Sunday, June 16, 2024

''ఆలోచన''

 ''ఆలోచన'' 

x

ఆలోచన అనేది మానవుల బుద్ధికి సంబంధించిన ఒక విశేష లక్షణం. ఇది మెదడుతో ముడిపడి ఉంటుంది మరియు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. భూమిపై ప్రతి మనిషి ఆలోచనా విధానం అనేది ప్రత్యేకం. ఒక మనిషి ఆలోచనలు మరొక మనిషి ఆలోచనలకు పూర్తిగా సరిపోతాయని ఆలోచనలను బట్టి మంచి లేదా చెడు చెప్పడం కష్టం. ప్రతి వ్యక్తి తన పనులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.  

ఈ ఆలోచనలను ఆధారం చేసుకొని, కొన్ని సంస్థలు మరియు వ్యక్తులు కులం, మతం, జెండర్ వంటి అంశాలలో తప్పుడు సంప్రదాయాలను కొనసాగించడానికి కృషి చేస్తున్నారు. అలాంటి తప్పుడు పద్దతులను అడ్డుకోవడంలో, ప్రజలు, ముఖ్యంగా స్త్రీలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్ బి.విజయ భారతి గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బి.విజయ భారతి పేరు తెలియని వారు చాలా తక్కువ. రచయితగా తన ఆలోచనలను పుస్తకాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేశారు. ముఖ్యంగా స్త్రీల గురించి ఆమె కృషి మరువలేనిది. బానిస సమాజం నుండి నేటి ఆధునిక సమాజం వరకు స్త్రీల అణచివేత, అసమానతలపై ఆమె రచనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలో ఉన్న కులం, మతం, జెండర్ గురించి ఆమె అనేక పరిశోధన పత్రాలు రాశారు మరియు పుస్తకాల రూపంలో అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

తన ఆలోచనల్లో వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను డాక్టర్ బి.విజయ భారతి గారు 'దళితశక్తి' మాసపత్రికలో ప్రచురించడం ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఆమె కృషి మానవ సమాజంలో సమానత్వం మరియు న్యాయసంస్థలను బలపరచడంలో కీలకంగా ఉంది. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడంలో, సాంఘిక న్యాయం సాధించడంలో ఆమె పాత్ర అత్యంత ముఖ్యమైనది.

''ఆలోచన'' పేరుతో డాక్టర్‌ బి.విజయ భారతి గారు రచించిన వ్యాసాలను తీసుకువస్తున్నాం. 

- ఎడోటర్

Thursday, June 6, 2024

ప్రియమైన పాఠక మిత్రులకు జై భీమ్‌లు,

 ప్రియమైన పాఠక మిత్రులకు జై భీమ్‌లు,

  • మీరందరూ దళితశక్తి మాసపత్రికకు చూపుతున్న ఆదరణకు హదయపూర్వక కతజ్ఞతలు, జై భీమ్‌లు. మీ మద్దతుతో మన పత్రిక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన పత్రికగా నిలిచింది. ఇది మన సమాజంలో, ముఖ్యంగా దళిత, బహుజన ప్రజల్లో, ఒక గొప్ప మార్పును తీసుకువచ్చే పత్రికగా నిలవాలనే మన అభిప్రాయం నిజమైనదని నిరూపిస్తోంది.
  • డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరామ్‌ల ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు మన పత్రిక నిరంతరం కషి చేస్తోంది. ఈ ప్రయాణంలో మీ అండదండలు ఎంతో ముఖ్యమైనవి. ఇంతవరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఆర్థిక వనరులు లేక పత్రికలు నిలబడలేకపోయాయి.
  • ''మాటలు కోటలు దాటిపోతున్న... చేతులు గడప దాటవన్నట్లు'' ఉంది మన పరిస్థితి. ఆచరణ, అమలు రెండు కండ్ల వంటివి. మనం ఒక్క కన్నుతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అందుకే మనం మనవరకే పరిమితం అయిపోతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న మన దళితశక్తి మాసపత్రికకు మీ వంతు సహాయం, సహకారం, చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
  • మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే దళితశక్తి పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని మన పత్రిక విజ్ఞప్తి చేస్తోంది.
చందా కాల పరిమితి:
  • 1 సం.రూ. 600/-
  • 3 సం. రూ.1,500/-
  • 5 సం|.రూ.2,500/-



మీ ఎడిటర్‌

Editorials

దేవుడి పాలనలో శాస్త్రీయత ఎంత?

