Wednesday, December 27, 2023
Thursday, December 7, 2023
డిసెంబర్ 2023 మాసపత్రిక
డిసెంబర్ 2023 మాసపత్రిక
తెలంగాణలో అధికారం మార్పు?
బర్రెలక్క (శిరీష) తెగువతో... ప్రజాస్వామ్యంలో నూతనాధ్యాయం
మనుసాహిత్యాన్ని చీల్చి చెండాడిన.. ప్రపంచ సాహితీవేత్త బాబాసాహెబ్
అసమానతలు తొలగినప్పుడే... అసలైన అభివృద్ధి
అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన... సంక్షేమం ప్రజల హక్కుగా మారాలి
కులగణనతో అసమానతలపై కొత్త పోరు
భ్రమలో బతుకుతున్న మనిషి
వైద్యం... అందరికీ దక్కని భాగ్యం
ఉద్యమకారుడి పాలనలో...ఆకాంక్షలు-అణచివేతతో గాడి తప్పిన పాలన
కొత్త చట్టాలు.. కొత్త సమస్యలు
అఖిల భారత న్యాయసేవ అవసరం
ఈ మట్టిని గౌరవిద్దాం
Sunday, December 3, 2023
Thursday, November 30, 2023
తెలంగాణ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మూడవసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,26,18,205 మంది ఓటర్లలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల వారిగా అధికార బిఆర్‌ఎస్, కాంగ్రెస్ 119, బిజెపి 111, బిఎస్‌పి 107, ఎంఐఎం 9, సిపియం 19, జనసేన 8, సీపీఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడుగురు ఎమ్మెల్యేలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్యేలతోపాటు 1,779 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, 1 ఎన్నికల ట్రాన్స్‌జెండర్ ఈ బరిలో ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో దివ్యాంగుల కోసం 120, మహిళల కోసం 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644 ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638, భద్రాచలం నియోజకవర్గంలో అతితక్కువగా 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పరిమితం చేసింది. దాదాపు 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రిన్యను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉంగా భద్రాచలంలో 1,48,713 మంది మాత్రమే ఉన్నారు. ఎబ్బీనగర్ నియోజనవర్గంలో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు, బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో అతితక్కువగా ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్, 54 నియోజకవర్గాల్లో రెండు, 10 నియోజకవర్గాల్లో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.
ముచ్చటగా మూడో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడ్డాక హౌరాహౌరీగా సాగుతున్న తొలి త్రిముఖ పోరులో అధికార భారాసకు విపక్ష కాంగ్రెస్, భాజపాలు తీవ్ర పోటీనిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి ఐదురాష్ట్రాల అసెంబ్లీల సమరాంగణంలో ఇదే చివరి పోరు...! రాష్ట్రం సాధించి, తొమ్మిదిరేళ్లుగా ఎంతో అభివ ద్ధి చేశామంటున్న అధికార పార్టీ ఒకవైపు, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, ఒక్కసారి ఆదరించాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీ మరో వైపు, డబుల్ ఇంజిన్ సర్కారుకు మద్దతివ్వాలంటున్న అధికార పార్టీ ఇంకోవైపు. ఇలా ద్విముఖ, త్రిముఖ పోటీలో తమ తీర్పును ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేస్తున్న రోజు ఇది. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ ఓటర్లు ఉన్న ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? మార్పును కోరుకుంటారా? లేక త్రిశంకును తీర్మానిస్తారా? ... ఫలితం ఏదైనా ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఓటున్న ప్రతి ఒక్కరూ ఇంట్లోంచి కాలు కదిలించి... ఈవీఎంలపై వేలు మీటే విద్యుక్త ధర్మం నెరవేర్చాల్సిందే! మరి పదండి పోలింగ్‌కు...
- B Gangadhar, Editor
Monday, November 6, 2023
Wednesday, November 1, 2023
జాతి తలరాతను మార్చేది... ఓటు
Tuesday, October 31, 2023
నీవే లేకుంటే...
నీవే లేకుంటే...
నీవే గనుక లేకుంటేమా బతుకులు ఇప్పటికీ
తెల్లారేవే కావు!
మూతికి ముంత, ముడ్డికి ఆకు
అలానే వ్రేళ్ళాడుతుండేవి!
తలలు పంకించి, చేతులు ముడుచుకుని
దిక్కులు వెతుక్కుంటూ ఉండేవాళ్ళం!
బిత్తర బిత్తరగా బ్రతికే వారు!
కార్మికులు యంత్ర బాహువులకి చిక్కి
నలిగి బూడిదయ్యేవారు!
ఓటు మొగమే చూసే వారం కాదు.
బడి గడప తొక్కేవాళ్ళమే కాదు!
నీవే గనుక లేకుంటే
గుక్కెడు నీళ్ళ కోసం
అలమటించాల్సి వచ్చేది!
గుప్పెడు మెతుకుల కోసం
అల్లాడాల్సి వచ్చేది!
మహద్ సత్యాగ్రహం చేసి
మా బతుకుల్లో వెలుగు పంచావు!
మనుధర్మ శాస్త్రాన్ని తగుల బెట్టి
మాలో ఆత్మ విశ్వాసం నింపావు!
నీవే గనుక లేకుంటే
దేవాలయాల గడప తొక్కనిచ్చేవారే కాదు!
పతనార్ల జీవితాల్లో
సంతోషం వెల్లువిరిసేదే కాదు!
శ్రామికుల బతుకుల్లో
నవ్వులు విరబూసేవే కాదు!
నీవే గనుక లేకుంటే
ఈ దేశానికి రాజ్యాంగం
ఎవరు రాయగలిగేవారు?
అంత పెద్ద బాధ్యతను
ఎవరు తలకెత్తుకొనగలిగేవారు
ఈ దేశంలో బౌద్ధాన్ని
ఎవరు పునరుద్ధరించగలిగే వారు?
నీవు పుట్టి ఉండకపోతే
నిమ్నజాతుల మనుగడ ప్రశ్నార్థకమయ్యేది
అస్పశ్యుల వెతలు
ఆరని కాష్టంలా రగులుతూ ఉండేవి!
దళిత బాంధవా! బాబాసాహెబా!
నీ నుంచి స్వాభిమానం అబ్బింది
నీ నుంచి వ్యక్తిత్వం అలవర్చుకున్నాం!
ధైర్యస్థైర్యాలను, ఆత్మ విశ్వాసాన్ని
నీ నుంచే చేజిక్కించుకున్నాం!!
అసలు నువ్వు లేకుండా ఉంటే?
ఈ ప్రశ్న అవసరం లేదు!
నువ్వు మా కోసం పుట్టావ్!
నీ జన్మ యుగధర్మానిధి!
నువ్వు మా యుగపురుషుడివి!
నువ్వు కారణజన్ముడివి!!
నవంబర్ 2023 దళితశక్తి తెలుగు మాసపత్రిక
నవంబర్ 2023 దళితశక్తి తెలుగు మాసపత్రిక
- అసెంబ్లీ నియోజకవర్గాలు
- జాతి తరరాతను మార్చేది.. ఓటు
- ఆత్మగౌరవ పాలన ఎక్కడీ
- నీవే లేకుంటే...
