Dalithashakthi Monthly Magazine June 2016

విషయ సూచిక
సంపాదకీయం ... 4
రిజర్వేషన్ల ఆద్యుడు ... 5
నిబద్ధతే సామాజికతత్వం ... 9
ఆద్యుడు ఆరాధ్యుడు భాగ్యరెడ్డి వర్మ ... 12
దళితుల నాణ్యమైన విద్యకై ... 15
KG to PG  ... 19
25% ఉచిత సీట్లు ... 22
ప్రభుత్వ పాఠశాల దుస్థితి ... 23
నీలోనూ ఓ బుద్ధుడు ... 25
ఎందుకింత అసహనం ... 29
స్వచ్ఛ భారతా? స్వచ్ఛ మనస్సా? ... 32
ఆనాదిగా... ... 33
నీళ్ళ కోసం సొంత బావి ... 36విషయ సూచిక

Thursday, May 12, 2016

Dalithashakthi May 2016







సంపాదకీయం May 2016


కార్మికులకు, కర్షకులకు దళితశక్తి సామాజిక మాసపత్రిక మేడే శుభాకాంక్షలు...
మేడే అంటే కార్మికుల విరోచిత పోరాటాలకు చిహ్నాం, మేడే అంటే కార్మికుల వెట్టిచాకిరి నుండి విముక్తి పొందిన రోజు. ఆనాటి చికాగో కార్మికుల బలిదానం, పోరాట స్ఫూర్తితో ప్రపంచ కార్మికులను ఐక్యం చేసింది. పోరాడితే పోయేదేమీలేదు, బానిస సంకెళ్లు తప్ప నినాదం మేడే స్ఫూర్తే. కార్మికుల ఐక్య పోరాటాలకు, హక్కుల సాధనకు కేంద్రం అయింది. కార్మిక ఉద్యమం అణచివేతను, అన్యాయాన్ని ప్రశ్నించి, విముక్తి సాధించింది. 
భారతదేశానికి స్వాతంత్య్రరానికి పూర్వం, స్వాతంత్య్రం అనంతరం డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కార్మికులు, ఉద్యోగులకు అనేక హక్కులను చట్టాల ద్వారా, రాజ్యాంగం ద్వారా విముక్తి కల్పించారు. ముఖ్యంగా మహిళలు, బాలకార్మికులు ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేయకుండా ఆనేక చట్టాలను తీసుకువచ్చారు. ఆనాటి నుండి నేటికి కార్మికులు, ఉద్యోగులు పొందుతున్న హక్కులు, సౌకర్యాలు డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించినవే. కార్మిక చట్టాలతో పాటు కార్మికుల నూతన జీవన విధానానికి ఆయన బాటలు వేశారు. డా||అంబేడ్కర్‌ ప్రతిపాదించిన స్టేట్‌ సోషలిజంలో పరిశ్రమలు, భూమి, సహజ వనరులు, విద్యా, వైద్యం, భీమా జాతీయ యాజమాన్యంలోనే ఉండాలని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆనాడే వ్యతిరేకించారు. ఆయన పాలకుల విధానాలను ఎప్పుడూ సమర్ధించలేదు. కార్మికులకు, పీడితులకు అండగా పోరాటాలు, ఉద్యమాలను నిర్వహించారు. 1942 డిసెంబర్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లడుతూ దేశానికి శ్రామికులైన కార్మికులే సరైన ప్రతినిధ్యం వహిస్తారని చెప్పారు.
మేడే నిర్వహించే ప్రతి కార్మికుడు, ప్రతి కార్మిక సంఘం డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను తమ హక్కుల ప్రదాతగాను, కార్మికుల పితామహుడుగాను, కార్మికుల జీవితాలను అభివృద్ధి చేయడానికి చేసిన కృషిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. 
డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి అంబేడ్కర్‌ జయంతి ఉత్సహాలను నిర్వహించారు. ఆయన ఆశయాలు, విధానాలకు ముందుకు తీసుకుపోవడానికి ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చిన మన దేశ పాలకులకు మాత్రం ఆయనకు వ్యతిరేక విధానాలనే అనుసరిస్తూ తామే వారసులమని ఢంకాలు మ్రోగిస్తున్నారు. సామాజిక న్యాయానికి పునాది వెయాల్సిన ప్రభుత్వాలు బ్రహ్మణీవాదాన్ని ముందుకు తెస్తూ కులవ్యవస్థ మరింత పటిష్టంగా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సామాజికోద్యమకారులు, అభ్యుదయవాదులు ఐక్యంగా డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను, విధానాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాల్సి తక్షణ అవసరం ఎంతైనా ఉంది.