  • ''మొదట్లో, మా అమ్మ బతికి ఉన్నన్నాళ్లూ ఆమే నాకు జన్మనిచ్చిందేమో అనుకునేవాడిని. అమ్మ వెళ్లిపోయిన తర్వాత, నా మొత్తం అనుభవాలనూ కలిపి చూస్తే నాకు నిశ్చయంగా ఓ విషయం అర్థమయింది. నన్ను ఆ పరమాత్ముడే ఈ లోకానికి పంపించాడు. ఈ శక్తి ఒక భౌతికమైన శరీరంతో వచ్చింది కాదు. ఈ శక్తి ఏదో ఒక పనికోసం ఈశ్వరుడు నాకు ఇచ్చింది. నాకు ఈ జీవితమే కాదు, దయా, ప్రేరణా అన్నీ ఆయనే ఇచ్చాడు. పురుషార్థం సాధించే ఈ సామర్థ్యమూ ఆయనే ఇస్తున్నాడు. నిజానికి నేనేమీ కాను. నేను ఒక పనిముట్టును. నా రూపం ద్వారా ఈశ్వరుడు ఏమి చేయదలచుకున్నాడో అవి చేస్తున్నాడు. అందుకే నేనేమైనా చేస్తున్నానంటే బహుశా ఈశ్వరుడే నాతో చేయిస్తున్నాడని అనుకుంటాను'' విలేకరి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ స్వయంగా అన్న మాటలివి. జ్ఞానం మనిషి పుట్టుక పరిణామాన్నీ శాస్త్రీయంగా నిర్దారించినప్పటికీ ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలీ. ఇలాంటి మాటలు ఎవరైనా అంటే పిచ్చి ముదిరి పాకాన పడింది అనుకుంటాం. శాస్త్రీయంగా ఆలోచించే ఏ వ్యక్తి ఇలాంటి వ్యాఖాలు చేయరు, మతోన్మాదులు మాత్రమే ఇలాంటి చేస్తారు. మరి నరేంద్ర మోడీని ఏమనాలి?
  • నరేంద్ర మోడీ ద్వారా దేశం లౌకికవాదం వర్థిలుతుందా? దేవుడి పరిపాలనలోని వారు భౌతికవాదం, శాస్త్ర, సాంకేతికను ఎలా ముందుకు తీసుకుపోతారు. దేశం వెలిగిపోతుంది నుండి దేవుడి పాలన మారింది. ప్రధానమంత్రిగా ఆయన దేశాన్ని సరియైన మార్గంలో నడిపిస్తాడని భౌతికవాదులు, శాస్త్రీయంగా సాంకేతికను ఎలా ముందుకు నడిపిస్తారు? దేశంలో నూతన విద్యావిధానం నరేంద్ర మోడీ అందుకే ప్రవేశపెట్టారని ఇప్పుడు అనిపిస్తుంది.
  • నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాల నుండి సాంకేతిక విద్యా సంస్థలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు. దేవుడే మార్చాలా? ప్రభుత్వం నిధులు కేటాయించి, విద్యార్థుల కనీస అవసరాలు తీరుస్తుందా? అనేది ప్రశ్నగానే మిగులుతుంది.
  • ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజుల భారం మోయలేక పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటీవల కాలంలో ప్రభుత్వ స్కూల్స్‌, కాలేజీలకు పంపలేని దుస్థితి నేలకోల్పారు. పేదలను విద్యాకు దూరం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రపంచంలో భారతదేశం ఏవిధంగా వెలిగిపోతుందో సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థ, సాంకేతికత, శాస్త్రీయత ముందుకు తీసుకెళ్లడంలో తీసుకుంటున్న చర్యలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలి.
  • కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తమ విధానాలను మరింతగా అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించలేని స్థితికి తీసుకువస్తుంది. భవిష్యత్తులో భారతదేశం ఎంతగా వెలిగిపోతుందనేది విద్య, సాంకేతికత, మరియు సమాన అవకాశాల కల్పనపై ఆధారపడి ఉంటుంది.

Saturday, May 4, 2024

Editorials

బాధ్యతారాహిత్యం


  • రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఏప్రిల్‌ 21వ తేదీన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాటలు పార్టీలు, అనేక ప్రజాస్వామిక, హక్కుల సంఘాలు, మేధావులు కూడా ఆ మాటల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. చిన్నస్థాయి నాయకులు స్థాయికి దిగజారి సాక్షాత్తూ నరేంద్రీమోదీయే ఇంతటి తీవ్రంగా మాట్లాడడం ఆయన అభిమానులకు, బీజేపీ శ్రేణులకు కూడా జీర్ణం కావడం లేదు. దేశానికి, భారత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఇట్లా మాట్లాడి, తమ గౌరవాన్ని తగ్గించుకోవడం, దేశప్రతిష్ఠను దిగజార్చడం అన్యాయమని మేధావులు, పౌరసమాజం ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు.




  • కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే, అది సంపదనంతా ముస్లిములకు పంచిపెడుతుందని మోదీ అన్నారు. పిల్లలెక్కువగా కనేవాళ్ళు, చొరబాటుదార్లు, అని కూడా ముస్లింలను దష్టిలో పెట్టుకుని మోదీ వ్యాఖ్యానించారు. సంపదను ముస్లింలకు పంచిపెట్టడమనే వాదనకు మూలం, ప్రస్తుత ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్నదేమో అనుకుంటే పొరపాటు. ఎప్పుడో పద్ధెనిమిది సంవత్సరాల కిందట అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జాతీయాభివద్ధి మండలిలో చేసిన వ్యాఖ్యలను విచిత్రంగా అన్వయించి, మోదీ తన వాదనకు ఉపయోగించుకున్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలు, మైనారిటీలు, స్త్రీలు, పిల్లలు, ఈ శ్రేణుల అభివద్ధి కోసం చేయవలసిన ప్రణాళికారచన గురించి, మౌలికసదుపాయాల కల్పన గురించి ప్రస్తావిస్తూ, మన్మోహన్‌ సింగ్‌, అభివద్ధి ఫలాలలో మైనారిటీలు న్యాయమైన భాగం పొందడానికి సజనాత్మకంగా పథకరచన చేయాలని అన్నారు. వనరులను ప్రాధాన్య ప్రాతిపదికన పొందే హక్కు వారికి ఉండాలని కూడా అన్నారు. ఆ మాటలనే ఇప్పుడు తన తీవ్ర వ్యాఖ్యలకు ఇంధనంగా ఉపయోగించుకున్నారు. మన్మోహన్‌ మాటలకూ, మోదీ వ్యాఖ్యానానికీ ఏమైనా పొంతన ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతున్నది. తరువాత రోజు కాంగ్రెస్‌ పార్టీ ప్రజల దగ్గర ఉన్న ఆస్తులను, బంగారాన్ని, నగలను ఆ పార్టీ లాగేసుకుంటుందని, దానిది మావోయిస్టు తరహా అని స్త్రీలను భయభ్రాంతులను చేసే విధంగా నిందించారు.

  • సమాజంలోని ఒక వర్గం మీద తక్కిన ప్రజలకు ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచే వ్యాఖ్యలను ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. ఎన్నికలప్రచారంలో భాగంగా అసలే చేయకూడదు. ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్‌ 123(3), 123(3ఎ) ప్రకారం మతం, జాతి, కులం, భాష తదితర ప్రాతిపదికలమీద ఓటు వేయమని కానీ, వేయవద్దని కానీ చెప్పడం నేరం, పౌరులలో ద్వేషభావాన్ని, శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం శిక్షార్హం. నేరం నిరూపణ జరిగితే, ఎన్నికలలో పోటీచేయకుండా ఆరేళ్లపాటు నిషేధించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నిర్దేశించే నమూనా ప్రవర్తనా నియమావళి ప్రకారం కూడా, ప్రజలలో ఇప్పటికే ఉన్న వైషమ్యాలను పెంచడం కానీ, కొత్తవి కల్పించడం కానీ అనైతికం. చట్టాన్ని, నియమావళిని కూడా ఉల్లంఘించిన ఆరోపణలను స్వయంగా ప్రధానమంత్రి ఎదుర్కొనవలసిరావడం విచారకరం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎన్నికల సంఘం స్పందన కర్తవ్యనిష్ఠకు తగినట్టుగా కనిపించడం లేదు. మునుముందు ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. దేశవ్యాప్తంగా ఈ వివాదం మీద వ్యక్తమవుతున్న ఆందోళనను గమనిస్తే, న్యాయవ్యవస్థ కూడా కల్పించుకోవలసిన పరిస్థితి రావచ్చుననిపిస్తుంది.]

  • మొదటి దశ పోలింగ్‌ తీరు నిరాశ కలిగించిందా? మొత్తంగా ఉత్తరాదిలో, ప్రజాస్పందన గత ఎన్నికలకు భిన్నంగా కనిపించిందా? ఓటింగ్‌ శాతాలు తక్కువగా ఉండడం బీజేపీకి అనుకూల సంకేతాలా? అనుకూల ఓటర్ల నిరాసక్తతా? ఈ ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. నిన్నటి దాకా 400 సీట్ల లక్ష్యం గురించి మాట్లాడినవారు, ఇప్పుడు అకస్మాత్తుగా అంచనాలలో ఏమి మార్పు వచ్చింది? ఒకవేళ, కొంత ఎదురుగాలి వీస్తున్నట్టు అనిపించినా, భయాందోళనలతో చివరి నిమిషంలో బాధ్యతారహితమైన ప్రచారాలకు ఒడిగట్టడం, పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ స్థాయికి తగినది కాదు. 