- ఎన్నికల సందడి
- ఓటరు... తస్మాత్ జాగ్రత్త
- భయంకరంగా నిరుద్యోగ సమస్య
- కులగణన సామాజిక అవసరం
- మనిషి చుట్టూ ముసురుకుంటున్న అజ్ఞానం
- బౌద్ధ తాత్విక పత్రం
- ఊరికొకరు కావాలి
- దేశ ప్రగతికి విఘాతం
- ప్రజల ఆరోగ్యం ఏమయ్యేట్టు?
- వారు గొప్పోళ్ళు...
Friday, October 27, 2023
చందాదారులకు విజ్ఞప్తి
చందాల వివరాలు:
Sunday, October 1, 2023
Wednesday, September 6, 2023
ప్రజాయుద్ధ నౌక గద్దర్
'నీ పాదం మీద పుట్టమచ్చయ్యి'...'పొడుస్తున్న పొద్దుమీద కాలమై నడిచిన'...
ప్రజాయుద్ధ నౌక గద్దర్
- బి.గంగాధర్ఎడిటర్ & పబ్లిషర్,దళితశక్తి తెలుగు మాసపత్రిక
Wednesday, August 2, 2023
ఆగష్టు 15 & జనవరి 26 తేడా ఏమిటో తెలుసా?
ఆగష్టు 15 & జనవరి 26 తేడా ఏమిటో తెలుసా?
ఆగస్టు 15, 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. దేశ వ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపు కుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించు కుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగర వేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ ముఖ్యమైన తేడా ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.
పచ్చని మణిపూరన కొండల్లో...
పచ్చని మణిపూరన కొండల్లో...
ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఎందుకు?
మణిపూర్ చిన్న రాష్ట్రమైన 33 తెగలు 190 భాషలకు నిలయం. ఆకుపచ్చని అరణ్యాలు, ఎత్తయిన కొండలతో నిండిన సుందరమైన మణిపూర్ కుకీ, మైతేయి తెగల ఘర్షణలతో మూడు నెలలుగా మండుతోంది. ఈ మంటలు రగిలిస్తున్నది ఎవరు? చలి కాగుతున్నది ఎవరు? లాభం పొందాలని ప్రయత్నిస్తున్న శక్తులు ఏవి అనేది ఆలోచించాలి.
మణిపూర్ రాష్ట్రంలో అత్యధికులు మైతీయి తెగకు చెందిన వారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాలించిన రాజవంశం కూడా ఈ తెగవారే. వీరి తరువాత రాష్ట్రంలో సింహభాగం గిరిజనులు. వారిలో ప్రధానమైన తెగలు కుకీలు, నాగాలు. సహజంగా గిరిజనులలో ఉండే అమాయకత్వం, మొండితనం, ధైర్యంతో కూడిన తెగువ వీరిలో నరనరాన జీర్ణించుకు పోయింది. ఆ సహజ స్వభావమే ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేలా చేసింది. దేశంలో సాగిన తొలి గిరిజన పోరాటాలలో ఒకటిగా ఈ కుకీ తిరుగుబాటు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి ఉన్న కుకీలు, నాగాలు, ఇతర తెగలు ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మొదటి నుంచి వీరందరూ సామాజికంగా ఎస్టీ హౌదాలో గుర్తించబడి కొనసాగు తున్నారు. అందువల్ల వీరు నివసించే అటవీ ప్రాంతాలలో వీరికి ప్రత్యేకంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లతోపాటు అక్కడి భూములపై ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాలను అమలు పరుస్తున్నారు. అయితే, వీరి కంటే సామాజికంగా ఉన్నత హౌదాను అనుభవిస్తున్న మెయితీలు ఈ ప్రాంతాలకు వలస వచ్చారు.
మణిపూర్‌లో మే 3వ తేదిన మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ మొదలైంది. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటే ఓ ఫేక్ వీడియో మెయితీ వర్గానికి చెందిన ప్రజల్లో వైరల్ అయింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీయులు ఇంఫాలకు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్ పోప్కి జిల్లాలో ఒక గ్రామానికి చెందిన 800-1000 మంది మే4వ తేదీన మరో గ్రామంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షించు కునేందుకు ఓ కుటుంబానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె, మరో ఇద్దరు మహిళలు అడవిలోకి పారిపోతుండగా... వాళ్లను వందల మందితో కూడిన గుంపు అడ్డగించి దాడికి పాల్పడింది. 21 ఏళ్ల యువతిని వివస్త్రను చేస్తున్న అల్లరి మూకను అడ్డగించిన 19 ఏళ్ల ఆమె తమ్ముడిని, 50 ఏళ్ల తండ్రిని చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో 42 ఏళ్ల మహిళ బట్టల ఊడదీసి, నగంగా ఊరేగిస్తూ, అసభకరంగా తాకుతూ, కొడుతూ పొల్లాల్లోకి లాక్కెళ్లారు. యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరితోపాటు మాజీ సైనికుడి భార్యను కూడా నగంగా ఊరేగించడం దేశానికే అవమాన కరంగా నిలిచింది. కార్గిల్ యుద్ధంలో శత్రువు నుంచి దేశాన్ని రక్షించిన తాను ముష్కరుల నుంచి తన భార్యను కాపాడుకోలేక పోయానని ఆవేదన చెందారు.తమను రక్షించాలని పోలీసుల వద్దకెళ్తే, వారే తమను గుంపు వద్దకు తీసుకెళ్లి వదిలి పెట్టారని బాధిత యువతి ఆవేదన వ్యక్తంగా చేసింది. తమను నగంగా ఊరేగిస్తూ, కొడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. తమ గ్రామంపై దాడి చేస్తున్న గుంపుతో కూడా పోలీసులు ఉన్నారని పేర్కొన్నది. తమను ఇంటి నుంచి ఫికప్ చేసిన పోలీసులు ఊరికి కొంచెం దూరంగా తీసుకుళ్లి గుంపు వద్ద రోడ్డుపై వదిలేశారని తెలిపింది. గుంపులో చాలా మంది ఉన్నారని, 21ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నది.
అన్నింటా... మహిళకే అవరోధం?
అన్నింటా... మహిళకే అవరోధం?