Dalithashakthi May 2016


Thursday, April 14, 2016

April 2016 Dalithashakthi Monthly Magazine

April 2016 Dalithashakthi Monthly Magazine


April 2016 సంపాదకీయం

సంపాదకీయం
రోహిత్‌, కన్నయ్య సంఘటనలు దేశ రాజకీయాల్లో పెను సంచలనమైన చర్చలను లేవనెత్తాయి. రోహిత్‌ మరణం స్వాతంత్య్రం వచ్చి 70 సం||లు గడిచినా భారత గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఉన్నత విశ్వ విద్యాలయాల్లోనూ కుల వివక్ష అతి భయంకరంగా కొనసాగుతుందనడానికి అదొక బలమైన నిదర్శనం. ఇక కన్నయ్య విషయానికొస్తే దేశ భక్తులెవరు, దేశ ద్రోహులెవరు అనే అంశంపై మొదలై ఈ దేశంలో నిజమైన జాతీయవాదం అంటే ఏమిటి? అనే అంశాలు బలంగా చర్చకు వచ్చాయి. ఈ రెండూ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని కులవివక్షపై, భారత జాతీయతాపై చర్చలను లేవనెత్తాయి. ఇలాంటి సంఘనటలను ముందే ఊహించిన భారత రాజ్యాంగ పిత, పీడిత ప్రజల విముక్తి ప్రధాత అయిన డా|| బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ''కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, ఒక నీతిని గానీ నిర్మించలేమని'', ''కులం ఉన్నంతకాలం భారతదేశం ఒక జాతిగా ఏర్పడదని కుల నిర్మూలనతోనే భారత్‌ను ఒకజాతిగా నిర్మించవచ్చని'' అభిప్రాయపడ్డారు. కానీ ఈ దేశాన్ని గత 70 సం||లుగా పరిపాలిస్తున్న బ్రాహ్మణ, అగ్రవర్ణ పరిపాలకులు మాత్రం కులం పునాదులమీదనే ఒక జాతిని, ఒక నీతిని నిర్మించవచ్చనే కలలు కంటున్నారు. 
అందుకు ఎవరూ అతీతులు కాదు. వాళ్ళు కేవలం కులవివక్ష గురించే మాట్లాడుతున్నారే తప్పా కులవివక్షకు కారణమైన కుల నిర్మూలన గురించి మాట్లాడడం లేదు. జాతీయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం కాంగ్రెస్‌, బీజేపీల లాగానే బ్రాహ్మణుల చేతుల్లో ఉన్న కారణంగా వాళ్ళు కులనిర్మూలనను తమ రాజకీయ ఎజెండాగా ఇంతవరకూ స్వీకరించలేదు. రాష్ట్ర స్థాయిలోనూ ఉన్నత కులాల నాయకత్వం కిందనే కింది కులాలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతున్నందువలన ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హతను ఈ పార్టీలు కోల్పోయాయి. అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1929లోనే శ్రామికవర్గ పోరాటంలో పాల్గొంటూ భారతీయ కమ్యూనిస్టు పార్టీలు మొదట బ్రాహ్మణులుగాను, తరువాత కమ్యూనిస్టులుగాను వ్యవహరిస్తూ మార్క్సిజాన్ని ఈ దేశ సామాజిక ఆర్ధిక వ్యవస్థకు విరుద్ధంగా అన్వయిస్తూ గుడ్డిగా మార్క్సిజాన్ని అనుకరిస్తూ శ్రామికవర్గాల చేతుల్లో వుండాల్సిన నాయకత్వం అగ్రవర్ణాలు తమ గుప్పిట్లో పెట్టుకుని మార్క్సిస్టు మనువాదులుగా మిగిలిపోయారని ఆయన బాధపడ్డారు. 