Sunday, April 28, 2024

Articles

 2024 ఎన్నికల వార్ @ Online 

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఏ విషయాన్ని అయినా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు మన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఒక వేదికగా సోషల్ మీడియా అందరికీ చేరువవుతోంది. సోషల్ మీడియా ప్రాధాన్యతను పసిగట్టిన రాజకీయ పార్టీలు దీనికి సంబంధించిన అన్ని ప్లాట్ ఫాంలను విరివిగా వినియోగించుకుంటూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయాలలో సోషల్ మీడియాను ఎంత ఉపయోగించుకుంటే ఆయా పార్టీలకు అంత ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఈ సోషల్ మీడియా యుగంలో 2024 సార్వత్రిక ఎన్నికల వార్లో ఆన్లైన్ కీలకపాత్ర పోషించనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత యూ ట్యూబ్ చానల్ సబర్స్ సంఖ్య ఇటీవల 2 కోట్లు దాటింది. ప్రపంచ అధినేతల్లో మోదీకే అత్యధికంగా సబ్ స్కైబర్స్ ఉన్నారు. దాదాపు ప్రతి సందేశాన్ని ఆయన తన యూ ట్యూబ్ చానల్ ద్వారా పంపిస్తున్నారు. గత డిసెంబర్లో ఆయన యూ ట్యూబ్ చానలి కి సుమారు 23 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇది మన దేశ సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవా త్మక మార్పుకు ఒక సంకేతం. రాజకీయ గోల చేసే సంప్రదాయ టీవీ చానళ్ల నుంచి ప్రేక్షకులు దూరం జరుగుతున్నారు. టీవీలో, పేపర్లో వాళ్లు ఇచ్చిందే చూడాలి. డిజిటల్ మీడియాలో అయితే తమకు నచ్చింది చూసే అవకాశం ఉండటంతో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సామాజిక మా ధ్యమాలతో పాటు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ చానళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం రావడంలోనూ డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించింది. 130 కోట్లకు పైగా ఉన్న మన దేశ జనాభాలో సుమారు 75 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో సుమారు 59 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం 1980 తర్వాత పుట్టిన మిలేనియల్స్ (జనరేషన్ వై). 1995 తర్వాత పుట్టిన జనరేషన్ జెడ్ సమాచారం కోసం డిజిటల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి, ఆ సమస్య పై అభి ప్రాయాన్ని తెలుసుకోవడానికి యూ ట్యూబ్ చూస్తా మని పలువురు చెప్పారు. వీరిలో ఎక్కువమంది తమ భావాలకు అనుగుణంగా ఉండేయూ ట్యూబ్ చానల్స్ చూస్తున్నారు. ఈ మార్పును పసిగట్టిన రాజకీయ పార్టీలు సొంత మీడియా కంటే, డిజిటల్ మీడియా పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.

వార్ రూమ్ నుంచి సమాచారం

ప్రధాన పార్టీల వార్ రూమ్ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, యూ ట్యూబ్ నుంచే పంపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా యూ ట్యూబ్ లో బీజేపీకి సుమారు 51 లక్షలు, కాంగ్రెస్కి 38 లక్షల మంది సబబర్స్ ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎఎస్కి లక్షా పదివేలు, బీజేపీకి 24 వేలు, కాంగ్రెస్ కి 20వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో టీడీపీకి సుమారు 3 లక్షలు, వైఎస్సార్సీపీకి 4లక్షలు, జనసేనకు 13 లక్షల సబ్స్కబర్స్ ఉన్నారు. వీటికి తోడు దేశంలోని ప్రతి ప్రధాన పార్టీకి రకరకాల పేర్లతో సుమారు 500 వరకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి. వాట్సాప్ లో కంటెంట్ని నిరంతరం షేర్ చేయడం కోసం ఆయా పార్టీలు పెద్దఎత్తున వాలంటీర్ల ను కూడా నియమించుకుంటున్నాయి. అందరికంటే ముందు సోషల్ మీడియా ఆయుధాన్ని వాడటం మొద లుపెట్టిన బీజేపీకి దానికి రెండు వైపులా పదునుందని బాగా తెలుసు. బీజేపీకి మేలు చేస్తున్న ఆ కత్తి కీడు కూడా చేయగలదని ఆ పార్టీ గుర్తించింది. అందుకే, బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేషన్ బిల్లు 2023 ద్వారా డిజిటల్ న్యూస్, ఓటీటీ కంటెంట్ని సెన్సార్ షిప్ చేయాలను కుంటోంది. చైనా కూడా ఇలాంటి సెన్సార్ ప్రయత్నా లు చేసి సఫలం కాలేకపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా విచ్చలవిడితనాన్ని అడ్డుకోలేకపోతున్న నియంత్రణ సంస్థలు, డిజిటల్ మీడియాను కట్టడిచేయడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బహిరంగ సభలు, రోడొషోలు, టీవీ చర్చలకే పరిమితం కాకుండా సోషల్ మీడియాకు రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యతని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్ని కల వారి ఆన్లైన్లో హోరాహోరీగా జరగబోతోంది.