స్వాతంత్య్ర వచ్చి 76 సంవత్సరాలు గడిచిన దేశ జనాభా సగభాగంగా వున్న మహిళలను నేటికి పురుషులతో సమానంగా చూడలేకపోతున్నారు. భారతదేశం పారిశ్రమిక రంగంతోపాటు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటి పడుతున్నది. అయినా దేశంలో అన్ని ప్రాంతాలను, వివిధ వర్గాల ప్రజలను ముఖ్యంగా మహిళలను సమానంగా చూడలేకపోతున్నది. దీనికి కారణం పాలకులా? ప్రభుత్వ యంత్రాంగమా? మనది పితృస్వామ్య సమాజం, అందుకే పురుషులకు అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా తయారు చేయబడ్డాయని చెబుతారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మహిళలు అనేక రంగాల్లో తమ సత్తా చాటుకుంటునే ఉన్నారు. అయినా వారిని బలహీనులుగా చూస్తున్నారు. పురుషుడు చేస్తున్న అన్ని పనులను సైతం మహిళలు సునయాసంగా చేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం, పాలకులకు మాత్రం వారి సేవలు కనిపించడం లేదు. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల తోపాటు రాజకీయంగా దేశ ప్రథమ పౌరురాలు నుండి కింది స్థాయిలో పనిచేసే వరకు అన్ని రంగాల్లో, మహిళలు ఉన్న వివక్ష మాత్రం తప్పడం లేదు. సామాజిక, సేవ రంగాల్లో మహిళల కృషి దేశం ఎన్నటి మార్చిపోలేదు. పారిశ్రామికం గా అనేక మంది మహిళలు రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో అవకాశం దొరికిన ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటున్నది. కానీ అవకాశాలే లేకుండా చేస్తున్న రంగం ఎదైనా ఉందంటే రాజకీయ రంగం మాత్రమే. అన్నింటికీ మహిళనే హస్త్రంగా ఉపయోగిస్తున్నారు. మణిఫూర్‌లో మహిళలను ఊరేగించడం అయా సామాజిక వర్గం ప్రజలను బయటికీ రాకుండా, భయపెట్టడానికే చేశారని బహిరంగంగానే ప్రకటించారు.
Friday, July 21, 2023
...దేశం రావణకాష్టంలా
...దేశం రావణకాష్టంలా
వట్టిగా
ఆడిపోసుకుంటాం కానీ..
నీరో చక్రవర్తి
మరీ
అంత దుర్మార్గుడేం కాదు
రోమ్ నగరం తగలబడుతుంటే
నీరో చక్రవర్తి
ఫిడేలు వాయిస్తూ
సంగీత సాధన చేస్తున్నాడు
అంతేగాని
రోమ్ నగరం తగలబడాలని కోరుకోలేదు
తగలబెట్టనూ లేదు
ఆ... అగ్నికి
ఆజ్యమూ పోయలేదు
చక్రవర్తి నీరో పై
కేవలం
బాధ్యతల్ని విస్మరించడన్నదే ఆరోపణ
కానీ
ఇవ్వాలా.. ఇక్కడ
కుల.. మత.. జాతి వైషమ్యాలతో
దేశం
దేశమే తగలబడుతుంటే
ఈ
విద్వేషాగ్నులకు
సమిధలు వేస్తూ
ఆ అగ్నికీలలకు
ఆజ్యం పోస్తూ...
అప్పుడప్పుడు
తడి లేని
రెండు పొడి మాటల్ని విదిలిస్తూ...
రక్తపు మరకల
రాక్షస హస్తాలతో రాజ్యాధికారాన్ని
పదిల పరుచుకుంటూ
ఓ నా దేశ పాలకుల్లారా ! చూద్దాం
మీరు
ఇంకెంతకాలం వర్ధిల్లుతారో
కాలానికి
ఎదురెదుకుంటూ....
...బత్తుల శ్రీనివాసులు
తియ్యని మాటలతో... మభ్యపెట్టడం ఎన్ని ఏళ్ళు
తియ్యని మాటలతో... మభ్యపెట్టడం ఎన్ని ఏళ్ళు
అంతటి అమానుష ఘటన మీద ప్రధానమంత్రి స్పందన ఎలా ఉండాలి? డెబ్బైఏడు రోజులుగా మణిపూర్ ఘోరకలిమీద ప్రధాని నోరువిప్పలేదు. రక్షించడం లేదు, రాష్ట్రంలో పర్యటించడమూ లేదు, కనీసం మాట్లాడండి అని ఆ రాష్ట్రప్రజలే కాదు, మిగతా దేశమూ ఆయనను ప్రార్థిస్తోంది. ఎట్టకేలకు ఆయన మాట్లాడారు. అదీ, సామాజిక మాధ్యమాల్లో ఒక దారుణఘటనకు సంబంధించిన విడియో వెలుగుచూసి, దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందిన తరువాత. మణిపూర్ మీద ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని, ఆయన రావాల్సిందేనని లోపల విపక్షాలు పట్టుబడుతూంటే, ఎన్నడూ మీడియాతో మాట్లాడని నరేంద్రమోదీ, పార్లమెంటు వెలుపల నాలుగుముక్కలు మాట్లాడారు. ఆ మాటలు విన్నవారికి అవి తడిసిన మనసులోనుంచి వచ్చినవని అనిపిస్తాయా? హింస నివారణలో ఆయన జోక్యాన్ని కోరుతున్నవారు, పాశవికదాడులు ఎదుర్కొన్న బాధితులు, ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన దేశప్రజలకు ఈ మాటలు ఉపశమనాన్ని, నమ్మకాన్ని ఇస్తాయా?మణిపూర్‌లో పరిస్థితులు ఎంతటి భయానకంగా ఉన్నాయో ఈ విడియో తెలియచెబుతోంది. కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడం, అడ్డుకోబోయిన కుటుంబీకులను హింసించి చంపేయడం మీతీల ఉన్మాదం ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. ఈ ఆదివాసీయువతులు ప్రాణరక్షణకోసం పారిపోతూ, రక్షకభటుల చేతికి చిక్కితే, వారే తిరిగి వీరిని మీతీ సేనలకు అప్పగించారంటే పాలకులు, అధికార యంత్రాంగం కలగలసి చేపట్టిన జాతినిర్మూలన అని అర్థం. అందుకే, మిగతాదేశం ఈ విడియో చూసి, దిగ్భ్రాంతికి, విషాదానికి లోనైంది కానీ, మీతీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ చలించిపోలేదు, కదిలిపోలేదు. ఇటువంటివి వందలకొద్దీ ఉన్నాయన్న ఒక్కమాట చాలు అక్కడ జరుగుతున్నదేమిటో మనకు అర్థంకావడానికి. తక్షణశిక్షలు అమలుచేసే డబుల్ ఇంజన్ పాలకులు విడియోలో మొఖాలు చూసి బుల్‌డోజర్లతో ఇళ్ళూవాకిళ్ళూ కూల్చివేయగల సమర్థులు. కానీ, మణిపూర్‌లో ఈ ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గులు వారికి ఆ మహిళలను స్వయంగా అప్పగించిన పోలీసులకు కానీ, అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన అధికారులకు కానీ, గుర్తుతెలియనివ్యక్తులుగానే ఉండటం విచిత్రం. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో జరిగింది, ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్నదీ ఒక్కటే. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నది ఒట్టిమాట, ఓ మర్యాదమాట. అక్కడ జరుగుతున్నది మతపరమైన ఊచకోత. అక్రమ వలసదారుల పేరిట, గంజాయి సాగుదారులపేరిట మణిపూర్ కొండలనుంచి చిట్టచివరి ఆదివాసీని తరిమికొట్టేవరకూ సాగే జాతిహననం. గుజరాత్‌లో మాదిరిగా పాలకుల ఆశీస్సులతో సమస్త వ్యవస్థలూ కట్టగట్టుకొని సాగిస్తున్న మారణకాండ. ఆదివాసీ భూములను హస్తగతం చేసుకోవడానికి చట్టాలు అడ్డుపడుతున్నప్పుడు, అంతర్యుద్ధం ఒక్కటే మార్గం. యాభైవేలమంది కేంద్రబలగాలున్నా, కేంద్రమే నేరుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నా పరిస్థితుల్లో మార్పురాలేదంటే, ఇది ఆవేశకావేశాలతో ఆకస్మికంగా రేగిన అగ్గికాదని, ప్రణాళికాబద్ధంగా సాగుతున్న కార్చిచ్చని అర్థమవుతుంది. ఇంతకాలమూ లోపల జరుగుతున్నదేమిటో బయటికి తెలియకుండా పాలకులు ఎంతో జాగ్రత్తపడ్డారు. నాయకులనే కాదు, పరిశీలకులను కూడా రానివ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. సుప్రీంకోర్టు వరకూ పోయి డెబ్బయ్‌ఏడురోజులుగా ఇంటర్నెట్ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయినా, దాచాలనుకున్నందంతా ఈ విడియోతో బయటకు పొక్కింది. ఇంతవరకూ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. పాలకులు మాత్రం విడియోను తొలగించాల్సిందిగా సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించారు.