వామపక్ష పార్టీల్లోనే సామాజిక న్యాయం కరువైనపుడు బూర్జువా పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలైన ఇతర అగ్రకుల పార్టీల్లో సామాజిక న్యాయం ఎలా సాధ్యమో చెప్పాలి. అంతేకాక ఈ దేశ రాజకీయ ఎజెండాలో కులం ఉన్నంతవరకు బ్రాహ్మణ, అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూనే వుంటుంది. అంతేగాక ఈ దేశరాజకీయాల్లో 70 ఏళ్ళుగా ఆధిపత్యం చేస్తున్న ఉత్తరాది ప్రాంతం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించకుండా కాంగ్రెస్‌, బీజేపీ కమ్యూనిస్టులు అడ్డుపడి దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించి శాశ్వతంగా ఈ దేశ రాజకీయాల్లో ఉత్తరాది ఆధిపత్యం దక్ష్షాణాదిపై ఉండొద్దని 1955లోనే డా||బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఫజల్‌ అలీ కమీషన్‌కు ఒక లేఖ రాస్తూ ఉత్తరాది ప్రాంతాలకు ఏవిధంగానైతే రాజధానిగా వుంటుందో దక్షిణాది ప్రాంతాలకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయాలని ఎందుకంటే ఢిల్లీ దక్షిణాది ప్రాంతాలకు చాలా దూరంలో వున్నందున అంతేకాక శత్రుదేశాలకు ఢిల్లీ దగ్గరగా వుండి వాతావరణ సమతుల్యత లేని కారణంగా (అత్యంత వేడి, అత్యంత చలి వున్న కారణంగా) ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే సెంటర్‌ పాయింట్‌గా ఢిల్లీ లేనందున ఈ దేశాన్ని రక్షించుకోవడానికి మరో సురక్షితమైన ప్రాంతము కేవలం హైదరాబాదేనని, హైదరాబాద్‌లో దేశ రక్షణ పరిశోధన కేంద్రాలు, సమతుల్యమైన వాతావరణం వుండడమే కాకుండా ఇక్కడ రాష్ట్రపతి నిలయం ఉన్న కారణంగా ఇక్కడ సువిశాలమైన భవనాలు వున్నందున ఢిల్లీకంటే సురక్షితమైన ప్రాంతం హైదరాబాదేనని అందువల్లనే హైదరాబాద్‌ను దేశ రక్షణ దృష్ట్యా దక్షిణాది ప్రాంతాల కోరికమేరకు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలని ప్రతిపాదించాడు. 2 కోట్ల జనాభా ఆధారంగా స్థానిక సంపద, భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల విభజన జరగాలని ప్రతిపాదిస్తే ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశ రాజకీయాల్లో కొనసాగించడానికి అశాస్త్రీయంగా 80ఎంపీలున్న ఉత్తరప్రదేశ్‌ను ఒక రాష్ట్రంగాను, 2 ఎంపీలున్న గోవాను ఒక రాష్ట్రంగానూ విభిజించిన కారణంగా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా ఇంకా దేశ రాజకీయాల్లో ఉత్తరాధి ఆధిపత్యమే కొనసాగడానికి కారణం రాష్ట్రాల విభజన అశాస్త్రీయంగా జరగడమే. ఆనాడు బ్రిటీష్‌ వాళ్ళ నుండి ఆజాదీ కావాలని కోరుకున్న ఈ ఉత్తరాది నల్లదొరలు అధికారంలోకి వచ్చారు. అవినీతిపై ఆజాదీ కావాలని పోరాటం చేసిన ఉత్తరాది నాయకుడైన కేజ్రీవాల్‌ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. 