యూ ట్యూబర్స్ కీలక పాత్ర

మెయిన్ స్ట్రీమ్ జాతీయ న్యూస్ చానళ్ల కంటే కూడా హిందీలో కోటిన్నర సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ రాథేయూట్యూబ్ చానల్నే ఎక్కువ మంది చూడటం దీనికి తార్కాణం. ఆయన దేశంలో జరిగే కరెంట్ ఎఫైర్స్ పైన, రాజకీయ అంశాలపై వీడియోలు చేస్తారు. ఇలాంటి వీడియోలనే తెలుగులో ప్రొఫెసర్ నాగేశ్వర్, తులసి చందు, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, సి. వనజ లాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీడియోలు చేస్తున్నారు. వీరిపై ప్రజలకు విశ్వసనీయత ఉండడంతో ఈ వీడియోలకు ఆదరణ లభిస్తోంది. వీరితో పాటు కేవలం కొన్ని పార్టీల భావజాలాల్ని వ్యాప్తి చేసే యూ ట్యూబర్స్ కూడా ఉన్నారు. ఆయా భావజాలాల్ని ఇష్టపడే లక్షలాది మంది ఆ చానళ్లకు ప్రేక్షకులుగా ఉంటున్నారు. పలు రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ యూ ట్యూబర్స్ని తమవైపు తిప్పుకుని, తమకు అనుకూలమైన అభిప్రాయాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, యూట్యూబర్స్ ఒక పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్టు కనిపిస్తే, వారికి వ్యూస్ తగ్గుతున్న సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇండిపెండెంట్ యూ ట్యూబర్స్నే అధికశాతం మంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

యూ ట్యూబ్ చానల్స్ తీవ్ర ప్రభావం

ఎన్నికల్లో గెలవడానికి 32 మెడికల్ కాలేజీల కంటే, ఫేక్ న్యూస్ ప్రచారాన్ని అడ్డుకోవడానికి 32 యూ ట్యూబ్ చానల్స్ పెట్టుకోవాల్సింది అని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వ్యాఖ్యానించారు. వాస్తవానికి అలాంటి యూ ట్యూబ్ చానల్స్ ప్రభావం చాలా తక్కువ. తెలంగాణ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి వందలాది యూట్యూబ్ చానల్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చాయి. కానీ, ప్రేక్షకులు ఇలాంటి యూట్యూబ్ చానళ్లని చూడటానికి ఇష్టపడటం లేదు. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత కూడటగట్టడంలో పెద్ద పెద్ద టీవీ చానళ్ల కంటే, తీన్మార్ మల్లన్న నడుపుతున్న క్యూ న్యూస్, రఘు నడుపుతున్న మన తొలివెలుగు చానళ్లు కీలకపాత్ర. పోషించాయి. వారి చానళ్లకు లక్షల్లో వ్యూస్ రావడంతో పాటు, వారి క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరు తమ యూ ట్యూబ్ చానల్స్ లో చెప్పినవాటినే ప్రజలు కూడా తమ అభిప్రాయాలుగా చెప్పడం చాలా చోట్లా పీపుల్స్ పల్స్ బృందం గమనించింది. టీవీ చానళ్లలో 24 గంటలు బలవంతంగా న్యూస్ జొప్పించి, ఎజెండా సెట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, సోషల్ మీడియాలో ఎంత కావాలంటే అంతే చెప్పేందుకు అవకాశం ఉంది. దీంతో తమకు కావాల్సిన కస్టమైజ్డ్ సమాచారం లేదా విశ్లేషణ కోసం ప్రేక్షకులు యూ ట్యూబ్ చానళ్లను చూస్తున్నారు.