మణిపూర్‌లో బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు మళ్ళీ డిమాండ్ చేశాయి కానీ, మోదీ మాటలు విన్న తరువాత కూడా అటువంటిదేదో జరుగుతుందని ఎవరికీ నమ్మకం అక్కరలేదు. ఇంతకాలం తరువాత తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చినందున కాబోలు అద్భుతమైన ఆ మాటకారి నోటినుంచి వచ్చిన ఆ నాలుగు మాటల్లో తడిలేదు. పైగా యావత్ సమాజమూ తలదించుకోవాలంటున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ అమ్మలనూ, అక్కలనూ కాపాడాలంటున్నారు. స్వపక్షపాలిత రాష్ట్రంలో ఈ ఘోరం జరిగితే, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లను కూడా ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించారు. అందుకే, ఎంతోకాలం తరువాత స్పందించినా, అది ఈ దేశ ప్రధానిగా కాక, ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టే అనిపించింది.
Sunday, July 9, 2023
ఉమ్మడి పౌర స్మృతి మీద ఒక విశ్లేషణ
ఉమ్మడి పౌర స్మృతి మీద ఒక విశ్లేషణ
ఈ దేశంలో ముస్లింలకు అన్ని విషయాల్లో ప్రత్యేక చట్టాలు ఏమి లేవు. క్రిమినల్ లాస్, సివిల్ లాస్ అందరికీ సమానం. ముస్లిం కి అన్ని విషయాల్లో సెపరేట్ లా ఉంది అనడం దుష్ప్రచారం మాత్రమే. వాళ్ళు అందరిలా ఇక్కడి అన్ని చట్టాలని ఫాలో అవుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ప్రకారం అన్ని మతాలకు మత స్వేచ్ఛ ఉంది. దాని ప్రకారమే అన్ని ప్రధాన మతాలకు వారి వారి పర్సనల్ లాస్ ఉన్నాయి. దానిని రాజ్యాంగం ఆదిలోనే ఆమోదించింది.ముస్లింలకు ఒక్కరికే పర్సనల్ లా ఏమీ ప్రత్యేకంగా లేదు. హిందువులకు హిందూ పర్సనల్ లా ఉంది, క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. ఇలా అన్ని మతాలకు రాజ్యాంగం కల్పించిన పర్సనల్ లాస్ ప్రకారం కొన్ని విషయాల్లో మాత్రమే తమ మత ఆచారాల ప్రకారం కొన్ని వ్యవహారాలు చేసుకొనే మతస్వేచ్ఛ అన్ని వర్గాల వారికి ఉంది. ఆ ప్రకారం ప్రతి మతం లాగా, ముస్లింలు కూడా కేవలం పెళ్ళి, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాలు లాంటి వ్రేళ్ళ మీద లెక్కబెట్టే కొన్ని పరిమితమైన వ్యక్తిగత మరియు కుటుంబ వ్యవహారాలను వారి మత ఆచారాల ప్రకారం అమలు చేసుకొనే స్వేచ్ఛ ఉంది.
అది స్వాతంత్ర్యం నుండి అమలులో ఉంది. అది రాజ్యాంగబద్ధ హక్కు. ఏ మతానికైనా లేదా వ్యక్తికైనా పైన చెప్పిన వ్యవహారాల్లో అతని మతానికి చెందిన ఆచారాలను పాటించాలని లేకపోతే అతను కామన్ చట్టాల ప్రకారం ఆయా వ్యవహారాలను చేసుకోవచ్చు. దానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టి క్రొత్తగా ఏమి చట్టాలు చేయనక్కర లేదు. ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకు ఏ మతాన్ని అవలంభించని, దేవుడిని నమ్మని నాస్తికులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. మరి ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా అవుతున్నాయి కదా. అంటే మతం వద్దు అన్న వారికి సయితం పెళ్లి, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాలకు సంబంధించి ఇప్పటికే కామన్ చట్టాలు ఉన్నాయి. వాటి ప్రకారమే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి.
మరి క్రొత్తగా కామన్ సివిల్ కోడ్ ఏమిటి? ఇప్పుడు దాని అవసరం ఏమిటి?
సివిల్ లాస్ విషయంలో కొన్ని పరిమితమైన వ్యవహారాల్లో రాజ్యాంగం రెండు రకాల అవకాశం, ఏర్పాటు చేసింది. అదేమిటంటే మతస్వేచ్ఛకు అనుగుణంగా ఎవరైనా తమ మత ఆచారాల ప్రకారం తమ వ్యక్తిగత లేదా కౌటంబిక వ్యవహారాలను కొనసాగించుకోవచ్చు లేదా కామన్ చట్టాలను కూడా అతను ఫాలో అవ్వవచ్చు. మరి అటువంటప్పుడు బలవంతంగా అందరికి ఒకే చట్టం అని ఇప్ప్పుడు ఈ హడావిడి ఎందుకు? రాజ్యాంగ బద్ధంగా తమ మత ఆచారాలను ఫాలో అవుతాము అన్న వారి మత స్వేచ్ఛను ఎందుకు అధికారికంగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం కాదా?
భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఒకే దేశంగా నిలబెట్ట గలిగింది కదా! మరి భిన్నత్వంలో ఏకత్వం వల్ల వల్ల కలిగిన లేదా కలుగుతున్న ప్రధాన నష్టం ఏమిటి? అన్ని మతాల పర్సనల్ లాస్ వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఏమిటి? రాజ్యాంగ బద్ధంగా ఎవరి మత ఆచారాలను వాళ్ళు ఫాలో అయితే ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేమిటి? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రం ముసుగులో, రాజ్యాంగ ప్రాధమిక హక్కులైనటువంటి మత స్వేచ్ఛను కాలరాయడం న్యాయమా? అది ప్రజాస్వామ్యమా?
ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు అయినటువంటి పేదరికం, నిరుద్యోగం, అవినీతి, పెరుగుతున్న నిత్యావసర ధరలు, మండుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు, నడ్డి విరుస్తున్న పన్నులు, ఆడవాళ్ల పై పెరిగిపోతున్న అఘాయిత్యాలు, దేశానికి తిరిగిరాని నల్లధనం, కూలుతున్న వంతెనలు, దిగజారిపోయిన జిడిపి, వెనక్కి వెళ్ళిపోతున్న విదేశీ పెట్టుబడులు, దివాళా తీస్తున్న కంపెనీలు, బ్యాంకులు, బడా బాబులు ఎగవేస్తున్న బ్యాంకు అప్పులు, రైతుల ఆత్మహత్యలు, నిర్వీర్యం చేయబడుతున్న ప్రభుత్వ సంస్థలు, అమ్ముడు అవుతున్న దేశ సంపద, ప్రయివటైజేషన్, ఇవన్నీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పర్సనల్ లాస్ వల్ల జరుగుతున్నాయా? అలా కాదే!
మరి అందరినీ ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడం మానేసి, గత ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన దేశాభివృద్ధి వాగ్దానాలు పూర్తి చేయకుండా, వారి పరిపాలనా లోపాలను కప్పిపుచ్చు కోవడానికి, దేశంలో హిందూ ముస్లింలు ఎప్పుడూ విభజించబడి, పరస్పరం దూషించుకునే, ద్వేషించుకునే సున్నితమైన మతపరమైన అంశాలను తెరపైకి తీసుకురావడం, మెజారిటీ మతం యొక్క ఓట్లను పొందడం కోసం, మైనారిటీ వర్గాల హక్కులను కాలరాసే నల్ల చట్టాలను అమలు చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగునా?
పాలించే ప్రభుత్వం దేశంలోని అన్ని మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు ప్రతినిధినా? లేదా ఒక ప్రధాన మతానికి మాత్రమే ప్రతినిధినా? రాజ్యాంగలోని ఆదేశిక సూత్రాలలో చేయమని చెప్పిన చాలా ప్రధాన విషయాలు ఉండగా, కేవలం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ను మాత్రమే, అది కూడా 2024 ఎన్నికల ముందు ఇంత హడావుడిగా అమలు చేసే ప్రయత్నం వెనుక దాగి ఉన్న మతరాజకీయం ఏమిటీ? ఒక వేళ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అని భావించినా కూడా, అసలు అది ఎలా ఉంటుందో ఓ స్పష్టమైన ముసాయిదా ఏది? అది క్లియర్ గా చెప్పకుండా మీరు యూసీసి ని సపోర్ట్ చేస్తారా లేదా అని అడగడం మోసం కాదా? ప్రజలను మతం పేర విభజించే మత రాజకీయం కాదా?
ఇది ఎలా ఉందంటే బస్టాండ్ లో ఎవరి ఊరి బస్సు వాళ్ళు ఎక్కడం కాదు, అందరూ ఒకే బస్ లో ప్రయాణం చేయాలి ఎందుకంటే పెట్రోల్ కలసి వస్తుంది అన్నట్లుంది! ప్రయాణికుడు స్వంత డబ్బులతో టిక్కెట్ కొని అతని ఊరి బస్ ఎక్కాక, నీవు చెప్పే కాకమ్మ కబుర్లు విని, నీ అబద్ధపు పెట్రోల్ సేవింగ్ కోసం విశాఖపట్నం, విజయవాడ లేదా ఇతర ప్రాంతాలకు, వేర్వేరు దిక్కులకు వెళ్లాల్సిన ప్రయాణినికులు, వారి వారి ఊరి బస్ ల నుండి దిగిపోయి, నీవు ఏర్పాటు చేసిన ఏ ఊరి బోర్డ్ లేని, ఏ రూటు వెళ్తుందో తెలియని బస్ లో ప్రయాణికులు ఎలా ఎక్కుతారు? ఒకవేళ ఎక్కినా ఒకే బస్ అందరిని ఏకకాలంలో అనేక దిక్కుల్లో ఉన్న వారి వారి ఊర్లకు ఎలా చేర్చుతుంది? ఇది హాస్యాస్పదంగా లేదా? కాబట్టి ముందు స్పష్టమైన యూసిసి ముసాయిదా తయారు కావాలి, దానిపై అన్ని మతాల వారితో సుదీర్ఘంగా చర్చించాలి. మెజారిటీ, మైనారిటీ తేడా లేకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి హక్కులను, మతస్వేచ్ఛను కాపాడుతూ, రాజ్యాంగ ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఆ క్రొత్త చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలియపరచాలి. వాటిలో మార్పు చేర్పులతో, అందరి ఆమోదంతో మాత్రమే యూ.సి.సి. తయారవ్వాలి.
ఆ బాధ్యతను కూడా ఒక రాజకీయ పార్టీకి ఇవ్వరాదు. మతతత్వ పార్టీకి అస్సలు ఇవ్వరాదు. అది బీజేపీ అయినా, ఎమ్.ఐ.ఎమ్. అయినా సరే. ఈ అతి సున్నితమైన, యావత్ భారతదేశ ప్రజల పై, విభిన్న రాష్ట్రాల పై, అక్కడి మతాలపై, వర్గాలపై, ఆచారాలు, సంస్కృతులపై తీవ్ర ప్రభావం చూపే యూ.సి.సి. లాంటి చట్ట తయారీ బాధ్యత ఒక స్వచ్చంద సంస్థకు అప్పజెప్పాలి. నిపుణులతో కూడిన ఆ కమిటీలో అన్ని ప్రాంతాల, మతాల, వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. వారు అందరూ సుదీర్ఘంగా చర్చించి నిజంగా సంస్కరణకు అవసరమైన విషయాలను పారదర్శకంగా చర్చించి, ఎవరి విశ్వాసాలను, మనోభావాలను, ఆచారాలను దెబ్బతీయకుండా కామన్ చట్టాలు తయారు చేయడంలో తప్పు లేదు.
కానీ అసలు సమస్య ఏమిటంటే ఇంతటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం తన ఎజెండాలో పెట్టుకున్న ఓ మతతత్వ పార్టీ ఈ యూ.సి.సి. గురించి అడుగులు వేస్తుంటే సాధారణంగా మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతాయి. వారిని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం గుర్తించకుండా, తమ పార్టీ సపోర్టర్స్ తో మీకు హిందూ దేశం కావాలంటే ఇదే మంచి సమయం, యూ.సి.సి. ద్వారానే దానిని సాధించుకోగలం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదు, దేశంలో ముస్లింలు ఒక్కరే ప్రత్యేక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అని అబద్ధాలు చెబుతూ, దాని వల్ల హిందువులు ఎంతో కోల్పోతున్నారు అని నమ్మబలుకుతూ, ముస్లింలు దేశాన్ని ప్రేమించడం లేదు వారి మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అసత్యాలు ప్రచారం చేస్తూ, ఓ ప్రక్క మాకు దేశమే ముఖ్యం మతం కాదు అని చెబుతూనే, మరో ప్రక్క అమాయక హిందూ సోదరులను మతం పేరుతో రెచ్చగొడుతూ, రాబోయే 2024 ఎన్నికల్లో మెజారిటీ మతం వారి ఓట్లతో మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.