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తరతరాలుగా పీడితులైన నా జాతిప్రజలు పాలక సమాజంగా మారినపుడు మాత్రమే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించారు. అందుకే భారత రాజ్యాంగ రచనలో భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ఈ దేశ సార్వ భౌమాధికారాన్ని సామ్య వాదాన్ని లౌకికవాదాన్ని సంరక్షించడంతోపాటు ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్ధిక, రాజకీయాధికారం జరగాలని జనాభా దామాషా పద్ధతిలో ప్రతి వర్గానికి సంపదలో వాటా రావాలని ఆశించారు. డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలు, కింది కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఆశిస్తున్నాను.
ఈదేశాన్ని 60 ఏండ్లుగా పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గమైన పరిపాలనపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఆ పార్టీతో అంటగాకిన బ్రాహ్మణ, అగ్రవర్ణ ఆధిపత్య కమ్యూనిస్టు పార్టీల్లోని మనువాదాన్ని ప్రశ్నించ కుండా కేవలం బీజేపీ, హిందూత్వ బ్రాహ్మణులను మాత్రమే నిందిస్తే ప్రయోజనంలేదనేది గ్రహించాలి. ఈ దేశంలో ఉగ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, అంటరానితనం, కులవివక్ష, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు పెరగడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీ కాగా, రెండవ ముద్దాయి కమ్యూనిస్టు పార్టీలు, మూడో ముద్దాయిగా మతతత్వాన్ని రెచ్చగొడుతూ జాతీయవాదం ముసుగులో హిందూ మతోన్మాదాన్ని అగ్రవర్ణ సంపన్న వర్గాలు కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అన్నిరంగాల్లో ముఖ్యంగా ఉన్నత విద్యారంగాల్లో తమ కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న ఉత్తరాది బ్రాహ్మణాధిపత్య పార్టీ అయిన బిజెపిని అడుగడుగునా అడ్డుకోవాలని, ఈదేశంలో ప్రజాస్వామిక విలువల్ని రాజ్యాంగ రక్షణలను పరిరక్షించే ప్రతి పౌరుడు అంబేడ్కర్‌ స్ఫూర్తితో మరో స్వాతంత్య్ర పోరాటానికి పున:రంకితం కావాల్సిన రోజు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పుట్టినరోజు. మార్క్సిస్టులు, అంబేడ్కర్‌ వాదులు, లౌకిక ప్రజాస్వామిక వర్గాలు అంతా ఏకమై నూతన నవ భారతాన్ని నిర్మించాలంటే ముందుగా ఈదేశంలో కుల నిర్మూలన జరగాలి. కులం ఉన్నంతవరకు అన్నిరంగాల్లో బ్రాహ్మణ అగ్రవర్ణ మనువాద ఆధిపత్య సంపన్న వర్గాల నుండి భారత్‌ను విముక్తి చేయాలంటే ముందుగా మనువాదాన్ని అడుగడుగునా ప్రశ్నించాలి.
మీ...
డాక్టర్‌ గాలి వినోద్‌ కుమార్‌

గౌరవ సంపాదకులు

April 2016 విషయ సూచిక

విషయ సూచిక
 సంపాదకీయం
- ప్రొ||గాలి వినోద్కుమార్
-
4
రాజనీతిజ్ఞుడు
- డా||జి.వి.రత్నాకర్
-
6
భీమ్భూమికీ జై
- ప్రొ||కంచ ఐలయ్య
-
12
అంబేడ్కర్బాటే
- డా||వై.బి.సత్యనారాయణ
-
16
సత్కరజ్ఞాని
- జ్వాలిత
-
18
మన భవిష్యత్పై
- కాన్షీరాం
-
21
ధన్యులమయ్యేదేప్పుడు?
-కూకట్లపల్లి పోలయ్య
-
23
హిందూమతం
- డా||బి.ఆర్‌.అంబేడ్కర్
-
25
ఎందుకొచ్చింది?
- కంచుల జయరాజ్
-
27
విప్లవ రథసారధి
- బి.గంగాధర్
-
29
బేబి మినిష్టర్
- జి.విఠల్
-
31
కులము
- డా||గోగు వెంకటేశ్వర్లు
-
34

Dalithashakthi - 2025 - Magazines