డిజిటల్ మీడియాపై యువత ఆసక్తి

ఒక పార్టీకి కొమ్ము కాసినట్టు ప్రేక్షకులు అనుమానిస్తే, ఆ చానల్ నమ్మకాన్ని కోల్పోతుంది. ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా వీడియోలు చేస్తున్న యూ ట్యూబర్స్ ద్వేషపూరితమైన కామెంట్స్, బెది రింపులను ఎదుర్కొంటున్నారు. మన దేశంలో 45 కోట్ల మంది అంటే జనాభాలో 32.8 శాతం మంది ప్రతి రోజూ యూ ట్యూబ్ చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి వచ్చిన ఓట్ల శాతానికి ఇది దాదాపు సమానం. యువత ఎక్కువగా డిజిటల్ మీడియాను వాడుతున్నట్టు అందరికంటే ముందు బీజేపీ గుర్తించింది. మొదటిసారి ఓటు వేసే వారిని ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఫేస్బుక్ ్న ఎక్కువగా ఉపయోగించుకున్న బీజేపీ, అక్కడ యూజర్స్ తగ్గడంతో. యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన దేశంలో పొలిటికల్ అప్డేట్స్ కోసం 40 శాతం మంది ఇన్స్టాగ్రాం, 26 శాతం యూట్యూబ్, 17 శాతం ఎక్స్, 12 శాతం ఫేస్ బుక్ మీద ఆధారపడుతుండ గా, వార్తా విశ్లేషణకు మాత్రం అత్యధిక శాతం మంది యూట్యూబ్ నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటోంది. భారత్ జోదో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ యూ ట్యూబర్స్ కి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటీవల నారా లోకేశ్ కూడా యూ ట్యూబర్స్కి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చారు.

-జంపాల ప్రవీణ్, రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ

Monday, April 1, 2024

ప్రజల ఆక్రందన - April 2024

 


సామాన్యుల పొట్టనిండితే ఎంత? నిండకపోతే ఎంత? భజనలు చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుందంటూ మోడీ మందిరాలు ప్రారంభిస్తూ, ప్రవచనాలు వల్లిస్తూ, కాలయాపన చేస్తున్నారేతప్ప ప్రజల బాధలను ముఖ్యంగా అన్నదాతల ఆక్రందనలను చల్లార్చే తరుణోపాయాలను అన్వేషించడం లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగ నియమాకాల విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. అదేవిధంగా దేశంలో నిరుపేదలు అత్యంత నిరుపేదలుగానే, పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులుగా తయారు అవుతున్నారు. ''చిత్తశుద్ధిలేని శివపూజలేలా..'' అన్నట్టు సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనే లేకుండా చర్చలు జరిపే మొక్కుబడి కార్యక్రమంగా అది మారిపోతే ఫలితం శూన్యమే కదా.

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. మూడవసారి అధికారం కోసం మోదీ నేతృత్వంలో బిజెపి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ 'ఇండియా' కూటమి పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఈ ఎన్నికలల్లో గెలవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మూడవసారి అధికారం కోసం బిజెపి వివిధ రాజకీయ పార్టీలను తన దారి తెంచుకోవడానికి సిబిఐ, ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు దేశ భవిష్యత్‌ను మారుస్తాయా? సామాన్య ప్రజలకు న్యాయం దక్కుందా? మనం వేచి చూడాల్సిందే...

జూలియన్‌ అసాంజే, ఎడ్వార్డ్‌ స్నోడెన్‌ వంటి సామాజ్య్రవాద దాష్టీకానికి బలౌతున్న స్థితి నేడు మనం చూస్తున్నాం. అయినా గన్నులకు పెన్నులు వణకవని, వెనక్కి తగ్గవని రుజువవుతూనే ఉంది. రుజువు చేయడమే జర్నలిస్టు కర్తవ్యం. కర్తవ్య నిర్వహాణలో కలంవీరులపై జరిగిన/జరుగుతున్న భౌతిక దాడుల వెనుక అధికారం ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే, అయినా అధికార పక్షంలో ఉన్నప్పుడు దాడులు, అధికారం చేజారిన వెంబటే సానుభూతి ప్రయత్నాలు చేయడం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొనసాగుతున్నది. 'యుద్ధ రంగంలో నిలబడి/ కవిత్వం రాయడం గొప్ప ఆనందా న్నిస్తుంది' అంటాడో కవి. నిరంకుశత్వం పెరిగేకొద్దీ జర్నలిస్టు కలం, కెమెరా కూడా తన వాడి పెంచుతుందే తప్ప వెనక్కి తగ్గదు.

సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ చెప్పినట్లు సులభతర న్యాయం దేశప్రజల హక్కు. వాస్తవంలో దానికి సరైన మన్నన దక్కుతోందా అంటే, లేదన్నదే కొన్నేళ్లుగా జవాబు. సుప్రీంకోర్టులోనే పెండింగ్‌ కేసుల సంఖ్య 80వేలకు పైబడి ఉన్నావు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో దాదాపు 50 లక్షలు, జిల్లా, తాలూకా కోర్టుల్లోనైతే సుమారు 4.3కోట్లకు చేరింది. గత రెండున్నర దశాబ్దాల తరువాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. మధ్యవర్తిత్వ చట్టం, భవిష్యత్తులో చేపట్టనున్న ఇంకొన్ని చర్యల ద్వారా కోర్టులపై పనిభారం తగ్గుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వెలి బుచ్చుతున్నా- దేశ వ్యాప్తంగా అసంఖ్యాక కక్షిదారులు నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. దిగువస్థాయి న్యాయస్థానాల్లోనే 30 ఏళ్లకు పైబడి మోక్షానికి నోచని వ్యాజ్యాలు లక్షకు మించిపోయాయి. సంస్కరణలు ఖాళీల భర్తీ, మౌలిక వసతుల పరికల్పనతో మొదలై డిజిటలీకరణతో ఊపందుకోవాలి. వాయిదాల సంస్కతిని దుంపనాశనం చేయాలన్న చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచన సహర్షంగా స్వాగతించదగినది. సరళమైన ప్రాంతీయ భాషలో తీర్పులివ్వాలి. జిల్లాస్థాయి వరకు అన్ని కోర్టుల్లోనూ జనం భాషలోనే కార్యకలాపాలు సాగించాలన్న ప్రతిపాదనలకూ సత్వరం దక్కుతుంది. తీర్పులివ్వడంలో జడ్జీలకు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లనుంచి స్వేఛ్ఛ లభిస్తే కక్షిదారుల్లో న్యాయస్థానాల పట్ల నమ్మకం ఇనుమడిస్తుంది. రాజ్యాంగ విలువల గీటురాయిపై శాసనాల చెల్లుబాటును తీర్మానించే సుప్రీంకోర్టు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆశీద్దాం. 

April 2024

 

April 2024

  • కవర్‌ పేజీ - భారతదేశ ఎన్నికల చిత్రపఠం

  • ప్రజల ఆక్రందన - సంపాదకీయం

  • మోగింది ఎన్నికల భేరి - కవర్‌స్టోరీ 

  • బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ - కవిత 

  • భారత్‌ వికసిస్తోంది..? ఏదీ, ఎక్కడీ 

  • అప్పుల ఊబిలో దేశం 

  • దళితశక్తి ప్రతినిధిపై దాడి 

  • చదువులు విలువలు నేర్పాలి

  • ఒక్క శాతం మంది చేతిలో 40శాతం సంపద 

  • కాలయాపనకు చెల్లుచీటీ మధ్యమర్తిత్వం 

  • నిరుద్యోగం రూపుమపడం... సాధ్యమా? 

  • దేశంలో పేదరికం తుగ్గుతుందంటా...? 

  • పరాన్నజీవి

  • మనస్సును శుద్ధిచేయు ధర్మం

Friday, March 29, 2024

శిక్షిస్తాం: ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌


దళితశక్తి ప్రకాశం జిల్లా ప్రతినిధి యామర్తి అంజనేయులుపై దాడి చేసిన అగ్రకుల పెత్తందార్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ బాబును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ బాబు మాట్లాడుతూ ప్రకాశం ఎస్పీతో నివేదిక తెప్పించి నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం శిక్షించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ఫ్రాన్సిస్‌ రాజు, కెవిపిఎస్‌ అధ్యక్షులు అండ్ర మాల్యాద్రి, దళితశక్తి విజయవాడ ప్రతినిధి దాసరి రంగనాథ్‌, బిఎస్‌పి నాయకులు పెగ్గం ప్రసాద్‌, రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు మర్రి సోహన్లాల్‌, లిబరేషన్‌ ఫ్రంట్‌ నాయకులు మంద ప్రసాద్‌, ఆహా రాష్ట్ర అధ్యక్షులు మెండం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Friday, March 22, 2024

ఖండన

దళితశక్తి ప్రకాశం జిల్లా ప్రతినిధి యామర్తి అంజనేయులుపై దాడి చేసిన అగ్రకుల పెత్తందార్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళితశక్తి ఎడిటర్‌ బి.గంగాధర్‌, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ఎడిటర్స్‌ నీలం పుల్లయ్య, కళింగ లక్ష్మణరావు, దళితశక్తి విజయవాడ ప్రతినిధి దాసరి రంగనాథ్‌ ప్రకాశం జిల్లా ఎస్పీని డిమాండ్‌ చేశారు. పెత్తందార్లు యామర్తి అంజనేయులుపై చేసిన దాడిని దళిత, ప్రజాసంఘాలు, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులు ఖండించారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు.