అంతా డబల్ స్టాన్సర్డ్. ఏనుగుకి రెండు రకాల పళ్ళు ఉంటాయట. చూపించే పళ్ళు వేరే, తినే పళ్ళు వేరే. అలా ఉంది వీరి వరసా. ఆ మతతత్వ పార్టీ మాకు దేశం ప్రధానం, మతం కాదు అంటూనే, రాజ్యాంగం మరియు నేటి చట్టాలలోని అన్ని లొసుగులు వాడుకుంటూ, ఈ దేశాన్ని మత దేశంగా మార్చే ప్రయత్నంలో భాగమే నేటి ఈ యూ.సి.సి. అమలుకు కృషి చేస్తుందని రాజకీయ విశ్లేషకుల గట్టి అభిప్రాయం. కాబట్టి ఒకవేళ సున్నితమైన మతాన్ని వాడుకొని, అధికార దుర్వినియోగానికి పాల్పడి, బలవంతాన యూనిఫామ్ సివిల్ కోడ్ ను వారికి అనుకూలంగా తయారు చేసుకొని అమలు చేసినా సరే, ఈ దేశాన్ని ఆర్ధికంగా మరియు అన్ని విధాలా అధోగతికి నెట్టుతున్న సమస్యల్లో 0% కూడా ఏ మార్పు రాదు. ఇంకా సమస్యలు జఠిలమై, దేశంలో అస్థిరత ఏర్పడి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగి, దేశం మరో శ్రీలంకలా ఆర్ధికంగా, అన్ని విధాలా దివాళా తీయడం మాత్రం ఖాయం.
అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి విజ్ఞత గల భారతీయులు ఎమోషనల్ అయి ఆ మతతత్వ పార్టీ ఉచ్చులో పడకుండా నిజాయితీగా, నిజమైన భారతీయులుగా ఆలోచిస్తేనే అసలు వాస్తవం అర్ధం అవుతుంది. ఆ మతతత్వ పార్టీ వారు "దేశాన్ని ప్రేమించే వారు యుసిసి కావాలంటుంటే, మాకు మా మతమే ముఖ్యం అంటున్న వారు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారు" అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వీరి మెసేజ్ లతో, వీడియోలతో సోషల్ మీడియా వేదికలు నిండిపోతున్నాయి. ఇలా ఆ పార్టీ మతం పేరున అమాయక ప్రజల నుండి యూ.సి.సి. కి సపోర్ట్ ను కూడగడుతుంది. కానీ వాస్తవం ఏమిటంటే దేశాన్ని ప్రేమిస్తున్న వారందరూ యూ.సి.సి.ని వ్యతిరేకిస్తుంటే, కేవలం ఆ మతతత్వ పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ మాకు దేశం కన్నా మా మతతత్వ పార్టీనే ముఖ్యం, మా నాయకుడే ముఖ్యం అంటున్నవారు మాత్రమే అసలు ఏ జ్ఞానం లేకుండా యూ.సి.సి. ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది యదార్ధం.
కానీ చివరకు ఒక మాట అంటాను: నిజంగా నిద్రపోయే వారిని నిద్ర లేపొచ్చు గాని, నిద్రపోతున్నట్లు నటించే వారిని మాత్రం నిద్ర లేపలేము. ఇక ఎవరి ఇష్టం వారిది. ఎవరు చేసుకున్న ఖర్మకు వారే బాధ్యులు.
- గడ్డం అశోక్ వాల్ నుండి
Sunday, June 25, 2023
ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి
ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి
దేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.
జర్నలిస్టులకు తప్పని తిప్పలు
జర్నలిస్టులకు తప్పని తిప్పలు
నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను. బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను. మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా.
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు. రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే. మత మార్పిడులు జరగకుండా హిందూ మతంలో కులాన్ని పాతరెయ్యొచ్చు. మరి కుల నిర్మూలనకు తీసుకున్న చర్యలేంటి? గిరిజన రాష్ట్రపతి, బహుజన ప్రధాని ఉన్న దేశంలో మత రాజకీయాలు ఎందుకు? ఒక్క రాష్ట్రంలో అయినా మతం పేరు చెప్పకుండా ఎందుకు గెలవలేకపోతున్నారు..?
అధికారంలో ఉన్నదే హిందూ పార్టీ యినప్పుడు.. 80 కోట్ల మంది హిందువుల్ని ఎవరు ఈ రోజు అభద్రతలోకి నెట్టేశారు? 75 ఏళ్లుగా లేని అభత్రత ఇప్పుడే వచ్చిందా. ఢిల్లీలో ఓ హిందు అమ్మాయిని ముస్లిం చంపేస్తే దాన్ని ఒక క్రైంగా చూడట్లేదు హిందువులపై దాడి అంటున్నారు. అదే హిందూ అమ్మాయిల్ని రోజూ వందల మందిని భర్తలూ, తండ్రులు, అన్నలూ, ప్రియుడు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తోంటే ఎందుకు మాట్లాడరు? దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు. అలాగని మీ స్నేహితున్నో, నా పక్కింట్లో ఉన్న సాధారణ ముస్లింలనో దోషులుగా చూపవచ్చా? ఇతర దేశాల్లో మనవాళ్లు ఉన్నారు, అక్కడొక హిందువులు క్రైం చేస్తే మొత్తం అందరినీ ఒకే గాటన కడితే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏం జరిగినా మతం కోణం ఎందుకు వస్తోంది? చివరికి బాలాసోర్లో రైలు ప్రమాదం జరిగిదే పక్కన మసీదు వల్లే, ఆ రోజు శుక్రవారం కాబట్టి అనేది తెరపైకి వచ్చింది. తీరా చూస్తే అది మసీదు కాదు ఇస్కాన్ టెంపుల్. తర్వాత స్టేషన్ మాస్టర్ ముస్లిం కావడం వల్లే ప్రమాదం అన్నారు తీరా చూస్తే ఆ స్టేషన్ మాస్టర్ మహంతి ఒక హిందువు. తర్వాత ఇప్పుడు ఇంజినీర్ అమీర్ అన్నారు.. ఇది కూడా తప్పుడు ప్రచారమే అని చివరికి రైల్వే డిపార్టెంట్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ప్రమాదాన్ని ఇన్ని సార్లు మతం కోణంలో చూసి తప్పుడు ప్రచారాలు చేసి నాలుకు కరుచుకుంటున్నారు అంటే ఎంత ద్వేషం నింపేసి ఉండాలి సామాన్యుల బుర్రల్లోకి. చిన్న పిల్లలు కూడా ఇవాళ మతం గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ పరిస్థితిలోకి ఎవరు నెట్టేశారు అంటే కారణం ఎవరు? మతాల పేరుతో కొట్టుకుచావనీనా భవిష్యత్తు తరాలు. ఇప్పటి ఈ విద్వేషం కాల్చేసేది మన పిల్లల్ని కాదా? సిరియా, ఆఫ్గనిస్థాన్ పాకిస్థాన్ ఈ దేశాల పక్కనా మనకు స్థానం కావాల్సింది? కుటుంబాల్లో, పిల్లల మనసుల్లో నాటుతున్న విష బీజాలు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి ఫలితాలు ఇస్తాయో పాలకులు ఆలోచిస్తున్నారా? ఇప్పటి విద్వేషం రేపు ఎన్ని ఓట్లు తెస్తుంది అనే దగ్గరే వాళ్ల ఆలోచనలు ఆగిపోతున్నాయ్.. మర్నాడు మరో ఎన్నిక.. ఇంతే కదా నడుస్తోంది.. !?