Thursday, January 4, 2024

సంపాదకీయం - జనవరి 2024


తమ భావాలను నిర్భయంగా వెల్లడించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనది. భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించడం, అసమ్మతిని ప్రకటించడం, విమర్శించడం దేశహితానికి దోహదపడతాయి. వాటి ముసుగులో వైషమ్యాలను రాజేస్తే విద్వేష వ్యాఖ్యలేమో ప్రజాభద్రతను పెళ్ళగిస్తాయి. హింసోన్మాద జ్వాలలను ఎగదోసి- రాజ్యాంగ ఆదర్శమైన సౌభ్రాతత్వాన్ని బూడిద చేస్తుంది. అటువంటి హేయధోరణులపై సుప్రీంకోర్టు కొన్నేళ్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్వేషాల మందుగుండును దట్టించిన మాటల తూటాలను పేల్చేవారిపై సుమోటోగా కేసులు నమోదుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం మొన్న ఏప్రిల్‌లో అన్ని రాష్ట్రాలను సూచించింది. దేశ లౌకిక స్వరూప స్వభావాలను ఛిన్నాభిన్నం చేసే ద్వేషపూరిత ఉపన్యాసాలను తీవ్రనేరాలుగా పరిగణించాలని 'సుప్రీంకోర్టు' అప్పట్లో స్పష్టంచేసింది. విభిన్న వర్గాల నడుమ వైమనస్యానికి పురిగొల్పితే కఠిన పర్యవసానాలను ఎదుర్కోక తప్పదనే సందేశం అందరికీ చేరాలని న్యాయపాలిక తాజాగా మరోసారి ఉద్ఘాటించింది. విద్వేష వ్యాఖ్యల నిరోధానికి ప్రత్యేక పాలనా పాలనా ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టే గతంలో తూర్పారపట్టినట్టు- ప్రభుత్వాల అసమర్థత కారణంగానే విషపూరిత ప్రసంగాలు పెచ్చరిల్లుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం- 2014 తరవాత ఆరేళ్లలో ఇటువంటి కేసులు అయిదింతలయ్యాయి. కులం, మతం, ప్రాంతం, భాష, ఆహారం, ఆహారం తదితరాల పేరుతో సాటి మనుషులపై విషం కక్కుతున్న వ్యక్తులు నేడు కోకొల్లలు. జుగుప్సాకరమైన వదరబోతుతనంతో సామాజిక శాంతిని దహిస్తున్న వారిలో రాజకీయ నాయకులది పెద్ద వాటా కావడమే దేశ ప్రారబ్ధం.

ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, ఏహ్యభావనల వ్యాప్తికి ప్రయత్నించడం వాటిని ఎన్నికల భ్రష్టాచారాలుగా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3ఏ) నిరూపిస్తోంది. జనవర్గాల మధ్య విభేదాలను తీవ్రతరం చేసే, పరస్పర ద్వేషానికి పాలుపోసే పెడపోకడలకు పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శక నియమావళి సైతం నిర్దేశిస్తోంది. కానీ, ఇవేమీ క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. పనిగట్టుకుని తమ ఉపన్యాసాలతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే నాయకులపై ఈసీ చేతలూ పదును తేలడం లేదు. ఎన్నికల ప్రచారంలో నేతల వాక్కాలుష్యంపై నిర్వాచన్‌ సదన్‌ నిర్లిప్తతను సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితమే ఎండగట్టింది. అయినప్పటికీ నిరుడు పోలింగుకు వెళ్ళిన రాష్ట్రాల్లో విద్వేష ప్రచారం అవధులు దాటినట్లు విశ్లేషణలు వెలుగుచూశాయి. తాజాగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారపర్వాల్‌లోనూ నేతలూ వారి అనుచరుల నోట అవాంఛనీయ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. విద్వేషాగ్నులకు ఆజ్యం పోసిన కేసుల్లో నిందితులైన వారు- రాజ్యాంగానికి విధేయంగా మెలగుతామంటూ, దేశ సమగ్రతను సంరక్షిస్తామంటూ చట్టసభల్లోకి అడుగుపెడుతుండటమే విస్మయకరం. దేశంలో 33 మంది ఎంపీలు, 74 మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి కేసులు నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఇటీవలే ఉన్నాయి. తమ మాటలూ చేతలతో సామాజిక సమరస్యాన్ని చెడగొట్టే, మూకదాడులకు ప్రేరేపించే వ్యక్తులను కఠినంగా దండించేందుకు ప్రస్తుత చట్టాల్లో మార్పుచేర్పులు అత్యవసరం. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం విద్వేష ప్రచారకులకు పెద్దపీట వేస్తున్న పార్టీల పిదపబుద్ధులూ మారాలి. అప్పుడే జాతి ఐక్యతకు ప్రోదిచేసేలా జనభారతంలో సోదరభావం వికసిస్తుంది.

- సంపాదకీయం

జనవరి 2024 మాసపత్రిక

 


జనవరి 2024 మాసపత్రిక 


2026