ఇప్పుడు మనకు కావాల్సింది అమెరికాతో చైనాతో పోటీ పడే భారతదేశం కాదు... హిందూరాష్ట్రంగా ప్రకటించడమే మనక్కావాలి? పోనీ ఏమౌతుంది ప్రకటిస్తే.. ఏం మారుతుంది? విదేశాల్లో సెటిలైపోయిన ఒక్క నాయకుడి బిడ్డైనా తిరిగొచ్చేస్తుందా? ఒక్క సామాన్యుడి పరిస్థితి మారుతుందా..? మహా అయితే పుస్తకాల్లో సిలబస్ మారిపోతుంది. ఇంగ్లీష్ మినిమం అయ్యి హిందీ, సంస్కృతం వస్తుంది. అదే జరిగిదే చిన్న చిన్న చదువులకోసం కూడా విదేశాల బాట పట్టరా? అదా మనక్కావాల్సింది?
రాను రాను మతాలు, కులాలు లేని భారతదేశాన్ని నిర్మించాలా లేదా కొకర్నొకరు ద్వేషిస్తూ కొట్టుకునే దేశం కావాలా? కేరళలో 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ లో చేరారా? మరి అన్ని మిస్సింగ్ కేసులు ఉండాలి కదా.. గుజరాత్ లో 40 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. తెలంగాణలో ఏపీలో అన్ని రాష్ట్రాల్లో వేలాది మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు వీళ్లంతా ఏమైపోతున్నట్లు? కేరళలో 3 కేసుల్లో ఇప్పటిదాకా కేసులు ఫైల్ అయ్యాయి, తల్లిదండ్రులు బయటికొచ్చారు, బాధితులు ఉన్నారు. మరి మిగతా 31వేల 997 కేసులు ఏవీ.. అంత మంది ఉగ్రవాద సంస్థల్లో చేరిపోతో ఎన్ని లక్షల మంది వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు రోడ్లపైకి రావాలి.. వచ్చారా? మరి ఎందుకీ ప్రచారం? ఆజాదీ కాశ్మీర్ సమస్య కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో సాధారణ హిందువులు,సాధారణ ముస్లింలు కొట్టుకోవట్లేదు.. ఉగ్రవాదులు వేరు సాధారణ వ్యక్తులు వేరు. హిందువుల్లో క్రైస్తవుల్లో కూడా మతాన్ని అతిగా తీసుకొని ఇతరుల్ని ద్వేషించే వాళ్లు ఉంటారు. ఇది వ్యక్తుల సమస్య ఇక్కడికి రాజకీయం ఎందుకు తెస్తున్నారు.. సరే ఇదే బీజేపీ నార్త్ ఈస్ట్ లో క్రిస్టియన్ అనుకూల విధానాలు, హామీలు ప్రకటనలు చేసి గెలిచింది. అంటే ఎక్కడ ఏ మతం మెజారిటీ అయితే వాళ్లను పోలరైజ్ చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం ఇదేనా కావాల్సింది?
మణిపూర్ ఆహుతి అయిపోతోంటే.. కనీసం ప్రధాని నుంచి శాంతి ప్రకటన కూడా ఎందుకు రావట్లేదు? కరోనా కష్టకాలంలో టీవీల్లో కనిపించి చెప్పిన మాట కనీసం మన్ కీ బాత్ లో అయినా చెప్పొచ్చు కదా.. నేనున్నాను.. మీ సమస్య పరిష్కరిస్తాను అని.. ఎందుకు చెప్పట్లేదు? చనిపోతున్న వాళ్లంతా మతం మారిన క్రైస్తవులే కాదు.. హిందువులూ చనిపోతున్నారు.. హిందువులైన మెయిటీల ఆస్తులూ ధ్వంసమౌతున్నాయ్.. మరి హిందువు కోణంలో అయినా ఒక ప్రకటన చెయ్యాలి కదా కేంద్రం. పోనీ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతితో అయిన ప్రకటింపజేయవచ్చు కదా.. ఇవేవీ ఎందుకు జరగట్లేదు. నేను ఇది అడిగినా మీ దృష్టిలో దేశద్రోహి, హిందూ వ్యతిరేకి అయిపోతున్నాను. చేవ చచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏమని అడుగుతాం ఈ దేశం గురించి..? అధికారంలో ఉన్న వాళ్లనే కదా అడగాలి..?
పోనీ దేశంలో ఉన్న మెజారిటీ మతానికి ఏం మేలు చేసినట్లు? ఏ సామాన్యుడినైనా పిలిచి మతం చూసి ఓటు వేశావు కదా.. నీకు జరిగిన 3 గొప్ప మేళ్లు చెప్పు అంటే ఏం చెప్తాడు?పెట్రోల్ గ్యాస్ ధరలే కాదు.. టాక్స్ పరిధిలోకి రాని వస్తువులు ఎన్ని ఉన్నాయ్ ఇప్పుడు?రైళ్లలో సామాన్యులు కిక్కిరిసి కూర్చునే జనరల్ బోగీలను నిలువునా కోసేస్తున్నారు.. వృద్ధులకుండే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేశారు.
పెన్షన్ల నుంచి కూడా రకరకాల కోతలతో నేరుగా వసూళ్లు చేస్తున్నారు. పరిశ్రమలు పెట్టక్కర్లేదు.. ఉన్న వాటిని సొంత ఆస్తిలా అమ్మేస్తున్నా అడగకూడదా? కనీసం ఒక పౌరురాలిగా అయినా అడిగే హక్కు ఉంటుంది కదా.. మీరు అడగరు.. నేను అడిగితే హిందూ వ్యతిరేకినా? బీజేపీని అధికారంలోకి తెచ్చింది గుజరాత్ మోడల్ చూసేగానీ మతాన్ని చూసి కాదు. మతం పేరుతోనే అయితే అద్వానీని చూపించే వాళ్లు 2014లో. గుజరాత్ వెలిగిపోతోంది.. భారత్ కూడా వెలిగిపోవాలి అంటే మోదీ రావాలి అని..
మోదీ వచ్చారు నల్లధనం వచ్చిందా, నోట్ల రద్దు తర్వాత గుర్తించిన నల్లధనం ఏమీ లేదు.. ఏదైనా చేశారు అంటే మళ్లీ రెండు వేల నోట్లు రద్దు చెయ్యడం. మరి అకౌంట్లలో వేస్తాం అన్న రూ. 15 లక్షల మాటేంటి? ఇది ఎవరూ అడగకూడదు కదా..? అడిగితే దేశ ద్రోహి, ధర్మ ద్రోహి హిందూ వ్యతిరేకి. జీఎస్టీ వల్ల కేంద్రానికి రెవెన్యూ పెరిగింది. కానీ పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లాయి. చిన్న హోటల్లో ఇడ్లీ తిన్నా జీఎస్టీ వేస్తున్నారు..
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అన్నారు..ఏవీ ప్రతి ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్.. మన దేశంలో ఉండే సహజమైన అధిక జనాభా అనే పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని, మనం చదువులకు ఇస్తున్న ప్రాముఖ్యతను క్యాష్ చేసుకునేందుకు చీప్ లేబర్ కోసం ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ప్రైవేట్ జాబ్స్ పెరిగాయ్.. మరి ప్రభుత్వ ఉద్యోగాలేవీ..? మేము నిరుద్యోగులం అని 29 కోట్ల మంది ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నారు..? నమోదు చేసుకోని వాళ్లనూ కలిపితే..?
కొంత మంది పారిశ్రామిక వేత్తల్నే ప్రోత్సహించడం వల్ల మార్కెట్లో మొనో పొలి పెరిగిపోయింది. ఇప్పుడు దేశం అంత భారీ స్థాయికి చేరుకున్న ఆ ఒకరిద్దురు పారిశ్రామిక వేత్తలకు ఏదైనా అయితే దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే స్థితికి ఎవరు కారణం? గ్యాస్, పెట్రోల్ ధరల ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడింది. గ్రామాల్లో మళ్లీ కట్టెపొయ్యలు ఎందుకు పెరిగాయో మీరు ఊరెళ్లినప్పుడు అడగండి ఆడవాళ్లు చెప్తారు. మీ ఫోన్ చెక్ చేసుకోండి మీకు బీజేపీ ఐటీ సెల్ నుంచి వండి వార్చిన మెసేజీలు మోడీ వల్ల దేశం వెలిగిపోతోంది అన్న మెసేజీలు, ఇతర మతాలపై ద్వేషం కలిగించే మెసేజీలు ఎన్ని వచ్చాయో చూసుకోండి.
కొత్తగా ఆఫీసులో చేరిన వాళ్లు ఇప్పుడు వాళ్ల క్వాలిఫికేషన్స్ గురించి చూడట్లేదు, పక్కవాడి ఐడియాలజీ ఏంటి, వాడి మతం ఏంటి అని చూస్తున్నారు. క్రిస్టియనో, ముస్లిమో అయితే కొందరు హిందువులు ద్వేషిస్తున్నారు. నుదుటున కుంకం బొట్టుపెట్టుకున్న ఫ్రెండును చూస్తే ముస్లిం లేదా క్రిస్టియన్ ఉలిక్కిపడుతున్నారు. మన ఫ్రెండ్స్ లో ఆ అభద్రతకు కారణం ఎవరు? అంత అవసరం ఏంటి? పోనీ ఆలయాలకు ఏం చేశారు? అయోధ్యలోని రామమందిరమే కాదు అంతే విశిష్ఠత ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం ఉంది, భద్రాద్రి రాముల వారి ఆలయం ఉంది.. వాటికి ఏం చేశారు? ఏమీ లేదు.. ఒక్క టెంపుల్ చూపించి దేశంలోని మొత్తం దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్నది ఎవరు? ఈ రోజు అందరికంటే దయనీయ పరిస్థితి సగటు సామాన్య హిందువులది, గతంలో ప్రభుత్వాలపై కోపమొస్తే గట్టిగా రోడ్లపైకి వచ్చి నిలదీసే వాళ్లు. కానీ ఇప్పుడు ఎవరైనా కడుపుకాలి నోరెత్తితే.. హిందువై ఉండి హిందువుల్ని ప్రశ్నిస్తావా నువ్వు దేశద్రోహివీ, హిందూ ద్రోహివీ.. నీ మొగుడు/పెళ్లాం ముస్లిమా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియనా అంటున్నారు..
సామాన్య యువత(బడా బాబుల పిల్లలు కాదు) మెదళ్లు ఈ రోజు గొప్ప భవిష్యత్తు గురించో, శాస్త్రీయ దృక్పథం వైపో లేవు.. కేవలం తాము నమ్మిన మతాన్ని తమను రెచ్చగొడుతున్న మతాన్ని డిఫెండ్ చేసే స్థాయికి పడిపోయాయి.. ఇన్ని కోట్ల మెదళ్లు మతం చుట్టూ ఉన్నప్పుడు... నా లాంటి ఒక్కరో ఇద్దరో ఇలా చేస్తున్న మతోన్మాద పార్టీలను ప్రశ్నిస్తే మీకు చాలా కష్టం కలుగుతోంది. నాకు తెలుసు నాది ప్రమాదకరమైన ప్రయాణం.. ఎప్పుడో ఏ అమాయక యువకుడో నా మీద తను ప్రేమించే పార్టీ నింపిన విద్వేషాన్ని కత్తిగానో బుల్లెట్టుగానో మార్చి దాడి చేస్తాడని.. అలాగని కోట్లాది మంది యువత కళ్లముందు మతం మత్తులోకి జారుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకనే నా పరిధిలో నేను చెప్పాల్సినవి చెప్తున్నాను. మత విద్వేషాలు మాత్రమే ఏ దేశయువతకైనా అత్యంత ప్రమాదకరం అని నేను చెప్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు.. నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కానివ్వండి.. నన్ను డిఫెండ్ చె్యయడానికి ఏ పార్టీ ముందుకు రాదు నేను ఏ పార్టీ మద్దతుదారూ కాదు కాబట్టి.. ఏ కుల సంఘమూ రాదు.. నా కులమేంటో ఎవరికీ తెలీదు కాబట్టి.. ఏ గ్రూపూ నా కోసం నిలబడదు.. నాకు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టు గుర్తింపు కార్డు సహా ఏ గుర్తింపూ లేదు కాబట్టి..
ఇలా ఒకరిద్దరికి నాకు తోచినప్పుడు వివరణ ఇవ్వడం కంటే ఇంకేమీ చెయ్యలేని అశక్తురాలిని.. ఏదో ఒక రోజు రాలిపోతాను, బలైపోతాను.. కానివ్వండి.. అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను, ఏకాకిగొంతును రికార్డు చెయ్యనివ్వండి.
- తులసి చందు,
-
ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం జాన్‌వెస్లీ సిపియం రాష్ట్రకార్యదర్శి తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త శక్తిని అందిస్తూ, జాన్‌వెస్లీ స...


















